సినిమా వార్తలు

Bigg Boss10 Telugu: నాగ్ సహా ఒక్కొక్కరినీ ఉతికి ఆరేసిన చరణ్

త్రిగుణ్ వెళ్లి కెమెరాతో మాట్లాడాడు. ముఖ్యంగా వర్షిణి తమ గురించి మాట్లాడటం గురించి బాగా కోపం పెంచుకుని మాట్లాడాడు. ఆ తరువాత రామ్ ప్రసాద్, వంశీ అందరితో కలిసి త్రిగుణ్ మీటింగ్ పెట్టాడు. మరోవైపు ముఖేష్‌తో తమ గురించే మాట్లాడుకుంటారని వర్షిణి చెప్పింది. జనాలు మనిషి క్యారెక్టర్ కూడా చూస్తారు కదా అని ముఖేష్. నామినేషన్ పాయింట్స్ గురించి మొత్తంగా చర్చ. ఇక సృష్టి ఎంట్రీ ఇచ్చింది. రామకృష్ణను పలకరించి నీకూ.. నీ వెనుక ఉన్న లెటర్ బాక్స్‌కు పెద్దగా తేడా కనిపించడం లేదని చెప్పింది. ఇక వర్షిణిని నామినేట్ చేసింది. స్టార్టింగ్‌లో నేను నిన్ను కలిసినప్పుడు పర్సనాలిటీ ఉందనుకున్నానని కానీ ముఖేష్ వెనుకే ఉంటున్నావని చెప్పింది. ఇండివిడ్యువల్ ప్లేయర్‌గా అస్సలు కనిపించడం లేదని చెప్పింది. అమన్ నుంచి కెప్టెన్సీ లాక్కోవడం నచ్చలేదని పేర్కొంది. అసలు ఎప్పుడు టాస్క్ ఆడతారు? ఎప్పుడు ముందుకు వెళతారు? ఉమెన్ కార్డ్ వాడటం నచ్చలేదని చెప్పింది. నువ్వు కాన్ఫిడెంట్‌గా లేకపోవడం వల్లనే చాలా వీక్ అని ఫీలవుతున్నావని చెప్పింది.

తనకు నరేష్ అంటే తనకు ఇష్టమని.. కానీ నరేష్ అంటే ఇష్టమున్నా కూడా అమన్‌కు సపోర్ట్ చేసినట్టుగా వర్షిణి చెప్పింది. అబ్బాయిల స్ట్రెంత్ వేరు.. తన స్ట్రెంత్ వేరని చెప్పింది. ఇండివిడ్యువల్‌గా ఏదైనా టాస్క్ ఆడి గెలిచినట్టుగా చెప్పింది. నువ్వెందుకు ఎలిమినేట్ అయ్యావని వర్షిణి అడిగితే అలియెన్స్‌గా చేరి తనకు టాస్క్ ఆడే ఛాన్స్ ఇవ్వకుండా బయటకు పంపించేశారని చెప్పింది. తనకు వర్షిణి సాయం చేయడానికి కారణం తను కన్విన్స్ చేసుకోవడమేనని అమన్ చెప్పాడు. తను పది సార్లు అడిగినా కూడా అమన్ పేరే వర్షిణి చెప్పిందని ఆర్కే స్టాండ్ తీసుకున్నాడు. మొత్తానికి వర్షిణిని సృష్టి నామినేట్ చేసింది. తన డ్యూస్ కంప్లీట్ చేద్దామనుకుంటున్నానని అది త్రిగుణ్‌కి ఇస్తే కంప్లీట్ అవుతుందని చెప్పి త్రిగుణ్‌కి కత్తి ఇచ్చింది. డైలాగ్స్ ఉంటే సరిపోదని.. దానికి తగ్గ గేమ్ ఉండాలని త్రిగుణ్ చెప్పి ముఖేష్‌ను నామినేట్ చేశాడు.

‘‘బిగ్‌బాస్ 10లో కొన్ని నియమాలున్నాయి. ఈ ఇంట్లో ఉంటే కొన్ని రూల్స్ పాటించాలి. ఇంట్లో ట్రిమ్మింగ్ చేసుకోకూడదు. ఇచ్చిన పని చేయాలి. టాస్క్‌లో ఓడిపోతే తీసుకోవాలి. ఫస్ట్ ఛీటింగ్ చేసి పక్కనున్న వారిని చెడగొట్టి.. అందరి ముందు తలదించుకునేలా చేయడం కరెక్ట్ కాదు. ఇంట్లో ఒక బిహేవియర్ ఉంటుంది. ొకమ్మాయి వెనుక ఉంటే అవదు. మూడు సార్లు మేకప్ వేస్తే లోపలి మురికి పోదు. తన కంటి ముందు ఐదు నిమిషాలు ఆడకుండా కూర్చోనేందుకు కూడా నీకు ధైర్యం లేదు. ఒళ్లు కదపకుండా కూర్చుంటున్నావు. ఝాన్సీని నిజంగా చెల్లిగా భావించి ఉంటే ఆ అమ్మాయి ముందు అర్థం కాని వర్డ్స్ వాడే వాడివి కావు’’ అని త్రిగుణ్ నామినేషన్ పాయిట్స్ పెట్టాడు. నువ్వే క్లాత్ వేసుకొని ట్రిమ్మింగ్ చేసుకోమన్నావు. ఇప్పుడు ఆ పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేస్తున్నావు. నా గేమ్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కరెక్ట్ చేసుకుంటా. మబ్బు అని అంటున్నావు. బురదలో ఉన్నావు. బురదలోనే ఉండు. మబ్బులోకి వెళ్లకు వర్షం వస్తే ఇబ్బంది పడతావు’’ అన్నట్టుగా ముఖేష్ చెప్పాడు.

నెక్ట్సై చైత్ర రాయ్ వచ్చింది. ఎమోషనల్లీ వీక్‌గా ఉన్నానని తనను హై రిస్క్‌లో పెట్టి పంపించారని.. వాళ్లు ఎమోషన్స్‌ను కంట్రోల్‌లో పెట్టుకోవడం లేదని చెప్పి వంశీని నామినేట్ చేసింది. త్రిగుణ్ ఉంటేనే వంశీ కనిపిస్తున్నాడు కానీ లేదంటే కనిపించడం లేదు. వంట గదిలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. టెంపర్ ఆటలోనే ఉండాలి. మాటలో కాదని చెప్పింద.ి చాలా మందితో పోలిస్తే తన పాయింట్ ఈజ్ అని అందుకే తనకు బాహుబలి పోస్టర్ ఇచ్చారని వంశీ అన్నాడు. తనకు పప్పెట్‌లా ఉన్నారని చైత్ర చెప్పింది. మాట్లాడుకుని నామినేషన్స్ చేయడం చూశానని చైత్ర చెప్పింది. ఇక్కడికి వచ్చి బయటకు హీరోలా వెళ్లిన వారున్నారని.. కానీ మీరు విలన్‌లా వచ్చారని అలాగే వెళతారని చెప్పింది. బ్యాక్ బిచ్చింగ్ కాస్త తగ్గించమని చైత్ర చెప్పింది. బ్యాక్ బిచ్చింగ్ చేసిన మాటలను చెప్పమని వంశీ అడిగాడు. ప్రూవ్ అజ్ అని వంశీ అంటే ప్రూవ్ మీ అని చెప్పింది. నువ్వు అని వంశీ మాట్లాడటంపై మీ బిహేవియర్ ఇక్కడ బయట పడుతోందని రెస్పెక్ట్‌గా మాట్లాడమని చెప్పింది. ముఖేష్‌ను పంపించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని.. కనీసం సేవ్ చేశాడన్న గ్రాటిట్యూడ్ కూడా లేదని చైత్ర చెప్పింది. వర్షిణికి కత్తి ఇచ్చింది.

వర్షిణి అమన్‌ను నామినేట్ చేసింది. తన ఇన్‌టెన్షన్ నరేష్‌ను సపోర్ట్ చేయాలనుకున్నా కానీ నువ్వొచ్చి అడగడంతో తన అభిప్రాయం మార్చుకున్నానని వర్షిణి చెప్పింది. శ్వేత ఉన్నన్ని రోజులు ఒకలా ఉన్నావని.. ఇప్పుడు మరోలా ఉన్నావని చెప్పింది. తను కెప్టెన్సీ తీసుకున్నా కాబట్టి నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి సపోర్ట్ చేసిందని అమన్ అన్నాడు. తను ఏవిధంగా హెడ్ కౌంట్ కోసం చూస్తున్నానని అడిగాడు. అగ్ని పరీక్ష నుంచి ఒక్కడిగా వచ్చానని.. ఒక్కడిగా పోతానని అమన్ చెప్పాడు. నీలాగా ఒకడి షాడో కింద లేనని అమన్ చెప్పాడు. నీకు చేత కాక.. ఆడటం రాక నా కెప్టెన్సీ గుంజుకున్నావని అన్నాడు. నీ అంత పచ్చి అబద్ధాలు, నీ అంత బూతులు ఈ హౌస్‌లో ఎవరూ మాట్లాడలేదని అమన్ అన్నాడు. నెక్ట్స్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. ‘బిగ్‌బాస్ నేను పని చేసిన ఇల్లు.. నన్ను గెంటేసిన మనుషులు అని చెప్పాడు. మీ అందరినీ చూస్తుంటే ఎక్స్‌పైర్ అయిన ట్యాబ్లెట్స్ గుర్తొస్తున్నాయన్నాడు. దేబ్జాని క్యూట్ తెలుగు మాటున ఎంత కాలం ఉంటారని ప్రశ్నించాడు. తెలుగు వచ్చినా కూడా ఇలా మాట్లాడుతున్నావు’ అని అన్నాడు.

‘అమన్ మసూద్.. నిన్ను బచ్చ అన్నందుకు పెద్ద రచ్చ చేశావు. చరణ్ గాడు బచ్చా గాడు అన్నావు. నేను వెళ్లిపోయే ముందు ఓటింగ్ పెడితే నాకెక్కడో తేడా కొడుతోందిరా అంటే నేను నీకే ఓటేస్తా అని చెప్పాడు. చెప్పినట్టే వేశావు. మీరు ముగ్గరు.. షాలిని ఉండాలా? చరణ్ ఉండాలా? అంటే ఆ చరణ్ గాడు ఏం ఆడాడని ఉంటాడురా? అన్నావు. ఆ ఎక్స్‌ప్రెషన్ నాకు నచ్చలేదు. అమన్ నీ ఆట నిన్ను నీ విజయానికి దగ్గరకు తీసుకెళుతుంటే.. నీ మాట రెండడుగులు వెనక్కు లాగుతోంది’ అని అమన్‌కు చరణ్ చెప్పాడు. సుధీర్ మీకు అంతలా ఏం పర్సనాలిటీ ఉందో నాకు తెలియడం లేదు. ఫ్లిప్పులు అవడం చూస్తుంటే ఉసరవెల్లి గుర్తొస్తోంది. మీకు పర్సనాలిటీ లేదు కానీ వెళ్లిపోయిన తమను పర్సనాలిటీ లేదనడం దారుణమని చెప్పాడు. త్రిగుణ్‌తో ఉండి వెన్నుపోటు పొడిచావు. సృష్టితో ఉండి అదే చేశావు. ముఖేష్‌తో ఉండి వెన్నుపోటు పొడిచావు అని చెప్పాడు. ముఖేష్ వాళ్లతో జెన్యూన్‌గానే ఉన్నాను. ఝాన్సీ వెళ్లిపోతుంటే కూడా తనను పంపించమని చెప్పాను. జెన్యూన్‌గానే మాట్లాడుతున్నా. మీ ఐదుగురు ఒకటి.. నన్ను మీలో కలపొద్దని వీళ్లకు చెప్పా. ‘నాకు అంతవరకూ ప్రామిస్‌ల మీద నమ్మకం ఉండేది. కానీ నువ్వు బ్రేక్ చేసిన తర్వాత ప్రామిస్ ఇంత భయంకరంగా ఉంటుందా? అనిపించింది’ అని చరణ్ అన్నాడు. తనను రోహిత్ అదే పాయింట్‌పై నామినేట్ చేస్తే నేను యాక్సెప్ట్ చేశాను తప్ప వేరే ఏం మాట్లాడలేదని సుధీర్ చెప్పాడు.

నెక్ట్స్ కత్తి.. రామ్ ప్రసాద్‌కు ఇచ్చాడు. శివను రామ్ ప్రసాద్ నామినేట్ చేశాడు. నీ గేమ్ హైట్‌లో ఉందని.. తరువాత మొత్తం పడిపోయిందని చెప్పాడు. కొద్దిసేపు ముఖేష్‌తో ఉండి.. త్రిగుణ్‌ను తిడతావని.. త్రిగుణ్‌తో ఉండి ముఖేష్‌ను తిడతావని.. ఇలా చేస్తే ఒక్కడివి అయిపోతావు’ అని చెప్పాడు. అప్పుడు తను ఒంటరిగా ఆడేందుకే వచ్చానంటే.. ఒంటరిగా ఉంటే ఇక్కడ ఉండలేవని.. బయటకు వెళ్లిపోతావని రామ్ ప్రసాద్ చెప్పాడు. ఒకరి దగ్గరకు వెళ్లి ఇన్వెస్టిగేట్ చేస్తావు.. అవి తీసుకొచ్చి మరొకరికి చెబుతావు. కెమెరాలు ఉన్నాయని మరిచిపోతున్నావని రామ్ ప్రసాద్ అన్నాడు. ‘రామ్ ప్రసాద్ గేమ్ మీకు అర్థం కావడం లేదా? నరేష్‌ను తొక్కి పైకి వెళతాడు అది మీకు తెలియడం లేదు.. అతనొక కన్నింగ్’ శివ తనకు చెప్పాడని దేబ్జాని చెప్పింది. తనపైన చాలా ప్రెజర్ ఉందని శివ చెప్పడంతో అలా ఉంటే రాకూడదని రామ్ ప్రసాద్ చెప్పాడు. త్రిగుణ్ అంత టార్చర్ చేసిన మనిషి హౌస్‌లో లేడని శివ చెప్పడంతో అంత టార్చర్ చేసిన మనిషి ఉండగా తననెందుకు నామినేట్ చేశావని రామ్ ప్రసాద్ అడిగాడు. శివ మాట్లాడలేక ఇక తనను నామినేట్ చేయమని చెప్పాడు.

రామ్ ప్రసాద్ దగ్గరకు శివ వెళ్లి తాను దేబ్జానితో చెప్పిందేంటో చెప్పబోగా త్రిగుణ్ వచ్చి ‘వెధవన్నర వెధవ, వెధవ రెండు కేజీలు.. ’ అంటూ ఇద్దరూ సరదాగా అనుకున్నారు. దీంతో శివ వెళ్లిపోయాడు. శివకు త్రిగుణ్‌పై కాన్సన్‌ట్రేట్ చేయడం మానేసి నీ గేమ్ నువ్వు ఆడమని రామ్ ప్రసాద్ సలహా ఇచ్చాడు. నెక్ట్స్ శ్వేత వచ్చింది. ‘బయటకు వెళ్లాక కొందరు డూ యూ రిగ్రెట్ ఎనీ థింగ్ అని అడిగారని తాను లేదు’ అని చెప్పానని కానీ తాను నామినేట్ చేసే వ్యక్తి ఒక అన్‌ట్రస్ట్‌వర్తీ, ఒక సేఫ్ గేమర్, ఒక కన్నింగ్ ప్లేయర్ రామ్ ప్రసాద్ అని చెప్పింది. నిన్ను ఎక్కడన్నా పైకి వెళుతుంటే నిన్ను లాగానా? అంటే లేదని చెప్పాడు. బోన్ టాస్క్‌లో అలయెన్స్ ఫామ్ చేసుకున్నారని దానిలో తాను లేనని.. ఝాన్సీ అయితే ఇక్కడి దాకా వచ్చిందని.. శ్వేత అయితే కాదని చెప్పాడని అన్నది. నరేష్‌ను కెప్టెన్‌ని చేద్దామని చెప్పావని.. మీరెవరు అసలు కెప్టెన్‌ను చేయడానికి? అని ప్రశ్నించింది. మీరొక విన్నింగ్ మెటీరియల్ కాదని.. కన్నింగ్ మెటీరియల్ అని చెప్పింది. తనను దేబ్జాని, నరేష్‌కు ఇంపార్టెన్స్ ఇస్తావా? తనకు ఇస్తావా? అని అడిగితే వాళ్లిద్దరికీ ఇస్తానని చెప్పానని.. అది మొహం మీదే చెప్పినట్టుగా చెప్పింది. ఇప్పుడు కూడా ఫ్రెంట్ నుంచే పొడుస్తున్నానని శ్వేత చెప్పింది. తనెప్పుడూ ఫ్రెంట్ నుంచే పొడుస్తానని శ్వేత అంటే అలా ఆడి ఉంటే హౌస్‌లోనే ఉండేదానివని రామ్ ప్రసాద్ పంచ్ వేశాడు.
‘
అమన్‌కు కత్తి ఇచ్చింది. అమన్ వచ్చేసి త్రిగుణ్‌ను నామినేట్ చేశాడు. అల్టిమేట్ గోట్ దగ్గర నీకోసం ఎలా నిలబడ్డానో నీకు తెలుసు. ప్రతిసారీ తనకు ఏదో చేస్తానని ఇప్పటి వరకూ చేసింది లేదు’ అని అమన్ చెప్పాడు. కొన్ని అబద్ధాలు చెబుతాడని.. తను అన్నలా భావించిన వ్యక్తిని అని కానీ నువ్వు తమ్ముడిలా చూడలేదని అనిపిస్తోందని అమన్ అన్నాడు. ‘నీకూ నాకూ ఉన్నది హెడ్ కౌంట్ కాదని.. కేవలం ఫ్రెండ్షిప్’ అని త్రిగుణ్ చెప్పాడు. దీంతో నామినేషన్ పూర్తైంది. ఇక ఇంటి కెప్టెన్‌గా నరేష్‌ను రెండు నామినేషన్స్ చేయాలని బిగ్‌బాస్ చెప్పారు. దీంతో నరేష్ ముందుగా శివను నామినేట్ చేశాడు. మీరు ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి తనను ఎంతగానో పొగిడావన్నాడు. అసలు నీతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు. పోనీ మీకు ఇష్యూస్ ఉంటే త్రిగుణ్‌తో పెట్టుకోండి. కానీ నాకెందుకు కెప్టెన్సీ టాస్క్‌లో ఓటేయలేదు? ఇంతకాలం నాతో ఉన్నది ఫేకా? అని అడిగాడు. త్రిగుణ్ పేరు ముందే రాసి కానీ అమన్ పేరు రాశారని చెప్పి తమను అందరినీ నమ్మించాడని నరేష్ అన్నాడు. వాళ్లు నమ్మకపోవచ్చేమో కానీ తాను నమ్మానని నరేష్ చెప్పాడు. మీరక్కడ తనను మోసం చేశారని నరేష్ చెప్పాడు. అమన్ అని చెప్పి త్రిగుణ్ పేరు రాయడం తనను మోసం చేయడమేనని శివ చెప్పాడు. తాను చెప్పలేదని అనడంతో మీరు ‘ఎ’ అన్నావని.. దానికి అమన్ అనేనని అంతా చెప్పారు. మిమ్మల్ని ట్రస్ట్ చేయాలన్నా మిమ్మల్ని ట్రస్ట్ చేసే పరిస్థితి లేదని నరేష్ చెప్పాడు.

తనకు గేమ్ బ్రేక్ చేయాలని అనిపించిందని.. అందుకే తాను అమన్‌కు ఓటు వేశానని శివ చెప్పాడు. అమన్ కెప్టెన్ అయ్యేందుకు డిజర్వ్ అనిపించిందని.. ఓటు అనేది తన ఇష్టమని శివ చెప్పాడు. దీంతో శివ నామినేషన్ పూర్తైంది. నెక్ట్స్ నామినేషన్.. ఆర్కేకు వేశాడు. ఇక్కడున్న వారిలో నీకున్న సపోర్ట్ మరెవరికీ లేదు. వచ్చి ఐదు వారాలవుతోందని మొన్న తప్ప నీ గేమ్ కనిపించలేదని చెప్పాడు. ఉన్నా కొద్దీ మనుషులు తగ్గిపోతున్నారని.. ఏం చెప్పినా చేయాల్సి ఉంటుందని నరేష్ చెప్పాడు. స్వీపింగ్ అంటే చేయనన్నావని నరేష్ చెప్పడంతో తాను చేయనని చెప్పలేదన్నాడు. తనకు కిచెన్ దగ్గర ఇచ్చారు కదా.. ఇంక స్వీపింగ్ ఎందుకు ఇచ్చావని అడిగానని చెప్పాడు. తాను ఎక్కడా కూడా చేయనని చెప్పలేదని ఆర్కే చెప్పాడు. ప్రతిసారీ పని చెబితే గింజుకుని చేస్తాడని త్రిగుణ్ అంటే.. తనకు నచ్చితే చేస్తా లేదంటే దొబ్బేయ్ అని ఆర్కే అన్నాడు. దీంతో వంశీ, త్రిగుణ్.. ఆర్కే మీదకు వెళ్లారు. నా డ్యూటీ మీకు వచ్చింది కాబట్టి మీరు ఇంతలా బాధపడుతున్నారని ఆర్కే అన్నాడు. నెక్ట్స్ వచ్చే వాళ్లు అలా ఉండరని.. ఏం చెబితే అది చేయాలని నరేష్ అన్నాడు. తాను ఆడిన గేమ్స్ గురించి ఆర్కే చెప్పాడు. తాను చెప్పిన ఎఫర్ట్స్ చెబుుతన్నానని ఆర్కే అన్నాడు. వంశీ, త్రిగుణ్, దేబ్జాని, రామ్ ప్రసాద్, సుధీర్, నీతూ, అమన్, శివ, రామకృష్ణ, వర్షిణి, ముఖేష్ నామినేట్ అయ్యారు. ఇవాళ్టి నామినేషన్స్‌లో హైలైట్ చరణ్. ఒక్కొక్కరినీ ఉతికి ఆరేశాడు. హోస్ట్ నాగార్జునను కూడా వదల్లేదు. ఐదు వారాల పాటు కులికానంటూ నాగ్‌కు కౌంటర్..

Pranav

Recent Posts

మారిపోయిన జేమ్స్ బాండ్.. నయా బాంబ్ బాబు ఎవరో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన సూపర్ స్పై క్యారెక్టర్ జేమ్స్ బాండ్. ఇప్పటివరకు ఈ ఐకానిక్ పాత్రలో నటించిన…

1 hour ago

2000 కోట్ల దిశగా రామాయణ.. ఆ రికార్డు రాముడి సొంతం అవుతుందా..?

పదేళ్ల క్రితం దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్యాన్ ఇండియా గేట్లను తెరిచింది. అప్పటివరకు…

20 hours ago

నేను రాను.. వచ్చే సమస్యే లేదు.. కుండ బద్ధలు కొట్టిన రోహిత్ నాయుడు..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 చాలా రసవత్తరంగా సాగుతోందిప్పుడు. అయితే ఈ సీజన్ మొత్తం మీద అందరికీ పెద్ద…

20 hours ago

ట్రెండింగ్‌లో జటాయు ఎర్త్స్ సెంటర్.. ఆ వైరల్ ప్లేస్ ఎక్కడుందో తెలుసా..?

రీసెంట్‌గా రిలీజ్ అయిన రామాయణ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ…

20 hours ago

‘వారణాసి’ వాయిదా దాదాపు ఖాయమేనా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ అనగానే ఇండియన్ సినిమా రేంజ్ లోనే కాకుండా…

1 day ago

ఫేక్ గాళ్ల తాట తీయండి.. కేంద్రమంత్రికి ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి విన్నపం..!

ఇండస్ట్రీకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ముందుండి నడిపించే నాయకుడు మెగాస్టార్ చిరంజీవి. కరోనా కష్టకాలంలో…

1 day ago