బిగ్‌బాస్ 10 తెలుగు మరో నాలుగు వారాలే ఉంది. ఇదిలా ఉండగా గతవారం హౌస్ నుంచి నీతూ ఎలిమినేట్ అయ్యింది. అంతుకు ముందు వారం శ్వేత ఎలిమినేట్ అయ్యింది. మరి వీరిద్దరూ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారో తెలుసుకుందాం. బిగ్‌బాస్‌లో రెమ్యూనరేషన్ వారానికి ఉంటుంది. శ్వేత, నీతూ ఇద్దరూ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారే. ఇద్దరూ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. అయితే శ్వేత నాయుడు వారానికి రూ.1.5 లక్షలు తీసుకుందని తెలుస్తోంది. ఆమె హౌస్‌లో ఐదు వారాల పాటు ఉంది. దీనికి గాను శ్వేత బిగ్‌బాస్ నుంచి మొత్తంగా రూ.7 లక్షల నుంచి రూ.7.5 లక్ష వరకూ అందుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇక నీతూ వచ్చేసి శ్వేత కంటే ఒక వారం ఎక్కువే ఉంది. ఆమె వారానికి సుమారు రూ. 1.2 లక్షలు – రూ. 1.5 లక్షలుగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆరు వారాల పాటు ీతూ హౌస్‌లో ఉంది. దీంతో ఆమెకు సుమారు రూ. 7.2 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకూ రెమ్యూనరేషన్ అందినట్టుగా తెలుస్తోంది. మరికొన్ని నివేదికల ప్రకారం అయితే రూ.10 లక్షల నుంచి 11 లక్షల వరకూ అందుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఇవాళ బిగ్‌బాస్ గత సీజన్ కంటెస్టెంట్స్ వచ్చి బడ్డీలుగా నిలిచి ప్రస్తుత కంటెస్టెంట్లకు సాయం చేస్తున్నారు. అలా సంజన, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ పడాల, దివ్య నికిత వచ్చారు.
సార్ట్ చేసుకుని సాల్వ్ చేసుకునే దానికి ఎందుకు పెద్దగా చేసుకుంటున్నావని ముఖేష్‌ను వర్షిణి అడిగింది. అంతకు ముందు హోస్ట్ నాగార్జున…
ఇవాళ షోను సింపుల్‌గా హోస్ట్ నాగార్జున ప్రారంభించారు. నామినేషన్స్‌లో ఉన్నవారిలో దేబ్జానిని ముందుగా సేఫ్ చేశారు. కృష్ణార్జునులా.. శకుని, దుర్యోధనులా…
వీకెండ్ రానే వచ్చేసింది. హోస్ట్ నాగార్జున వచ్చి ముందుగా శుక్రవారం ఏం జరిగిందో చూశారు. ఇక శుక్రవారం.. ముందుగా ముఖేష్‌ను…
ఈవారం బిగ్‌బాస్ ఏమాత్రం ఆసక్తిగా అనిపించడం లేదు. ముఖేష్, త్రిగుణ్‌లను డిక్టేటర్స్‌ను చేసి ఒక టాస్క్ ఆడించారు బిగ్‌బాస్. దానిలో…
నిన్న షో ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే తిరిగి నేడు ప్రారంభమైంది. వంశీ వచ్చేసి టీం త్రిగుణ్ విన్నర్ అని..…
త్రిగుణ్ వెళ్లి కెమెరాతో మాట్లాడాడు. ముఖ్యంగా వర్షిణి తమ గురించి మాట్లాడటం గురించి బాగా కోపం పెంచుకుని మాట్లాడాడు. ఆ…