Menu
BREAKING
అక్కినేని కోడలి గ్లామర్ షోపై ఫ్యాన్స్ గుర్రు.. శోభిత బికినీ ఫోటోషూట్ వివాదంలో తప్పెవరిది..?   |   Bigg Boss 10 Telugu: షాలిని రచ్చ.. రామకృష్ణ కాళ్లు పట్టుకుని సారీ.. వైల్డ్ ఫైర్స్‌కు షాకిచ్చిన ఓజీలు!   |   Biggbogss10 Telugu: నామినేషన్స్‌లో వంశీ, శివ్ రచ్చ.. దేబ్జాని బిహేవియర్ వరస్ట్..   |   విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సెన్సార్ రివ్యూ.. ప్లస్ ఏంటి.. మైనస్ ఏంటి..?   |   అవకాశం ఇస్తాను పడుకుంటావా అని అడిగాడు.. హీరోయిన్ సంచలనం..!   |   శ్రీకాంత్ కూతురు మేధ హీరోయిన్‌గా సక్సెస్ అవుతుందా..?   |   Biggboss10 Telugu: మరీ చిల్లరగా మారిన షాలిని.. ఈవారం ఎలిమినేట్ అవుతుందా?   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌ను టార్గెట్ చేస్తున్న హౌస్‌మేట్స్.. షాలినిని కాపాడుతున్నారా?   |   జైలర్ 2కు అక్కడ షోస్ క్యాన్సిల్.. రజినీకాంత్ పప్పులు ఉడకలేదు..!   |   సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ మధ్య ఏం జరుగుతుంది.. అక్కడే బీజం పడిందా..?   |   400 కోట్ల సినిమాకు ఇదేం తిప్పలు.. హనుమాన్ అంశ్ తెలుగులో అందుకే ఆడలేదా..?   |   అమలాపాల్ ఆపసోపాలు చూస్తున్నారా… ఇప్పుడు వర్కవుట్ అవుతుందా..?   |   దసరాకు పాంచ్ పటాకా.. 5 సినిమాల్లో గెలిచేది ఎవరో..?   |   ‘ది ప్యారడైజ్’ దెబ్బతో నాని కీలక నిర్ణయం..   |   Bigg Boss 10 Telugu: చరణ్ ఎలిమినేషన్ వెనుక ట్విస్ట్.. షాలినికి ఓటేసిన హౌస్‌మేట్స్!

Bigg Boss 10 Telugu: షాలిని రచ్చ.. రామకృష్ణ కాళ్లు పట్టుకుని సారీ.. వైల్డ్ ఫైర్స్‌కు షాకిచ్చిన ఓజీలు!

Bigg Boss 10 Telugu: షాలిని రచ్చ.. రామకృష్ణ కాళ్లు పట్టుకుని సారీ.. వైల్డ్ ఫైర్స్‌కు షాకిచ్చిన ఓజీలు!

ఇవాళ్టి షో కూడా గొడవలతోనే నడిచింది. అది కూడా మొత్తంగా షాలిని చేసిన రచ్చతో. నిన్న ముఖేష్‌ను నామినేట్ చేయవద్దని అమన్‌కు రోహిత్ చెప్పాడట. ఆ విషయమై రోహిత్‌ని షాలిని నిలదీసింది. ముఖేష్‌ను నామినేట్ చేస్తే వర్షిణి డేంజర్ జోన్‌లోకి వచ్చి తను సేవ్ అయ్యేదాన్ని కదా.. మరి ఎందుకు చేయవద్దన్నావని అడిగింది. అమన్ తనకు సరైన కారణాలు ముఖేష్‌పై లేవని చెప్పాడట. అప్పుడున్న ఈక్వేషన్స్ వేరని రోహిత్ చెప్పాడు. ఇక మీదట ఎవరి గేమ్ వారు ఆడుకుందామని.. తనను షాలిని నమ్మే పరిస్థితి లేదని చెప్పాడు. మరోవైపు ముఖేష్ దేబ్జాని ఇన్నోసెంట్ కాదని.. ఆమె మాటలు లోపలి నుంచి వచ్చినట్టుగా ఉండవని చెప్పాడు. ఇక రామ్ ప్రసాద్, నరేష్ ఫన్నీగా స్కిట్ చేశారు. నామినేషన్స్‌లో షాలిని, అపూర్వ ఎలా ఉంటారో చెప్పి ఇద్దరూ ఫన్ చేశారు. ఆ తరువాత రోహిత్, త్రిగుణ్ నామినేషన్స్‌లో ఎలా ఉంటారో చెప్పారు. రోహిత్, త్రిగుణ్ నామినేషన్‌కి మధ్యలో షాలిని వెళ్లినప్పుడు ఎలా ఉంటుందో చాలా ఫన్నీగా చెప్పారు.

ఇక రోడ్ బ్లాక్‌లో భాగంగా వైల్డ్ ఫైర్‌కి పవర్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ టాస్క్ నిర్వహించారు. వైల్డ్ ఫైర్స్‌ను అందరికంటే శక్తివంతమైన స్థానంలో ఉంచారు. వారందరూ కెప్టెన్సీ కంటెండర్సేనని బిగ్‌బాస్ చెప్పారు. మూడు టీంల చేతిలో బెడ్ రూం, బ్యాక్‌యార్డ్.. కిచెన్, లాంజ్, బాత్రూం ఈ మూడు టీంల కంట్రోల్‌లోనే ఉంటాయి. మూడు టీంలకు కుర్చీలను ఏర్పాటు చేశారు. ఆరుగురు వైల్డ్ ఫైర్స్‌కి ఏడు కుర్చీలు ఇచ్చారు. వారిని గెలిచి ఒక్కో కుర్చీని సొంతం చేసుకోవాలి. ఒక్క కుర్చీ వైల్డ్ ఫైర్స్ చేతిలో ఉన్నా వారే కెప్టెన్సీ కంటెండర్స్. ఓజీలను ఎలా విడదీయాలో వైల్డ్ ఫైర్స్ మాట్లాడుకుంటుండగా.. వారంతా ఫుడ్, క్లోత్స్ అన్నీ దొంగతనం చేస్తున్నారు. తను లేపకుంటే రోహిత్ అనేవాడు ఉండేవాడు కాడని శివ్‌కి త్రిగుణ్ చెప్పాడు. ఓజీలను నరేష్, దేబ్జాని, రోహిత్, షాలిని, త్రిగుణ్, సుధీర్‌లతో బ్లూ టీం.. మిగిలిన వారిని మరొక గ్రీన్ టీంగా వైల్డ్ ఫైర్స్ విభజించారు. ఒక్కో టీం ఒక్కో ఏరియాపై కంట్రోల్ తీసుకోవాలని.. ఎవరికి ఏ ఏరియా ఇవ్వాలనేది వైల్డ్ ఫైర్సే నిర్ణయించాలని బిగ్‌బాస్ చెప్పారు.

Bigg Boss 10 Telugu: షాలిని రచ్చ.. రామకృష్ణ కాళ్లు పట్టుకుని సారీ.. వైల్డ్ ఫైర్స్‌కు షాకిచ్చిన ఓజీలు!

రెండు టీంలను డివైడ్ చేయడం కోసం మధ్యలో ఉండాలని వైల్డ్ ఫైర్స్ భావించారు. ఈ క్రమంలోనే కిచెన్, లాంజ్ వైల్డ్ ఫైర్స్ ఎంచుకున్నారు. బ్లూ టీం (రోహిత్, త్రిగుణ్)కి బాత్రూం.. గ్రీన్ టీంకి బెడ్ రూం ఇచ్చారు. ఒకరి ఏరియాలోకి మరొకరు వెళ్లాలంటే టీం అనుమతి తీసుకోవాలని బిగ్‌బాస్ సూచించారు. గేమ్ స్టార్ట్ అవగానే అంతా దొంగతనాలు ప్రారంభించారు. రోహిత్, షాలిని డోర్ దగ్గర ఉన్నారు. తనను రామకృష్ణ తోసేశాడని అలా తోయడం వల్ల పడిపోతే తన మొహం పగిలేదని చెప్పింది. శివ్ క్లారిటీ ఇచ్చాడు. మిమ్మల్ని బయటకు పంపించేసి లాక్ చేద్దామని అనుకున్నామని అంతే తప్ప తమకు మరో ఆలోచన లేదని చెప్పాడు. రామకృష్ణ అయితే పాపం పరిస్థితి దారుణంగా అనిపించింది. వెళ్లి షాలిని కాళ్లు పట్టుకుని మరీ సారీ చెప్పాడు. అతను కావాలని చేయలేదని ఎంత చెప్పినా వినకుండా షాలిని గొడవ చేయడంతో ఏం చేయాలో తప్పనిసరి పరిస్థితిలో ఓ నిస్సహాయ స్థితిలో రామకృష్ణ ఆమె కాళ్లు మొక్కి మరీ సారీ చెప్పాడు.

నెక్ట్స్ రామకృష్ణ, శివ్ ముఖేష్‌తో డీలింగ్‌కు దిగారు. తమ టీం మెంబర్స్ ముగ్గురిని తీసుకొచ్చి లాక్ చేయడానికి హెల్ప్ చేస్తే రెండు కుర్చీలు ఇస్తామని చెప్పాడు. మూడు కుర్చీలను ముఖేష్ డిమాండ్ చేశాడు. మరోవైపు రోహిత్ కూడా నీతూ వాళ్లతో డీల్ మాట్లాడుకుంటున్నాడు. అప్పుడు బిగ్‌బాస్ అందరినీ లివింగ్ ఏరియాకు పిలిచాడు. అరుచుకుని ఎవరి మాటా ఎవరికీ వినపడకుండా చేస్తారని కానీ.. దొంగతనాలు చేస్తారని కాదని బిగ్‌బాస్ చెప్పారు. ఏ ఏరియాపై ఎవరికీ పవర్ లేదని బిగ్‌బాస్ చెప్పారు. తను ఫాస్టింగ్‌లో ఉన్నానని కాస్త ఫుడ్ కావాలని అడిగాడు. కానీ ఫుడ్ అంతా అయిపోయిందని చెప్పాడు. శివ్ వెళ్లి రేషన్ మేనేజర్‌గా నీ బాధ్యత కదా.. ఎవరు తిన్నారో.. ఎవరు తినలేదో చూసుకోవాలి కదా అనడంతో అది తనకు లేదని త్రిగుణ్ అన్నాడు. లోపల తిన్నారు.. మళ్లీ ఇప్పుడు దొబ్బితింటున్నారని రోహిత్ అన్నాడు. దీంతో అమన్‌కు కోపం వచ్చింది. తనను అనడమేంటని అడిగాడు. అమన్‌ను అనలేదని.. అందరినీ అన్నట్టుగా రోహిత్ చెప్పాడు. అనవసరంగా అమన్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. రోహిత్‌ ఆకలితో ఉండటం వలన స్ట్రెస్ బాగా పెరిగినట్టుగా అనిపించింది.

Shiv, Ramakrishna in BiggBoss 10 Telugu

ఓజీల ఆటను బయట నుంచి చూశారు..లోపల చూశారు. మీ ఒపీనియన్ ఏంటని బిగ్‌బాస్ అడిగారు. పెద్దగా మార్పేం లేదని చెప్పారు. కొన్ని లక్షణాలను పెట్టి అవి ఎవరికి ఎలా సెట్ అవుతాయో చెప్పమన్నారు. డ్రామా కింగ్‌‌ని రోహిత్‌కి, మ్యానిప్యులేటర్ త్రిగుణ్, విక్టిమ్ కార్డ్ షాలిని, అన్‌ట్రస్ట్ వర్తీని సుధీర్‌కి, వర్షిణి బ్రెయిన్ లెస్, కన్నింగ్ రామ్ ప్రసాద్, డెలులు ముఖేష్, సెల్ఫ్ అబ్సెస్డ్ అమన్, బ్యాక్ స్టాబర్ ఝాన్సీకి, దేబ్జానికి సేఫ్ ప్లేయర్ ఇచ్చారు. ఆ తరువాత ఓజీలను పిలిచి వైల్డ్ ఫైర్స్ ఎవరి గురించి ఏ అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారో చెప్పాలి. కరెక్ట్ అయితే వైల్డ్ ఫైర్స్ పాయింట్స్ తగ్గుతాయి. టాస్క్ ముగిశాక గెలిచిన టీం బోనస్‌ను గెలుచుకుంటుంది. బ్యాక్ స్టాబర్ అని ఎవరికి ఇచ్చారని అడిగితే త్రిగుణ్ టీం వర్షిణికి ఇచ్చింది. కానీ రాంగ్ అని వైల్డ్ ఫైర్స్ చెప్పారు. ముఖేష్ టీం వచ్చేసి షాలిని అని చెప్పింది. వీళ్లు కూడా రాంగ్ చెప్పారు. దీంతో వైల్డ్ ఫైర్స్‌కి పాయింట్ వచ్చింది. వైల్డ్ ఫైర్స్ సేఫ్ గేమ్ అని ఎవరికి ఇచ్చారని అని అడగడంతో ముఖేష్ టీం సుధీర్ అని.. రోహిత్ టీం నరేష్ అని చెప్పారు. దీంతో ఇద్దరూ రాంగ్ చెప్పారు. వైల్డ్ ఫైర్స్‌కు పాయింట్ వచ్చింది.

నెక్ట్స్ క్వశ్చన్ బ్రెయిన్‌లెస్ అని సుధీర్ అని రోహిత్ టీం చెప్పింది. అమన్ అని ముఖేష్ టీం చెప్పింది. ఇద్దరూ రాంగ్ చెప్పారు. దీంతో వైల్డ్ ఫైర్స్‌కి పాయింట్ వచ్చింది. విక్టిమ్ కార్డ్ ఎవరని అడగడంతో షాలిని పేరును ముఖేష్‌ టీం చెప్పింది. దీంతో వారికి పాయింట్ వచ్చింది. విక్టిమ్ కార్డ్‌కి పాయింట్స్ చెబుతుంటే రోహిత్ మద్యలోకి వచ్చాడు. అనవసరంగా రోహిత్.. షాలిని తరుఫున స్టాండ్ తీసుకుని తన ఇజ్జత్‌ను తీసుకుంటున్నాడు. పాపం దీనిలో రామకృష్ణను చూస్తే పాపం అనిపించింది. గ్రీన్ టీంకు పాయింట్ వచ్చింది. వైల్డ్ ఫైర్స్‌కి ఒక పాయింట్ తగ్గింది. అన్ ట్రస్ట్ వర్తీ ఎవరంటే.. బ్లూ టీం త్రిగుణ్ అని చెప్పింది. గ్రీన్ టీం అమన్ అని చెప్పింది. వైల్డ్ ఫైర్స్ సుధీర్ అని చెప్పారు. డెలులు ఎవరంటే గ్రీన్ టీం ముఖేష్ అని చెప్పింది. దీంతో గ్రీన్ టీంకు పాయింట్ వచ్చింది. మ్యానిప్యులేటర్ త్రిగుణ్ అని గ్రీన్ టీం చెప్పింది. గ్రీన్ టీంకు పాయింట్ వచ్చింది. డ్రామా కింగ్ లేదంటే క్వీన్ ఎవరంటే.. గ్రీన్ టీం రాంగ్ చెప్పింది. రోహిత్ అని బ్లూ టీం చెప్పడంతో వారికి పాయింట్ వచ్చింది. అబ్సెస్ట్ ఎవరంటే గ్రీన్ టీం అమన్ అని కరెక్ట్‌గా చెప్పింది. దీంతో గ్రీన్ టీంకు పాయింట్ వచ్చింది. కన్నింగ్ అంటే రామ్ ప్రసాద్ అని చెప్పడంతో బ్లూ టీంకు పాయింట్ వచ్చింది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360