Menu
BREAKING
అక్కినేని కోడలి గ్లామర్ షోపై ఫ్యాన్స్ గుర్రు.. శోభిత బికినీ ఫోటోషూట్ వివాదంలో తప్పెవరిది..?   |   Bigg Boss 10 Telugu: షాలిని రచ్చ.. రామకృష్ణ కాళ్లు పట్టుకుని సారీ.. వైల్డ్ ఫైర్స్‌కు షాకిచ్చిన ఓజీలు!   |   Biggbogss10 Telugu: నామినేషన్స్‌లో వంశీ, శివ్ రచ్చ.. దేబ్జాని బిహేవియర్ వరస్ట్..   |   విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సెన్సార్ రివ్యూ.. ప్లస్ ఏంటి.. మైనస్ ఏంటి..?   |   అవకాశం ఇస్తాను పడుకుంటావా అని అడిగాడు.. హీరోయిన్ సంచలనం..!   |   శ్రీకాంత్ కూతురు మేధ హీరోయిన్‌గా సక్సెస్ అవుతుందా..?   |   Biggboss10 Telugu: మరీ చిల్లరగా మారిన షాలిని.. ఈవారం ఎలిమినేట్ అవుతుందా?   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌ను టార్గెట్ చేస్తున్న హౌస్‌మేట్స్.. షాలినిని కాపాడుతున్నారా?   |   జైలర్ 2కు అక్కడ షోస్ క్యాన్సిల్.. రజినీకాంత్ పప్పులు ఉడకలేదు..!   |   సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ మధ్య ఏం జరుగుతుంది.. అక్కడే బీజం పడిందా..?   |   400 కోట్ల సినిమాకు ఇదేం తిప్పలు.. హనుమాన్ అంశ్ తెలుగులో అందుకే ఆడలేదా..?   |   అమలాపాల్ ఆపసోపాలు చూస్తున్నారా… ఇప్పుడు వర్కవుట్ అవుతుందా..?   |   దసరాకు పాంచ్ పటాకా.. 5 సినిమాల్లో గెలిచేది ఎవరో..?   |   ‘ది ప్యారడైజ్’ దెబ్బతో నాని కీలక నిర్ణయం..   |   Bigg Boss 10 Telugu: చరణ్ ఎలిమినేషన్ వెనుక ట్విస్ట్.. షాలినికి ఓటేసిన హౌస్‌మేట్స్!

అవకాశం ఇస్తాను పడుకుంటావా అని అడిగాడు.. హీరోయిన్ సంచలనం..!

అవకాశం ఇస్తాను పడుకుంటావా అని అడిగాడు.. హీరోయిన్ సంచలనం..!

సినిమా ఇండస్ట్రీ అంటేనే బయటికి ఎంతో గ్లామర్‌గా కనిపిస్తుంది. పేరు, ప్రఖ్యాతలు, డబ్బు అన్నీ ఒక రేంజ్‌లో ఉంటాయి. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఎవరికీ కనిపించని చాలా చీకటి కోణాలు కూడా దాగి ఉంటాయి. అందులో ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. అవకాశాల పేరుతో ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెట్టే హీరోయిన్లను వాడుకోవాలని చూసే కొందరు వ్యక్తుల గురించి అప్పుడప్పుడు పలువురు సెలబ్రిటీలు ధైర్యంగా బయటపెడుతుంటారు. తాజాగా ఇదే కోవలో నీతి టేలర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మేం వయసుకు వచ్చాం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, అప్పట్లో తన క్యూట్ యాక్టింగ్‌తో కుర్రకారును ఆకట్టుకుంది. తనీష్ హీరోగా వచ్చిన ఆ సినిమాలో దిల్ సే అంటూ ఆమె చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. కానీ ఆ తర్వాత ఆమె తెలుగు స్క్రీన్ మీద పెద్దగా కనిపించలేదు. దానికి అసలు కారణం ఏంటి అనేది ఆమె ఇప్పుడు పబ్లిక్‌గా ఓపెన్ అయిపోయి అసలు విషయం చెప్పేసింది.

కెరీర్ స్టార్టింగ్‌లోనే తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి నీతి టేలర్ షాకింగ్ విషయాలు వెల్లడించింది. సౌత్ ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాలు చేసిన తర్వాత, తన మొదటి సినిమా డైరెక్టర్ ఆమెకు ఫోన్ చేసి.. నీకు నా తర్వాతి సినిమాలో మరో మంచి అవకాశం ఇస్తానని చెప్పిన ఆ దర్శకుడు, ఆ క్యారెక్టర్ చేయాలంటే దానికి తగ్గట్టుగా తనకు కమిట్‌మెంట్ ఇవ్వాలని డైరెక్ట్‌గా అడిగేశాడని గుర్తు చేసుకుంది నితి. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ఒక యువ హీరోయిన్‌ను, అందులోనూ తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టరే ఇలాంటి అసభ్యకరమైన కోరిక కోరడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. సినిమా ఆఫర్ల కోసం ఇలాంటి కండిషన్స్ కూడా పెడతారా అని ఆమెకు అప్పుడే అర్థమైంది. మంచి భవిష్యత్తు ఇస్తాడని నమ్మిన వ్యక్తే ఇలాంటి నీచమైన ప్రపోజల్ తీసుకురావడం ఆమెను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఆ దర్శకుడి నోటి వెంట కమిట్‌మెంట్ అనే మాట వినగానే ఆ క్షణంలో ఏం చేయాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో నీతి టేలర్‌కు అస్సలు అర్థం కాలేదట. భయంతో పాటు కోపం కూడా వచ్చి ఏం మాట్లాడాలో తెలియక వెంటనే అతడి ముఖం మీద ఫోన్ కట్ చేసి, ఆ నెంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేసింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో అనే భయంతో కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే తన తల్లికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పుకుని బాధపడింది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని ఆమె చాలా ఎమోషనల్ అయింది. నిజానికి ఆ డైరెక్టర్ గతంలో కూడా కొంతమంది మహిళలతో ఇలాగే అసభ్యంగా ప్రవర్తించాడనే రూమర్స్ ఉన్నప్పటికీ, తన విషయంలో కూడా ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడని ఆమె అస్సలు ఊహించలేదని చెప్పింది. ఒక ఆర్టిస్ట్‌గా ఎదగాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీకి వచ్చిన ఒక అమ్మాయికి కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే ఆ మెంటల్ ట్రామా ఎలా ఉంటుందో ఆమె మాటల్లోనే స్పష్టంగా అర్థమవుతోంది.

ఈ ఒక్క సంఘటన నీతి టేలర్ మైండ్ సెట్‌ను పూర్తిగా మార్చేసింది. టాలీవుడ్ మీద, సౌత్ సినిమాల మీద ఆమెకు ఒక రకమైన భయం మరియు విరక్తి పుట్టేలా చేసింది. సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఇలాంటి కాంప్రమైజ్‌లు తప్పనిసరి అని ఫిక్స్ అయిన ఆమె, ఇక దక్షిణాది సినిమాలకు శాశ్వతంగా దూరం కావాలని డిసైడ్ అయిపోయింది. ఆ భయంతోనే సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి, టెలివిజన్ రంగం వైపు తన అడుగులు వేసింది. హిందీ సీరియల్స్‌లో అవకాశాలు దక్కించుకుని అక్కడ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా కైసీ యే యారియాన్ లాంటి పాపులర్ షోస్‌తో బాలీవుడ్ బుల్లితెర ఆడియన్స్‌కు బాగా దగ్గరైంది. సినిమాలతో పోలిస్తే టెలివిజన్ ఇండస్ట్రీ చాలా సేఫ్ అని, అక్కడ తన టాలెంట్‌కు సరైన గుర్తింపు దొరికిందని ఆమె భావించింది. ఒక రకంగా ఆ డైరెక్టర్ చేసిన పని వల్ల టాలీవుడ్ ఒక మంచి టాలెంటెడ్ హీరోయిన్‌ను మిస్ అయిందని చెప్పొచ్చు.

ఇప్పుడు సడెన్‌గా నీతి టేలర్ చేసిన ఈ కామెంట్స్ టాలీవుడ్ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఎందుకంటే ఆమె పేరు చెప్పకపోయినా ఆ దర్శకుడు ఇప్పుడు ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. 100 కోట్ల సినిమా కూడా తెరకెక్కించాడు. ఇలాంటి సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉన్న టైమ్‌లో ఆయన మీద కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఈ విషయం మీద రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎంత దారుణంగా ఉంటుందో ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆడవాళ్లకు పని ప్రదేశాల్లో సరైన రక్షణ, భద్రత కల్పించినప్పుడే ఏ ఇండస్ట్రీ అయినా మరింత ముందుకు వెళ్తుంది. ఇన్నేళ్ల తర్వాత అయినా తన చేదు అనుభవాన్ని ఇంత ధైర్యంగా పబ్లిక్‌గా షేర్ చేసుకున్న నీతి టేలర్ గట్స్ ని చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఇప్పుడీ మ్యాటర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360