
ఇవాళ హోస్ట్ నాగార్జున వచ్చీరాగానే ఎలిమినేషన్ ప్రారంభించారు. ముందుగా అపూర్వను ఎలిమినేట్ చేశారు. ఝాన్సీ గురించి ఎక్కువ బాధపడతానని.. బాగా ఆడమని అపూర్వ చెప్పి స్టేజ్‌పైకి వెళ్లింది. నాగ్‌తో ‘మీరు నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్’ అని చెప్పింది. అపూర్వ ఏవీ చూపించారు. ఒక్క వారమే ఉన్నా కూడా అపూర్వ హౌస్‌లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చాలా ఎక్కువ స్క్రీన్ స్పేస్ సంపాదించుకున్న కంటెస్టెంట్స్‌లో అపూర్వ ఒకరు. తన ఏవీ చూసి తనే కన్నీళ్లు పెట్టుకుంది. తను ఫేస్ చేసిన బాటిల్స్, తను ఫేస్ చేసిన కష్టాలు.. తను దేనికి పనికి రానన్న వ్యక్తులు.. అన్నింటి మధ్య తను బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి తనను తాను ప్రూవ్ చేసుకున్నానని తెలిపింది. ఐదుగురికి బిట్టర్ షాట్ ఇచ్చి.. వారి గురించి బిట్టర్ ట్రూత్ చెప్పమని నాగ్ అన్నారు. ఫస్ట్ అపూర్వ.. రోహిత్‌కి ఇచ్చింది. పక్కన వారిని తక్కువగా చూస్తావని చెప్పింది. ముఖేష్‌లా మనుషుల్ని చీడ పురుగుల్లా చూడకున్నా కూడా దాదాపుగా ఆ స్థాయిలో చూస్తావని చెప్పింది. నీ గురించి నువ్వు ఓవర్ ఎస్టిమేట్ చేసుకోకు అని చెప్పింది.
నెక్ట్స్ రామ్ ప్రసాద్‌కి బిట్టర్ షాట్ ఇచ్చింది. ‘మీ దగ్గర కన్నింగ్ నేచర్ ఉంది. మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పే మాట కాన్ఫిడెంట్‌గా లేదు. సెల్ఫిష్ నేచర్‌తో ఎవరికో మంచి చేయాలని.. ఎవరికో చెడు చేయకండి’ అని చెప్పింది. షాలినితో ‘నువ్వు నీలా ఆడు. చెట్టు చాటు నుంచి ఆడుతున్నావు. ఆ చెట్టు ఎవరో నీకు తెలుసు. అవతలి వాళ్ల మాట విన్నాక మాటలు వదులు’ అని చెప్పింది. సుధీర్‌కి ‘నాకు మీరు చాలా అయోమయంగా అనిపిస్తారు. ఏదైనా ఇన్సిడెంట్లో మీ పేరు వినబడగానే వెంటనే రియాక్ట్ అవడం కాదు. మంచీ చెడు తెలుసుకుని వెళ్లు. పర్సనల్ అసిస్టెంట్‌గా ఉంటావు’ అని చెప్పింది. అప్పుడు నాగ్ కూడా ‘మేలుకో రాజా మేలుకో’ అని సుధీర్‌కి నాగ్ చెప్పారు. ఆ తరువాత అమన్‌కు తామిద్దరం టామ్ అండ్ జెర్రీలా ఉంటామని చెప్పింది. ఒకటికి రెండు సార్లు ఏ విషయమైనా చెక్ చేసుకోమని.. ఏదైనా తప్పు జరిగితే సారీ చెబితే నీ వాల్యూ తగ్గదు అని చెప్పింది. షాలిని, రోహిత్‌కి తానెప్పుడూ మీ మధ్యలోకి రావాలనుకోలేదు అని చెప్పింది. కొన్నిసార్లు తను రాకుండా ఉండేదని అనిపించిందని.. యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అపూర్వ చెప్పింది. ముఖేష్‌కి మీరు కూడా కాస్త యాటిట్యూడ్ తగ్గించుకోమని చెప్పింది. అపూర్వకు వైట్ గోల్డ్ మెడల్ ఇచ్చి పంపించారు.
నెక్ట్స్ వైల్డ్ కార్డును ఒక పెర్ఫార్మెన్స్తో ప్రవేశపెట్టారు. ఫస్ట్ వైల్డ్ కార్డ్‌గా బుల్లితెర నటుడు, గత బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ ప్రియుడు శివ్ కుమార్ ఎంట్రీ ఇచ్చాడు. ‘నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు.. అప్పుడే జనాలు నిన్ను ఇష్టపడతారు’ అని ప్రియాంక చెప్పిందని శివ్ చెప్పాడు. బిగ్‌బాస్ అనేది ఇండివిడ్యువల్ గేమ్ అని కానీ ప్రస్తుతం అక్కడ రెండు గ్రూపులున్నాయని చెప్పాడు. తన గేమ్ తను ఇండివిడ్యువల్‌గా ఆడాలనుకుంటున్నట్టు చెప్పాడు. మాస్క్ తెప్పించి.. శివ్ని మాస్క్ పెట్టుకోమన్నారు. హౌస్‌మేట్స్‌కి వైల్డ్ కార్డు వస్తున్నారని.. తను చూపించబోయే గ్లింప్స్ చూసి ఆ కంటెస్టెంట్ ఎవరో చెప్పాలన్నారు. షాలిని పేరు చెప్పడంతో నాగ్ ఫైర్ అయ్యారు. చరణ్‌ని అడిగితే శివ్ అని చెప్పాడు. ఫస్ట్ టైమ్ హౌస్‌లోకి రావడానికి ముందే వైల్డ్ కార్డ్ ఎవరనేది రివీల్ చేసినట్టుగా నాగ్ చెప్పారు. హౌస్‌లోని వారిలో ఏ ఇద్దరిని టార్గెట్ చేయబోతున్నావని నాగ్ అడిగారు. శివ్ ముందుగా షాలిని పేరు చెప్పాడు. అగ్నిపరీక్షలో బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడానికి చాలా కష్టపడ్డారని.. కానీ హౌస్‌లోకి వచ్చాక ‘నువ్వు ఎందుకు కప్ కోసం కాకుండా రోహిత్‌ని గెలుచుకోవడం కోసం ఆడుతున్నావు’ అని అడిగాడు. షాలిని ‘మీరు హౌస్‌లోకి వచ్చాక తెలుస్తుంది’ అని అన్నది. దీనికి నాగ్ కౌంటర్ ఇచ్చారు. మీ ఆటను బయట నుంచి మాత్రమే చూసి ఆడియెన్స్ ఓట్లు వేస్తారని చెప్పారు.
నెక్ట్స్ శివ్.. చరణ్‌ను ఎంచుకున్నాడు. రెండు సార్లు హౌస్‌లోకి వెళ్లడమనేది చాలా లక్కీ అని.. కానీ దానిని మీరు వినియోగించుకోవడం లేదని శివ్ చెప్పాడు. ప్రతి వారం చరణ్ గేమ్ బయటకు తీస్తాడని చూస్తున్నానని కానీ అది జరగడం లేదని చెప్పాడు. శివ్ చాలా సర్ప్రైజ్2లతో వస్తున్నాడని నాగ్ చెప్పారు. హౌస్‌లోకి వెళ్లడానికి ముందు రెండు బాధ్యతలు నాగ్ అప్పగించారు. క్యాష్తో కూడిన బ్రీఫ్ కేస్ నాగ్ ఇచ్చారు. హౌస్‌లోకి వెళ్లి పవర్స్ ఉన్న వారిని ఛాలెంజ్ చేసి గెలిస్తే ఆ పవర్ శివ్దని.. ఓడితే దానిలో ఉన్న డబ్బు హౌస్‌లోని వారిదని చెప్పారు. ఇక సెకండ్ రెస్పాన్సిబులిటీ వచ్చేసి డేంజర్లో ఉన్నవారిలో హౌస్‌లో ఉండేందుకు అర్హత ఉన్న ఇద్దరికి బ్యాడ్జ్‌లు ఇవ్వమని చెప్పి రెండు బ్యాడ్జ్‌లు శివ్‌కి ఇచ్చి హౌస్‌లోకి పంపించారు. వర్షిణి ఏం చేస్తోందని షాలిని పాయింట్. తను రోహిత్‌నే గెలుచుకోవడానికి వచ్చాననుకో.. మరి వర్షిణి ఏం చేస్తోందని ప్రశ్నించింది. రోహిత్ కూడా వాళ్లంతా ఓ టార్గెట్‌తో వస్తున్నారని.. వచ్చి మనల్ని మాత్రమే గెలుకుతారని చెప్పాడు. మొత్తానికి ఇంతకు మించి దిగజారడు అనుకున్న ప్రతిసారీ రోహిత్ దారుణంగా దిగజారుతున్నాడు. ఇక రోహిత్‌ను ఫ్యాన్స్ కూడా వదిలేస్తారనడంలో సందేహం లేదు. అతనిలో వాళ్లంతా అలా ఎందుకు అంటున్నారు? బయటేమైనా తన గురించి నెగిటివ్ అవుతోందా? అన్న ఆలోచనే లేదు. శివ్.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
రోహిత్ దగ్గరకు వెళ్లి ఏమైనా స్ట్రెస్‌లో ఉన్నారా? అని శివ్ అడిగాడు. బిగ్‌బాస్ హౌస్ అంటేనే స్ట్రెస్ అని తగ్గించుకోమని చెప్పాడు. తనకు మూడు పేర్లు ఉన్నాయని.. ఒకరికి ఇవ్వకపోవడానికి కారణం ఉందని చెప్పాడు. ముందుగా నరేష్‌ను సేవ్ చేశాడు. ఆ తరువాత రోహిత్, ముఖేష్లలో ఇద్దరికీ ఇవ్వాలని ఉందని.. కానీ ఒకరికే ఇవ్వాలి కాబట్టి దానిని ముఖేష్‌కు ఇస్తున్నట్టుగా చెప్పాడు. నెక్ట్స్ మ్యాజికల్ ఫైర్ ఉన్న ఒకరిని ఎంచుకుని ‘బిల్డ్ ది పిరమిడ్’ టాస్క్ ఆడాలని బిగ్‌బాస్ చెప్పారు. టాస్క్ గెలిస్తే పవర్ వస్తుంది. ఓడితే రూ.2 లక్షల డబ్బు విన్నింగ్ అమౌంట్‌కు యాడ్ అవుతుంది. రోహిత్‌ను సంచాలక్‌గా శివ్ ఎంచుకున్నాడు. తనకు ఇంట్రస్టింగ్ పవర్ అనిపించింది త్రిగుణ్దని అతనితో టాస్క్ ఆడాడు. ముందుగా టాస్క్‌ని త్రిగుణ్ గెలిచాడు. ప్రైజ్ మనీకి రెండు లక్షలు యాడ్ చేశాడు. ఓడిపోయిన వాళ్లకు పనిష్మెంట్ ఇస్తారు. దానిని బయట బోర్డులో అరేంజ్ చేశారు. వాటిలో ఒకటి నువ్వు సెలక్ట్ చేసుకోమని శివ్‌కి నాగ్ చెప్పారు. శివ్‌కి వాష్ రూమ్ డ్యూటీ ఇస్తున్నట్టుగా త్రిగుణ్ చెప్పాడు.
సెకండ్ వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్‌గా ఒక మంచి పెర్ఫార్మెన్స్తో దక్షి గుత్తికొండను ప్రవేశ పెట్టారు. తను సింగిల్ పేరెంటింగ్ అని.. డాడీ లేకుండా కష్టమని కానీ తన మదర్ ఆ లోటు తనకు తెలియకుండా పెంచిందని దక్షి చెప్పింది. జనాలకు దగ్గరయ్యే అవకాశం ఇప్పటి వరకూ రాలేదని.. ఇన్నాళ్లకు వచ్చిందని చెప్పింది. రోహిత్ తనకు నచ్చిన గేమర్ అని.. నచ్చనిది షాలిని అని చెప్పింది. షాలిని కారణంగా రోహిత్ సరిగా ఆడటం లేదని చెప్పింది. ఇక హౌస్‌లోని కంటెస్టెంట్స్‌కు వైల్డ్ కార్డుకు సంబంధించిన గ్లిమ్స్ చూపించారు. నరేష్ గుర్తిస్తే విన్నింగ్ ప్రైజ్ మనీకి రూ.2 లక్షలు యాడ్ చేస్తానని నాగ్ చెప్పారు. సగం పొగే కనిపించిందని నరేష్ చెప్పాడు. నెక్ట్స్ వచ్చేది ఎవరనేది ఎవరూ కనిపెట్టలేకపోయారు.
ఆ తరువాత దక్షిని పరిచయం చేశారు. నీకు బాగా లో కాంపిటేషన్ అని ఎవరు అనుకుంటున్నావో వాళ్లను టార్గెట్ చేయాలని నాగ్ చెప్పారు. ఆమె కూడా ఫస్ట్ షాలిని పేరు చెప్పింది. షాలిని.. అపూర్వ క్యారెక్టర్ అసాసినేషన్ చేసిందని చెప్పింది. సెకండ్.. నరేష్‌ను టార్గెట్ చేస్తున్నట్టు చెప్పింది. రామ్ ప్రసాద్, నరేష్ నుంచి చాలా ఫన్ ఎక్స్పెక్ట్ చేశానని అది లేదని చెప్పింది. నరేష్, రామ్ ప్రసాద్‌ను లేపి.. బంధాలు, బంధనాలు ఒకటేనా? అని నాగ్ అడిగారు. చరణ్ దానికి ఆన్సర్ ఇచ్చాడు. బంధం ముదిరితే బంధనం అవుతుందని చెప్పాడు. దక్షికి రెండు బ్యాడ్జెస్, బ్రీఫ్‌కేస్ ఇచ్చి పంపించారు. సేమ్ శివ్ మాదిరిగానే పవర్ ఉన్న వారిలో ఒకరిని ఛాలెంజ్ చేసి టాస్క్ ఆడాలి. గెలిస్తే పవర్.. ఓడితే ఆమె తీసుకెళ్లిన అమౌంట్ ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. దక్షి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు షాలిని, రోహిత్ డిస్కషన్. ‘నేను లీస్ట్ కాంపిటేటర్నా?’ అని అంటే.. తను కూడా హౌస్‌కి పనికి రానని ఐదు ముద్రలు వేశారని చెప్పాడు. కానీ వాళ్లు బయటి నుంచి చూసి చెబుతున్నారని షాలిని అన్నది. ఈమె కాస్త పరిస్థితిని అర్థం చేసుకుంటున్నట్టుగా అనిపించింది. హౌస్‌లో ఉండాల్సిన ఇద్దరికి స్టే బ్యాడ్జెస్ ఇవ్వమంటే.. ఒకటి రోహిత్‌కి.. మరొకటి ముఖేష్‌కి ఇచ్చింది. పవర్ ఉన్న వారిలో నరేష్‌ను దక్షి ఛాలెంజ్ చేసింది. సుధీర్‌ను సంచాలక్‌గా ఎంచుకుంది. నరేష్ టాస్క్ చాలా బాగా ఆడి గెలిచాడు. దీక్ష ఓడిపోయింది. దక్షికి పనిష్మెంట్ కింద యుటెన్సెల్ క్లీనింగ్ ఇచ్చాడు. ప్రైజ్ మనీ రూ.39 లక్షలు అయినట్టుగా నాగ్ చెప్పారు.
ఇక వైల్డ్ కార్డ్స్‌లో భాగంగా థర్డ్ కంటెస్టెంట్‌గా నటరాజ్ మాస్టర్ భార్య నీతూ ఓ పెర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లో నీ పేషెన్సీ ఎవరు టెస్ట్ చేస్తారని అనుకుంటే త్రిగుణ్ పేరు చెప్పింది. హౌస్ చాలా హీట్ హీట్‌గా ఉందని.. ముందుగా ప్రేమను పంచుతామని చెప్పింది. హౌస్‌లో ఎవరు బెటర్ డ్యాన్సర్ అంటే ముందుగా చరణ్, ఆ తరువాత షాలిని అని చెప్పింది. నీతూ గురించి ఒక ఏవీని ప్లే చేశారు. గుజరాతి అమ్మాయినని.. తనకు చదువు పెద్దగా ఎక్కలేదు కానీ డ్యాన్స్ బాగా చేస్తానని చెప్పింది. చాలా కాంపిటేషన్స్‌కి వెళ్లి గెలిచానని చెప్పింది. నటరాజ్ మాస్టర్‌తో పెళ్లి, పాప కూడా పుట్టిందని చెప్పింది. పెళ్లైన తర్వాత ఏమీ చేయలేరనే అపోహ ఉంటుందని దానిని మార్చేందుకే తను వచ్చానని చెప్పింది. కర్రసాము, కత్తిసాము బాగా చేస్తుందట. నీతూ గ్లిమ్స్ చూపించారు. హౌస్‌లోని ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఆమె కత్తి సామును నాగ్ చూపించారు. నీతూ అని నాగ్ చెప్పారు. హౌస్‌లో నీకు ఇద్దరు టార్గెట్ ఎవరని నాగ్ అడిగితే ఫస్ట్ షాలిని అని నీతూ చెప్పింది. షాలిని గేమ్ కనిపించడం లేదని.. అరుపులే కనిపిస్తున్నాయని నీతూ చెప్పింది. ఆల్రెడీ నీ గేమ్ నాకు కనిపించిందని బయటి నుంచే చూసి వచ్చానని చెప్పింది. ఒక్క గేమ్ అయినా ఆడావా? అని అడిగింది. నువ్వు గేమ్ అంతా రోహిత్‌ని అడ్డు పెట్టుకుని ఆడుతున్నావని చెప్పింది. వంశీని మీరెక్కడా కనిపించడం లేదని చెప్పింది. పాయింట్‌లెస్‌గా అరుస్తున్నావని చెప్పింది. సరే.. వచ్చాక గేమ్ ఆడదాంలే అని అన్నాడు. స్టే బ్యాడ్జెస్, బ్రీఫ్ కేస్ ఇచ్చి నాగ్ ఆమెను హౌస్‌లోకి పంపించారు.
షాలిని ఇష్టానుసారంగా నీతూపై కామెంట్స్ చేసింది. దీనికి శివ్ వచ్చి బయటి నుంచి వచ్చి చెబుతున్నాం కాబట్టి మార్చుకోవడానికి ట్రై చేయమని.. నీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోమని.. స్టెబులిటీతో ఉండి చెప్పమని చెప్పాడు. షాలని చాలా యాటిట్యూడ్ చూపించింది. దక్షి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు రోహిత్, షాలిని దూరంగా ఉన్నారు.
నీతూ తన దగ్గర ఉన్న రెండు స్టే బ్యాడ్జ్‌లలో ఒకటి నరేష్‌కు.. రెండోది రోహిత్‌కు పెట్టింది. ఇక నీతూ పవర్ ఉన్న వారిలో త్రిగుణ్‌ని ఛాలెంజ్ చేసింది. సంచాలక్‌గా నరేష్‌ని ఎంచుకుంది. నీతూ అవలీలగా ఆడి టాస్క్ గెలిచి త్రిగుణ్ దగ్గర ఉన్న పవర్ లాగేసింది. పవర్ గురించి ఎవరికీ చెప్పొద్దని నాగ్ చెప్పారు. పవర్ బాక్స్‌పై త్రిగుణ్ ఫోటో తీసి నీ ఫోటో పెట్టుకోమని నాగ్ చెప్పారు. షాలినిని లేపి.. ‘హౌస్‌లోకి రండి.. వచ్చి ఆడండి.. తర్వాత చూద్దాం అన్నావు కదా.. వచ్చి ఆడింది.. గెలిచింది’ అని నాగ్ అన్నారు. అవునని చెప్పారు. తను ఫస్ట్ వీక్‌లో ఒక టాస్క్ ఆడి గెలిచానని చెప్పింది. అది ఇప్పటి వరకూ నీకు కూడా గుర్తు లేదు కదా అని నాగ్ అడిగారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కొన్ని సర్ప్రైజెస్ పంపించిందని నాగ్ చెప్పారు. అందరికీ షాపింగ్ కోసం రూ.10 వేల చెక్ ఇచ్చింది.
నెక్ట్స్ వైల్డ్ కార్డుగా శ్వేతా నాయుడు ఒక మంచి పెర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చింది. శ్వేత తన జర్నీ గురించి చెప్పింది. తనకు డ్యాన్స్, సింగింగ్ చేస్తుంటానని చెప్పింది. నాగ్ ఒక పాట పాడమంటే చాలా బాగా పాడింది. దేబ్జానిని కూడా చక్కగా ఇమిటేట్ చేసింది. హౌస్‌లోని వారిలో మోస్ట్ డేంజరస్ షాలిని అని చెప్పింది. కంటెస్టెంట్స్ శ్వేత గ్లింప్స్ చూపించారు. త్రిగుణ్‌ని గ్లింప్స్‌లో నడుము చూపించి పొరపాటున చెయ్యి లేపుతావేమో అంటూ నాగ్ టీజ్ చేశారు. అమన్ చక్కగా శ్వేతానాయుడు అని గెస్ చేశాడు. హౌస్‌లో తన టార్గెట్ షాలిని అని శ్వేత చెప్పింది. షాలినిని ఇమిటేట్ చేయాలని నాగ్ చెబితే ఆమె ఓన్లీ పీస్ అని చెప్పింది. తను మాట్లాడుతుంటే టీవీలో సౌండ్ కూడా తగ్గించుకుంటానని చెప్పింది. నెక్ట్స్ టార్గెట్ రోహిత్ అని చెప్పింది. రోహిత్ గేమ్ ప్లేకు తను పెద్ద ఫ్యాన్ అని.. లాస్ట్ వీక్ నుంచి డిస్ట్రాక్ట్ అయినట్టుగా తనకు అనిపిస్తోందని.. కమ్ బ్యాక్ ఇవ్వాలని శ్వేత చెప్పింది. రెండు బ్యాడ్జెస్, బ్రీఫ్‌కేస్‌తో హౌస్‌లోకి శ్వేత అడుగు పెట్టింది. డేంజర్లో ఉన్నవారిలో స్టే బ్యాడ్జెస్ శ్వేత ముందుగా ఒకటి రోహిత్‌కు.. మరొకటి నరేష్‌కు ఇచ్చింది. ఆ తరువాత వంశీని శ్వేత ఛాలెంజ్ చేసింది. త్రిగుణ్ సంచాలక్. ఈ టాస్క్‌ను వంశీ గెలిచాడు. శ్వేతకు వంశీ క్లీనింగ్ ఇచ్చాడు. ప్రైజ్ మనీ రూ.41 లక్షలకు చేరింది.
లాస్ట్ వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్‌గా రామకృష్ణ ఒక మంచి ఏవీతో అడుగు పెట్టాడు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక కేటరింగ్‌కు వెళ్లేవాడినని రామకృష్ణ చెప్పాడు. అగ్నిపరీక్షలో ఎఫర్ట్ పెట్టి ఆడినా సెలక్ట్ అవకపోవడం తనను బాధించిందని చెప్పాడు. రెండోసారి అవకాశం వచ్చినా మిస్ అయ్యిందని.. తనకు మూడోసారి ఛాన్స్ వచ్చిందని దానిని వినియోగించుకుంటానని ఆర్కే చెప్పాడు. తనకు బాగా నచ్చింది నరేష్ ఆట అని ఆర్కే చెప్పాడు. హౌస్‌లో ఫన్ మిస్ అయ్యిందని చెప్పాడు. గ్లింప్స్ లేదని.. ఫైనల్ వైల్డ్ ఫైర్ ఎవరో కనుక్కోవాలని.. కనిపెట్టలేకుంటే రూ.10 లక్షలు పోతాయని నాగ్ చెప్పారు. రామకృష్ణ అని గెస్ చేశారు కానీ నాగ్ రూ.10 లక్షలు పోతాయని హెచ్చరించడంతో డ్రాప్ అయ్యారు. షాలిని, వర్షిణికి ఏం పనిష్మెంట్ ఇద్దామంటే.. ఆల్రెడీ పనిష్మెంట్లోనే ఉన్నానని షాలిని చెప్పింది. రామకృష్ణ తన ఫస్ట్ టార్గెట్‌గా రోహిత్‌ను ఎంచుకున్నాడు. రోహిత్ గేమ్ అగ్నిపరీక్షలో చాలా బాగుందని.. కానీ హౌస్‌లో బాగోలేదని చెప్పాడు. సెకండ్ టార్గెట్ షాలిని అని చెప్పాడు. హౌస్‌లోకి షాలిని వచ్చింది గేమ్ ఆడేందుకో.. రోహిత్‌తో బాండ్ పెంచుకోవడానికో తెలీదని చెప్పాడు. బ్రీఫ్‌కేస్, బ్యాడ్జెస్తో రామకృష్ణను నాగ్ హౌస్‌లోకి పంపించారు.
డేంజర్ జోన్లో ఉన్న ఐదుగురిలో రెండు స్టే బ్యాడ్జెస్లో ఒకటి నరేష్‌కు.. రెండవది రోహిత్‌కి ఇచ్చాడు. బయటి నుంచి వచ్చిన వారిలో నలుగురు రోహిత్‌కి స్టే బ్యాడ్జెస్ ఇచ్చారు. నరేష్, ముఖేష్, రోహిత్‌కు స్టే బ్యాడ్జెస్ రావడంతో ముగ్గూరే సేవ్ అయ్యారు. షాలిని, చరణ్‌కి ఒక్కటి కూడా రాకపోవడంతో వారిలో ఒకరు ఎలిమినేట్ అని నాగ్ చెప్పారు. ముందుగా ఎవరిని ఛాలెంజ్ చేస్తావని ఆర్కేని నాగ్ అడిగితే రామ్ ప్రసాద్‌ను అని చెప్పాడు. సంచాలక్ అమన్. హౌస్‌లోని 11 ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ షాలిని, చరణ్‌లలో ఎవరు ఉండాలనుకుంటే వారికి ఓటేయాలని నాగ్ చెప్పారు. ఒక్క అమన్ తప్ప అంతా షాలినికి ఓటు వేశారు. దీంతో చరణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఆమాట చెప్పగానే షాలిని ఓ స్మైల్ ఇచ్చింది. తరువాత వెంటనే సర్దుకుంది. తను తక్కువ చేసి ఉండొచ్చు కానీ తప్పైతే చేయలేదని చరణ్ చెప్పి బయటకు వెళ్లిపోయాడు. షాలినికి ఎందుకు ఓటేయలేదని రోహిత్.. అమన్‌ను క్వశ్చన్ చేయడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వాస్తవానికి ఒక క్లోజ్ ఫ్రెండ్ తను ఓటు వేయాల్సింది పోయి.. నువ్వెందుకు వేయాలేదనడం విచిత్రం. రోహిత్ ఆట గోవిందా.. షాలిని నెక్ట్స్ వీక్ పోయిందా? రోహిత్ ఉంటాడు. లేదా.. రోహిత్ రెండు మూడు వారాల్లో హౌస్ నుంచి బయటకు రావడం ఫిక్స్ అని పరిస్థితులు చూస్తుంటే అనిపిస్తోంది.
చరణ్‌కు నాగ్.. డబుల్ ఫేసేస్ ఉన్న ముగ్గురిని చెప్పమంటే.. ముందుగా త్రిగుణ్ గురించి చెప్పాడు. అపూర్వ లిప్స్ గురించి వెనుక మాట్లాడటం ఫ్రంట్ ఫుట్‌లో ఆడేవారికి కరెక్ట్ కాదని చెప్పాడు. ఝాన్సీ వచ్చేసి తనకు జనాలున్నారని చెప్పే వ్యక్తి తన పవర్‌ను ఆడుకోవడం కరెక్ట్ కాదనిపించింది. సుధీర్ వీక్ అంతా బాగుంటాడని నామినేషన్స్‌లో డిఫరెంట్ పర్సనాలిటీ కనిపిస్తుంది. కోపం, పగ కనిపిస్తుందని చరణ్ చెప్పాడు. చరణ్ తనకు పడిన ఒక్క ఓటు ఎవరేసి ఉంటారని అడిగితే అమన్ అని చెప్పాడు. వైట్ గోల్డ్ మెడల్ ఇచ్చి చరణ్‌ను నాగ్ పంపించారు. రామ్ ప్రసాద్‌ని ఆర్కే ఛాలెంజ్ చేశాడు. అమన్ సంచాలకుడిగా టాస్క్ నడిచింది. ఈ టాస్క్‌లో రామ్ ప్రసాద్ గెలిచాడు. రూ.2 లక్షలు ప్రైజ్ మనీకి యాడ్ అయ్యింది. ఆర్కేకు రామ్ ప్రసాద్ కిచెన్ డ్యూటీ ఇచ్చాడు. మొత్తంగా విన్నర్ ప్రైజ్ మనీ రూ.43 లక్షలకు చేరింది. నెక్ట్స్ వీక్ బిగ్‌బాస్ అవతారం ‘రోడ్ బ్లాక్’ అని నాగ్ చెప్పారు. మొత్తానికి కొత్తగా ఐదుగురు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరూ రోహిత్, షాలినిలకు కావల్సినన్ని హింట్స్ ఇచ్చారు. ఆట మార్చుకుంటే బాగుంటుంది. లేదంటే తూర్పు ఎటుందో చూసుకోవాల్సిందే.
