Menu
BREAKING
హ్యాపీ బర్త్ డే టబు.. అప్పుడు పండు.. ఇప్పుడు మహంతి ఝాన్సీ రాణి..!   |   ఎర్లీ మార్నింగ్ షోస్‌కు ఓకే.. టికెట్ హైక్స్‌కు నో.. విజయ్ సర్కార్ సంచలనం..!   |   మహేష్ బాబు.. ది రియల్ లైఫ్ బిజినెస్ మెన్‌.. వ్యాపారాల్లో దూకుడు..!   |   పాకెట్ రాకెట్స్ టీజర్ రివ్యూ.. మెగా డాటర్ హ్యాట్రిక్ కొట్టేలా ఉందిగా..!   |   “రాధిక ఆప్టే నీకు అసలు సిగ్గుందా..” సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల ఆగ్రహం..!   |   Bigg Boss10 Telugu: మరో రోహిత్ అవుతున్న ముఖేష్.. రెడ్ కార్డ్ ఇచ్చేంత తప్పు చేశాడా?   |   మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సాయి ధరమ్ తేజ్ పెళ్ళి ఎప్పుడో తెలుసా..?   |   Bigg Boss10 Telugu: వంశీకి ‘టెంపర్’ లేచింది.. వెకిలి చేష్టలతో చిరాకు తెప్పించిన శివ్..   |   మారిన సెన్సార్ (CBFC) రూల్స్.. దర్శక నిర్మాతలు గుర్తించుకోండి ఈ పాయింట్స్..!   |   Bigg Boss10 Telugu: రోహిత్ ఎలిమినేట్..   |   ఏంటి గురూజీ ఆదర్శ కుటుంబం కూడా కాపీయేనా..? త్రివిక్రమ్‌పైనే ఎందుకిలా..?   |   ‘ఇరుముడి’ నిర్మాతలకు భారీ షాక్.. లేబర్ డిపార్ట్‌మెంట్ నోటీసులు..   |   చిరంజీవికి బాలకృష్ణ సవాల్.. మెగావర్స్ టాక్ షో అన్ స్టాపబుల్ ను మ్యాచ్ చేయగలదా..?   |   ఎమోషన్ లేని వైలెన్స్ కు అర్థం లేదు.. అది మనోళ్లకు చెప్పినా అర్థం కాదు..!   |   సాయి పల్లవి ఎందుకమ్మా అంత నోటిదురద.. రిలీజ్‌కు ముందు అవసరమా..?

Biggboss10 Telugu: మరీ చిల్లరగా మారిన షాలిని.. ఈవారం ఎలిమినేట్ అవుతుందా?

Biggboss10 Telugu: మరీ చిల్లరగా మారిన షాలిని.. ఈవారం ఎలిమినేట్ అవుతుందా?

బిగ్‌బాస్ 10 తెలుగు.. వైల్డ్ కార్డ్స్ వచ్చి ఇచ్చిన హింట్స్‌తో సెలబ్రిటీలంతా ఆట మార్చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమ ఆట తీరును మార్చుకున్నారు. తమ మెయిన్ ప్రత్యర్థిగా రోహిత్‌ను ఎంచుకుని మరీ గేమ్ ఆడుతున్నారు. ఇక నిన్న (సోమవారం), ఇవాళ నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. నిన్న వచ్చేసి పెద్దగా ముందుకు సాగలేదు. రోహిత్, షాలిని నామినేట్ చేయాల్సిన ఇద్దరిలో ఒకరిని చేయడంతో షో ముగిసింది. రోహిత్ వచ్చేసి వంశీని స్ట్రాంగ్ పాయింట్స్‌తో ఝాన్సీని నామమాత్రపు పాయింట్స్‌తో నామినేట్ చేశాడు. దీంతో ఆటోమేటిక్‌గా వంశీ నామినేషన్స్‌లోకి వచ్చాడు. ఇక నిన్న షాలిని వచ్చేసి దేబ్జానిని నామినేట్ చేసింది. ఇవాళ మరొకరిని నామినేట్ చేయనుంది.

అయితే దేబ్జాని వచ్చేసి ఇద్దరిని నామినేట్ చసింది. షాలినిని స్ట్రాంగ్ పాయింట్స్‌తో.. రామ్ ప్రసాద్‌ను నామమాత్రపు పాయింట్స్‌తో నామినేట్ చేసింది. దీంతో షాలిని నామినేషన్స్‌లోకి వచ్చింది. ఇక మొన్నటి నుంచి షాలిని బాగా ఒత్తిడిలో ఉన్నట్టుగా ఉంది. వైల్డ్ కార్డ్స్ అంతా షాలినిని టార్గెట్ చేయడంతో ఆమె బాగా స్ట్రెస్ ఫీలవుతోందో.. మరొకటో కానీ ఎవరు కదిలించినా వాళ్ల మీదకు మాటలతో దారుణాతి దారుణంగా దాడి చేస్తోంది. అగ్నిపరీక్షలో ఆమె చాలా బ్యాడ్ అయిపోయింది. అయితే బిగ్‌బాస్‌లో అంతకు మించి బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది. ఇక ఈవారం ఆమె చేస్తున్న హంగామా చూస్తుంటే ప్రేక్షకులకే చిరాకు వస్తోంది.

ఈ క్రమంలోనే రోహిత్ ఫ్యాన్స్ కూడా షాలిని ఎప్పుడు నామినేషన్స్‌లోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఆమె ఎలిమినేట్ అవకుంటే రోహిత్ ఆట మొత్తం పోతుంది. త్వరలోనే బయటకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో షాలినిని ఈ వారం బయటకు తీసుకొచ్చేందుకు అస్త్ర శస్త్రాలను వినియోగిస్తారు. క్రాస్ ఓటింగ్ బాగా పడే అవకాశం ఉంది. మరోవైపు స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరూ నామినేషన్స్‌లో ఉండబోవడం లేదనిపిస్తోంది. దీంతో స్ట్రాంగ్ ప్లేయర్స్‌కు సంబంధించిన ఓటింగ్ అంతా షాలినికి పడే అవకాశం ఉంది. అంటే షాలినిని బయటకు లాగాలని రోహిత్ ఫ్యాన్స్.. ఆమెను హౌస్‌లోనే ఉంచాలని ముఖేష్, త్రిగుణ్ ఫ్యాన్స్ ఓటింగ్ చేసే అవకాశం ఉంది. దీంతో షాలిని బయటకు వస్తుందా? లేదంటే హౌస్‌లోనే ఉంటుందా? అనేది తెలియాలంటే వీకెండ్ వరకూ ఆగాల్సిందే.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360