సినిమా వార్తలు

Bigg Boss10 Telugu: రోహిత్ ఎలిమినేషన్‌పై ఎన్నో ఊహాగానాలు.. అసలు నిజమేంటి?

బిగ్‌బాస్ హౌస్ నుంచి నిన్న సాయంత్రం రోహిత్ ఎలిమినేట్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఎన్నో ఊహాగాలు వినవస్తున్నాయి. రోహిత్ ఎలిమినేట్ అవలేదని.. సీక్రెట్ రూమ్‌కి పంపారంటూ ముందుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత కాసేపటికే సీక్రెట్ రూం ఏదీ లేదు. రోహిత్ తన తల్లికి కాల్ చేశాడట. ఆమె నీ ఇష్ట ప్రకారం నిర్ణయం తీసుకోమని చెప్పారట. దీంతో తను సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యేందుకే మొగ్గు చూపాడట అంటూ వార్తలొచ్చాయి. ఆ తరువాత మరికాసేపటికే రోహిత్‌ను సీక్రెట్ రూంకి పంపాలని హోస్ట్ నాగార్జున, బిగ్‌బాస్ టీం శతవిధాలుగా ప్రయత్నించిందని.. రోహిత్‌కు తన తల్లితోనూ.. అలాగే అభిజిత్‌తోనూ చెప్పించారని అయినా రోహిత్ వినలేదని వార్తలొచ్చాయి.

హౌస్‌లోనూ.. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి ఇన్ని వారాలుగా తననే టార్గెట్ చేయడంపై రోహిత్ చాలా అసంతృప్తితో ఉన్నాడని.. కేవలం సెల్ఫ్ రెస్పెక్ట్‌ను కాపాడుకునేందుకే అతను బయటకు వచ్చాడంటూ వార్తలొచ్చాయి. అంతేకాదు.. బిగ్‌బాస్ బజ్‌ జరుగుతోందని.. మరికాసేపట్లో రోహిత్ ఇంటర్వ్యూ పూర్తై బయటకు వస్తాడని సైతం వార్తలొచ్చాయి.

కనీసం రోహిత్‌ను ప్రోమో కూడా వేయకుండా బయటకు పంపించారని.. బిగ్‌బాస్ టీం, హోస్ట్ నాగార్జున కేవలం రోహిత్ ప్రశ్నించాడనే కారణంగానే ఇదంతా చేసిదంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. రోహిత్ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వచ్చిన దాఖలాలు అయితే కనిపించలేదు. పోనీ అక్కడే ఉన్నాడా? అనేది కూడా క్లారిటీ లేదు.

ఇకపోతే తాజాగా మరో న్యూస్.. రోహిత్‌ను బయటకు పంపేందుకు నాగ్ ఓటింగ్ నిర్వహించగా.. అమన్ సైతం అతను బయటకు వెళ్లాలంటూ ఓటు చేశాడంటూ వార్తలొచ్చాయి. అసలు ఈ ఊహాగానాలన్నింటిలో ఏది నిజం? రోహిత్ ఏమయ్యాడు? వంటి విషయాలు తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Telugu Cinema 360

Recent Posts

రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో శ్రీ కృష్ణుడు.. కాన్సెప్ట్ పోస్టర్ అర్థం అదేనా..?

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చేది రంగస్థలం సినిమా. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన…

44 minutes ago

Bigg Boss10 Telugu: ఝాన్సీ ఎలిమినేట్.. త్రిగుణ్ గ్రూప్‌కి ప్రశంసలు.. రోహిత్ గ్రూప్‌కి అక్షింతలు..

బిగ్‌బాస్ షో వీకెండ్‌కు వచ్చేసింది. హోస్ట్ నాగార్జున వచ్చీరాగానే ఆడియెన్స్‌తో మాట్లాడి శుక్రవారం ఏం జరిగిందో చూశారు. సుధీర్‌ను ముఖేష్…

1 hour ago

Bigg Boss10 Telugu: షాకింగ్.. బిగ్‌బాస్ నుంచి రోహిత్ ఎలిమినేట్..

బిగ్‌బాస్ 10 తెలుగు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని ముందుగానే బిగ్‌బాస్…

1 day ago

Bigg Boss10 Telugu: ఈవారం ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. ఊహించని కంటెస్టెంట్ అవుట్

బిగ్‌బాస్ 10 తెలుగు ఈవారం కూడా బిగ్‌బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈవారం ఊహించని వ్యక్తి బిగ్‌బాస్ హౌస్ నుంచి…

1 day ago

Bigg Boss10 Telugu: అమన్ వర్సెస్ రోహిత్ పెద్ద గొడవ.. సుధీర్ ఎలిమినేట్ కానీ..

నిన్న రోహిత్‌కు అమన్ బ్యాక్ స్టాబ్ చేయడం.. ఆ తరువాతి పరిణామాలతో నేడు బిగ్‌బాస్ షో ప్రారంభమైంది. రోహిత్ వచ్చేసి…

1 day ago

సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ‘అదుర్స్’ బామ్మ ఇకలేరు..!

సీనియర్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూశారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎన్నో నాటకాలు, టీవీ సీరియల్స్, సినిమాలతో ప్రేక్షకులను…

2 days ago