బిగ్‌బాస్ షో వీకెండ్‌కు వచ్చేసింది. హోస్ట్ నాగార్జున వచ్చీరాగానే ఆడియెన్స్‌తో మాట్లాడి శుక్రవారం ఏం జరిగిందో చూశారు. సుధీర్‌ను ముఖేష్ సేవ్ చేశాడు. ముఖేష్‌కు సుధీర్ థ్యాంక్స్ చెప్పాడు. ఆ తరువాత ముఖేష్ టీం అంతా సమావేశమైంది. శివ మరో త్రిగుణ్ అవుతాడని రోహిత్ అన్నాడు. త్రిగుణ్ ఏం చేశాడో శివ అలాగే చేస్తున్నాడని ముఖేష్ అన్నాడు. ముఖేష్ మీడియేటర్ పని చేస్తున్నాడని అన్నాడు. ‘B’తో వస్తుందని సుధీర్ అన్నాడు. బి అంటే ఏమిటని ముఖేష్ అడిగాడు. ముఖేష్ చెవిలో వర్షిణి చెప్పింది. తన మెయిన్ ఇన్‌టెన్షన్ కూడా అదేనని చెప్పాడు. త్రిగుణ్ టార్గెట్ డైరెక్టర్‌గా తనని రోహిత్ చెప్పాడు. ఈ నామినేషన్స్‌లో తనను వదలరని ముఖేష్ చెప్పాడు. వాళ్లలో వాళ్లు ఒక్కరిని కూడా నామినేట్ చేసుకోరని ఝాన్సీ చెప్పింది. మనలో ఎవ్వరు కెప్టెన్ అయినా తన కొవ్వు కరిగించాలని ముఖేష్ అన్నాడు. మనలో ఎవ్వరు కెప్టెన్ అయినా దేబ్జాని, త్రిగుణ్‌తో చీపురు పట్టించాలని రోహిత్ చెప్పాడు. కెప్టెన్ రూం అనేది అదొక హోదా అని ప్రతి ఒక్కరూ వెళ్లి వస్తుంటే ఎలాగని రోహిత్ అన్నాడు. వంశీ అన్న తీసుకెళ్లి ఏకంగా మీటింగ్ పెట్టాడన్నాడు. ఆ తరువాత త్రిగుణ్, వంశీ మీటింగ్. తను న్యూట్రల్‌గా ఆడదామంటే వాళ్లే తనను ఆడనివ్వలేదని.. ముఖేష్ అందితే జుట్టు లేదంటే కాళ్లు పట్టుకుంటాడని వంశీ అన్నాడు. దీనికి త్రిగుణ్ వంత పాడాడు.
ఫోన్‌పే నుంచి గోల్డ్ కాయిన్స్ వచ్చాయి. వాటిలో మూడు కాయిన్స్‌ను దేబ్జానికి ఇచ్చాడు. నరేష్‌కు 4 గోల్డ్ కాయిన్స్ ఇచ్చాడు. తరువాత త్రిగుణ్, శివ, రామకృష్ణ మీటింగ్. ఎందుకండి తమ్ముడికి కొట్టారని త్రిగుణ్‌ని నీతూ అడిగింది. తనకన్నా దిగజారి ఉందని చెప్పాడు. ఇక్కడున్న వాళ్లలో తప్పుల మీద తప్పులు చేసింది మీరేనని తను రోహిత్‌కు చెప్పానని శివ్ చెప్పాడు. హౌస్‌లో తనకు నచ్చని పర్సన్ ఉన్నారంటే రోహితేనని అతనికే చెప్పానని శివ్ అన్నాడు. షూస్ గురించి త్రిగుణ్, ముఖేష్ మధ్య చర్చ. నరేష్ అయితే మనుషులను తను ఇకపై దూరం పెడతానని.. వెళ్లిపోతుంటే ఎమోషనల్ అవుతున్నానన్నట్టుగా నరేష్ చెప్పాడు. నీ థింగ్స్ అన్నీ తీయాలని ముఖేష్‌కు త్రిగుణ్ చెప్పాడు. ముందుగా నీ రూమ్‌లో చూసుకోమని త్రిగుణ్‌కు ముఖేష్ చెప్పాడు. తనది ప్రైవేట్ రూమ్ అని త్రిగుణ్ అన్నాడు. ఇద్దరి మధ్య బాగా గొడవ జరిగింది. వల్గర్ థాట్ నీ మైండ్‌లో ఉందని.. నెగిటివ్ థింకింగ్ అని త్రిగుణ్ చెప్పాడు. ఆ తరువాత తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లకు సంబంధించిన ప్రమోషనల్ టాస్క్ జరిగింది.
పప్పు గురించి నీతూతో త్రిగుణ్ గొడవ. నిన్న మధ్యాహ్నం ఎవరో పప్పు ఫ్రిడ్జ్‌లో పెట్టారు. అది పడేయలేదని నీతూతో త్రిగుణ్ గొడవపడ్డాడు. రోహిత్, ముఖేష్, సుధీర్ చర్చ. అల్టిమేట్ గోట్‌లో ఎందుకు త్రిగుణ్‌ను ముందుకు పంపిస్తుంటే రామ్ ప్రసాద్ కానీ..దేబ్జాని ఎందుకు మాట్లాడలేదు అని చెప్పాడు. దేబ్జాని కారణంగా రామ్ ప్రసాద్ తన పర్సనాలిటీని కోల్పోతున్నాడని ముఖేష్ అన్నాడు. మరోవైపు రామ్ ప్రసాద్, త్రిగుణ్, వంశీ.. ముఖేష్, రోహిత్ గురించి చర్చ. రోహిత్ అనేవాడు తనతో కలవాలన్నా కలవడని.. వాడికి తనపై ద్వేషం వచ్చేసిందని త్రిగుణ్ చెప్పాడు. తన గేమ్ గురించి నరేష్‌ని ముఖేష్ అడిగాడు. గేమ్ అని కాదు.. కొన్ని మాటలు లూజ్ అవుతున్నావని.. లిమిట్ దాటి వెళితే అది వేరేలా అవుతుందని చెప్పాడు. కొన్నిసార్లు ఓడిపోతే ఓడిపోవచ్చని లైట్ తీసుకోమని ముఖేష్‌కు నరేష్ చెప్పాడు. నిన్న నీ ఫ్రెండ్‌ని నువ్వు కాపాడుకున్న విధానంతో ఒక మెట్టు ఎక్కేశావని.. నీకు బయట బాగా పాజిటివిటీ వస్తుందని నరేష్ చెప్పాడు.
నాగ్ అందరినీ కూర్చోబెట్టి నరేష్‌ను నిలుచోబెట్టి అదరగొట్టేశావని అన్నారు. ఈవారం మీ అందరి ఆట గత వారంతో పోలిస్తే ఇంప్రూవ్ అయ్యిందని నాగ్ చెప్పారు. సుధీర్‌ని లేపి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఆడియెన్స్ ఓట్లతో ఎలిమినేట్ అవబోయి నువ్వు పెట్టుకున్న బంధాల కారణంగా సేవ్ అయ్యావని నాగ్ అన్నారు. రెండు వారాల పాటు రెడ్‌లో ఉండి.. ఎందుకు ఎల్లోలోకి రాలేకపోయావని నాగ్ అడిగారు. హోటల్ టాస్క్‌లో ఎంటర్‌టైన్ చేయమంటే.. బేరసారాల్లోనే ఉండిపోయావని నాగ్ చెప్పారు. ఆడియెన్స్ వర్డిక్ట్ ఇచ్చారని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలని చెప్పారు. ఝాన్సీని లేపి ‘నీ పవర్ నీకు వినియోగించుకునే అవకాశం మరోసారి వచ్చిందని.. నువ్వు మనస్ఫూర్తిగా వాడావా? ముఖేష్ అడిగాడని వాడావా?’ అని నాగ్ అడిగితే తనే డెసిషన్ తీసుకున్నానని ఝాన్సీ చెప్పింది. ఈ వారం ఆటేదని అడిగారు. నరేష్‌తో కలిసి ఆడిన ఆటలో ఎందుకు చూపిస్తూ ఆడావని నాగ్ అడిగారు. ఆ గేమ్‌కు సంబంధించి నాగ్ వీడియో చూపించారు. ముఖేష్, నరేష్‌లతో అలాగే ఆడావని నాగ్ చెప్పారు. రోహిత్, వర్షిణి ఎవరికీ తెలియకుండా ఆడారని నాగ్ చెప్పారు.
రామకృష్ణను ఎందుకు అక్కడే ఉన్నావని నాగ్ అడిగారు. అందరి ఆకలి తీర్చాల్సిన నువ్వు ప్రతి ప్లేటుకు డబ్బులు తీసుకుని ఉంటే నీ దగ్గర ఎంత ఉండేదని నాగ్ అడిగారు. నువ్వు నవరస మామా అంటావని.. నీలో శోకరసం మాత్రమే ఉందని నాగ్ చెప్పారు. అంపైర్ నీతూ మాస్టర్ అని నాగ్ పిలిచారు. గ్రీన్‌కు వచ్చేసరికి చాల్లే అనుకున్నావా? అని నాగ్ అడిగారు. నీకు ఇచ్చిన రోల్.. గులాబి గాసిప్ అని.. దానిని ఎంత బాగా చేయవచ్చని నాగ్ అడిగారు. చిన్న చిన్న విషయాలకు కన్నీళ్లు పెట్టుకోవద్దని నాగ్ చెప్పారు. వర్షిణికి తెలిసిన విషయం నీకు తెలియలేదని.. బంధాలు, బంధాలు అనుకుంటే మన దగ్గర స్టార్స్ మిగలవని చెప్పారు. అవకాశం కల్పించుకుని ఆడాలని నాగ్ చెప్పారు. ఛాన్స్ రాలేదన్నావని.. వచ్చిన దాన్ని వినియోగించుకోలేదని నాగ్ చెప్పారు. ఈసారి పక్కా ఆడతానని నీతూ చెప్పింది. రామ్ ప్రసాద్‌ను లేపి అంత అమాయకంగా నటించవద్దని నాగ్ చెప్పారు. రెడ్‌లో ఉన్న నువ్వు.. ఎల్లోకి.. అక్కడి నుంచి గ్రీన్‌కి వచ్చావని చెప్పారు. నీ దగ్గర అన్ని స్టార్స్ ఉన్నప్పుడు నరేష్‌కు ఇవ్వొచ్చు కదా అని నాగ్ అడిగారు. నీకోసం ఆడమని మీరే గత వారం అన్నారు కదా.. అందుకే నాకోసం ఆడానని రామ్ ప్రసాద్ చెప్పారు.
నరేష్‌ను నీకు స్టార్స్ వచ్చినా రాకున్నా నీ ఆట ఎప్పుడు 5 స్టారే అని నాగ్ చెప్పారు. యానిమల్ మాదిరిగా మిమిక్రీ చేయమన్నారు. లయన్ వాయిస్ చేస్తానని.. నాగ్‌ను మాట్లాడమని అడిగాడు. ఆయన మాట్లాడగానే ఇలా ఉంటుందని చెప్పాడు. గేమ్ కొంచెం ఇంప్రూవ్ చేయమని చెప్పారు. ముఖేష్‌కు సలహాలివ్వడాన్ని నాగ్ ప్రశంసించారు. డెఫినెట్లీ ఫాలో అవుతానని ముఖేష్ చెప్పాడు. వర్షిణికి నాగ్ 3 స్టార్స్ ఇచ్చారు. గ్రీన్‌లోకి వచ్చావు కానీ నీ ఆట మాత్రం ఎల్లోలోనే ఉందన్నారు. దానికి సంబంధించి రోహిత్‌తో ఆడిన టాస్క్ తాలుకూ వీడియోలు నాగ్ చూపించారు. ముఖేష్ బాల్‌ను వేసి వర్షిణి బోర్డును అమన్ జరపడంపై వర్షిణి ప్రశ్నించింది. ముఖేష్ గురించి నీకెందుకు? నీ గేమ్ గురించి నువ్వు చూసుకోవాలి కదా అని నాగ్ అన్నారు. ఈ విషయంలో నాగ్ తప్పుదోవ పట్టించిందుకు ట్రై చేశారు. కానీ వర్షిణి మాత్రం స్ట్రాంగ్‌గా వాళ్లంతా త్రిగుణ్‌ని గెలిపించాలని అనుకున్నారని అందుకే ముఖేష్ గేమ్‌ను ముందుకు జరపలేదని చెప్పింది. త్రిగుణ్ టీంకు చాలా బయాస్డ్‌గా నాగ్ కనిపించారు. ఎందుకంటే వాళ్లంతా త్రిగుణ్‌ని గెలిపించాలని మాట్లాడుకోవడం అంతా లైవ్‌లో చూశారు. దానికోసమే ముఖేష్ గెలవకుండా వర్షిణి బోర్డును జరిపారు. నాగ్ మాత్రం మొత్తం దానిని తిప్పేశారు. శివ నిజంగా మరో త్రిగుణ్ లాగే ఇవాళ కనిపించాడు. ప్రతిసారి రోహిత్ పేరు రాగానే వెటకారంగా నవ్వుతూ కనిపించాడు.
ఆల్ఫాబెట్ పి అంటే ఏమిటని వర్షిణిని నాగ్ అడిగారు. ఆమె ఏమీ చెప్పలేదు. దీంతో సుధీర్‌ను లేపి బి అంటే ఏమిటని అడిగారు. జోకర్ అని చెప్పానని సుధీర్ అన్నాడు. బి అంటే జోకర్ ఏంటని నాగ్ అడిగారు. ఆ తరువాత ఝాన్సీని అడిగారు. పి అంటే ఏమిటంటే.. తనకు తెలియదని ఆమె చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను నాగ్ చూపించారు. ఆ వీడియో చూపించగానే త్రిగుణ్, శివ ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. దీన్ని నాగ్ చాలా సాగదీశారు. మీరే మీ ఆట ఎక్కడుందో ఆలోచించుకోవాలని నాగ్ చెప్పారు. మీరిలా మాట్లాడుకోవడం వలన నీకు నో స్టార్స్ ఇస్తున్నానని వర్షిణికి నాగ్ చెప్పారు. శ్వేతను లేపి త్రి స్టార్స్ ఇచ్చారు. గొప్ప గేమ్ లేదని కానీ ఎంటర్‌టైన్ చేశావని నాగ్ చెప్పారు. ఎందుకు లాస్ట్‌లో జీర్ క్యాష్ ఉండిపోయిందని నాగ్ అడిగారు. వంశీ చాలా బాగా పెర్ఫామ్ చేయడంతో ఆయనకు ఇచ్చేశానని చెప్పింది. నీ ఆటపై నువ్వు కాన్సన్‌ట్రేట్ చేయకుంటే రెడ్ జోన్ నుంచి కూడా అవుట్ అవుతావని చెప్పారు. శివ్‌కు త్రి స్టార్స్ నాగ్ ఇచ్చారు. గ్రీన్‌కు ఎందుకు రావడం లేదని అడిగితే తను నామినేషన్స్‌లో ఉండాలనుకుంటున్నానని కాబట్టి రావడం లేదని చెప్పాడు. బాగా ఆడావని ప్రశంసలు కురిపించారు.
పి అంటే పప్పెట్ అని.. బి అంటే బఫూన్ అని చెప్పవచ్చు కదా అని బ్రేక్‌లో వర్షిణి, సుధీర్‌లను రోహిత్ అడిగాడు. తనకు బ్రేక్‌లో తెలిసిందని నాగ్ అన్నారు. ఈమాట ముందే కంఫర్టబుల్‌గా ఎందుకు చెప్పలేకపోయారని నాగ్ అడిగారు. అది కాదని శివ్, అమన్ అన్నారు. ఈ మధ్య దానిని అలా అంటున్నారా? అని త్రిగుణ్ కామెడీ చేశాడు. వంశీని లేపి ప్రశంసించారు. అతనికి నాగ్ త్రి స్టార్ ఇచ్చారు. నిజంగానే వంశీ ఎఫర్ట్ పెట్టాడు. కోపం వస్తే మాటలు లూజ్ అవుతున్నావని నాగ్ చెప్పారు. దేబ్జానికి నాగ్ 5 స్టార్ ఇచ్చారు. కానీ అని చెప్పి ఆమెకు నో స్టార్ ఇచ్చారు. అల్టిమేట్ గోట్ అయ్యేందుకు ఎఫర్ట్ పెట్టలేదని చెప్పారు. గ్రీన్‌కి వచ్చాక గేమ్ తగ్గిపోయిందని అన్నారు. దేబ్జాని ఏవేవో కారణాలు చెబుతుంటే మనం ఆడకుంటే కారణాలే మిగులుతాయని నాగ్ చెప్పారు. ఆపై ప్రశంసలతో ముంచెత్తారు.ముఖేష్‌ను లేపి నిన్నెవరైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేశారా? అని నాగ్ అడిగారు. కొత్త అలయెన్స్ తనను బాగా టార్గెట్ చేశారని ముఖేష్ చెప్పాడు. తన పాయింట్స్ చెప్పినా.. అవి వినకుండా ట్రిగర్ చేస్తున్నారని చెప్పాడు. నువ్వు ఆడుతుంటే ముచ్చటగా ఉందని కానీ ఆ కోపం దానిని కప్పేస్తోందన్నారు. మైండ్ బ్యాలెన్స్ తప్పిందని చెప్పారు. లాస్ట్ వీక్ జెంటిల్ మ్యాన్ అన్నానని.. కానీ ఈ వారం జెంటిల్ అనేది కనిపించడం లేదన్నారు. నువ్వు ఆడిన తీరుకు నిన్ను 5 స్టార్‌లో పెట్టాలని కానీ మాటల కారణంగా 3 స్టార్‌లో పెడుతున్నట్టుగా నాగ్ చెప్పారు.
దేబ్జానితో ప్రాబ్లమ్ ఏంటని నాగ్ అడిగారు. తను లెటర్ చింపిన నాటి నుంచి ఆ కోపం తనపై పెట్టుకుందని ముఖేష్ చెప్పాడు. దేబ్జాని ప్రవర్తన కారణంగా.. ఆమె బ్యాడ్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉండటం కారణంగా అలా చేస్తోందన్నట్టుగా చెప్పాడు. నీ ఆలోచనను నీకే వదిలేస్తున్నానని కానీ ఆట తగ్గకుండా చూసుకోమని నాగ్ చెప్పారు. తరువాత రోహిత్‌ను లేపి 5 స్టార్స్‌లో నాగ్ పెట్టారు. 5 స్టార్‌లో ఎందుకు పెట్టానో తెలుసా? ప్రేక్షకులు నిన్ను 5 స్టార్‌లో చూడాలనుకుంటున్నారని చెప్పారు. వర్షిణి, రోహిత్ గేమ్‌కు సంబంధించిన వీడియో చూపించారు. రోహిత్‌ను వాషింగ్ మెషీన్ ఎలా పెట్టావని నాగ్ అడిగారు. తను బట్టలు చూపించడంతో వాషింగ్ మెషీన్ అనుకున్నానని చెప్పారు. నాగ్ పది పది విధాలుగా అడిగారు. రోహిత్ చూసి చేశాడని శివ చెప్పాడు. రామ్ ప్రసాద్‌ను లేపి చూశావు.. వాళ్లు చెప్పేది విన్నావని అడిగారు. ఏం జరిగిందని అడిగితే ఏదో జరిగిందని చెప్పాడు. వర్షిణి, రోహిత్‌ను మీ ఆట ఇంప్రూవ్ చేసుకోవాలని నాగ్ చెప్పారు. రోహిత్‌ను నీ ఆటకు నువ్వు ఎన్ని మార్కులేసుకుంటావని అడిగితే 8 అని చెప్పాడు. తనకు కావాల్సిన వాళ్లను గ్రీన్‌కు పంపామని చెప్పాడు. తను గ్రీన్‌లోకి వెళ్లకుంటే తనను తొక్కేస్తారని అందుకే తనను పంపించాల్సి వచ్చిందని చెప్పాడు. నీ వాళ్ల కోసం ఆడితే నువ్వు ఉన్న చోటనే ఉంటావని నాగ్ చెప్పారు.
అమన్‌ను లేపి బ్రహ్మాండంగా ఆడావని ప్రశంసలు కురిపించారు. రోహిత్ ఎప్పుడూ తన వాళ్లకే ఇస్తాడని సలహాలు తీసుకోమంటే.. తనకు ఇవ్వడని.. క్యాలిక్యులేషన్స్ మారిపోయాయని అమన్ చెప్పాడు. త్రిగుణ్‌ను బాగా ఆడావని సర్‌ప్రైజింగ్‌గా అందరి సపోర్ట్‌తో గెలిచావని నాగ్ చెప్పారు. ఒకానొక సమయంలో తనే సపోర్ట్ ఇచ్చానని రామ్ ప్రసాద్ చెప్పాడు. త్రిగుణ్‌లో మూడు మంచి గుణాలున్నాయని అందులో మంచి గుణం మారడమని నాగ్ చెప్పారు. నీకు బిగ్‌బాస్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారని కన్ఫెషన్ రూంకి రమ్మని నాగ్ పిలిచారు. అల్టిమేట్ గోట్‌గా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం కోసం బిగ్‌బాస్ ఓ గిఫ్ట్ ఇస్తున్నారని నాగ్ చెప్పారు. రోహిత్ వాళ్లు మాట్లాడుకున్న వీడియోను నాగ్ చూపించారు. అలాగే వర్షిణి, ముఖేష్ మాట్లాడుకున్న వీడియోను సైతం త్రిగుణ్‌కు చూపించారు. త్రిగుణ్‌ను దెబ్బ కొట్టాలనుకుంటున్నట్టు చెబుతున్న వీడియో అది. తను దెబ్బేస్తే మళ్లీ లేవకుండా చేస్తానని చెప్పాడు. ఆ వీడియోను నాగ్ చూపించారు. వర్షిణిని నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నావని త్రిగుణ్‌కు నాగ్ చెప్పారు. ఈ విషయాల గురించి నువ్వు వాళ్లతో మాట్లాడాలనుకుంటున్నావా? అని నాగ్ అడిగారు. అడగొచ్చని నాగ్ చెప్పారు.
ఆ తరువాత హౌస్‌మేట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలోకి నాగ్ పిలిచారు. రెడ్ జోన్‌లో ఉన్నవాళ్లు ఆడియెన్స్ ఓటింగ్ ప్రకారం ఒకరు.. హౌస్‌లోని వారి ఓటింగ్‌తో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పారని నాగ్ అన్నారు. నామినేషన్స్‌లో ఉన్నవాళ్లను ఒక సైడ్ నిలబెట్టి.. మిగిలిన వారందరి కుండను పగులగొట్టాలన్నారు. రామ్ ప్రసాద్ వచ్చి ఓ కుండను పగులగొట్టాడు. ఝాన్సీ సేఫ్ అని వచ్చింది. ముఖేష్ వచ్చి రోహిత్ సేఫ్ అని చెప్పాడు. నీతూ వచ్చి వంశీని సేఫ్ చేసింది. త్రిగుణ్ వచ్చి రామకృష్ణను సేఫ్ చేశాడు. నరేష్ వచ్చి శివ్‌ను సేవ్ చేశాడు. ఇక ఆ తరువాత అమన్ వచ్చి రెండు పాట్స్‌ను బ్రేక్ చేసి.. ఝాన్సీ, రామకృష్ణు సేవ్ చేశాడు. వర్షిణి వచ్చి రోహిత్, శివను సేవ్ చేసింది. ముఖేష్ వచ్చి ఝాన్సీ, రామకృష్ణను సేవ్ చేశాడు. దేబ్జాని వచ్చి శివ, వంశీలను సేవ్ చేశాడు. శ్వేత వచ్చి రోహిత్, వంశీని సేవ్ చేసింది. అందరికీ త్రి త్రి వచ్చాయని.. త్రిగుణ్‌ను కన్ఫెషన్ రూంకి పంపించి అక్కడున్న కుండలను పగులగొట్టమని చెప్పారు. అక్కడ ఎవరి ఫోటో మిస్సింగో వారు ఎలిమినేట్ అని నాగ్ చెప్పారు. అన్ని పాట్స్ బ్రేక్ చేయడంతో ఝాన్సీ ఫోటో మిస్ అయ్యింది. దీంతో ఝాన్సీ ఎలిమినేట్ అయినట్టుగా నాగ్ చెప్పారు. ఆడియెన్స్ ఓటింగ్ ప్రకారం ఝాన్సీ ఎలిమినేట్ అయినట్టుగా నాగ్ చెప్పారు. సుధీర్ ఆ పవర్‌ను రీ యూజ్ చేసి తనను ఎలిమినేట్ చేసి ఝాన్సీని ఉంచమని కోరాడు. అది కుదరదని నాగ్ చెప్పారు. ముఖేష్ బాగా ఏడ్చాడు. తనను క్షమించమని ఝాన్సీని ముఖేష్ వేడుకున్నాడు. తను న్యాయంగానే ఉన్నానని.. న్యాయంగానే వెళుతున్నానని ఝాన్సీ చెప్పింది. తన పేరెంట్స్‌ని హౌస్‌లో అడుగు పెట్టిద్దామని అనుకున్నానని అది కుదరలేదని చెప్పింది. తనవంటి అమాయకురాలు ఇక్కడ ఉంటే ముందుకు వెళ్లలేదని చెప్పి ఝాన్సీ వెళ్లిపోయింది. మొత్తానికి నాగ్ ఈవారం త్రిగుణ్ గ్రూప్‌కి ప్రశంసలు.. రోహిత్ గ్రూప్‌కి అక్షింతలు వేశారు.
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చేది రంగస్థలం సినిమా. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన…
బిగ్‌బాస్ హౌస్ నుంచి నిన్న సాయంత్రం రోహిత్ ఎలిమినేట్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఎన్నో ఊహాగాలు వినవస్తున్నాయి.…
బిగ్‌బాస్ 10 తెలుగు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని ముందుగానే బిగ్‌బాస్…
బిగ్‌బాస్ 10 తెలుగు ఈవారం కూడా బిగ్‌బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈవారం ఊహించని వ్యక్తి బిగ్‌బాస్ హౌస్ నుంచి…
నిన్న రోహిత్‌కు అమన్ బ్యాక్ స్టాబ్ చేయడం.. ఆ తరువాతి పరిణామాలతో నేడు బిగ్‌బాస్ షో ప్రారంభమైంది. రోహిత్ వచ్చేసి…
సీనియర్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూశారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎన్నో నాటకాలు, టీవీ సీరియల్స్, సినిమాలతో ప్రేక్షకులను…