
బిగ్‌బాస్ హౌస్‌లోకి నేడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ జరిగింది. నేడు (గురువారం) షో అంతా ఇంట్రస్టింగ్‌గానే సాగింది. ఇక ఇవాళ్టి షో విషయానికి వస్తే.. తరువాతి టాస్క్ గురించి రామ్ ప్రసాద్, నరేష్, వర్షిణి, ముఖేష్ స్కెచ్ వేసుకుంటున్నారు. ఎలాగైనా మన గ్రూప్ నుంచి నరేష్ మాత్రమే వెళ్లాలని చెప్పాడు. బయట సుధీర్‌ను వెళ్లనిద్దామని పేర్కొన్నారు. త్రిగుణ్ కూడా వచ్చి నరేష్‌తో ఆడిద్దామని చెప్పాడు. అయితే రోహిత్ వాళ్లు ఒప్పుకోలేదని రామ్ ప్రసాద్ చెప్పాడు. ‘టెమ్టేషన్ వర్సెస్ టెన్షన్’ టాస్క్ ప్రారంభమైంది. ఒక బజర్ వంశీ, మరో బజర్ ఝాన్సీ కొట్టింది. ఫస్ట్ నరేష్ అని చెప్పాడు. ఆ తరువాత వంశీ పేరు చెప్పాడు. వాస్తవానికి వంశీ ముందుగా చేయి పెట్టాడు. ఆ తరువాత నరేష్ పెట్టాడు. అయితే త్రిగుణ్ డెసిషన్ మార్చుకోవడంపై నరేష్, ముఖేష్, సుధీర్, వర్షిణి గొడవకు వచ్చారు. తన డెసిషన్ కారణంగా ఏమైనా ఇబ్బంది వస్తే పరిణామాలు ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని త్రిగుణ్ చెప్పాడు. కన్నింగ్ మనిషని త్రిగుణ్‌ని ఝాన్సీ కూడా కామెంట్ చేసింది. దీని గురించి చాలా సేపు గొడవ జరిగింది. ‘నీకోసం నువ్వే పోరాడాలి’ అంటూ ముఖేష్.. నరేష్‌ని రెచ్చగొట్టే యత్నం చేశాడు. ముందుగా నరేష్ పేరు చెప్పి అతనిలో ఆశలు రేపినందుకు త్రిగుణ్ సారీ చెప్పాడు. ఆ తరువాత టాస్క్ ప్రారంభమైంది. ఈ టాస్క్‌లో ఝాన్సీ గెలిచింది. ఝాన్సీ టెమ్టేషన్ పొందింది. తన తండ్రి నుంచి లెటర్ వచ్చిందని బిగ్‌బాస్ చెప్పారు. ఇక ఝాన్సీ ఏడుపు స్టార్ట్ చేసింది. ఇక టెన్షన్లో భాగంగా నరేష్‌కు తన తమ్ముడి లెటర్ దక్కకుండా చేయాలి. రామ్ ప్రసాద్‌కు కుటుంబంతో ఉన్న ఫోటోను దూరం చేయాలని బిగ్‌బాస్ చెప్పడంతో నరేష్‌కు టెన్షన్ ఇచ్చి.. పెద్దగా ఏడుస్తూ హై డ్రామా స్టార్ట్ చేసినట్టుగా అనిపించింది.

ఆ తరువాత బిగ్‌బాస్.. లాన్లోని టేబుల్‌పై ఫుడ్ అరేంజ్ చేశాడు. అది తినాలా.. వద్దా? అని అంతా ఆలోచిస్తున్నారు. కంటెస్టెంట్స్‌ను బిగ్‌బాస్ బాగా టెమ్ట్ చేశారు. ముందుగా రామ్ ప్రసాద్, నరేష్ తాము తినేస్తామని ముందుకు వెళ్లారు. కానీ త్రిగుణ్ వచ్చి ముందుగా తీసుకుని తీనేశాడు. ఆ తరువాత రోహిత్, చరణ్, సృష్టి మినహా అంతా వచ్చి తినేశారు. ఈ వారం టెమ్టేషన్ పొంది టాస్క్‌ల్లో గెలిచిన ముఖేష్, సృష్టి, అమన్, ఝాన్సీ కెప్టెన్సీ కోసం పోటీ పడతారని బిగ్‌బాస్ చెప్పారు. ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో అంత టెమ్టేషన్ రుచి చూశారని.. ఇక టెన్షన్ రుచి చూసేందుకు సిద్ధంగా ఉండాలని బిగ్‌బాస్ చెప్పారు. ఆ తరువాత ఝాన్సీకి మెసేజ్ వచ్చింది. ఇక్కడ విషయాన్ని అక్కడ చెబుతూ మోసం చేస్తోందని.. కేవలం నామినేషన్ సమయంలోనే రైతు బిడ్డ అన్న సెంటిమెంటు వాడుకుంటున్నావు.. కేవలం సింపతి కోసమేనా? అని మెసేజ్ వచ్చింది. అది చూసిన ఝాన్సీ తనను చరణ్ అలా చెప్పి నామినేట్ చేశాడు కాబట్టి అదే జనాల్లోకి వెళ్లి ఉంటుందని ఆమె చెప్పింది. తన ఐడెంటిటిని పదే పదే రుద్దాల్సిన అవసరం లేదని త్రిగుణ్ చెప్పాడు. ఆ మెసేజ్.. ముఖేష్‌కు మరోలా అర్థమైంది. తమ వృత్తిని చెప్పుకోవడంలో తప్పు లేదని ముఖేష్ చెప్పాడు. ఎవరికైనా.. ఏదైనా అచీవ్ చేయాలనుకునే వారికి నెగిటివ్ కామెంట్స్ వస్తాయని.. నీ గోల్ ఏంటో అది నువ్వు చూసుకో అని ముఖేష్ చెప్పాడు.

ఆ తరువాత ముఖేష్‌కు మెసేజ్ వచ్చింది. అంత అటెన్టివ్‌గా ఉండట్లేదని.. వర్షిణితో ఉండటం వలన కూడా అతని గేమ్ డీవియేట్ అవుతోందని మెసేజ్ సారాంశం. దీనిపై కూడా వర్షిణి, ముఖేష్‌ల మధ్య చర్చ జరిగింది. ఎక్కడ గేమ్ డీవియేట్ అవుతోంది? తను దేనిలోనైనా ఓడిపోయానా? అనేది ముఖేష్ పాయింట్. ఆ తరువాత షాలినికి తన కామ్‌నెస్ కోల్పోతోందని.. బ్యాక్ బిచ్చింగ్ స్టార్ అని.. తనకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయని మెసేజ్ సారాంశం. మరోవైపు వర్షిణికి ముఖేష్ చెవిలో ఏదో చెబుతున్నాడు. అలా చెప్పడం బిగ్‌బాస్ రూల్కి విరుద్ధం. వంశీ గురించి కుకింగ్ బాగా చేస్తున్నారని.. ఫస్ట్ వీక్ బాగానే ఉన్నారు కానీ సెకండ్ వీక్ గట్టిగా అరుస్తున్నారని మెసేజ్ వచ్చింది. రామ్ ప్రసాద్ గురించి కన్నింగ్, పక్కనోళ్ల మీద డిపెండ్ అవుతాడు. సేఫ్ గేమ్ ఆడుతాడు. పోట్రే చేసుకున్నంత సెయింట్ ఏమీ కాదని మెసేజ్ వచ్చింది. నరేష్ గురించి చాలా సెల్ఫిష్ అని.. అసలు ఇండివిడ్యువాలిటీ లేదని.. ఎప్పుడూ రామ్ ప్రసాద్తోనే ఉంటాడని మెసేజ్ వచ్చింది. ఆ తరువాత బిగ్‌బాస్ హౌస్‌లోకి మిథిలేష్, ఆర్కే, అపూర్వ వచ్చారు. వాళ్ల గురించి వాళ్లు చెప్పుకున్నారు. తను వస్తే ఊసరవెల్లులు, గుంట నక్కలను బయటకు తీసుకొస్తానని మిథిలేష్ చెప్పాడు.
ఒక స్టేట్మెంట్ పర్సనాలిటీ అనేది హౌస్‌లో మిస్సింగ్ అని.. డిఫెండింగ్ స్కిల్స్ తనకు ఉందని అపూర్వ చెప్పింది. అగ్నిపరీక్షలో ఉన్న ఫైర్ ఇక్కడ కొందరు చూపించలేకపోయారని.. తను హౌస్‌లో బటర్ ఫ్లై అవుతానని అపూర్వ చెప్పింది. ఆర్కే వచ్చేసి తను హౌస్‌లో అడుగు పెడితే చాలా ఎనర్జిటిక్‌గా ఉంటానని.. ఎంత కష్టమైనా భరిస్తానని.. ఎక్కడా కాంప్రమైజ్ అవనని.. జెన్యూన్‌గా ఉంటానని ఆర్కే చెప్పాడు. ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు అడగమంటే.. రామ్ ప్రసాద్ ముందుగా తనను కన్నింగ్ అని ఎందుకు అన్నావని అడిగాడు. రన్ రాజా రన్ గేమ్‌లో అమన్ కంటే వరస్ట్ కంటెస్టెంట్స్ ఉన్నారని.. కానీ అమన్‌ను తీసేయడం కరెక్ట్ కాదని చెప్పాడు. త్రిగుణ్ తనను కూడా కన్నింగ్ అని కూడా అన్నావని అనగానే.. రోహిత్‌ని స్టెరాయిడ్ బాడీ అని చెప్పావని.. ముఖేష్‌ని మరో మాట అన్నావని అందుకే అన్నానని చెప్పాడు. ముఖేష్ తనను ఎందుకు అటెన్టివ్ అని అడిగితే.. మీకు మీ పవరేంటో కూడా కరెక్ట్ కాదని.. అపూర్వ చెప్పింది. మీరు పులి చొక్కా వేసుకుని నక్కల ముసుగులో ఉంటున్నావని చెప్పింది. స్టార్ చూపించి కనిపిస్తోందా? అని ముఖేష్ అడిగితే నలుగురు మాత్రమే వేశారని చెప్పింది. నువ్వు కొంపదీసి లోపలికి వస్తే అప్పుడు ఆలోచిస్తామని ముఖేష్ పేర్కొన్నాడు.

నామినేట్ ఫర్ వన్ వస్తే.. నా పవర్ వేరే వాళ్లకు ఇవ్వొచ్చా? అంటే అటెన్టివ్‌గా ఎలా ఉన్నట్టని మిథిలేష్ అడిగాడు. ఒక్కరోజు కూడా ఒళ్లొంచి పని చేయలేదని ముఖేష్‌కు అపూర్వ చెప్పింది. ఇక ఆ ముగ్గురిలో ఎవరు హౌస్‌లో అడుగు పెట్టాలనేది ఇంటి సభ్యుల నిర్ణయమని బిగ్‌బాస్ చెప్పారు. ఒక్కొక్కరిగా ఓటు నమోదు చేయాలని బిగ్‌బాస్ చెప్పారు. ఇలా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాడు (మిథిలేష్) రావాలి లోపలికి.. తానేంటో చూపిస్తానంటూ రామ్ ప్రసాద్ మాట్లాడటం గమనార్హం. అప్పుడప్పుడు ఇలాగే మాటలు జారుతూ ఉంటాడు. హౌస్ మొత్తం రెండు గ్రూపులుగా విడిపోయి మాట్లాడుకుంటున్నారు. రామ్ ప్రసాద్ మాత్రం తనను కన్నింగ్ అనేది వదలడం లేదు. మిథిలేష్ వస్తే జిమ్ పెట్టుకోమని చెబుతా. దానికే పనికొస్తావని చెబుతానని ముఖేష్ అనడంతో ఏం చూసుకుని అంత? నాకు బీపీ పెరిగిందని రోహిత్ చెప్పాడు. షాలినిక అపూర్వ వచ్చేస్తుందని భయం పెట్టుకుందని ముఖేష్.. వర్షిణికి చెప్పాడు. ఆర్కే మీద మంచి ఒపీనియన్ ఉందని.. మిగిలిన వాళ్లు (అపూర్వ, మిథిలేష్) ఏదో చేద్దామని వస్తారని.. వాళ్లు నాలుగు రోజులే ఉంటారని ముఖేష్, వర్షిణి జోకులు వేసుకుంటున్నారు. రేపటి ఎపిసోడ్లో భాగంగా.. హౌస్‌లోకి అపూర్వ ఎంటర్ అయినట్టుగా బిగ్‌బాస్ చూపించారు.
