
గుర్తింపు గోల ఆపేయండిక చాలు.. దయచేసి హాయిగా పాత ఫార్మాట్లో మనసుకు హత్తుకునే ప్రేమకథలు, మంచి కిక్ ఇచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్స్ వైపు అడుగులు వేస్తే అందరికీ మంచిది. అర్థం పర్థం లేని అనవసరపు రాజకీయాలు కథల్లో ఇరికించి సినిమాలు తీస్తే చూసేవాళ్లకు ఇంట్రెస్ట్ రావడం లేదు. రాత్రికి రాత్రే ఇమేజ్ పెంచుకోవాలని కథ, కాకరకాయ్ లేని సినిమాలు చేసి ప్రేక్షకులకు తలనొప్పులు తెప్పించకండి. ఈ విషయంలో దర్శకులు కచ్చితంగా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఒక ఆడియన్ తన మూడు గంటల వాల్యుబుల్ సమయం, వందల రూపాయల కష్టార్జితం ఇచ్చి థియేటర్ కు వస్తున్నాడంటే కచ్చితంగా వాళ్ల మీద రెస్పెక్ట్ చూపించాల్సిందే. ఆడియన్స్ కు కావాల్సిన సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వకుండా, వాళ్లకు నచ్చని ఐడెంటిటీ పాలిటిక్స్ ను బలవంతంగా రుద్దితే రిజల్ట్ చాలా దారుణంగా ఉంటుంది. ఆడియన్ థియేటర్ కు వచ్చేది రిలాక్స్ అవ్వడానికి కానీ, మీకు నచ్చిన ఏజెండాలను భరించడానికి కాదు అన్న బేసిక్ లాజిక్ ను డైరెక్టర్స్ మర్చిపోకూడదు.
కోట్లు పెట్టే నిర్మాతలు ఉన్నారు కదా అని వాళ్లను బలి చేస్తే అది చాలా దారుణం. కేవలం హీరో ఇమేజ్, డైరెక్టర్ విజన్ అనే పెద్ద పెద్ద పదాల పేరుతో ప్రొడ్యూసర్స్ డబ్బును అడ్డగోలుగా మంచి నీళ్లలా ఖర్చు పెట్టిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అర్థం పర్థం లేకుండా వచ్చిన టాక్సిక్ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం కంటెంట్ మీద ఫోకస్ చేయకుండా, అనవసరమైన బిల్డప్ ఇవ్వడం వల్ల ఆ సినిమా ఏకంగా 300 కోట్లు నష్టాలు తీసుకొచ్చింది. వందల కోట్లు బడ్జెట్ పెడితే సినిమా ఆడేయదు, అందులో ఆడియన్స్ ను కనెక్ట్ చేసే బలమైన ఎమోషన్ ఉండాలి. కానీ ఇప్పుడున్న మేకర్స్ ఆ విషయాన్ని గాలికి వదిలేసి ప్రొడ్యూసర్స్ ను ఏటీఎం మెషిన్ల లాగా వాడుకుంటున్నారు. కథను నమ్ముకుంటే బడ్జెట్ కంట్రోల్ లో ఉంటుంది, కానీ కేవలం ఎలివేషన్స్ నమ్ముకుంటే టాక్సిక్ లాగే ఫైనాన్షియల్ గా దెబ్బతినక తప్పదు.

ఇక ప్యాన్ ఇండియా సినిమాల లెక్కలు కూడా చాలా విచిత్రంగా మారిపోయాయి. పుష్ప సినిమా పెద్ద హిట్ అని అందరూ అంటారు కానీ, వాస్తవానికి ఫస్ట్ పార్ట్ హిందీ మార్కెట్ వల్ల సేఫ్ అయింది. ఫస్ట్ పార్ట్ అక్కడ ఆ రేంజ్ లో వర్కవుట్ అవ్వడం వల్లే, సెకండ్ పార్ట్ కూడా అక్కడ్నుంచే భారీ స్థాయిలో డబ్బులు రాబట్టింది. అంటే బాలీవుడ్ ఆడియన్స్ సపోర్ట్ లేకపోతే ఆ సినిమా పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆ సినిమా తెలుగు మార్కెట్ వరకు కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించుకున్నా, వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఏం ఒరగబెట్టింది లేదు. పాన్ వరల్డ్ రేంజ్, గ్లోబల్ రీచ్ అని చెప్పి, ఆడియన్స్ కు యూనివర్సల్ అప్పీల్ ఉన్న కంటెంట్ ఇవ్వకపోతే ఎవరూ చూడరు అనడానికి పెద్ది రిజల్ట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.

ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ప్యారడైజ్ సినిమా పరిస్థితి కూడా అచ్చం ఇలాగే తయారైంది. ఈ సినిమాను ఆడియన్స్ ఔట్ రేటెడ్ గా తిప్పి కొడుతున్నారు. న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమాతో ఎలాగైనా మాస్ గా ఎదగాలని, రాత్రికి రాత్రే తన ఇమేజ్ పూర్తిగా మార్చుకోవాలని చాలా గట్టిగా ట్రై చేసినా అది అస్సలు వర్కవుట్ కాలేదు. ప్రేక్షకులకు హీరోల బాడీ లాంగ్వేజ్ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, దాన్ని దాటి అనవసరమైన మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తే రిజల్ట్ ఇలాగే బెడిసికొడుతుంది. కథలో దమ్ము లేకుండా, కేవలం యాక్షన్, మాస్ ఎలివేషన్స్ పెడితే జనాలు గుడ్డిగా చూస్తారనే భ్రమ నుంచి మేకర్స్ బయటకు రావాలి. ఇమేజ్ మేకోవర్ అనేది కథలో నుంచి సహజంగా రావాలి కానీ, ప్యారడైజ్ లాగా బలవంతంగా రుద్దితే మాత్రం ఆడియన్స్ అస్సలు యాక్సెప్ట్ చేయరు.

మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఖర్చు పెట్టే నిర్మాతలకు ఏ మాత్రం వ్యాల్యూ లేకుండా పోయింది, అలాగే డబ్బులు ఖర్చు పెట్టి థియేటర్ కు వెళ్లి చూస్తున్న ఆడియన్స్ కు అంతకన్నా విలువ లేదు. దర్శకులు, రైటర్స్ వాళ్లకు తోచింది ఏదో రాస్తున్నారు, గుడ్డిగా ఏదో తీసుకుంటూ వెళ్తున్నారు. ఈ చెత్త ట్రెండ్ ఇక్కడితో ఆపేయాలి, లేదంటే సినిమా ఇండస్ట్రీకే అసలుకే మోసం వస్తుంది. మళ్ళీ మన పాత స్టైల్ లో ఆడియన్స్ ను నవ్వించే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్స్, మనసుకు హత్తుకునే క్యూట్ లవ్ స్టోరీస్ తీస్తేనే ఇండస్ట్రీ సేఫ్ జోన్ లో ఉంటుంది. అనవసరమైన గుర్తింపు గోల, అర్థం లేని మెసేజ్ లు పక్కన పెట్టి, స్వచ్ఛమైన వినోదాన్ని పంచితేనే ఇటు ప్రొడ్యూసర్స్ కు లాభాలు వస్తాయి, అటు ఆడియన్స్ కు పైసా వసూల్ ఫీలింగ్ దక్కుతుంది. ఈ మ్యాటర్ త్వరగా అర్థం చేసుకుంటే అందరికీ మంచిది.
