Menu
BREAKING
ఇప్పుడేం చేస్తాడు మన చిరంజీవి..? శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తాడా..?   |   నానిని ఏ‘మారుస్తున్నదెవరు..?’.. ఎందుకింత మాస్ పిచ్చి.. నీ రూట్స్ మరిచావా నాని..?   |   Biggboss10 Telugu: ఝాన్సీ హైడ్రామా.. రామ్ ప్రసాద్ కన్నింగ్.. నక్కల ముసుగులో ముఖేష్..   |   అర్థం పర్థం లేని సినిమాలు.. ఆరిపోతున్న నిర్మాతలు.. ప్రేక్షకులకు తలనొప్పులు..!   |   రాధ Vs అంబిక.. అక్కాచెల్లెళ్ల గొడవలో అసలు తప్పు ఎవరిది..? ఎవరు ఎవర్ని మోసం చేసారు..?   |   ఓరి దేవుడో.. వాళ్ళ సినిమాలు వాళ్లు చూడ్డానికి హీరోలకు ఇన్ని ఇబ్బందులా..?   |   నేషనల్ వైడ్ గా సత్తా చాటిన కమిటీ కుర్రోళ్ళు.. అవార్డ్స్ తీసుకున్న నిహారిక అండ్ టీం..   |   ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా వెనక ‘ప్యారడైజ్’ హస్తం.. నాని కోసం త్యాగమా..?   |   Biggboss 10 Telugu: వర్షిణి కోసం దేబ్జానిని బలి చేసిన ముఖేష్..   |   Biggboss 10 Telugu: అతి చేస్తున్న శ్రష్టి.. మొత్తం కంటెంట్ కోసమేనా?   |   నానిని తొక్కేయాలని చూస్తున్నారా.. అతడి చుట్టూ కుట్ర జరుగుతుందా..?   |   ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌కు మోహన్ బాబు దూరం.. అదేనా అసలు కారణం..!   |   అయ్యో ఏంది కాకా ఇది.. నువ్వు వినవు.. ఆయన ఆగడు.. సరిపోయారు ఇద్దరూ..!   |   ది ప్యారడైజ్ సినిమా సెన్సార్ రివ్యూ.. 21 కట్స్.. చాలా పెద్ద రిస్క్.. అవే మైనస్..!   |   Biggboss 10 Telugu: రచ్చ లేపిన నామినేషన్స్.. శివాలెత్తిన సృష్టి

నానిని ఏ‘మారుస్తున్నదెవరు..?’.. ఎందుకింత మాస్ పిచ్చి.. నీ రూట్స్ మరిచావా నాని..?

నానిని ఏ‘మారుస్తున్నదెవరు..?’.. ఎందుకింత మాస్ పిచ్చి.. నీ రూట్స్ మరిచావా నాని..?

ఒకప్పుడు నాని నుంచి సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల ముందు కుటుంబ ప్రేక్షకులు క్యూ కట్టేవాళ్లు. సినిమా టాక్ ఎలా ఉన్నా, రివ్యూలు ఏమొచ్చినా సరే ఫ్యామిలీస్ అంతా కలిసి కచ్చితంగా వెళ్లి ఓసారి చూద్దాం అనుకునేంత గుడ్ విల్, నమ్మకం ఆయన సొంతం. పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని క్యారెక్టరైజేషన్, క్యూట్ లవ్ స్టోరీస్, న్యాచురల్ యాక్టింగ్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే ఆయనకు న్యాచురల్ స్టార్ అనే ట్యాగ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కానీ కొన్నేళ్లుగా నాని కంప్లీట్ గా మారిపోయాడు. అసలు నానిని ఏమారుస్తున్నదెవరు, ఆయన మైండ్ సెట్ ని ఎవరు డైవర్ట్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎలా ఉండే హీరో ఎలా అయిపోయాడు అని ఆయన కోర్ ఆడియన్స్ అయిన ఫ్యామిలీస్ బాగా ఫీల్ అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి తనకంటూ ఒక సెపరేట్ మార్కెట్, ఎంటర్టైన్మెంట్ తో కూడిన స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నాని, ఇప్పుడు ఆ సేఫ్ ట్రాక్ ను పక్కన పెట్టేసి పూర్తిగా తన రూట్ మార్చడం అనేది రెగ్యులర్ ప్రేక్షకులకు ఏమాత్రం మింగుడు పడటం లేదు.

మిగిలిన హీరోల మాదిరే తాను కూడా ఒక ఊర మాస్ హీరో అనిపించుకోవాలనే ఆశ నానిలో బలంగా నాటుకుపోయింది. మాస్ పురుగు ఆయనను కూడా గట్టిగానే కుట్టేసింది అని చెప్పొచ్చు. అందుకే తన పాత స్టైల్ ను వదిలేసి వరసగా మాస్ సినిమాలతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. దసరా సినిమాతో ఫస్ట్ టైమ్ ఫుల్ లెంగ్త్ మాస్ అవతారం ఎత్తాడు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయినా కూడా, దాని ఇంపాక్ట్ ఎక్కువగా తెలంగాణ ప్రాంతానికే పరిమితం అయింది. ఆ తర్వాత వచ్చిన హిట్ 3, సరిపోదా శనివారం సినిమాలు కూడా నానికున్న సక్సెస్ స్ట్రీక్ వల్ల, ఓపెనింగ్స్ వల్ల గట్టెక్కేసాయి. కానీ ఆ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులకు పూర్తిగా నచ్చలేదు. కేవలం నాని మార్కెట్ స్టామినా వల్లే ఆ సినిమాలు సేఫ్ జోన్ లోకి వెళ్లాయి తప్ప, అందులో ఆయన మార్క్ న్యాచురాలిటీ మిస్ అయిందనే కామెంట్స్ అప్పట్లోనే బలంగా వినిపించాయి. అయినా సరే నాని అవేవీ పట్టించుకోకుండా తన మాస్ జపమే కంటిన్యూ చేస్తూ వచ్చాడు.

ది ప్యారడైజ్ సినిమా సెన్సార్ రివ్యూ.. 21 కట్స్.. చాలా పెద్ద రిస్క్.. అవే మైనస్..!

ఈ క్రమంలోనే లేటెస్ట్ గా వచ్చిన ప్యారడైజ్ సినిమాతో మరోసారి థియేటర్లలో వీర రుద్రతాండవం చేద్దామని బయల్దేరిన నానికి బాక్సాఫీస్ దగ్గర గట్టి షాక్ తగిలేసింది. ఒక బలమైన కథ లేకుండా కేవలం యాక్షన్, ఎలివేషన్స్, మాస్ ఇమేజ్ కోసం చేసిన ఈ ప్రయోగం దారుణంగా బెడిసికొట్టింది. సినిమా సిచ్యువేషన్, పబ్లిక్ టాక్ చూస్తుంటే ఈసారి ఈ ప్లాప్ నుంచి నాని బయటపడటం చాలా కష్టంగానే కనిపిస్తోంది. ఆడియన్స్ కూడా ప్యారడైజ్ సినిమాను ఔట్ డేటెడ్ కంటెంట్ అంటూ పెదవి విరుస్తున్నారు. రాత్రికి రాత్రే ఇమేజ్ పెంచుకోవాలని, కమర్షియల్ మాస్ హీరోల జాబితాలో చేరిపోవాలని నాని చేసిన ఈ ప్రయత్నం ఏమాత్రం వర్కవుట్ కాలేదు. ప్రేక్షకులకు హీరోల బాడీ లాంగ్వేజ్ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, దాన్ని దాటి అనవసరమైన మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తే రిజల్ట్ ప్యారడైజ్ లాగే ఉంటుంది. కేవలం రక్తపాతం, కత్తిపోట్లు చూపిస్తే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు అనే బేసిక్ లాజిక్ ను ఈ సినిమా విషయంలో మేకర్స్ పూర్తిగా మర్చిపోయారు.

హిట్ 3, దసరా, సరిపోదా శనివారం లాంటి సినిమాల లెక్కలు వేరు, ప్యారడైజ్ లెక్కలు వేరు. ఆ పాత సినిమాల బడ్జెట్స్, టార్గెట్స్ చాలా చిన్నవి. కాబట్టి పబ్లిక్ టాక్ కాస్త అటు ఇటుగా తేడాగా ఉన్నా కూడా, కేవలం నాని క్రేజ్ తో వచ్చిన వీకెండ్ ఓపెనింగ్స్ తోనే ఆ సినిమాలు బ్రేక్ ఈవెన్ దాటి బయటపడిపోయాయి. కానీ ప్యారడైజ్ సినిమా పరిస్థితి అలా కాదు. ఈ సినిమా బడ్జెట్ పరంగా చాలా భారీగా తెరకెక్కింది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 200 కోట్లు గ్రాస్ వస్తేనే ఈ సినిమా హిట్ అయినట్లు లెక్క. వాస్తవానికి నానికి ఇప్పటి వరకు తన కెరీర్ లో కనీసం 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సినిమానే లేదు. ఆయన కెరీర్ లోనే హైయ్యస్ట్ అంటే హిట్ 3 సినిమా తెచ్చిన 60 కోట్ల షేర్ మాత్రమే. అలాంటిది ఇప్పుడు ప్యారడైజ్ సినిమా హిట్ అవ్వాలంటే కచ్చితంగా 100 కోట్ల షేర్ రావాలి. దీన్నిబట్టి ఆయన ఎంత పెద్ద రిస్క్ గేమ్ ఆడారో ఇట్టే అర్థమైపోతుంది.

తన మార్కెట్ కు మించి బడ్జెట్లు పెట్టించడం, తన బాడీ లాంగ్వేజ్ కు సెట్ కాని మాస్ క్యారెక్టర్లు ఎంచుకోవడం నాని కెరీర్ కే పెద్ద మైనస్ గా మారుతోంది. నాని త్వరగా మేల్కొని తనను ఈ మాస్ ఇల్యూజన్ లో పెట్టి ఏమారుస్తున్న వాళ్ల నుంచి బయటపడితే మంచిది. తన బలాన్ని నమ్ముకుని, పాత న్యాచురల్ స్టార్ మళ్ళీ బయటికొస్తే బెటర్. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలు, మంచి కిక్ ఇచ్చే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్స్, డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తేనే నానికి బాక్సాఫీస్ దగ్గర తిరుగుండదు. అది వదిలేసి కత్తులు, కొడవళ్లు పట్టుకుని రక్తం చిందిస్తూ కూర్చుంటే మాత్రం రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా దూరమైపోతారు. ఫైనల్ గా ఆయన పాత మార్కెట్ పోయి, కొత్త మాస్ ఇమేజ్ రాక అసలుకే మోసం వస్తుంది. నాని ఈ నిజాన్ని ఎంత త్వరగా రియలైజ్ అయితే ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కు అంత సేఫ్.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360