Menu
BREAKING
భయపెడుతున్న వారణాసి బిజినెస్.. రిలీజ్‌కు ముందే 1000 కోట్లు ఏంటి స్వామి..?   |   ఆ అగ్ర నిర్మాత చేతికి జైలర్ 2 రైట్స్.. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్ సడన్‌ ఎంట్రీ..!   |   Biggboss10 Telugu: ఎవరూ తగ్గట్లే.. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్లదే…   |   Biggboss10 Telugu: ఝాన్సీ గ్రాఫ్ పడగొట్టుకుంటోందా? ఇలా అయితే కష్టమే..   |   బాలయ్య కోసం రేసులో ఇద్దరు దర్శకులు.. కొరటాల సినిమా ఆగిపోయిందా..?   |   Biggbogss10 Telugu: ఫైర్ లేని నామినేషన్స్.. ఇదే తొలిసారి..   |   Biggboss10 Telugu: వామ్మో ఈ గొడవలేంటి? ఒకటా.. రెండా.. ప్రతిదీ రచ్చే..   |   ఇదెక్కడి దిక్కు మాలిన కథ.. ఇదెక్కడి సినిమా.. కీర్తి సురేష్‌కు ఏమైంది..?   |   అప్పుడు నవనీతమ్మా.. ఇప్పుడు నారాయణమ్మ.. మళ్లీ దొరికిపోయావా తమన్..!   |   అంతా ఫేక్.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. అంతా కనికట్టు..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కు క్లాసే కాదు.. హ్యాపీ న్యూస్ అందించిన నాగ్..   |   సిగ్మాతో ఏం చేయబోతున్నారు.. సందీప్ కిషన్ జాతకం ఇప్పటికైనా మారుతుందా..?   |   Rajamouli: రాజమౌళి 25 ఏళ్ల ప్రస్థానం.. ఇంతింతై వటుడింతై..!   |   నన్ను తొక్కేయట్లేదు కదా.. వాళ్లకు సైలెంట్‌గా రాడ్ దించేసిన చిరంజీవి..!   |   ‘ది ప్యారడైజ్’ చుట్టూ రాజకీయం.. తెలియకుండానే నాని ఇరుక్కుపోయాడా..?

Biggboss10 Telugu: ఎవరూ తగ్గట్లే.. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్లదే…

Biggboss10 Telugu: ఎవరూ తగ్గట్లే.. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్లదే...

ఇవాళ బిగ్‌బాస్ షోలో కూడా త్రిగుణే హైలైట్. ‘లం….’ అనే పదం వాడి నానా రచ్చ చేశాడు. ఇవాళేం జరిగిందంటే.. షో ప్రారంభంలోనే నరేష్ ప్రేక్షకులను తనకు ఓటు వేయాలని కోరుకుంటున్నాడు. తనకు సింపతి వద్దని.. డబుల్ ఫేస్ లేదని.. మాట మార్చనని చెప్పి ఓటు వేయమంటూ కెమెరాకు చెప్పాడు. ఇక కెప్టెన్ తన రూంలోకి ఎవరినీ వెళ్లనీయడం లేదు. దీంతో కాస్త రచ్చ జరిగినట్టుగా జరిగింది కానీ చెప్పుకోదగినదేం కాదు. ఇక బిగ్‌బాస్ డ్యాగర్స్‌ను సంపాదించుకోమని.. ఆలస్యం అమృతం విషమని చెప్పాడు. దీంతో ఝాన్సీ నుంచి డ్యాగర్ లాక్కోవడానికి ట్రై చేస్తే ఎవరూ జెంట్స్ వెళ్లవద్దని లేడీస్ లేడీస్ చూసుకుంటారని అంతా ఫిక్స్ అయిపోవడంతో జెంట్స్ ఆగిపోయారు. ఆ తరువాత త్రిగుణ్‌ను అమన్ టాకిల్ చేశాడు. ఈ క్రమంలోనే త్రిగుణ్ రిస్ట్‌కి ఏదో అయ్యిందంటూ గొడవ పెట్టాడు. ఈ నేపథ్యంలోనే ‘లం..’ వాడాడంటూ అమన్ ఫైర్ అయ్యాడు. అమన్‌ను రోహిత్ వాళ్లు పట్టుకుని ఆపేశారు. మరోవైపు ముఖేష్‌ను రోహిత్ పట్టుకున్నాడు. అప్పుడు నరేష్ అని ముఖేష్ అరవడంతో నరేష్ వెళ్లి గొడవ మధ్యలోకి వెళ్లడంతో అతని వేలు నొప్పి పట్టింది. దీని గురించి రామ్ ప్రసాద్ కామెడీ చేశాడు. ఆ తరువాత కెప్టెన్సీ టాస్క్ ప్రారంభమైంది.

Biggboss10 Telugu: ఎవరూ తగ్గట్లే.. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్లదే...

తాళ్లతో డ్రమ్స్‌ను కట్టి ఉంచారు. తాళ్లన్నీ విప్పి డ్రమ్స్‌ను గార్డెన్ ఏరియాలో పెట్టి వాటి మీదుగా వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన హోల్స్‌లో వాటిని పెట్టాలి. టీం భైరవ నుంచి వంశీ, రామ్ ప్రసాద్, అమన్, రోహిత్.. టీం సప్తశక్తి నుంచి త్రిగుణ్, ముఖేష్, దేబ్జాని, సృష్టి ఆడుతున్నట్టు చెప్పడంతో నరేష్, వర్షిణికి సంచాలకులుగా బిగ్‌బాస్ నియమించారు. భైరవ టీం సభ్యులకు బిగ్‌బాస్ అడ్వాంటేజ్ ఇచ్చాడు. ఫస్ట్ బజర్ మోగగానే భైరవ టీం టాస్క్ ప్రరాంభించవచ్చు. అయితే సప్తశక్తి టీం మాత్రం సెకండ్ బజర్ మోగిన తర్వాత మాత్రమే టాస్క్ ప్రారంభించాలి. ఈ సమయంలో కూడా త్రిగుణ్ ఫౌల్ ఆడాడు. వర్షిణి ఎంత చెబుతున్నా వినలేదు. ఆ తరువాత ముందుగా భైరవ టీం వెళ్లి పెట్టేసింది. ఆ తరువాత సప్తశక్తి టీం వచ్చి వాటిని తోసేసింది. అమన్, త్రిగుణ్ పోరా అంటే పోరా అనుకున్నారు. సృష్టి చేతికి దెబ్బ తగిలింది. ఈ టాస్క్‌లో టీం భైరవ గెలిచింది. ఓడిన టీం నుంచి ఒక డ్యాగర్‌ను గెలిచిన టీం నుంచి ఎవరు తీసుకోవచ్చో చెప్పమని బిగ్‌బాస్ చెప్పడంతో అమన్ వచ్చేసి దేబ్జాని డ్యాగర్‌ను తీసుకుంటున్నట్టు చెప్పాడు.

Biggboss10 Telugu: ఎవరూ తగ్గట్లే.. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్లదే...

అమన్‌ను ‘నేను స్ట్రాంగ్ ప్లేయర్ కదా అని అడిగింది. ముందు సృష్టిని ఎందుకు సెలక్ట్ చేశారని అడిగింది. అది టీం డెసిషన్ అని.. ఇది నా డెసిషన్’ అని అమన్ చెప్పాడు. మొత్తానికి దేబ్జాని నుంచి డ్యాగర్ తీసుకున్నాడు. రామ్ ప్రసాద్, సుధీర్ మాత్రం అగ్నిపరీక్ష టీం నుంచి తీసుకోవాలని చెప్పాడు. మరోవైపు రామ్ ప్రసాద్ వెళ్లి ‘త్రిగుణ్, ముఖేష్‌తో మీరు ఆడండి.. మా టీం నుంచి నేను, ఝాన్సీ ఆడతామని.. మేము ఓడితే అమన్ నుంచి డ్యాగర్ తీసుకోవాలి’ అని చెప్పాడు. మరోవైపు అగ్నిపరీక్ష టీం కూడా రామ్ ప్రసాద్ విడదీసి మాట్లాడటంపై చర్చించుకుంటున్నారు. మొత్తానికి రామ్ ప్రసాద్ అయితే సెలబ్రిటీల టీంను కాపాడుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అమన్ తన మెడ పట్టుకున్నాడని.. ఆ సమయంలో ఆపేయని చెబుతున్నా ఆపలేదని అపూర్వతో గొడవకు దిగాడు. అసలు గొడవకు ఎందుకు ఇనిషియేట్ చేస్తున్నావని త్రిగుణ్‌ని అపూర్వ అడిగింది. దీంతో త్రిగున్ ఆమెపై బాగా ఫైర్ అయ్యాడు.

Biggboss10 Telugu: ఎవరూ తగ్గట్లే.. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్లదే...

నరేష్ ఫస్ట్ టైం నామినేషన్స్‌లోకి రావడంతో దాని చుట్టూనే అతను తిరుగుతున్నాడు. అమన్ సోలోగా డ్యాగర్స్ చుట్టూ తిరుగుతున్నాడని.. అది సంపాదించాలని చరణ్‌కు త్రిగుణ్ చెప్పాడు. తనైతే టీం అనే ఆడుతున్నానని.. నీకు కూడా అలాగే ఉంటే అమన్ డ్యాగర్ తీసుకోమని చెప్పాడు. షాలిని.. డ్యాగర్ కోసం బాగా ప్రయత్నిస్తోంది. మెల్లగా కెప్టెన్ రూంలోకి వెళ్లి డ్యార్ కోసం సెర్చింగ్ ప్రారంభించింది. అది చూసిన షాలిని.. అందరికీ చెప్పింది. షాలిని దొంగతనం చేసింది. అయితే రోహిత్ ఆమె దొంగతనం చేయలేదని సమర్థించాడు. ఆ తరువాత నిజంగానే షాలిని దొంగతనం చేసిందని తెలుసుకుని రోహిత్ గొడవపడ్డాడు. అందరిదీ ఒక దారైతే ఉలిపి పిట్టది ఒక దారి అని.. ప్రపంచం ఎటు పోతున్నా.. ముఖేష్, వర్షిణి మాత్రం చేతిలో చేయి వేసుకుని నడుస్తూ ప్రేమ పావురాల్లా విహరిస్తున్నారు. సెలబ్రిటీలంతా కలిసి మెలిసి ఆడుతుంటే.. షాలిని చేసిన పనితో ఒక్కసారిగా వారి మధ్య విభేదాలు వచ్చాయి. రోహిత్ వెళ్లి తన కారణంగానే డ్యాగర్ మిస్ అయ్యిందని అందరికీ సారీ చెప్పాడు.

ముఖేష్.. అపూర్వ, రోహిత్‌, షాలినిని కలిపి ‘చిన్నదో వైపు.. పెద్దదో వైపు’ అంటూ పర్సనల్ కామెంట్స్ చేశాడు. అలా ఎందుకు చేశావని అడగాడు. వర్షిణిని నిన్ను ఎప్పుడైనా ఏమైనా అన్నామా? అని రోహిత్ అడగడంతో ముఖేష్ గొడవకు దిగాడు. మధ్యలో సుధీర్ వచ్చేసి రోహిత్ ప్రొవోక్ చేస్తున్నాడంటూ గొడవకు దిగాడు. మర్యాదగా మాట్లాడమని చెప్పానని.. అడగడంతో అడుక్కోవడమేంటని రోహిత్ అన్నాడు. రెడ్ టీం వాళ్లతో ఆడుతున్నాడు. బ్లూ టీం వాళ్లతో డీల్ చేసుకుంటున్నాడని సుధీర్ చెప్పాడు. వాస్తవానికి సుధీర్, రామ్ ప్రసాద్ కూడా చేస్తున్నది అదే. కానీ ఇలా మరొకరిని అనడం దారుణం. మొత్తానికి గొడవ షాలిని దగ్గర ప్రారంభమై.. మధ్యలో ముఖేష్ మీదుగా.. సుధీర్‌ దగ్గరకు వెళ్లి ఆగింది. ఎవరూ తగ్గట్లే. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్లు ఇస్తున్నారు. ఇవాళ బిగ్‌బాస్ ఇలా ముగిసింది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360