Menu
BREAKING
అయ్యా మోహన్ బాబు గారు.. మీ రేంజ్ ఏంటి.. ఈ క్యారెక్టర్స్ ఏంటి సర్..?   |   ఆ ప్యాన్ ఇండియన్ దర్శకుడిపై ప్రెజర్.. అంతా వారసుడి మహిమ..!   |   Biggboss10 Telugu: రోహిత్‌ వర్సెస్ అపూర్వ.. ఎంజాయ్ చేసిన ఇతర హౌస్‌మేట్స్..   |   Biggboss10 Telugu: వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో మళ్లీ టార్గెట్ రోహిత్..   |   ఇప్పుడేం చేస్తాడు మన చిరంజీవి..? శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తాడా..?   |   నానిని ఏ‘మారుస్తున్నదెవరు..?’.. ఎందుకింత మాస్ పిచ్చి.. నీ రూట్స్ మరిచావా నాని..?   |   Biggboss10 Telugu: ఝాన్సీ హైడ్రామా.. రామ్ ప్రసాద్ కన్నింగ్.. నక్కల ముసుగులో ముఖేష్..   |   అర్థం పర్థం లేని సినిమాలు.. ఆరిపోతున్న నిర్మాతలు.. ప్రేక్షకులకు తలనొప్పులు..!   |   రాధ Vs అంబిక.. అక్కాచెల్లెళ్ల గొడవలో అసలు తప్పు ఎవరిది..? ఎవరు ఎవర్ని మోసం చేసారు..?   |   ఓరి దేవుడో.. వాళ్ళ సినిమాలు వాళ్లు చూడ్డానికి హీరోలకు ఇన్ని ఇబ్బందులా..?   |   నేషనల్ వైడ్ గా సత్తా చాటిన కమిటీ కుర్రోళ్ళు.. అవార్డ్స్ తీసుకున్న నిహారిక అండ్ టీం..   |   ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా వెనక ‘ప్యారడైజ్’ హస్తం.. నాని కోసం త్యాగమా..?   |   Biggboss 10 Telugu: వర్షిణి కోసం దేబ్జానిని బలి చేసిన ముఖేష్..   |   Biggboss 10 Telugu: అతి చేస్తున్న శ్రష్టి.. మొత్తం కంటెంట్ కోసమేనా?   |   నానిని తొక్కేయాలని చూస్తున్నారా.. అతడి చుట్టూ కుట్ర జరుగుతుందా..?

Biggboss10 Telugu: రోహిత్‌ వర్సెస్ అపూర్వ.. ఎంజాయ్ చేసిన ఇతర హౌస్‌మేట్స్..

Biggboss10 Telugu: రోహిత్‌ వర్సెస్ అపూర్వ.. ఎంజాయ్ చేసిన ఇతర హౌస్‌మేట్స్..

మొత్తానికి ఇవాళంతా షో గొడవలతోనే నిండిపోయింది. బిగ్‌బాస్‌కి కావల్సిన దానికంటే ఎక్కువే కంటెంట్ వచ్చింది. షో ప్రారంభంలోనే ఈవారం కెప్టెన్సీ టాస్క్ గురించి సృష్టి, అమన్ మధ్య చర్చ జరుగుతోంది. ముఖేష్, ఝాన్సీ కలిసి ఆడుతారని అమన్ చెప్పాడు. ఆ తరువాత రోహిత్, చరణ్ మధ్య జరిగింది. టెంపర్ రేపాడని అమన్ గురించి రోహిత్ చెబుతున్నాడు. ఎవరు మన గురించి అడిగినా కూడా అమన్ అన్నీ చెప్పేస్తున్నాడని చరణ్‌కి రోహిత్ చెప్పాడు. చాలా మ్యానిప్యులేట్ అవుతున్నాడని ఫీలవుతున్నాడు. నిన్న మిథిలేష్, అపూర్వ, రామకృష్ణ వచ్చారని.. కంటెస్టెంట్స్ ఓట్స్ వేశారని.. అయితే ఎవరికైతే తక్కువ ఓట్లు పడ్డాయో వారిని మీ టెన్షన్‌గా ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నట్టు బిగ్‌బాస్ చెప్పాడు. వెంటనే అపూర్వ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అపూర్వను తీసుకెళ్లి ఇల్లు చూపించారు. రోహిత్, అపూర్వ డ్యాన్స్ అగ్నిపరీక్షలో చూడలేదని.. ఇప్పుడు తాను చూడాలనుకుంటున్నట్టు ముఖేష్ చెప్పడంతో ఇద్దరూ కలిసి ఓ స్టెప్ వేశారు.

ఆ తరువాత రోహిత్, షాలిని, సృష్టి, షాలిని కలిసి భోజనం చేస్తూ అపూర్వ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఆమెతో మీ గ్రూప్‌ని స్ప్లిట్ చేయాలనుకుంటే ఎలాగని త్రిగుణ్.. రోహిత్‌ని అడిగాడట. ‘ఇక్కడున్నది రోహిత్ నాయుడు.. అవన్నీ కుదరవు’ అని చెప్పానని వాళ్లతో రోహిత్ చెప్పాడు. రామకృష్ణ, మిథిలేష్‌లకు సమాన ఓట్లు వచ్చినందున వారిలో ఒకరిని హౌస్‌లోకి పంపేందుకు బిగ్‌బాస్ ఓ టాస్క్ నిర్వహించారు. టైర్లను ఏర్పాటు చేసి.. వాటిని తమకు కేటాయించిన లైన్ లోపల ఉండేలా చూసుకోవాలి. ఎవరికి ఎక్కువ టైర్లు ఉంటే వారు గెలిచినట్టు. ఇద్దరి మధ్య గట్టి ఫైట్ జరిగింది. మిథిలేష్‌ది జిమ్ బాడీ కావడంతో స్ట్రాంగ్‌గా రామకృష్ణను హోల్డ్ చేశాడు. అయినా కూడా రామకృష్ణ చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు. చివరకు టాస్క్‌లో మిథిలేష్ గెలవడంతో రామకృష్ణ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. బయట విషయాల గురించి ఎవరికీ చెప్పకూడదు. ఎవరి దగ్గర ఏ పవర్ ఉందని రివీల్ చేయకూడదని బిగ్‌బాస్ మిథిలేష్‌కు కండీషన్స్ పెట్టారు.

Rohith vs Apoorva and Mithilesh

బెడ్ షీట్ మీద ఉన్న దుమ్మంతా దులిపి క్లీన్ చేయాలని ఝాన్సీ.. రోహిత్, అమన్‌కి చెప్పింది. మరోవైపు త్రిగుణ్ వెళ్లి సుధీర్, ముఖేష్‌లకు రోహిత్ గురించి పని విషయమై కంప్లైంట్ చేస్తున్నాడు. ఇంట్లో గొడవ లేక చాలా రోజులవుతోందని.. ఇవాళ బాగా జరుగుతోందని రామ్ ప్రసాద్ సంబరపడుతున్నాడు. అపూర్వతో రోహిత్‌కు గొడవ జరిగింది. ఆ తరువాత హౌస్ క్లీనింగ్ విషయమై అమన్ వర్సెస్ త్రిగుణ్ మధ్య గొడవ జరిగింది. వాష్‌రూమ్‌లో మజాక్‌లాడి.. ఇంట్లోకి వచ్చి చిరాకు వస్తోందని అంటున్నావని.. రోహిత్‌పై అమన్ ఫైర్ అయ్యాడు. ఎవరి పనులు వారికి అప్పజెప్పినప్పుడు ఎవరూ చెప్పించుకోవట్లేదని.. మీరెందుకు చెప్పించుకుంటున్నారని ఝాన్సీ అడిగింది. ‘నీ మొహం చూస్తేనే చిరాకేస్తోంది’ అని త్రిగుణ్ అనడంతో ఈ విషయమై పెద్ద గొడవే జరిగింది. వీళ్ల గొడవ ఇటు జరుగుతుంటే.. మరోవైపు సుధీర్, ముఖేష్.. ఇతర హౌస్‌మేట్స్ అంతా దానిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తరువాత అమన్‌ను త్రిగుణ్‌ని సైడ్‌కి తీసుకెళ్లి చిరాకులో పొరపాటున అన్నానని సారీ చెప్పాడు.

అపూర్వ, మిథిలేష్‌కు.. ఇప్పటికే కెప్టెన్సీ కంటెండర్స్ అయిన వారి నుంచి ఇద్దరిని తొలగించి.. ఉన్న ఇద్దరిలో చెరొకరు పెయిర్‌గా ఎంచుకుని టాస్క్ ఆడాలని బిగ్‌బాస్ చెప్పారు. అపూర్వ, మిథిలేష్ చర్చించుకుని అమన్, సృష్టిలను తొలగించారు. మిథిలేష్ వచ్చేసి ఝాన్సీని తొలగిద్దామన్నాడు కానీ అపూర్వ పడనివ్వలేదు. కానీ అగ్నిపరీక్ష నుంచి వచ్చి వారిద్దరినీ తొలగించడం కరెక్ట్‌గా అనిపించలేదు. అయితే ఈ నేపథ్యంలో మళ్లీ చాలా పెద్ద గొడవ జరిగింది. సుధీర్‌ని అన్ని మాటలంటున్నప్పుడు ఇంత మంది మగవాళ్లుండి ఒక్కరు కూడా సపోర్ట్‌గా మాట్లాడలేదని అపూర్వ.. తిరిగి రోహిత్‌తో గొడవకు దిగింది. అమన్‌ని తీసేసే విషయంలో రోహిత్ మంచి పాయింట్ పట్టుకున్నాడు. అమన్‌కు అటెన్టివ్‌నెస్ తక్కువ అని చెప్పడంతో రోహిత్ స్టాండ్ తీసుకున్నాడు. నిన్న ముఖేష్‌ను అటెన్టివ్‌నెస్ తక్కువని.. ఇవాళ అమన్ తక్కువనడం ఏంటని రోహిత్ ప్రశ్నించాడు. మొత్తానికి అగ్నిపరీక్ష టీం మధ్య బీభత్సమైన గొడవ జరిగింది.

Ram Prasad, Debjani, Anchor Varshini

అగ్నిపరీక్ష టీంతో గొడవ పడటంతో అపూర్వకు రామ్ ప్రసాద్, ఝాన్సీ, రామ్ ప్రసాద్ అంతా అండగా నిలిచారు. ఆ తరువాత కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ప్రారంభమైంది. ఎత్తైన టవర్ నిర్మించడం టాస్క్. రోహిత్ వచ్చేసి సంచాలక్. ముఖేష్, అపూర్వ ఒక టీం.. ఝాన్సీ, మిథిలేష్ ఒక టీం. ఈ టాస్క్‌లో ముఖేష్, అపూర్వ గెలిచారు. దీంతో ముఖేష్ టీం అంతా రచ్చ చేసింది. ముఖేష్ కెప్టెన్ అవగా.. అపూర్వకు ఇమ్యూనిటీ లభించింది. ఈ నేపథ్యంలో స్టార్, స్టార్‌డమ్ కష్టపడితేనే వస్తుందని.. ఊరికే రాదని చరణ్‌కు ముఖేష్ కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికి ప్రస్తుతం చూస్తే మిథిలేష్ కాస్త రోహిత్ గ్యాంగ్‌తో బాగానే ఉంటున్నట్టుగా అనిపిస్తోంది కానీ అపూర్వ మాత్రం పూర్తిగా యాంటీ అయిపోయింది. చూడబోతే అపూర్వ అయితే రోహిత్ టీంతో అయితే కలిసే అవకాశమే లేదు కానీ మిథిలేష్ ఎలా ఉంటాడో చూడాలి. టోటల్‌గా చూస్తే అందరూ కలిసి రోహిత్ టీంని కార్నర్ చేసినట్టుగా అనిపిస్తోంది. ఇది కూడా రోహిత్‌కు ఫేవర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360