Menu
BREAKING
అక్కినేని కోడలి గ్లామర్ షోపై ఫ్యాన్స్ గుర్రు.. శోభిత బికినీ ఫోటోషూట్ వివాదంలో తప్పెవరిది..?   |   Bigg Boss 10 Telugu: షాలిని రచ్చ.. రామకృష్ణ కాళ్లు పట్టుకుని సారీ.. వైల్డ్ ఫైర్స్‌కు షాకిచ్చిన ఓజీలు!   |   Biggbogss10 Telugu: నామినేషన్స్‌లో వంశీ, శివ్ రచ్చ.. దేబ్జాని బిహేవియర్ వరస్ట్..   |   విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సెన్సార్ రివ్యూ.. ప్లస్ ఏంటి.. మైనస్ ఏంటి..?   |   అవకాశం ఇస్తాను పడుకుంటావా అని అడిగాడు.. హీరోయిన్ సంచలనం..!   |   శ్రీకాంత్ కూతురు మేధ హీరోయిన్‌గా సక్సెస్ అవుతుందా..?   |   Biggboss10 Telugu: మరీ చిల్లరగా మారిన షాలిని.. ఈవారం ఎలిమినేట్ అవుతుందా?   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌ను టార్గెట్ చేస్తున్న హౌస్‌మేట్స్.. షాలినిని కాపాడుతున్నారా?   |   జైలర్ 2కు అక్కడ షోస్ క్యాన్సిల్.. రజినీకాంత్ పప్పులు ఉడకలేదు..!   |   సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ మధ్య ఏం జరుగుతుంది.. అక్కడే బీజం పడిందా..?   |   400 కోట్ల సినిమాకు ఇదేం తిప్పలు.. హనుమాన్ అంశ్ తెలుగులో అందుకే ఆడలేదా..?   |   అమలాపాల్ ఆపసోపాలు చూస్తున్నారా… ఇప్పుడు వర్కవుట్ అవుతుందా..?   |   దసరాకు పాంచ్ పటాకా.. 5 సినిమాల్లో గెలిచేది ఎవరో..?   |   ‘ది ప్యారడైజ్’ దెబ్బతో నాని కీలక నిర్ణయం..   |   Bigg Boss 10 Telugu: చరణ్ ఎలిమినేషన్ వెనుక ట్విస్ట్.. షాలినికి ఓటేసిన హౌస్‌మేట్స్!

Biggboss10 Telugu: వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో మళ్లీ టార్గెట్ రోహిత్..

Biggboss10 Telugu: వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో మళ్లీ టార్గెట్ రోహిత్..

బిగ్‌బాస్ 10 స్టార్టింగ్ నుంచే ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. ఈసారి త్రిగుణ్, రోహిత్ లేకుంటే షో లేదనే చెప్పాలి. ఇద్దరూ కంటెంట్ కింగ్సే. ఇక తాజాగా హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మిథిలేష్, అపూర్వ అడుగు పెట్టారు. వీరు రాకతో హౌస్ మరింత రసవత్తరంగా మారింది. వాళ్లు ఎంట్రీ ఇవ్వకముందే ముఖేష్, త్రిగుణ్‌కి గట్టిగానే ఇచ్చారు. కానీ హౌస్‌లోకి అడుగు పెట్టాక మాత్రం వాళ్లిద్దరూ ముఖేష్, త్రిగుణ్‌ని వదిలేసి రోహిత్‌ని పట్టుకున్నారు. దీనికి కారణం రోహిత్ టాప్‌లో ఉండటమే అయి ఉండొచ్చు. తప్పదు.. ఎవరొచ్చినా కూడా రోహిత్‌తో పెట్టుకుంటేనే వాళ్లకు హైప్ వస్తుంది. ఇంకొకటేంటే.. రోహిత్ కూడా హౌస్‌లో పని విషయంలో చాలా వెనుకబడి ఉన్నాడు. పని చేసేందుకు బద్దకమా? మరో కారణమా? తెలియదు కానీ రోహిత్ మాత్రం పని అంటే వెనుకడుగు వేస్తుంటాడు.

పని కారణంగానే రోహిత్‌ టార్గెట్ అవుతున్నాడు. లేదంటే రోహిత్‌ను కార్నర్ చేయడానికి పెద్దగా కారణాలేమీ ఉండవు. ఇక ఇవాళ బిగ్‌బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి ఇద్దరిని తొలగించమని మిథిలేష్, అపూర్వకు చెప్పారు. వీళ్లిద్దరూ సృష్టి, అమన్‌ను ఎంచుకున్నారు. దీనికి కారణాలు చెబుతుంటే మధ్యలో రోహిత్ ఇన్వాల్వ్ అయ్యాడు. అసలెందుకు రోహిత్ మధ్యలోకి వచ్చాడనేది షో చూస్తే కానీ తెలియదు. దీంతో రోహిత్ వర్సెస్ మిథిలేష్, అపూర్వ పెద్ద గొడవ జరిగింది. రోహిత్ అటెన్టివ్‌గా లేడని మిథిలేష్ అన్నాడు. దీంతో నిన్న ముఖేష్ అటెన్టివ్ కాదన్నావు.. ఇవాళ నేను అటెన్టివ్ కాదంటున్నావు.. ఇందులో ఏది నిజమంటూ రోహిత్ గొడవకు దిగాడు. మరోవైపు పని విషయంలో త్రిగుణ్ వర్సెస్ రోహిత్ పెద్ద గొడవ జరిగింది. ఇదంతా చూస్తుంటే త్రిగుణ్ కూడా తన వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత తన స్ట్రాటజీ మార్చేసి రోహిత్‌తో గొడవపడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360