Menu
BREAKING
ఓ ఇంటివాడు కాబోతున్న మెగా మేనల్లుడు.. సాయి దుర్గ తేజ్ పెళ్ళి సందడి..!   |   Bigg Boss10 Telugu: ఫ్యామిలీ కోసం బిగ్ ఫైట్.. వంశీ, శ్వేత విన్..   |   వీకెండ్ అయిపోయింది.. ఆదర్శ కుటుంబం సిచ్యువేషన్..   |   హ్యాపీ బర్త్ డే టబు.. అప్పుడు పండు.. ఇప్పుడు మహంతి ఝాన్సీ రాణి..!   |   ఎర్లీ మార్నింగ్ షోస్‌కు ఓకే.. టికెట్ హైక్స్‌కు నో.. విజయ్ సర్కార్ సంచలనం..!   |   మహేష్ బాబు.. ది రియల్ లైఫ్ బిజినెస్ మెన్‌.. వ్యాపారాల్లో దూకుడు..!   |   పాకెట్ రాకెట్స్ టీజర్ రివ్యూ.. మెగా డాటర్ హ్యాట్రిక్ కొట్టేలా ఉందిగా..!   |   “రాధిక ఆప్టే నీకు అసలు సిగ్గుందా..” సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల ఆగ్రహం..!   |   Bigg Boss10 Telugu: మరో రోహిత్ అవుతున్న ముఖేష్.. రెడ్ కార్డ్ ఇచ్చేంత తప్పు చేశాడా?   |   మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సాయి ధరమ్ తేజ్ పెళ్ళి ఎప్పుడో తెలుసా..?   |   Bigg Boss10 Telugu: వంశీకి ‘టెంపర్’ లేచింది.. వెకిలి చేష్టలతో చిరాకు తెప్పించిన శివ్..   |   మారిన సెన్సార్ (CBFC) రూల్స్.. దర్శక నిర్మాతలు గుర్తించుకోండి ఈ పాయింట్స్..!   |   Bigg Boss10 Telugu: రోహిత్ ఎలిమినేట్..   |   ఏంటి గురూజీ ఆదర్శ కుటుంబం కూడా కాపీయేనా..? త్రివిక్రమ్‌పైనే ఎందుకిలా..?   |   ‘ఇరుముడి’ నిర్మాతలకు భారీ షాక్.. లేబర్ డిపార్ట్‌మెంట్ నోటీసులు..

ఆ ప్యాన్ ఇండియన్ దర్శకుడిపై ప్రెజర్.. అంతా వారసుడి మహిమ..!

ఆ ప్యాన్ ఇండియన్ దర్శకుడిపై ప్రెజర్.. అంతా వారసుడి మహిమ..!

టాలీవుడ్‌లో ఒక యంగ్ డైరెక్టర్ గురించి చాలా ఆసక్తికరమైన చర్చ నడుస్తోందిప్పుడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఒకే ఒక్క సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు ఆ యువ దర్శకుడు. బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి లాంటి పెద్ద సీజన్లో ఎదురుగా సూపర్ స్టార్ లాంటి అగ్ర హీరో సినిమా ఉన్నా సరే ఎక్కడా తగ్గకుండా నిలిచి గెలిచాడు. ఆ ఒక్క భారీ విజయంతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అండ్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. సినిమా మేకింగ్ లో అతని విజన్ చూసి ఇండస్ట్రీ పెద్దలు సైతం ఆశ్చర్యపోయారు. ఈ క్రేజ్ తోనే ఆ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఈ దర్శకుడి నుంచి వెంటవెంటనే ఏకంగా ఐదారు సినిమాలు అనౌన్స్ అయ్యాయి. ఇక అతనికి ఇండస్ట్రీలో తిరుగులేదు, వరుస విజయాలతో దూసుకుపోతాడు అని అందరూ అనుకున్నారు.

కానీ ఇక్కడే సీన్ మొత్తం రివర్స్ అయింది. చేతిలో ఆరు సినిమాలు ఉన్నా అందులో ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ అయ్యే స్టేజ్ కు వచ్చిన మూడు ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అందులో ఒక ప్రముఖ నిర్మాత తనయుడిని హీరోగా పెట్టి చేయాల్సిన సినిమాతో పాటు, టాలీవుడ్ కు చెందిన ఒక పెద్ద స్టార్ హీరో కుమారుడి సినిమా కూడా ఉండటం గమనార్హం. ప్రాజెక్టులు అనౌన్స్ అయిన తర్వాత ఇలా మధ్యలో ఆగిపోవడం ఇండస్ట్రీలో సహజమే అయినా, వరుసగా మూడు సినిమాలు క్యాన్సిల్ అవ్వడం మాత్రం ఆ యువ దర్శకుడికి పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే సదరు దర్శకుడితో సినిమా క్యాన్సిల్ చేసుకున్న ఆ పెద్ద హీరో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన వారసుడిని తీసుకెళ్లి మరో యంగ్ ఫాంటసీ దర్శకుడి చేతుల్లో పెట్టాడు. రీసెంట్ గా ఆ కాంబినేషన్ లో సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసేశారు.

ఇలా తనతో ఆగిపోయిన వారసుడి ప్రాజెక్ట్, మరో దర్శకుడి చేతికి వెళ్లిపోవడంతో ముందు ఆపేసిన యువ దర్శకుడికి కంగారు మొదలైందని టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఒక హీరో మనతో సినిమా క్యాన్సిల్ చేసుకుని వేరే డైరెక్టర్ తో హిట్ కొడితే ఆ ప్రెజర్ కచ్చితంగా మన మీదే పడుతుంది. ఇప్పుడు ఆ ప్యాన్ ఇండియా డైరెక్టర్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నాడంటున్నారు. అందుకే తన వర్కింగ్ స్టైల్ ను పూర్తిగా మార్చేశాడు. ప్రస్తుతం తను దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న సినిమాల నుంచి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతి ప్రాజెక్ట్ టీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ విజయం సాధించి తీరాలని గట్టిగా చెబుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తన టీమ్ మెంబర్స్ కు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కావొద్దని, కంటెంట్ విషయంలో ప్రతీ చిన్న డీటైలింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నాడని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మరోవైపు ఆ స్టార్ హీరో వారసుడిని లాంచ్ చేయబోతున్న కొత్త డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ చూస్తే అది కూడా కాస్త గమ్మత్తుగానే ఉంది. ఆ ఫాంటసీ డైరెక్టర్ మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ ఆయన రెండో సినిమా మాత్రం గత రెండేళ్లుగా రకరకాల కారణాల వల్ల విడుదలకు నోచుకోవడం లేదు. ఆ సినిమా రిలీజ్ కాకముందే ఇప్పుడు ఏకంగా మూడో సినిమాగా పెద్ద హీరో వారసుడి చిత్రాన్ని ఒప్పుకున్నాడు. మొత్తానికి ఈక్వేషన్స్ అన్నీ గమనిస్తే ఆ స్టార్ కిడ్ సినిమా చుట్టూ ఇద్దరు యంగ్ డైరెక్టర్ల భవిష్యత్తు ముడిపడి ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ వారసుడి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ప్రస్తుతం ప్యాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఆ మొదటి యువ దర్శకుడికి మాత్రం తన నెక్స్ట్ సినిమాలతో కచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ ప్రెజర్ ను దాటి అతను మళ్లీ తన మ్యాజిక్ రిపీట్ చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360