Menu
BREAKING
Bigg Boss10 Telugu: బిగ్‌బాస్ నుంచి ఈవారం ఎలిమినేట్ అయ్యిందెవరంటే…?   |   ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత.. చివరి రోజుల్లో ఎలా గడిచిందో తెలుసా..?   |   Bigg Boss10 Telugu: ముఖేష్ వర్సెస్ వర్షిణి బిగ్‌ ఫైట్.. ఎప్పుడూ చూస్తామనుకోలే..   |   Bigg Boss10 Telugu: శివ్‌కు రాంగ్ గైడెన్స్ ఇచ్చిన ప్రియాంక.. ఇక కష్టమే..   |   Bigg Boss10 Telugu: అందరికీ పరోక్షంగా ప్రియాంక వార్నింగ్.. ముఖేష్ తల్లి సూపర్బ్..   |   Bigg Boss10 Telugu: ఎవరెవరు వచ్చారు? ఏ ఏ హింట్స్ ఇచ్చారంటే…   |   వారెవ్వా కమ్ బ్యాక్ అంటే ఇలా ఉండాలి.. సూర్య ఆల్ టైమ్ రికార్డులు..!   |   Bigg Boss10 Telugu: నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్, వంశీ.. ఇంట్లో ఉండేందుకు అర్హత లేదంటూ..   |   రామాయణపై రామ్ గోపాల్ వర్మ రివ్యూ.. వాళ్లంతా వీధి కుక్కలు..!   |   షాకింగ్.. పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు..!   |   బడ్జెట్ కంట్రోలింగ్.. మలయాళం వాళ్లను చూసి మనం నేర్చుకుందామా..?   |   Bigg Boss10 Telugu: నామినేషన్స్ పాయింట్స్ మాట్లాడుకున్న త్రిగుణ్ టీం.. నాగ్ ప్రశ్నిస్తారా?   |   జాన్వీ కపూర్‌కు తత్వం బోధపడిందా.. తిట్టిన నోటితోనే పొగడ్తల వర్షం కురిపిస్తుందిగా..!   |   Bigg Boss10 Telugu: బ్లాక్ కోతి పంచాయతీకి చెక్ పెట్టిన నాగ్.. ఇక టైం లేదు..   |   Bigg Boss10 Telugu: ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే…
Itlu Arjuna
MOVIE REVIEW

Itlu Arjuna

★ 2.75 / 5
Release Date: November 13, 2026
Cast
Aniesh Reddy, Anaswara Rajan, Mukesh Rishi, Kalaiyarasan, Ilango Kumaravel, Vennela Kishore
Director
Mahesh Uppala
Music Director
Thaman
Producer
Venky Kudumula
Banner
What Next Entertainments

Itlu Arjuna Review

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి బడా స్టార్స్ ప్రమోట్ చేయడం, అలాగే నాగార్జున సమర్పకుడిగా వ్యవహరించడంతో ఇట్లు అర్జున మూవీకి ముందు నుంచే మంచి బజ్ క్రియేట్ అయింది. వెంకీ కుడుముల నిర్మాణంలో మహేష్ ఉప్పల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ద్వారా అనీష్ రెడ్డి టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నాడు. మరి ఇన్ని అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్‌లో మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

Itlu Arjuna Movie Review

కథ:

పుట్టుకతోనే మూగవాడైన అర్జున్ (అనీష్) చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో దొంగగా మారతాడు. ఆ ముద్ర పడటంతో అతనికి ఎవరూ స్నేహితులు కూడా ఉండరు. బాల్యంలోనే ఒకసారి జైలుకు కూడా వెళ్లి వస్తాడు. మరోవైపు పెద్దన్న (ముఖేష్ రుషి) తన కొడుకు మునిని పాలిటిక్స్‌లోకి తీసుకురావడానికి హవాలా ద్వారా ఏకంగా 1000 కోట్లు తెప్పించే ప్లాన్ వేస్తాడు. కానీ ఆ డబ్బుకు సంబంధించిన పెన్ డ్రైవ్, పాస్ వర్డ్ వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తాయి. సరిగ్గా అదే సమయంలో పెద్దన్న రైట్ హ్యాండ్ గౌరీ (కలైయరసన్) మునిని రహస్యంగా చంపేస్తాడు. అసలు గౌరీ ఈ స్కెచ్ ఎందుకు వేశాడు? ఆ 1000 కోట్లు పెద్దన్నకు దక్కాయా లేదా? తన కొడుకును చంపింది సొంత మనిషే అనే నిజం అతనికి తెలిసిందా? పోలీస్ ఆఫీసర్ హిరానీ (ఎలాంగో) ఈ కేసులో ఎలా ఎంటర్ అయ్యాడు? అర్జున్ జీవితంలోకి కీర్తి (అనస్వర రాజన్) ఎలా వచ్చింది? మాటలు రాని ఆ కుర్రాడు తన ప్రేమను ఆమెకు ఎలా చెప్పాడు? కీర్తి కోసం అతను ఎలాంటి పోరాటం చేశాడు అనేది వెండితెర మీద చూడాలి.

స్క్రీన్ ప్లే:

హీరో పాత్రకు మాటలు రాకపోవడం అనే పాయింట్ ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్. ఈ ఒక్క కొత్తదనం పక్కన పెడితే సినిమా స్టోరీ అంతా మనం రెగ్యులర్‌గా చూసినట్లే అనిపిస్తుంది. కానీ దర్శకుడు మహేష్ ఉప్పల దాన్ని తెరమీద ప్రజెంట్ చేసిన విధానం మాత్రం ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంది. వెయ్యి కోట్ల రూపాయల చుట్టూ నడిచే డ్రామా, ఆ పాస్ వర్డ్ కోసం వెతికే ట్రాక్ అన్నీ క్యూరియాసిటీ పెంచుతాయి. ఇలాంటి సీరియస్ నేపథ్యం ఉన్నా కూడా కామెడీని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ సినిమాను స్టైలిష్‌గా మలిచారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ల మధ్య నడిచే అందమైన లవ్ స్టోరీతో సరదాగా గడిచిపోతుంది. హీరో మూగవాడు కావడంతో వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, కాన్వర్జేషన్స్ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అదే టైమ్‌లో విలన్ గ్యాంగ్ డబ్బు కోసం చేసే వేట ఆసక్తి రేపుతుంది. మధ్యలో వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ సినిమాకు బాగా ప్లస్ అయింది.

ఇంటర్వెల్ దగ్గర ప్రధాన జంట అనుకోని ఆపదలో చిక్కుకోవడం, అక్కడి నుంచి కథ మలుపు తిరగడం సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఎమోషన్స్ డోస్ కొంచెం పెంచారు. ఇక్కడ కూడా రఘుబాబు, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తమ కామెడీతో రిలీఫ్ ఇస్తారు. సినిమా లాస్ట్‌లో వచ్చే 40 నిమిషాల ఎపిసోడ్ మాత్రం సీట్ ఎడ్జ్ లాగా సాగుతుంది. నేరుగా విలన్ కోటలోకి హీరో వెళ్లడం, అక్కడ జరిగే యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. హీరోకి మాటలు రాకపోయినా ఆ మైనస్‌ను ఎక్కడా కనిపించకుండా దర్శకుడు తన స్క్రీన్ ప్లేతో కవర్ చేశాడు. క్లైమాక్స్ పాస్ వర్డ్ సీన్ కూడా బాగా పేలింది. చివర్లో హీరో హీరోయిన్లు ఒక్కటైనా, ఆ వెయ్యి కోట్ల సీక్రెట్‌ను మాత్రం రివీల్ చేయకుండా సీక్వెల్ కోసం దాచిపెట్టడం బాగుంది.

నటీనటులు:

తొలి సినిమానే అయినా అనీష్ రెడ్డి ఎలాంటి బెరుకు లేకుండా చాలా కాన్ఫిడెన్స్ చూపించాడు. లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ పరంగా మంచి మార్కులు వేయించుకున్నాడు. డ్యాన్సులు, ఫైట్స్ చాలా ఈజ్‌తో చేశాడు. అయితే ఈ సినిమాలో డైలాగ్స్ లేవు కాబట్టి, అతని వాయిస్ ఎలా ఉంటుందో తెలియాలంటే రెండో సినిమా వరకు ఆగాలి. హీరోయిన్ అనస్వర రాజన్ తన క్యూట్ యాక్టింగ్‌తో పాటు మంచి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంది. చాలా గ్యాప్ తర్వాత ముఖేష్ రుషికి ఒక పవర్ ఫుల్ విలన్ రోల్ దక్కింది, దాన్ని ఆయన చాలా ఈజీగా పండించారు. బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రఘుబాబు తమదైన శైలిలో నవ్వించారు. ఎలాంగో, కలైయరసన్ తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది అని చెప్పొచ్చు. పాటలు కూడా వినడానికి, చూడటానికి బాగున్నాయి. కాకపోతే చాలా చోట్ల OG మ్యూజిక్ ఎక్కువగా వినిపించింది. అక్కడక్కడా అనిరుధ్‌ను ఫాలో అయినట్లు అనిపిస్తుంది. కెమెరా వర్క్ చాలా రిచ్‌గా ఉంది, ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా తీశారు. మాటలు లేకపోయినా ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు అనే మీనింగ్ వచ్చేలా రాసిన డైలాగ్స్ మనసుకు హత్తుకుంటాయి. ఎడిటింగ్ కూడా ఫ్లో మిస్ అవ్వకుండా స్మూత్‌గా చేశారు. వెంకీ కుడుముల నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా చాలా గ్రాండ్‌గా మూవీని నిర్మించారు. ఖర్చు పెట్టిన ప్రతి పైసా విజువల్స్ లో తెలుస్తుంది.

చివరగా:

ఓవరాల్‌గా ఇట్లు అర్జున.. మైండ్ బ్లాంక్ అయ్యే సినిమా అని చెప్పలేం కానీ.. బోర్ కొట్టకుండా సాగే ఎంటర్‌టైనర్..!

Itlu Arjuna Cast

Aniesh Reddy Anaswara Rajan Mukesh Rishi Kalaiyarasan Ilango Kumaravel Vennela Kishore