Menu
BREAKING
Bigg Boss10 Telugu: బిగ్‌బాస్ నుంచి ఈవారం ఎలిమినేట్ అయ్యిందెవరంటే…?   |   ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత.. చివరి రోజుల్లో ఎలా గడిచిందో తెలుసా..?   |   Bigg Boss10 Telugu: ముఖేష్ వర్సెస్ వర్షిణి బిగ్‌ ఫైట్.. ఎప్పుడూ చూస్తామనుకోలే..   |   Bigg Boss10 Telugu: శివ్‌కు రాంగ్ గైడెన్స్ ఇచ్చిన ప్రియాంక.. ఇక కష్టమే..   |   Bigg Boss10 Telugu: అందరికీ పరోక్షంగా ప్రియాంక వార్నింగ్.. ముఖేష్ తల్లి సూపర్బ్..   |   Bigg Boss10 Telugu: ఎవరెవరు వచ్చారు? ఏ ఏ హింట్స్ ఇచ్చారంటే…   |   వారెవ్వా కమ్ బ్యాక్ అంటే ఇలా ఉండాలి.. సూర్య ఆల్ టైమ్ రికార్డులు..!   |   Bigg Boss10 Telugu: నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్, వంశీ.. ఇంట్లో ఉండేందుకు అర్హత లేదంటూ..   |   రామాయణపై రామ్ గోపాల్ వర్మ రివ్యూ.. వాళ్లంతా వీధి కుక్కలు..!   |   షాకింగ్.. పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు..!   |   బడ్జెట్ కంట్రోలింగ్.. మలయాళం వాళ్లను చూసి మనం నేర్చుకుందామా..?   |   Bigg Boss10 Telugu: నామినేషన్స్ పాయింట్స్ మాట్లాడుకున్న త్రిగుణ్ టీం.. నాగ్ ప్రశ్నిస్తారా?   |   జాన్వీ కపూర్‌కు తత్వం బోధపడిందా.. తిట్టిన నోటితోనే పొగడ్తల వర్షం కురిపిస్తుందిగా..!   |   Bigg Boss10 Telugu: బ్లాక్ కోతి పంచాయతీకి చెక్ పెట్టిన నాగ్.. ఇక టైం లేదు..   |   Bigg Boss10 Telugu: ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే…
Ramayana Part 1
MOVIE REVIEW

Ramayana Part 1

★ 3 / 5
Cast
Ranbir Kapoor, Sai Pallavi, Yash, Sunny Deol, Ravi Dubey, Rakul Preet Singh, Vivek Oberoi, Arun Govil, Lara Dutta, Kajal Aggarwal, Sheeba Chaddha
Director
Nitesh Tiwari
Producer
Namit Malhotra

Ramayana Part 1 Review

రామాయణం అంటే తెలియని కథ కాదు కానీ నితీష్ తివారి మాత్రం తాను తెరకెక్కించిన రామాయణంలో చాలా కొత్త విషయాలు చూపించే ప్రయత్నం చేసాడు.. ఈ చిత్రాన్ని యశ్, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

‘రామాయణం’ సినిమా రివ్యూ.. కొత్త కోణంతో సాగిన ఆసక్తిరమైన ఇతిహాసం..!

కథ:

వాల్మీకి మహర్షి అందించిన మహా కావ్యాన్ని ఎవరికీ తెలియని కొత్త కోణాల్లో ఆవిష్కరించిన చిత్రమిది. కేవలం శ్రీరాముని జననంతోనే కాకుండా, లంకాధిపతి (యశ్) పరిచయంతో ఈ సినిమా ప్రారంభం కావడం ఇందులో ఉన్న ప్రధాన ఆకర్షణ. అసలు ఆ రాక్షస రాజు ఎవరు, అతనికి ఆ అహంకారం ఎందుకు వచ్చింది అనే విషయాలను స్పష్టంగా వివరించారు. ఆ తర్వాత అయోధ్య వారసుడైన రాముడి (రణ్‌బీర్ కపూర్) బాల్యం సాగుతుంది. విశ్వామిత్రుని వద్ద అస్త్రాలు నేర్చుకోవడం, తాటకిని వధించడం, మిథిలాపురంలో శివ ధనస్సును విరిచి సీతను (సాయి పల్లవి) పరిణయమాడటం జరుగుతాయి. సరిగ్గా పట్టాభిషేకం సమయానికి కైకేయి (లారా దత్తా) తన పాత వరాలతో రాముడిని 14 ఏళ్ళు వనవాసానికి పంపుతుంది. ధర్మ పరిరక్షణ కోసం భార్య, సోదరుడు లక్ష్మణుడితో (రవి దూబే) అరణ్యవాసానికి వెళ్లిన రాముడి జీవితంలోకి మారీచుడు మాయలేడిలా వస్తాడు. రావణుడు పన్నిన వలకార్లో చిక్కి సీతమ్మ అపహరణకు గురవుతుంది. ఆ తర్వాత మొదలయ్యే సీతాన్వేషణ, రాబోయే భారీ యుద్ధానికి నాంది పలకడంతో ఈ తొలి భాగం ముగుస్తుంది.

స్క్రీన్ ప్లే:

రామాయణం చిత్రాన్ని దర్శకుడు నితీష్ తివారి కేవలం మన ఆడియన్స్ కోసమే కాకుండా, అంతర్జాతీయ ప్రేక్షకులకు సైతం సులభంగా కనెక్ట్ అయ్యేలా ఎంతో పకడ్బందీగా తీర్చిదిద్దారు. కేవలం ఒక పాత ఇతిహాసంగా కాకుండా, మంచికి చెడుకి మధ్య జరిగే ఒక ఉద్వేగభరితమైన పోరాటంగా దీన్ని మలిచారు. మొదటి సగమంతా పాత్రల గతాన్ని, వారి స్వభావాన్ని పరిచయం చేయడానికే ఎక్కువ సమయం వెచ్చించారు. విదేశీయులకు కూడా మన పురాణం సులువుగా అర్థం కావాలనే ఉద్దేశంతో ప్రతి ఘట్టాన్ని ఎంతో విపులంగా చెప్పారు. ఒకవైపు ఎంతో ప్రశాంతంగా, ధర్మానికి కట్టుబడి ఉండే రాముడిని చూపిస్తూనే.. దానికి పూర్తి భిన్నంగా అహంకారంతో రగిలిపోయే రావణుడి క్రోధాన్ని బ్యాలెన్స్ చేస్తూ రాసుకున్న సన్నివేశాలు అద్భుతంగా పండాయి. రూపాలు మార్చుకునే రాక్షసులు, గాల్లో ఎగిరే మృగాలతో ప్రతి క్షణం ఒక ఫాంటసీ లోకంలో విహరిస్తున్న అనుభూతిని కలిగించారు. సీతాపహరణం తర్వాత జరిగే సంఘటనలు ఎంతో ఆసక్తికరంగా సాగుతాయి. అయితే ఎంత గ్రాండ్‌గా తీసినా కొన్ని మైనస్‌లు మాత్రం స్పష్టంగా తెలుస్తాయి. సినిమా మొత్తం అత్యున్నతమైన గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్స్ చుట్టూనే తిరగడంతో, ప్రేక్షకులకు పాత్రలతో కలగాల్సిన భావోద్వేగ బంధం చాలా చోట్ల తెగిపోతుంది. తెరమీద ఒక అద్భుతం జరుగుతున్నట్లు ఉంటుంది కానీ, మనసుకు హత్తుకునే ఎమోషన్స్ కాస్త మిస్ అయ్యాయి. కథ ఒక సహజమైన ప్రవాహంలా కాకుండా, కొన్ని భారీ యాక్షన్ ఘట్టాలను ఒకదాని తర్వాత ఒకటిగా అతికించినట్లుగా అనిపిస్తుంది. అయినా సరే, ఈ తరం ప్రేక్షకులకు ఒక మహా కావ్యాన్ని ఇంత భారీ స్థాయిలో పరిచయం చేసిన తీరు మాత్రం కచ్చితంగా అభినందించదగినదే. కేవలం పైపైన కథను చెప్పేయకుండా, ఎంతో లోతైన విశ్లేషణతో ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు.

నటీనటులు:

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సరైన నటీనటులు కుదిరారు. శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ పూర్తిగా ఒదిగిపోయాడు. అతని ముఖంలో కనిపించే ప్రశాంతత ఆ క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేసింది. జానకిగా సాయి పల్లవి తన సహజ నటనతో ఆకట్టుకుంది. కాకపోతే ఈమె సీతగా ఇంకాస్త బాగా చేసుంటే అద్భుతంగా ఉండేది. లక్ష్మణుడి పాత్రలో రవి దూబే తన వంతు బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. ఇక ఈ సినిమాలో అందరి దృష్టిని ఆకర్షించేది రావణుడిగా యశ్ యాక్టింగ్. గర్వం, క్రూరత్వం కలగలిపిన దానవ రాజుగా తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టాడు. విద్యుత్ జిహ్వగా వివేక్ ఒబెరాయ్ తన పాత్ర పరిధి మేరకు నటించాడు. లారా దత్తా, రకుల్ ప్రీత్, కాజల్, శోభన, అరుణ్ గోవిల్ తదితరులు కథకు అవసరమైన మేర మెప్పించారు.

టెక్నికల్ టీం:

4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో సాంకేతిక నిపుణుల పనితీరు చాలా కీలకం. ఎఆర్ రెహ్మాన్, హాన్స్ జిమ్మెర్ అందించిన పాటలు పర్వాలేదనిపించినా, నేపథ్య సంగీతం మాత్రం ఇంకొంచెం పవర్ ఫుల్‌గా ఉంటే బాగుండేది. పంకజ్ కుమార్, మహేష్ లిమాయేల కెమెరా పనితీరు సినిమాకు ప్రాణం పోసింది. ప్రతి ఫ్రేమ్‌ను ఒక అద్భుతమైన పెయింటింగ్‌లా చిత్రీకరించారు. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నా, ఇంకొంచెం శ్రద్ధ పెడితే రిజల్ట్ వేరేలా ఉండేది. ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు నితీష్ తివారి పడిన కష్టం, ఆయన శ్రమ ప్రతి సన్నివేశంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది.

చివరగా:

రామాయణం.. సరికొత్త కోణంలో ఆవిష్కృతమైన ఒక అద్భుతమైన ఇతిహాస పోరాటం.

Ramayana Part 1 Cast

Ranbir Kapoor Sai Pallavi Yash Sunny Deol Ravi Dubey Rakul Preet Singh Vivek Oberoi Arun Govil Lara Dutta Kajal Aggarwal Sheeba Chaddha