సినిమా వార్తలు

Bigg Boss10 Telugu: వంశీకి ‘టెంపర్’ లేచింది.. వెకిలి చేష్టలతో చిరాకు తెప్పించిన శివ్..

హోస్ట్ నాగార్జున తనను కన్ఫెషన్ రూంలోకి పిలిచి ఏం చూపించారో త్రిగుణ్.. సుధీర్, నీతూ, దేబ్జానికి చెప్పాడు. బెడ్ మీద అందరం కూర్చొని మాట్లాడుకుని బయటకు వస్తున్నామని.. ‘త్రిగుణ్ గాడు కెప్టెన్ రూం అంటే ఒక హోదా ఉందని చెప్పాడు. ఒక కర్ర తీసి నూనె తీసి అని పాజ్ ఇచ్చాడు’ అని చెప్పాడు. అని తన తదుపరి అవతారం రివార్డ్ అండ్ రివెంజ్ ప్రారంభమైందని.. ఇప్పటి వరకూ ఆడిన గేమ్ కొందరికి రివార్డ్స్.. కొందరికి రివెంజ్ తీర్చుకోవాలన్న ఆలోచనను ఇచ్చి ఉండొచ్చని చెప్పి బిగ్‌బాస్ నామినేషన్స్ ప్రారంభించారు.త్రిగుణ్ కెప్టెన్ అయిన కారణంగా ఎవరూ నామినేట్ చేయడానికి లేదు. వంశీ నామినేషన్ ప్రారంభించండని బిగ్‌బాస్ చెప్పగానే ముఖేష్ లేచి నిలబడ్డాడు. తననే నామినేట్ చేస్తాడని ముందుగానే ముఖేష్ గ్రహించాడు. ఝాన్సీ మీ దగ్గర ఉంటే ఆ అమ్మాయికి అసలేమీ తెలియదు. అలాంటి అమ్మాయి మీ కారణంగా హోస్ట్ సర్ దగ్గర బుక్ అయ్యింది. దయచేసి కల్లు తాగిన కోతిలాగా బిహేవ్ చేయవద్దని ముఖేష్‌కు వంశీ చెప్పాడు. ఝాన్సీ, తాను ఆడేటప్పుడు తప్పు జరిగిందని యాక్సెప్ట్ చేస్తున్నానని ఆ తరువాత రూల్స్ మార్చారని ముఖేష్ చెప్పాడు. ఆ తరువాత ఫేక్ చేయలేదని ముఖేష్ డిఫెండ్ చేసుకున్నాడు. . తప్పు చేశామని.. యాక్సెప్ట్ చేసిన వాడే గొప్ప అని అలా తాము యాక్సెప్ట్ చేసినట్టుగా ముఖేష్ చెప్పాడు.

వంశీ వచ్చేసి మరో నామినేషన్ వర్షిణిని చేశాడు. నైట్ టైమ్ మీ కారణంగా హౌస్ హార్మోని పాడవుతోందని చెప్పాడు. అన్ని తప్పులు గ్రహించినప్పుడు ఒక్కసారి కూడా రామ్ ప్రసాద్‌ను ఎందుకు నామినేట్ చేయలేదని అడిగాడు. తమకు మాత్రమే అనౌన్స్‌మెంట్ రాలేదని.. అందరికీ వస్తోందని వర్షిణి చెప్పింది. మేము ఒకటే సారి తప్పు చేశామని.. మీరు పది సార్లు తప్పు చేశఆడని రామ్ ప్రసాద్ అంటున్నాడని.. ఎన్ని సార్లు చేసినా తపపు తప్పేనని వర్షిణి చెప్పింది. తామంటే నచ్చదు కాబట్టి తమ గురించి అనౌన్స్‌మెంట్ వస్తే పాయింట్ అవుట్ చేస్తున్నారని డిఫెండ్ చేసుకుంది. మీ పర్సనాలిటీ గురించి తనకు తెలుసుని ఏదైనా ఉంటే మనసులో పెట్టుకునే వారు కాదని కానీ రామ్ ప్రసాద్ విషయం ఎందుకు మనసులో పెట్టుకోవాల్సి వచ్చిందని వంశీ అడిగాడు. తన పర్సనాలిటీ గురించి ఎలా చెబుతారని వర్షిణి అడిగింది. తను మనసులో పెట్టుకునే అమ్మాయినేనని చెప్పింది. మధ్యలోకి శివ్ వచ్చి గొడవ చేశాడు. ఆడియెన్స్‌లో ఉన్నాను కాబట్టే వర్షిణి కోసమే ముఖేష్ తన పవర్‌ని వినియోగించాడని శివ్ చెప్పాడు. మీరేం చెప్పినా కూడా ప్రపంచం మొత్తానికి అసలు ఏం జరిగిందనేది వంశీ చెప్పాడు. ఏది ఏమైనా ముఖేష్ త్యాగం కారణంగా ఆ వారం వంశీ కూడా సేవ్ అయ్యాడు. సిగ్గు, లజ్జ పక్కన పెట్టారని వంశీ అన్నాడు. వంశీకి ఆవేశం వస్తే పట్టుకోలేం. ఇష్టానుసారంగా మాటలు జారతాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది.

నెక్ట్స్ సుధీర్ వచ్చేసి వంశీని నామినేట్ చేశాడు. మిథిలేష్ సూట్‌కేసు పట్టుకుని పోయినప్పుడు ఇద్దరం పక్కపక్కనే ఉన్నామని.. రూ.20 లక్షలు ఇస్తే నేను కూడా వెళ్లిపోయేవాడినని వంశీ అన్నాడని.. అసలు వచ్చింది కప్ కోసమా? లేదంటే డబ్బు కోసమా? అని సుధీర్ అడిగాడు. వంశీ ఎక్కడున్నా కోపమేనని సుధీర్ చెప్పాడు. జంతువులన్నీ ఒకలాగే ఉండవని వంశీ చెప్పాడు. మధ్యలో ముఖేష్ లేచి జంతువులా బిహేవ్ చేయకని చెప్పాడు. మరో నామినేషన్ అమన్‌ను సుధీర్ చేశాడు. రోహిత్‌కు స్టార్ ఇచ్చి తీసుకున్న దాని గురించి సుధీర్ అడిగాడు. చివరకు స్టార్ తీసుకున్నావని.. మళ్లీ అతడిని ఎలిమినేట్ చేసేందుకు ఓటు చేశావని చెప్పాడు. ఒకప్పుడు రోహిత్ అంటే పడనప్పుడు భజన్‌లాల్ అని ఎగతాళి చేశావని.. ఆ తరువాత రోహిత్‌తో సెట్ అయ్యాక మాట మార్చావని అమన్ చెప్పాడు. తేడాలొస్తే అలాగే ఉంటాయని చెప్పాడు. రూ.2000, స్టార్ నెక్ట్స్ డే పెట్టానని అమన్ చెప్పాడు. అప్పుడు పెట్టినా ఉపయోగం అయితే ఉండదు. సేఫ్ అవుతాడని తనకు తెలుసని అందుకే రోహిత్‌కు సపోర్ట్ చేయలేదని చెప్పాడు. మరి రోహితే కదా ఎలిమినేట్ అయ్యాడు. ఈ లాజిక్ ఎందుకో అమన్‌కు తెలియడం లేదు. ఒక్క ఇన్సిడెంట్ పట్టుకుని తన గురించి చాలా రాశాడని.. దానికి చాలా హర్ట్ అయ్యానని.. అంతకు ముందున్న ఒపీనియన్ మార్చుకుని ఫ్రెండ్ కాదని ఎలిమినేట్ చేయడం కోసం ఓటేశానని అమన్ చెప్పాడు.

శ్వేత వచ్చి ఫస్ట్ నామినేషన్.. ముఖేష్‌కు వేసింది. తాను వైల్డ్ కార్డుగా ఫస్ట్ డే వచ్చినప్పుడు ముఖేష్ ఆట గురించి ప్రసంశించానని శ్వేత చెప్పింది. బాల్ టాస్క్‌లో కంప్లీట్‌గా గేమ్ వన్ సైడ్ అయిపోయిందని.. అయినా ట్రై చేస్తున్నావని.. రామ్ ప్రసాద్‌ను కన్విన్స్ చేసేందుకు ట్రై చేసే బదులు ముగ్గురు సపోర్టర్స్‌ను కన్విన్స్ చేసి ఉంటే బాగుండేదని శ్వేత చెప్పింది. ముందుగా రామ్ ప్రసాద్ మీ నుంచి ఒకరు.. మా నుంచి ఇద్దరు వస్తారని చెప్పి కంప్లీట్‌గా మార్చారని ముఖేష్ చెప్పాడు. తను బాల్ తీసుకురాగానే శివ లాక్కొని వెళ్లిపోతున్నాడని ముఖేష్ చెప్పాడు. శ్వేత ఏదో నామినేట్ చేయాలన్నట్టుగా చేసింది కానీ అవన్నీ పసలేని పాయింట్స్. కర్ర గురించి త్రిగుణ్‌ను మాట్లాడింది తనను డిస్టర్బ్ చేసిందని చెప్పింది. ఇండివిడ్యువల్ ప్లేయర్ అని చెప్పి వేరొకరి దగ్గర చాకిరి చేయడానికి తాను ఇక్కడకు రాలేదని ముఖేష్ చెప్పాడు.

ఆ తరువాత అమన్‌ను నామినేట్ చేసింది. డే 1 నుంచి ఇద్దరం ఒకరినొకరం నామినేట్ చేసుకుంటున్నామని.. బీబీ టాస్క్‌లో స్టార్ ఇస్తానని చెప్పాడని శ్వేత చెప్పింది. అమన్‌ని నమ్మలేనని త్రిగుణ్ చెప్పాడని.. కానీ అమన్ తనకు మాట ఇచ్చాడని చెప్పిందట. అప్పుడు రామ్ ప్రసాద్ వచ్చి మా ముందుకు వచ్చి స్టార్ ఇవ్వమంటే అప్పుడు ఇచ్చాడని.. అది టైమ్‌కి ఇవ్వకపోవడం వలన తనకు ఇబ్బంది ఏర్పడిందని చెప్పింది. తనది ఇదే పర్సనాలిటీ అని తనకు ఏం అనిపిస్తే అది చేస్తానని అమన్ చెప్పాడు. రామ్ ప్రసాద్ అడిగిన వెంటనే స్టార్ తీసుకొచ్చి నీ చేతిలో పెట్టానా? లేదా? అని అమన్ అడిగాడు. 8 వారాల నుంచి తనను ఎవరు వెన్నుపోటు పొడిచారో తనకు తెలుసని.. అందుకే ఇకపై తన గేమ్ తను ఆడతానని చెప్పాడు. మళ్లీ రోహిత్ టాపిక్ తీసి తాను ఫ్రెండ్షిప్‌కి వాల్యూ ఇచ్చానని.. రోహిత్‌కి స్టార్ ఇచ్చానని వాడికి ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదని.. తనకు తెలుసని చెప్పాడు.

నెక్ట్స్ వంశీని నీతూ నామినేట్ చేసింది. వచ్చినప్పుడు తనపై చాలా ఎలిగేషన్స్ చేశావని.. మరి నువ్వు చేసిందేంటని వర్షిణిని అడిగింది. తనను ఏమీ పీకలేదని చెప్పావని.. ఏం పీకానో చూశావు కదా అని నీతూ అడిగింది. తన గురించి లెటర్‌లో అలా రాయడం గురించి ప్రశ్నించింది. రోహిత్ తనకు ఇస్తానని ఎక్కడా చెప్పలేదని వర్షిణి చెప్పింది. వర్షిణికి స్టార్ ఇస్తాడని చివరి వరకూ తెలియదని చెప్పింది. మధ్యలో దేబ్జాని, రామ్ ప్రసాద్ వచ్చి తన ఫ్యామిలీకి ఇవ్వాలని ఉందని రోహిత్.. నాగ్ సర్‌కి చెప్పాడని పేర్కొన్నారు. వర్షిణికి ఇంట్లో ఉండే అర్హత లేదని నీతూ నామినేట్ చేసింది. నెక్ట్స్ వంశీని నామినేట్ చేసింది. కిచెన్‌లో ఉంటే వంశీలా ఉంటారని.. గేమ్‌లోకి వస్తే టెంపర్ అయిపోతారని చెప్పింది. ఎదుటి వారిని బట్టే తన ప్రవర్తన ఉంటుందని వంశీ చెప్పాడు. మొన్న గేమ్‌లో చాలా మాటలు వదిలారని.. అంటే కూడా అవతలి వారిని బట్టే తన ప్రవర్తన ఉంటుందని చెప్పాడు. ఇంట్లో అందరి కంటే మంచి వ్యక్తి మీరు అని.. అరుపులు తగ్గించుకోమని చెప్పింది.

ముఖేష్ వచ్చి వంశీని నామినేట్ చేశాడు. గేమ్ విషయానికి వస్తే.. గ్రాటిట్యూడ్ విషయానికి వస్తే జీరో అని.. ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త చేశారని చెప్పాడు. మీ గురువుగారు త్రిగుణ్ కారణంగా రూ.40 వేలు సంపాదించావని చెప్పాడు. దీనికి వంశీ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. నీది పెద్ద ఉల్లిగడ్డ తెలివి అని.. పోరా మతిమరుపు అంటూ మాటలు జారాడు. నీలాగా చెల్లిని బయటకు పంపించి కులుకుతున్నాడని వంశీ అన్నాడు. ఇష్టానుసారంగా.. చిరాగ్గా వంశీ మారాడు. పదే పదే చెల్లి చెల్లి అంటూ బయటకు పంపిచావని తీశాడు. నెక్ట్స్ దేబ్జానిని ముఖేష్ నామినేట్ చేశాడు. లెటర్ విషయంలో ప్రాబ్లమ్ ఉంటే తనను అడగాలని.. వర్షిణి దగ్గరకు వెళ్లి అడగమేంటని ప్రశ్నించాడు. తన లెటర్ కట్ చేసిన టైంలో తన బోర్డింగ్ స్కూల్ గుర్తొచ్చిందని.. ఆ రోజు ముఖేష్‌తో మాట్లాడలేదని.. తరువాత మాట్లాడానని చెప్పింది. మీరు చూపిస్తున్నది ఫేక్ పర్సనాలిటీ, టు ఫేస్ పర్సనాలిటి అని చెప్పాడు.

రామకృష్ణ వచ్చేసి ముఖేష్‌ను నామినేట్ చేశాడు. తను అగ్నిపరీక్షలో ఉన్నట్టు ఇక్కడ లేవని అంటున్నావని.. తను అక్కడెలా ఉన్నానో.. ఇక్కడా అలాగే ఉన్నానని చెప్పాడు. తను నీపై ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోలేదని.. నువ్వు ఇన్నోసెంట్ అని అనుకోలేదని మూర్ఖత్వమే ఎక్కువ ఉందని వంశీ చెప్పాడు. ర్యాక్ విషయంలోనే మూర్ఖుడని చెప్పానని అన్నాడు. దేబ్జానిపై కోపం ఉండి ఆమె ర్యాక్స్ గురించి మాట్లాడాడని రామకృష్ణ చెప్పాడు. నీ కోసమే సపోర్ట్ చేశానని కానీ ఇన్నోసెన్స్ కంటే ఫూలిష్ ‌నెసే ఎక్కువగా కనిపిస్తోందని ముఖేష్ అన్నాడు. నెక్ట్స్ నామినేషన్ నీతూని రామకృష్ణ చేశాడు. ఫస్ట్ నుంచి రేషన్ మేనేజర్ కావాలని ఆశ పడ్డావని.. కానీ చారు వేస్ట్ చేశావని.. ఎమోషనల్ అయిపోతున్నావని రామకృష్ణ చెప్పాడు. తనకు ఫ్రిడ్జ్‌లో ఉండేవన్నీ తీయాలని తనకు తెలియదని నీతూ చెప్పింది. తనకు కూడా ఉట్టుట్టి పాయింట్లు చెప్పావని రామకృష్ణ చెప్పాడు. రోహిత్ తనకు నీకన్నా స్ట్రాంగ్ అనిపించాడని అందుకే నీకు ఎగ్జిట్ ఇచ్చానని రామకృష్ణ చెప్పాడు. తన తమ్ముడిని కాపాడుకునేందుకు స్టార్ తీసుకున్నానని నీతూ చెప్పింది.

నరేష్ వచ్చి అమన్‌ను నామినేట్ చేశాడు. హోటల్ టాస్క్‌లో స్టార్ గురించి తనను పిలిచి డబ్బు రెడీ చేసుకో.. స్టార్ ఇస్తానని చెప్పాడన్నాడు. ఆ తరువాత పక్కకు తీసుకెళ్లి రూ.6 వేలు ఇస్తావా? అని రోహిత్ దగ్గరకు వెళ్లి.. అతనికి స్టార్ ఇచ్చేశానని చెప్పావని నరేష్ అన్నాడు. ఆ తరువాత శ్వేతకు ఇస్తానని చెప్పావని నరేష్ అన్నాడు. అప్పుడే రామ్ ప్రసాద్‌తో అమన్ దగ్గరున్న స్టార్‌కు విలువ లేకుండా పోద్ది అని చెప్పానని.. అమన్ చివరకు అలాగే చేశాడని చెప్పాడు. ఫస్ట్ రామ్ ప్రసాద్‌కు ఇవ్వాలనుకున్నానని.. అలాగే ఇచ్చి డబ్బులు తీసుకున్నానని అమన్ చెప్పాడు. ఆ తరువాత నరేష్‌కి ఇవ్వాలనుకున్నానని చెప్పాడు. చివరకు స్టార్ అమ్మాల్సి వస్తే నరేష్‌కే ఇచ్చానని చెప్పాడు. శ్వేతకు ఇవ్వాలనుకుంటే ముందే ఇచ్చి ఉంటే ఎల్లోలోకి వెళ్లేదన్నాడు. మొత్తానికి అమన్ అయితే చాలా మందికి స్టార్ ఇస్తానని కమిట్ అయ్యాడు. చివరకు ఆ స్టార్‌కే వాల్యూ లేకుండా చేశాడు.

నరేష్ రెండవ నామినేషన్.. వర్షిణిని చేశాడు. అల్టిమేట్ గోట్‌లో నీది జరిపితే నాదెందుకు జరుపుతున్నావని అడుగుతున్నావని చెప్పాడు. అలా ఎందుకని.. గేమ్‌లో ముఖేష్ తప్ప ఎవరూ కనిపించలేదని నీ గేమ్ కనిపించలేదని నరేష్ చెప్పాడు. ముగ్గురు సపోర్టర్స్‌లో మాకు సపోర్ట్ చేసేవారు లేరని.. ముఖేష్ బాల్ తీసుకొస్తే అతనిని ఓడించాలన్న ఉద్దేశంతోనే తనది జరిపారని చెప్పింది. మరి శాక్స్ టాస్క్‌లో మీకోసం రామ్ ప్రసాద్ ఓడిపోయాడు కదా.. మరి అతడినెందుకు నామినేట్ చేయడం లేదు? తననెందుకు చేస్తున్నావంటూ వర్షిణి వాలిడ్ పాయింట్ తీసింది. తను కూడా మున్ముందు చేస్తానేమో అన్నాడు. చేయకుంటే అని వర్షిణి అడిగితే.. ఇక్కడ మాట మీద ఉన్నోడు ఎవడున్నాడని నరేష్ అన్నాడు. మొత్తానికి వంశీకి టెంపర్ లేచింది. ఇష్టానుసారంగా మాటలతో రెచ్చిపోయాడు. మరోవైపు శివ్ మరో త్రిగుణ్‌లా మారిపోయాడు. వర్షిణి, ముఖేష్, సుధీర్‌లలో ఎవరిని నామినేట్ చేస్తున్నా.. వెకిలి నవ్వులు.. వెకిలి చేష్టలతో ప్రేక్షకులకు చిరాకు తెప్పించాడు.

Telugu Cinema 360

Recent Posts

“రాధిక ఆప్టే నీకు అసలు సిగ్గుందా..” సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల ఆగ్రహం..!

సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ల తీరు చూస్తుంటే ఆడియన్స్‌కు నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. మొదట్లో అవకాశాల కోసం సౌత్ ఇండస్ట్రీకి…

1 hour ago

Bigg Boss10 Telugu: మరో రోహిత్ అవుతున్న ముఖేష్.. రెడ్ కార్డ్ ఇచ్చేంత తప్పు చేశాడా?

బిగ్‌బాస్ 10 తెలుగు కంప్లీట్‌గా గ్రూప్‌ల మీదే నడుస్తోంది. ప్రస్తుతం అయితే పది మంది ఒక గ్రూప్ అదే త్రిగుణ్…

2 hours ago

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సాయి ధరమ్ తేజ్ పెళ్ళి ఎప్పుడో తెలుసా..?

మెగా అభిమానులకు త్వరలో ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందబోతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలోనే ఓ…

3 hours ago

మారిన సెన్సార్ (CBFC) రూల్స్.. దర్శక నిర్మాతలు గుర్తించుకోండి ఈ పాయింట్స్..!

సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడంలో, టైటిల్స్ ఫిక్స్ చేసి ప్రమోషన్స్ చేసుకోవడంలో మన మేకర్స్ ఎప్పుడూ ముందుంటారు. కానీ…

1 day ago

Bigg Boss10 Telugu: రోహిత్ ఎలిమినేట్..

నిన్న ఝాన్సీ ఎలిమినేట్ అయిన సీన్ నుంచి ఇవాళ్టి షో ప్రారంభమైంది. ఝాన్సీ స్టేజ్‌పైకి వచ్చాక ఆమె జర్నీ చూపించారు.…

1 day ago

ఏంటి గురూజీ ఆదర్శ కుటుంబం కూడా కాపీయేనా..? త్రివిక్రమ్‌పైనే ఎందుకిలా..?

టాలీవుడ్‌లో మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన డైరెక్ట్…

1 day ago