
ఇవాళ (ఆదివారం) హోస్ట్ నాగార్జున చాలా హుషారుగా షోను ప్రారంభించారు. ఇవాళ్టి షోకు షాలిని ఆలస్యంగా వచ్చింది. దీనిలో కొత్తేముంది? అది కామన్ అన్నట్టుగా నాగ్ చెప్పారు. లేటుగా వచ్చినందున షాలినిని కూర్చోమని మిగిలిన వారిని నామినేషన్స్ నుంచి సేవ్ చేసేందుకు నిలబెట్టారు. అవకాశం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తానని.. అమన్ కెప్టెన్సీని లాక్కొన్న వర్షిణి.. అతనికి కెప్టెన్సీ టాస్క్‌లో వెన్నుపోటు పొడవడంపై నాగ్ ప్రశ్నించారు. ఇక నామినేషన్స్ నుంచి వంశీని ముందుగా సేవ్ చేశారు. వంశీకి గ్రాటిట్యూడ్ ఉందా? అని వర్షిణిని నాగ్ అడిగారు. లేదని వర్షిణి చెప్పింది. తమ కోసం కెప్టెన్సీని త్యాగం చేసిన ముఖేష్‌కు ఆయన ఏనాడూ అండగా నిలిచింది లేదని వర్షిణి చెప్పింది. ఆ తరువాత రామ్ ప్రసాద్‌ను కూడా నాగ్ సేవ్ చేశారు. ఆ తరువాత షాలినికి అవకాశం ఇద్దామా? అని రోహిత్‌ను నాగ్ అడిగారు. ఇద్దామని చెబితే.. లేటు వచ్చినా ఇద్దామా? అని అడిగితే అది తప్పేనని రోహిత్ చెప్పాడు. ఆ తరువాత షాలినిని పిలిచారు. ఆమె నామినేషన్స్ నుంచి సేవ్ అవలేదు.

నెక్ట్స్ సండే ఫన్డేలో భాగంగా హౌస్‌మేట్స్‌ను రెండు టీములుగా విభజించారు. ఒక టీమ్‌కు రామ్ ప్రసాద్, మరో టీమ్‌కు నరేష్ కెప్టెన్స్. నాగ్ పిలిచినప్పుడు ఒక్కో టీం నుంచి ఇద్దరు వచ్చి డ్యాన్స్ ఫేస్ ఆఫ్ చేయడం గేమ్. రోహిత్, వంశీ స్టిక్స్‌తో డ్యాన్స్ ఫేస్ ఆఫ్ చేయాలి. వంశీ చాలా బాగా చేశాడు. నెక్ట్స్ షాలిని, నీతూ చీపుర్లతో డ్యాన్స్ చేశారు. నీతూ కొరియోగ్రాఫర్ అయినా కూడా ఆమెకు ఏమాత్రం తగ్గకుండా షాలిని చేసింది. నీతూకి రోహిత్ 10, షాలినికి 8 ఇచ్చాడు. నాగ్ మాత్రం నీతూకి 9, షాలినికి 7 ఇచ్చారు. షాలిని తన బర్త్‌డే అని చెప్పడంతో నాగ్ ఆమెకు విషెస్ చెప్పారు. ఆ తరువాత మోసం చేసిన త్రిగుణ్, మోసపోయిన శివ అని ఇద్దరినీ పిలిచారు. త్రిగుణ్ బాగా చేశాడు. నెక్ట్స్ నరేష్‌తో పసుపు పెట్టించుకున్న దక్షి.. కన్నీరు పెట్టుకున్న దేబ్జాని అంటూ వారిద్దరినీ ఫేస్ ఆఫ్ కోసం నాగ్ పిలిచారు. ఆ తరువాత ముఖేష్, అమన్‌ను పిలిచారు వాళ్లిద్దరూ హీల్స్ వేసుకుని చేయాలి. అమన్ అదరగొట్టాడు. ఝాన్సీని ఎవరు బాగా చేశారని అడిగితే అమన్ అని చెప్పింది. మళ్లీ ముఖేష్‌కు వెన్నుపోటు పొడిచావా? అని నాగ్ ఫన్ చేశారు.

నెక్ట్స్ వర్షిణి, శ్వేత చేశారు శ్వేత చాలా బాగా చేసింది. సుధీర్, ఝాన్సీ, రామకృష్ణలను నాగ్ పిలిచారు. ఈ డ్యాన్స్ చాలా ఫన్నీగా ఉంది. సుధీర్, రామకృష్ణలకు అసలు డ్యాన్స్ రాదు. ఝాన్సీ అంతంత మాత్రమే. ముగ్గురూ కలిసి చాలా ఫన్ చేశారు. ఈ సాంగ్‌ను కాంపిటేషన్‌లో కన్సిడర్ చేయవద్దని నాగ్ చెప్పారు. రామకృష్ణను తప్పు చేయకుండానే తప్పు చేశానని ఎందుకు ఒప్పుకున్నావని అడిగారు. కాళ్లపై ఎందుకు పడ్డావని అడిగారు. తన కారణంగా ఇప్పటి వరకూ అబ్బాయిలు బాధ పడ్డారేమో తెలియదు కానీ అమ్మాయిలు మాత్రం బాధ పడలేదని చెప్పాడు. అందుకే తను అలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఇంకెప్పుడూ అలా చేయవద్దని నాగ్ చెప్పారు. ఆ తరువాత నరేష్ వర్సెస్ రామ్ ప్రసాద్ ఫేస్ ఆఫ్.. ఇద్దర చాలా బాగా చేశారు. ఈ గేమ్‌లో నరేష్ గెలిచారు. ఖాళీ దొరికినప్పుడు అడ్డంగా తిని పడుకోకుండా నరేష్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోమని నాగ్ సరదాగా రామ్ ప్రసాద్‌కు చెప్పారు. నెక్ట్స్ నామినేషన్స్ నుంచి అమన్‌ను సేవ్ చేశారు. టాప్‌లో ఉన్న రోహిత్‌ను లాస్ట్ వరకూ ఉంచడం వెనుక స్ట్రాటజీ ఏంటో అర్థం కాలేదు. మొత్తానికి రోహిత్‌ను తొక్కడమేనని మాత్రం తెలుస్తోంది. టైం దొరికినప్పుడల్లా రోహిత్‌కు ఏదో ఒక కౌంటర్ ఇస్తూనే ఉన్నారు.

స్టార్ ఆఫ్ ది వీక్‌గా అందరూ రామ్ ప్రసాద్‌ను ఎన్నుకున్నారు. రామ్ ప్రసాద్‌కు అమెజాన్ నుంచి గిఫ్ట్ వచ్చింది. అతను తనకు.. మరకరికి గిఫ్ట్ సెలక్ట్ చేసుకోవచ్చంటే రెండూ తనకే రామ్ ప్రసాద్ సెలక్ట్ చేసుకున్నాడు. తరువాత వైల్డ్ ఫైర్స్ ఆట ఎలా ఉందనేది ఓజీలు డిసైడ్ చేస్తారని నాగ్ చెప్పారు. మిరపకాయలు తెచ్చి పెట్టారు. దక్షి తన ఆటను ఇంప్రూవ్ చేసుకోవాలని రోహిత్ చెప్పాడు. ఆర్కే అని ముఖేష్ చెప్పి అతనికి మిర్చి ఇచ్చాడు. దక్షికి షాలిని మిర్చి ఇచ్చింది. వర్షిణి.. రామకృష్ణకు మిర్చి ఇచ్చింది. దక్షికి రామ్ ప్రసాద్ ఇచ్చాడు. రామకృష్ణకు వంశీ, దేబ్జాని మిర్చి ఇచ్చారు. దక్షికి నరేష్, సుధీర్, ఝాన్సీ.. రామకృష్ణకి అమన్.. నీతూకి త్రిగుణ్ మిర్చి ఇచ్చాడు. హయ్యెస్ట్ మిర్చి దక్షికి రావడంతో ఆమె తన క్లారిటీ తను ఇచ్చింది. శివ్ కూడా దక్షికి తను చెప్పానని.. వెజెల్ క్లీనింగ్‌లో మూడు రోజుల పాటు తనే చేసిందని.. రోహిత్‌కు చెప్పాలని చెప్పినా కూడా చెప్పలేదని అన్నాడు. దీంతో ఇంకా ఆలోచించ వద్దని.. మీ ఒపీనియన్ ధైర్యంగా చెప్పమని నాగ్ చెప్పారు. దక్షిని పాట్ బ్రేక్ చేయమని నాగ్ చెప్పారు. దక్షిని రెండు వారాల పాటు డైరెక్ట్ నామినేట్ చేశారు.
నెక్ట్స్ నామినేషన్స్ నుంచి సేవింగ్‌లో భాగంగా రోహిత్‌ను నాగ్ సేవ్ చేశారు. షాలిని, వర్షిణి బోటమ్లో ఉన్నారు. ముఖేష్‌ను లేపి ఇద్దరిలో ఎవరు వెళతారని అడగ్గా.. షాలిని అని ముఖేష్ చెప్పాడు. రోహిత్ వచ్చేసి షాలిని సేవ్ అవుతుందని చెప్పాడు. అమన్‌కు నువ్వు ఎప్పటికీ నా ఫ్రెండ్ అని.. నువ్వు మా పిల్ల అనుకున్నా అనుకోకున్నా షాలిని మనసులో నువ్వు ఎప్పటికీ ఫ్రెండ్‌వే అని చెప్పింది. శ్వేతకు ఐ లవ్ యూ ఫ్రమ్ బోటమ్ ఆఫ్ మై హార్ట్ అని చెప్పింది. ఇక రోహిత్‌కు జాగ్రత్తగా ఉండమని.. ఐలవ్ యూ సో మచ్ అని చెప్పింది. అలాగే ‘చూసుకుని మాట్లాడు కన్నా.. నువ్వు ఏమైనా మాట్లాడితే నేను ఆపడానికి ఉన్నా.. నేను మాట్లాడితే నువ్వు ఆపడానికి ఉన్నావు. ఇక ఇప్పుడు నేను ఉండట్లేదు’ అన్నట్టుగా షాలిని చెప్పింది. రామ్ ప్రసాద్‌ను లేపి హౌస్‌ను ఆర్డర్లో పెడతానన్నావని అక్కడ కుండలేంటని నాగ్ ఫైర్ అయ్యారు. తీసుకెళ్లి లోపల పెట్టేయమని నవ్వుతూ చెప్పారు. ఇక ఎలిమినేషన్ ప్రారంభమైంది. షాలినిని ఎలిమినేట్ చేస్తున్నట్టు నాగ్ చెప్పారు. రోహిత్ ఆమెను హగ్ చేసుకుని ఫస్ట్ టైం బాగా ఏడ్చాడు. కప్పు కొట్టుకుని రమ్మని షాలిని చెప్పింది. వెళ్లేటప్పుడు కూడా అన్నన్ని మాటలు అని పంపిస్తున్నారని రోహిత్ అన్నాడు. ‘ఎవరెన్ని మాటలన్నా.. నువ్వు నా పక్కన నిలిచావు అది చాలు’ అన్నట్టుగా షాలిని చెప్పింది. రామకృష్ణకు ‘నువ్వు నా తమ్ముడవని.. బాగా ఆడమని.. తను మాటలు వదిలిన దానికి సారీ’ అని చెప్పింది.

అందరూ కలిసి షాలినికి హ్యాపీ బర్త్‌డే చెప్పి పంపించారు. అందరితో మంచిగా మాట్లాడి వెళ్లిపోయింది. మిమ్మల్ని బాగా చూసుకున్నాడని.. తను వెళ్లిపోతున్నా కాబట్టి తన వంతు కూడ బాగా చూసుకోమని నీతూకి షాలిని చెప్పింది. ఆ తరువాత షాలిని జర్నీని నాగ్ చూపించారు. వాస్తవానికి సీక్రెట్ రూంకి పంపేలా అయితే జర్నీ వీడియోను చూపించరు. చాలా సహజంగా అనిపించడం కోసం చూపించినట్టుగా ఉన్నారు. తను ఉండాల్సిన ప్లేస్‌లో ఎవరు ఉండాలని నాగ్ అడిగారు. ముందుగా వంశీ పేరు షాలిని చెప్పింది. ఇండివిడ్యువల్ ఒపీనియర్ లేదంటే గేమ్ లేదని.. త్రిగుణ్ పప్పెట్ అని షాలిని చెప్పింది. నాగ్ అప్పుడు ముఖేష్‌తో టాస్క్‌లో చివరి వరకూ వెళ్లాడు కదా అని నాగ్ అడిగారు. అవునని చెప్పింది. హౌస్ డ్యూటీల్లో అని అడిగితే వాటిలోనూ పర్ఫెక్ట్ అని చెప్పింది. తరువాత తన ప్లేస్‌లో సుధీర్ ఉండాలని షాలిని చెప్పింది. దానికి కూడా నాగ్.. తను కెప్టెన్ అయ్యాడు.. నువ్వు అది కూడా కాలేదు కదా అని నాగ్ అన్నారు. నెక్ట్స్ వర్షిణి పేరు చెప్పింది. తను చాలా మంచి అమ్మాయి అని.. గేమ్‌కి దీనికి ముడి పెట్టట్లేదని.. కానీ గేమ్ విషయంలో తను తనకంటే తక్కువని షాలిని చెప్పింది.
రోహిత్ షాలినికి WMIM అని చెప్పాడు. షాలిని కూడా రివర్స్‌లో అతనికి అదే చెప్పింది. ఇంతకీ WMIM అంటే ఏమిటో చెప్పలేదు. బై చెప్పి షాలిని వెళుతుండగా.. నాగ్ వెనక్కి పిలిచారు. తన బ్లెస్సంగ్స్ తీసుకోకుండానే వెళుతున్నావా? అని అడిగారు. వెంటనే వచ్చి నాగ్ బ్లెస్సింగ్స్ తీసుకుంది. విష్ యు హ్యాపీ బర్త్‌డే అని చెప్పి ‘నువ్వు వెళ్లట్లేదు.. సీక్రెట్ రూమ్‌కి వెళుతున్నావు’ అని నాగ్ చెప్పడంతో ఆమె చాలా హ్యాపీ ఫీలైంది. ఇక ఈ వీక్ థీమ్ వచ్చేసి గోట్ (G.O.A.T) అని నాగ్ ప్రకటించారు.
