సినిమా వార్తలు

Bigg Boss10 Telugu: ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే…

బిగ్‌బాస్ 10 తెలుగు ఆసక్తికరంగా నడుస్తోంది. దాదాపుగా వీకెండ్‌కు చేరుకోవడంతో మరికొన్ని గంటల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎలిమినేషన్ అనేది ఊహించడం కాస్త కష్టంగానే ఉంది. ఈ వారం ముఖేష్, వంశీ, అమన్, దేబ్జాని, శివ్, వర్షిణి, నీతూ, సుధీర్ నామినేషన్స్‌లో ఉన్నారు. ముఖేష్ అయితే ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నాడు. అతనికి ఎలాంటి ఇబ్బందీ లేదు.

ఇక ముఖేష్ తర్వాత వంశీ సేఫ్ జోన్‌లో ఉన్నాడు. త్రిగుణ్ నామినేషన్స్‌లో లేకపోవడం అనేది వంశీకి కలిసొస్తున్న అంశం. దీంతో వంశీ ఓటింగ్‌లో టాప్ 2లో కొనసాగుతున్నాడు. ఆ తరువాత అమన్ ఉన్నాడు. వాస్తవానికి అమన్ సెకండ్ ప్లేస్‌లో ఉండాలి. కానీ రోహిత్‌కు వెన్నుపోటు పొడవడం అతనికి ఓటింగ్‌కు అవరోధంగా మారింది.

ఆ తరువాత నీతూ నాలుగో స్థానంలో ఉంది. రోహిత్ ఫ్యాన్స్.. నీతూకి సపోర్ట్‌గా ఉన్నారు. ఇక పోతే శివ్, వర్షిణి, సుధీర్‌పై ప్రస్తుతం ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే శివ్ వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. డబుల్ ఎలిమినేషన్ అయితే వర్షిణి, సుధీర్‌లలో ఒకరు వెళ్లిపోవడం ఖాయం.

ఇప్పటి వరకూ బిగ్‌బాస్ డబుల్ ఎలిమినేషన్ అనే విషయం చెప్పలేదు కాబట్టి సింగిల్ ఎలిమినేషనే ఉండే అవకాశం ఉంది. వీరిలో శివ్ దాదాపుగా వెళ్లిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఓటింగ్ చాలా తక్కువగా పడుతోంది. ఒకవేళ అటు ఇటు అయితే మాత్రం వర్షిణి, సుధీర్‌లలో ఒకరు వెళ్లిపోవడం ఫిక్స్.

శివ్ మంచి గేమర్ కానీ అతని గేమ్ అంతా సైడ్ ట్రాక్‌లో వెళుతోంది. నామినేషన్స్ సమయంలో అతను చేసిన ఓవర్ యాక్షన్ అతనికి ఇబ్బందికరంగా మారింది. ఇక చూడాలి ఈ వారం ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో..

Pranav

Recent Posts

Bigg Boss10 Telugu: ముఖేష్‌పై రివెంజ్ తీర్చుకున్న దేబ్జాని.. త్రిగుణ్‌ని నిలదీసిన నీతూ..

నిన్న ఎక్కడైతే టాస్క్‌లు ఆగిపోయాయో అక్కడి నుంచి బిగ్‌బాస్ షో నేడు తిరిగి ప్రారంభమైంది. త్రిగుణ్ వచ్చేసి గేమ్ ప్రారంభానికి…

21 hours ago

ఓ ఇంటివాడు కాబోతున్న మెగా మేనల్లుడు.. సాయి దుర్గ తేజ్ పెళ్ళి సందడి..!

మెగా అభిమానులకు, టాలీవుడ్ ప్రేక్షకులకు తీపికబురు చెప్పాడు సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్. ఆయన జీవితంలో కొత్త ఇన్నింగ్స్…

1 day ago

Bigg Boss10 Telugu: ఫ్యామిలీ కోసం బిగ్ ఫైట్.. వంశీ, శ్వేత విన్..

నీతూ, వర్షిణి, ముఖేష్.. ముగ్గురూ వంట గురించి చర్చ. తను రసం పాడు చేశానని అందరూ తనపై పడ్డారని.. కానీ…

2 days ago

వీకెండ్ అయిపోయింది.. ఆదర్శ కుటుంబం సిచ్యువేషన్..

వీకెండ్ హడావిడి పూర్తయింది. ఇక బాక్సాఫీస్ దగ్గర అసలు నిజాలు మాట్లాడుకునే సమయం వచ్చేసింది. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు…

2 days ago

జనసేన మరోసారి 100 % స్ట్రైకింగ్.. పురం ఎన్నికల్లోనూ పవన్ ప్రభంజనం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది, అదే పవన్ కళ్యాణ్. ఒకప్పుడు రాజకీయాల్లో ఆయన సైలెంట్ గా…

2 days ago

హ్యాపీ బర్త్ డే టబు.. అప్పుడు పండు.. ఇప్పుడు మహంతి ఝాన్సీ రాణి..!

సిల్వర్ స్క్రీన్ మీద కొన్ని పెయిర్స్ మ్యాజిక్ ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ లో అక్కినేని నాగార్జున,…

3 days ago