సినిమా వార్తలు

Bigg Boss10 Telugu: గంగవ్వలా తయారైన నరేష్.. వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రశంసలే..

గతంలో ఓ సీజన్‌లో గంగవ్వ వచ్చారు. అభిజిత్ విన్నర్ అయిన సీజన్ అది. ఆ సమయంలో ఆమె చేసిందేమీ లేదు. ఆమె వయసుకు ఏమీ చేయలేదనే తెలిసే బిగ్‌బాస్ నిర్వాహకులు తీసుకున్నారు. తరువాత కొన్ని వారాలకు తను ఉండలేనంటూ ఆమె రిక్వెస్ట్ చేసి హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఆమె హౌస్‌లో ఉన్నంత కాలం ఆమెను ఎవరూ ఏమీ అనలేకపోయారు. ఎందుకంటే ఏమైనా అంటే బయట నెగిటివ్ అయిపోతామన్న భయం. ఆమెను ఎవరూ నామినేట్ చేసింది కూడా లేదు. ప్రతివారం ప్రశంసలే. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో నరేష్ విషయంలో కూడా అదే జరుగుతోంది. వాస్తవానికి నరేష్ చేస్తున్నదేమీ లేదు. టాస్క్‌ల్లో విన్ అవుతున్నది కూడా లేదు. అలాగని అతడిని ఎవరూ పెద్దగా నామినేట్ చేసే సాహసం చేయడం లేదు.

ఒకవారం హోస్ట్ నాగార్జునే ఏదో ఒకటి చేసి నామినేషన్స్‌లోకి రమ్మని నరేష్‌కు సలహా ఇచ్చారు. ఎందుకంటే నామినేషన్స్‌లోకి రాకుంటే సడెన్‌గా ఎప్పుడైనా వస్తే ఎలిమినేట్ అవుతావని.. దీంతో నెక్ట్స్ వీక్ ఎలాగోలా నామినేషన్స్‌లోకి వచ్చాడు. అప్పుడు కూడా అతనికి బిగ్‌బాస్ తనను సేవ్ చేయమంటూ ప్రేక్షకులను నిత్యం అడిగే అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం హౌస్‌లోకి వచ్చిన వారంతా కూడా నరేష్‌కు డప్పు కొట్టడమే. ఇక హోస్ట్ నాగార్జున అయితే నరేష్ కారణంగానే బిగ్‌బాస్ నడుస్తుందన్నట్టుగా బిల్డప్ ఇచ్చేస్తున్నారు. అయితే ఇటీవల నామినేషన్స్ కోసం వచ్చిన చరణ్ మహాదేవ్ మాత్రం అతడు సినిమాలో ‘అందరూ చెబుతుంటే నువ్వేదో అందంగా ఉన్నావని ఫీల్ అవుతున్నావు కానీ నువ్వేమంత అందంగా లేవు’ అని డైలాగ్ చెప్పి.. నరేష్‌కు అందరూ ప్రశంసించడం వలన గొప్పగా ఫీలవుతున్నావని నీ గేమ్ ఏమీ లేదని చెప్పాడు. అది అక్షరాలా నిజం. కానీ అది చెబితే బయట తామెక్కడ నెగిటివ్ అవుతామోనని వెళ్లిన వాళ్లంతా భజన చేస్తున్నారు. మొత్తానికి నరేష్ నక్క తోక తొక్కినట్టున్నాడు. ఎక్స్‌పైరీ డేట్ ఎప్పుడో అయిపోయినా హౌస్‌లో కాలం గడిపేస్తున్నాడు.

Telugu Cinema 360

Recent Posts

బాక్సాఫీస్ దగ్గర రామాయణ ప్రభంజనం.. పుష్ప 2 ఆల్ టైమ్ రికార్డ్స్ ఔట్..

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఎక్కడ చూసినా రామాయణ సినిమా పేరే గట్టిగా వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్…

26 minutes ago

భోగి ఈవెంట్స్‌లో అనుపమ పరమేశ్వరన్ మిస్సింగ్.. అసలు కారణం ఇదేనా?

టాలీవుడ్‌లో ఏదైనా క్రేజీ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుందంటే ప్రమోషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా హీరో,…

11 hours ago

Bigg Boss10 Telugu: శ్వేత, నీతూ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారంటే..

బిగ్‌‌బాస్ 10 తెలుగు మరో నాలుగు వారాలే ఉంది. ఇదిలా ఉండగా గతవారం హౌస్ నుంచి నీతూ ఎలిమినేట్ అయ్యింది.…

17 hours ago

Bigg Boss10 Telugu: అదరగొట్టిన రీతూ, డెమాన్… త్రిగుణ్‌తో రీతూ గొడవ

కప్ కడిగే విషయమై ముఖేష్‌కు అమన్‌కు గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ‘వినరా మబ్బేష్.. అందరికీ రూల్ ఒకటేరా మబ్బు,…

19 hours ago

Bigg Boss10 Telugu: నేడు షో మొత్తం ముఖేష్ చుట్టూనే.. నోరు జారిన దేబ్జాని

సార్ట్ చేసుకుని సాల్వ్ చేసుకునే దానికి ఎందుకు పెద్దగా చేసుకుంటున్నావని ముఖేష్‌ను వర్షిణి అడిగింది. అంతకు ముందు హోస్ట్ నాగార్జున…

3 days ago

Bigg Boss10 Telugu: అన్ని భాషల్లోనూ విజయ్‌కు ఐలవ్యూ చెప్పానన్న రష్మిక… నీతూ ఎలిమినేట్

ఇవాళ షోను సింపుల్‌గా హోస్ట్ నాగార్జున ప్రారంభించారు. నామినేషన్స్‌లో ఉన్నవారిలో దేబ్జానిని ముందుగా సేఫ్ చేశారు. కృష్ణార్జునులా.. శకుని, దుర్యోధనులా…

3 days ago