కప్ కడిగే విషయమై ముఖేష్‌కు అమన్‌కు గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ‘వినరా మబ్బేష్.. అందరికీ రూల్ ఒకటేరా మబ్బు, గబ్బు.. గబ్బుగాడివి ఉన్నావు’ అని అమన్ రెచ్చిపోయాడు. సుధీర్ వచ్చి వయసు చూసి మాట్లాడమని అమన్‌కు హితవు చెప్పాడు. అయినా వినే పరిస్థితి లేదు. సొంత బుద్ధి లేదని త్రిగుణ్ చెప్పినట్టుగా ఫాలో అవుతున్నాడని వర్షిణి.. ముఖేష్‌కు చెప్పింది. ప్రొటీన్ పోగొట్టుకుని కాఫీ పౌడర్ దాచి మాటలు పడుతున్నానని శివ అన్నాడు. తన ప్రొటీన్ ఎవరు తీసుకున్నారనేది తాను ఇకపై అడగనని.. వీకెండ్‌లో నాగ్ సర్ వచ్చి వీడియో వేసి చూపిస్తారని శివ ెప్పాడు. ఈ క్రమంలోనే శివకు త్రిగుణ్‌కు చిన్న గొడవ జరిగింది. నెక్ట్స్ హౌస్‌లోకి డెమాన్ పవన్ వచ్చాడు. అంతా ఒక్కడివే వచ్చావా? అని అడిగారు. ఆ తరువాత అంతా బాగా ఆడుతున్నారని కానీ అంతే మిస్టేక్స్ చేస్తున్నారని హౌస్‌మేట్స్ అందరితో డెమాన్ చెప్పాడు. మిమ్మల్ని ఇష్టపడే వారిని మీరే ద్వేషించేలా చేస్తున్నారని చెప్పాడు. ఆ తరువాత రీతూ చౌదరి ఎంట్రీ ఇచ్చింది.
అమన్‌కు లేటుగా స్టార్ట్ చేశావని డెమాన్ చెప్పాడు. ఆర్కే మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నామని చెప్పాడు. లాస్ట్ కెప్టెన్ లేడీ అవ్వాలని చెప్పాడు. రీతూ వచ్చేసి ముఖేష్‌కు నిన్ను అమ్మాయిలు, అమ్మలు పిచ్చి పిచ్చిగా ఇష్టపడుతున్నారని.. నోరు కాస్త అదుపులో పెట్టుకోమని రీతూ చెప్పింది. టెంపర్ వంశీ.. నామినేషన్స్‌లో బాగా మాట్లాడుతున్నాడని.. కుకింగ్ బాగా చేస్తున్నాడని చెప్పింది. రీతూ షో చూసి వచ్చినట్టుగా అనిపించలేదు. నరేష్‌కు చూడటానికి ఇంత ఉంటావని.. కాన్ఫిడెన్స్ లెవల్స్ నెక్ట్స్ లెవల్ అని చెప్పింది. ఎవరైనా లోలో ఉంటే వారి కోసం నిలబడిపోతావని రీతూ చెప్పింది. త్రిగుణణ దూత అంటూ అతనికి మంచి బూస్ట్ ఇచ్చింది. ముందుగా పవన్, రీతూలు ఫేస్ ఆఫ్ చేశారు. దీని కోసం ఆర్కేను డెమాన్.. వర్షిణిని రీతూ ఎంచుకుంది. డెమాన్, ఆర్కే బాగా చేశారని హౌస్‌మేట్స్ అంతా చెప్పారు. నెక్ట్స్ త్రిగుణ్, వంశీ వచ్చి ఫేస్ ఆఫ్ చేశారు. ‘నాటు నాటు’ సాంగ్‌కు ఇద్దరూ డ్యాన్స్ ఇరగదీశారు. తరువాత సుధీర్, నరేష్ వచ్చి చేశారు. సుధీర్ చాలా ఫన్నీగా చేశాడు. సుధీర్‌ను విన్నర్‌గా ప్రకటించారు.
దేబ్జాని, ముఖేష్ వచ్చి డ్యాన్స్ చేశారు. నెక్ట్స్ రామ్ ప్రసాద్, అమన్ వచ్చి డ్యాన్స్ చేశారు. త్రిగుణ్‌ని ముఖేష్ ఎదురుగా నిలబెట్టి పొగడమన్నారు. అప్పుడు త్రిగుణ్.. ‘‘నీ కళ్లు చాలా బాగుంటాయి. నువ్వు గేమ్‌లో ఆడతావు చాలా బాగా ఆడతావు. మీ అక్క ఫోటో వచ్చినప్పుడు నాకు చాలా నచ్చింది. నీకు చాలా అభిమానం వచ్చింది. దానిని నీవు నిలబెట్టుకోవాలని ఓ బ్రదర్‌గా ఆశిస్తున్నా’’ అని చెప్పాడు. ముఖేష్, దేబ్జానిలలో చెరొకరిని ఎంచుకుని టాస్క్ ఆడాలని బిగ్‌బాస్ చెప్పడంతో డెమాన్ వచ్చేసి దేబ్జానిని.. రీతూ వచ్చి ముఖేష్‌ను ఎంచుకుంది. ఈ టాస్క్‌కు త్రిగుణ్ సంచాలక్. బీభత్సమైన ఫైట్ జరిగింది. దేబ్జాని, రీతూ.. డెమాన్, ముఖేష్ మధ్య బీభత్సమైన ఫైట్ జరిగింది. అయితే ముఖేష్ బాల్ తీసుకెళ్లి స్విమ్మింగ్‌పూల్‌లో వేశాడు. ఫస్ట్ రౌండ్‌లో ఎవరికీ పాయింట్స్ రాలేదు. తన నెక్ట్స్ దేబ్జాని గట్టిగా పట్టుకుందని రీతూ చెప్పింది. ఈ రౌండ్‌లో ఎవరు గెలిచారని చెప్పండని వర్షిణిని తప్ప అందరినీ త్రిగుణ్ అడిగాడు. దీనిపై రీతూ అబ్జెక్ట్ చేసింది. వారందరూ దేబ్జాని సపోర్టర్స్ అని వాళ్లు ఆమెకు అనుగుణంగానే చేతులు లేపుతారంటూ గొడవకు దిగింది. సంచాలక్ మీరు కాబట్టి మీ డెసిషన్ చెప్పాలని రీతూ చెప్పింది.
సెకండ్ రౌండ్ ప్రారంభమైంది. ఈ రౌండ్‌లో ముఖేష్, రీతూ గెలిచారు. మూడో రౌండ్‌లో దేబ్జాని, డెమాన్ గెలిచారు. డెమాన్, రీతూ, దేబ్జాని, ముఖేష్ గేమ్ చూడాల్సిందే. ప్రాణం పెట్టి ఆడారు. రీతూ, డెమాన్ వెళ్లాక త్రిగుణ్, నరేష్.. వాళ్ల గేమ్ గురించి మాట్లాడుకుంటున్నారు. గేమ్ చాలా బాగుందని చర్చించుకున్నారు. ఆతరువాత రామ్ ప్రసాద్, నరేష్ ఇద్దరూ కెప్టెన్సీ గురించి మాట్లాడుకున్నారు. నువ్వు, దేబ్జాని ఉంటే ఎవరిని చేయాలని నరేష్.. రామ్ ప్రసాద్‌ను అడిగితే దేబ్జానినే చేయాలని చెప్పాడు. ఆ తరువాత హౌస్‌లోకి శోభ, తేజ ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్ ఫ్యాన్‌గా ప్రతి సీజన్ చూస్తానని.. ఈ సీజన్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉందని తేజ చెప్పాడు. బేసిగ్గా చాలా మంది వచ్చి ఎన్నో చెబుతారని.. అవేమీ వినకుండా ఆడాలని చెప్పాడు. టాప్ 5 ఇప్పటి వరకూ డిసైడ్ కాలేదని చెప్పాడు. అందరికీ ఛాన్స్ ఉందని చెప్పాడు. బేసిగ్గా ఈ హౌస్‌లో క్రియేట్ అయ్యే బాండ్స్ జెన్యూన్ అని తేజ చెప్పాడు. బ్యాండ్స్ తెచ్చారు. ఎవరితో అయితే బయటకు వెళ్లాక కూడా బాండ్ కంటిన్యూ చేయాలనుకుంటే ఆ బ్యాండ్ తొడగాలని చెప్పాడు.
వర్షిణి వచ్చే ముఖేష్‌కు బ్యాండ్ తొడిగింది. ఈ బాండ్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందని చెప్పింది. సుధీర్‌కు లీస్ట్ బాండింగ్ అని బ్యాండ్ తొడిగింది. రామ్ ప్రసాద్.. దేబ్జానికి బ్యాండ్ తొడిగాడు. నా బెస్ట్ సెల్ఫిష్ చెల్లి అని చెప్పాడు. లీస్ట్ బాండింగ్ శివతోనేనని చెప్పాడు. వంశీకి త్రిగుణ్ తొడిగాడు. మిత్ర ద్రోహం ఒప్పుకోనని వర్షిణికి బ్యాండ్ తెంపాడు. ముఖేష్ వచ్చేసి వర్షిణికి బ్యాండ్ తొడిగాడు. సుధీర్ వచ్చినప్పటి నుంచి సుధీర్ ఎన్నో చెప్పాడని.. అలాంటి సుధీర్‌తో తనకు బయట ఫ్రెండ్షిప్ వద్దని చె్పాడు. దేబ్జాని వచ్చేసి రామ్ ప్రసాద్‌కు బ్యాండ్ తొడిగింది. ముఖేష్‌కు బ్యాండ్ కట్ చేసింది. ఆ తరువాత రామ్ ప్రసాద్, ముఖేష్‌తో పాటు ఇప్పటి వరకూ ఏ ఛాలెంజ్‌లోనూ పాల్గొనని సభ్యులకు కూడా కంటెండర్స్‌గా అవకాశం ఇస్తున్నానని బిగ్‌బాస్ చెప్పారు. ఇప్పటి వరకూ కంటెండర్స్‌గా నిలవని 8మందిలో ఒక్కొక్కరిని సెలక్ట్ చేసుకుని గేమ్ ఆడాలని తేజ, శోభకు బిగ్‌బాస్ చెప్పారు. ఇక తేజ వచ్చేసి నరేష్‌ను ఎంచుకోగా.. అమన్‌ను శోభ ఎంచుకుంది. ఈ టాస్క్‌లో అమన్, శోభ గెలిచారు. దీంతో నరేష్ చాలా బాధ పడ్డాడు. రామ్ ప్రసాద్, దేబ్జాని ఇద్దరూ అతనికి ధైర్యం చెప్పారు. ఆ తరువాత తేజ, శోభ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. తను ఎలా ఆడాలని బిగ్‌బాస్‌ను వర్షిణి అడిగింది. తను ఆడతానని చెప్పినా కూడా శోభ, తేజ తనకు ఛాన్స్ ఇవ్వలేదని చెప్పింది. కనీసం రేపు వచ్చే వాళ్లకైనా తనతో ఆడాలని చెప్పింది.
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఎక్కడ చూసినా రామాయణ సినిమా పేరే గట్టిగా వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్…
గతంలో ఓ సీజన్‌లో గంగవ్వ వచ్చారు. అభిజిత్ విన్నర్ అయిన సీజన్ అది. ఆ సమయంలో ఆమె చేసిందేమీ లేదు.…
టాలీవుడ్‌లో ఏదైనా క్రేజీ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుందంటే ప్రమోషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా హీరో,…
బిగ్‌బాస్ 10 తెలుగు మరో నాలుగు వారాలే ఉంది. ఇదిలా ఉండగా గతవారం హౌస్ నుంచి నీతూ ఎలిమినేట్ అయ్యింది.…
సార్ట్ చేసుకుని సాల్వ్ చేసుకునే దానికి ఎందుకు పెద్దగా చేసుకుంటున్నావని ముఖేష్‌ను వర్షిణి అడిగింది. అంతకు ముందు హోస్ట్ నాగార్జున…
ఇవాళ షోను సింపుల్‌గా హోస్ట్ నాగార్జున ప్రారంభించారు. నామినేషన్స్‌లో ఉన్నవారిలో దేబ్జానిని ముందుగా సేఫ్ చేశారు. కృష్ణార్జునులా.. శకుని, దుర్యోధనులా…