సినిమా వార్తలు

Biggbogss10 Telugu: నామినేషన్స్‌లో వంశీ, శివ్ రచ్చ.. దేబ్జాని బిహేవియర్ వరస్ట్..

నిన్నటి నామినేషన్స్‌కు కంటిన్యూగా నేడు వర్షిణిని షాలిని నామినేట్ చేసింది. వర్షిణి ఇన్‌హ్యూమన్ అంటూ రోహిత్‌ను అన్నదానికి షాలిని నామినేట్ చేసింది. వర్షిణికి హ్యుమానిటీ లేదంటూ నామినేట్ చేసింది. ముఖేష్‌ను నామినేట్ చేసే దమ్ముందా? అని అడిగావని.. దానికి దమ్మెందుకు? అని షాలిని అడిగింది. తన టీమ్ మెంబర్‌ని సేవ్ చేయడానికి వచ్చానని చెప్పింది. సింపతి డ్రామా అని షాలిని… ఇద్దరిని పక్కనబెట్టుకుని ఆడుతున్నావని షాలిని చెప్పింది. షాలిని బ్యాక్ బిచ్చింగ్ స్టార్ అని వర్షిణి చెప్పింది. తనకు ఎల్లో కార్డు రాలేదని చెప్పింది. ‘నీ పైకి వచ్చే ఇంట్రస్ట్ లేదులే’ అంటూ త్రిగుణ్ నోరు జారాడు. మొత్తానికి వర్షిణి నామినేట్ అయ్యింది. ఆ తరువాత దేబ్జాని వచ్చి షాలినిని నామినేట్ చేసింది. వేరొక వ్యక్తి ఆట ఆడుతున్నావని.. ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతున్నావని చెప్పింది. తను సంచాలక్‌గా ఉన్నప్పుడు వార్న్ చేసినా వినలేదని చెప్పింది. లాస్ట్ కొన్ని వీక్స్‌గా కన్ఫ్యూజ్ అవుతున్నావని నామినేట్ చేసింది.

రోహిత్ తను ఒక టీంలో ఉన్నాము కాబట్టి ఓ స్ట్రాటజీ చెప్పాడని అది తను ఫాలో అయ్యానని.. అది వర్కవుట్ అయితే బాగుందని చెప్పింది. మీకు నచ్చినట్టు ఉంటే ఓకే.. లేదంటే మీరు దానిని యాక్సెప్ట్ చేయరని దేబ్జానికి చెప్పింది. ‘నీ నామినేషన్‌లో పస లేదు’ అని షాలిని చెప్పింది. రోహిత్ అక్కడ ఉన్నప్పుడు ‘ఛీ.. థు’ దేబ్జాని అన్నదని షాలిని చెప్పింది. దేబ్జాని ఆ సమయంలో చాలా యారోగెంట్‌గా బిహేవ్ చేసింది. బ్రూటల్లీ వయోలెన్స్ చేస్తావని చెప్పింది. దేబ్జాని బిహేవియర్ చాలా వరస్ట్‌గా చేసింది. నెక్ట్స్ రామ్ ప్రసాద్‌ను దేబ్జాని చేసింది. మీరు వేసే పంచ్‌లు కొందరిని హర్ట్ చేస్తున్నాయని చెప్పింది. కేవలం ఒక వీక్.. ఒక స్ట్రాంగ్ నామినేషన్ దేబ్జాని చేసింది. దీని వెనుక షాలినిని నామినేషన్‌లోకి తీసుకురావడమే మెయిన్ లక్ష్యం. వర్షిణి, సుధీర్ ఇన్‌ఫ్లూయెన్స్ అవలేదా? ఎందుకు తనను మాత్రమే అడుగుతున్నారని.. వర్షిణి ఎప్పుడూ ముఖేష్‌తోనే గడుపుతుందని కానీ అది మీకు కనిపించడం లేదా? అని శివ్‌ని వర్షిణి నిలదీసింది. ప్రతి ఒక్కరూ మీ గురించే మాట్లాడుతున్నారంటే ఆలోచించుకోమని శివ్ చెప్పాడు. బయటి నుంచి చూసి గేమ్ ఆడటం లేదని మీరెలా చెబుతున్నారని రోహిత్ ప్రశ్నించాడు.

బ్రిక్స్ టాస్క్‌లో తాను బాగా ఆడానని షాలిని నానా గొడవ చేసింది. నిన్న తను హర్ట్ అయ్యిందని తెలిసిన వెంటనే వచ్చి సారీ చెప్పానని చాలా రూడ్‌గా చెప్పానని చెప్పింది. మధ్యలో సంబంధం లేని దానిలోకి వంశీ వచ్చాడు. ‘నిన్న బుర్ర లేని వ్యక్తి నీతో తిరుగుతాడు’ అని అన్నాడని.. అదేంటంటే సారీ చెప్పాడని వంశీ చెప్పాడు. దానిలో తప్పేముంది? తప్పు అనుకున్న వెంటనే సారీ చెప్పాను.. దానిలో తప్పేముందని రోహిత్ అడిగాడు. వంశీ సోది అని ఇష్టానుసారంగా మాట్లాడటంతో రోహిత్ ఫైర్ అయ్యాడు. సారీ చెప్పాక కూడా ఆ పాయింట్ వంశీ తీయడం దారుణం. ఇష్టానుసారంగా వంశీ మాటలు జారాడు. అన్నం పెట్టి దెప్పుతావని రోహిత్.. అన్నం పడేస్తావని వంశీ ఇద్దరూ మాటలు జారారు కానీ సంబంధం లేని దానిలోకి వచ్చి ముందుగా ఇష్టానుసారంగా మాటలు జారింది మాత్రం వంశీయే. అతనే గొడవను చాలా పెద్దది చేశాడు.

ఆ తరువాత వంశీకి నామినేట్ చేసే అవకాశం వచ్చింది. వంశీ వచ్చేసి షాలినిని నామినేష్ చేశాడు. మనుషులను హ్యుమిలియేట్ చేయకని చెప్పాడు. ఎఫ్ వర్డ్ అన్నావని చెప్పాడు. నైట్ పడుకున్నాక హౌస్ హార్మోనీ డిస్ట్రర్బ్ అవుతోందని.. ఎన్ని సార్లు వార్నింగ్ వచ్చినా కరెక్ట్ చేసుకోవడం లేదన్నాడు. వందమంది ఉన్నా నీ గొంతే వినిపిస్తుంది. ఇంక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏంటని షాలిని అడిగాడు. అన్నం కోసం అక్కడి వారు అలమటిస్తున్నారని.. అలాంటిది అన్నం పడేయడం తనకు నచ్చలేదని చెప్పింది. చీప్ అంటే మీకు హ్యుమిలియేషన్ అనిపించిందని.. మీ పక్కనున్నవాడు ఆడంగోడు అని మాట్లాడుతుంటే అది హ్యుమిలియేషన్ అనిపించలేదా? అని వంశీ అన్నది. వంశీ.. షాలినిని ఇమిటేట్ చేసి మరీ చూపించాడు. ‘నేను తప్ప హౌస్‌లో ఎవరూ హ్యుమిలియేట్ చేయలేదా?’ అంటే చేయలేదని చెప్పాడు. రామ్ ప్రసాద్ చేసిందేంటని అడిగింది. దానికి వంశీ దగ్గర ఆన్సర్ లేదు. నెక్ట్స్ ముఖేష్‌ను ఒక వీక్ పాయింట్‌తో వంశీ నామినేట్ చేశాడు. దీంతో షాలిని నామినేట్ అయ్యింది. తనకు చెప్పిన పాయింట్స్ వాలిడ్ అనిపించాయా? పర్సనల్‌గా నా పేరు చెప్పావా? అని రామకృష్ణను షాలిని అడగడంతో.. పర్సనలా? అన్నట్టుగా అతను బ్లాంక్ ఫేస్ పెట్టాడు. పర్సనల్ అన్నాడు అంటూ అతనిపై కూడా నింద వేసేసింది. తనలా అనలేదని రామకృష్ణ చెబుతున్నా వినిపించుకోలేదు.

కొందరికి నామినేట్ చేసే అవకాశం లేదు కాబట్టి మరోసారి వారికి నామినేట్ చేసే అవకాశం బిగ్‌బాస్ ఇచ్చాడు. త్రిగుణ్ వచ్చేసి రోహిత్‌ను నామినేట్ చేశాడు. అమన్ స్ట్రాంగ్ ప్లేయర్ అని అతనికి బ్రెయిన్ ఇచ్చేదే రోహిత్ అని చెప్పాడు. రోహిత్ ఏదైనా అనాలసిస్ చేస్తాడని.. అది ఓవర్ బోర్డ్ అవుతుందని చెప్పాడు. తన చుట్టూ ఉన్న ముగ్గురూ ఇప్పుడు లేరని చెప్పాడు. షాలిని గేమ్ కూడా నాశనం చేస్తాడని త్రిగుణ్ చెప్పాడు. అపూర్వ తన ఫ్యామిలీ గురించి మాట్లాడానని తను చెప్పాను కానీ అది ఫస్ట్ తీసిందే రోహిత్ అని త్రిగుణ్ చెప్పాడు. కానీ హోస్ట్ నాగార్జునతో రోహిత్, తను ఎన్నో మాటలు అనుకుంటాం కానీ ఎప్పుడూ ఫ్యామిలీ జోలికి ఎవరూ వెళ్లలేదని చెప్పాడు. అదే త్రిగుణ్ ఇప్పుడు ఆ మాట అనడం దారుణం. అపూర్వ ఉన్నన్ని రోజులు ఆమెను దారుణంగా మాట్లాడి ఏడిపించాడని.. ఆమె నడుము గురించి కూడా మాట్లాడాడని అలాంటి త్రిగుణ్ సింపతి యాంగిల్ తీస్తున్నాడని రోహిత్ చెప్పాడు. రోహిత్ అండ్ గ్యాంగ్ రొట్ట గ్యాంగ్ అని.. నువ్వు చేసిన పనుల కారణంగానే నీ పక్కనున్న వారంతా బయటకు వెళ్లిపోయారని త్రిగుణ్ చెప్పాడు. అసలు త్రిగుణ్ అనేవాడు లేకుంటే రోహితే లేడని చెప్పాడు. మొత్తానికి రోహిత్ నామినేట్ అయ్యాడు.

నెక్ట్స్ నామినేట్ చేసే అవకాశం అమన్‌కు వచ్చింది. వర్షిణిని నామినేట్ చేశాడు. బిగ్‌బాస్ హౌస్‌లో మేల్, ఫిమేల్ లేదని.. తను గెలిచిన తర్వాత ఆడవాళ్లపై గెలిచి ఈ సంబరాలేంటో అన్నదని.. అలా నువ్వు గెలిచి ఉంటే అలా చేసేదానివా? అని అమన్ అడిగాడు. ‘నువ్వు నన్ను అలా పట్టుకున్నావు.. నాకసలు నచ్చలేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వర్షిణి సింపతి డ్రామా మొదలు పెట్టింది. ఇక్కడ తను ఎవ్వరికీ చెప్పలేదని.. ఇంకా తనకు ఆ బాధ ఉందని చెప్పింది. వర్షిణి నామినేట్ అయ్యింది.

నెక్ట్స్ నామినేట్ చేసే అవకాశం నరేష్‌కు వచ్చింది. నరేష్ వచ్చేసి రోహిత్‌ను చేశాడు. పోయినసారి తనను నామినేట్ చేస్తూ చరణ్‌తో కంపేర్ చేస్తే తను పెద్దగా ఆడలేదని అన్నావని.. తను ఆడిన గేమ్స్ అన్నీ చెప్పుకొచ్చాడు. చరణ్‌ను అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారని అన్నాడు. మీరు మొన్న చరణ్ పేరు రాసి మీరైనా ఎంకరేజ్ చేయవచ్చు కదా? అని ప్రశ్నించాడు. మీవాడిపై మీకే లేకుంటే మాకెలా ఉంటుందని ప్రశ్నించాడు. నరేష్ వచ్చేసి చాలా వాలిడ్ పాయింట్స్ చెప్పాడు. మీ గేమ్ డౌన్ అవుతోందని చెప్పి నామినేట్ చేశాడు. ఇంట్లో అందరితో కంపేర్ చేస్తే నీ ఆటే బాగోలేదని చెప్పాడు. లీస్ట్‌లో ఎవరూ లేరా? అని ప్రశ్నిస్తే.. బయట ఉన్నారు.. వెళ్లి వాళ్లతో మాట్లాడుకోపో అని సెటైర్ వేశాడు. షాలినికి ఎందుకు ఓటు వేశాడో రోహిత్ చెప్పాడు. మధ్యలో శివ్ వచ్చి అందరూ అందుకే నామినేట్ చేశారని.. మీరు ఇంత చెప్పాల్సిన అవసరం లేదని శివ్ చెప్పాడు. వాస్తవానికి శివ్‌కు ఈ విషయంలో అవసరమే లేదు. మధ్యలో వెళ్లి కామ్‌గా వెళుతున్న దానిని గొడవ చేశాడు. మొత్తానికి రోహిత్ మరోసారి నామినేట్ అయ్యాడు.

ఈ వారం రోహిత్‌ను నామినేషన్ వంశీ, అమన్, వర్షిణి, రోహిత్, షాలిని నామినేట్ అయ్యారు. నామినేట్ చేయడంలో విఫలమైన సభ్యులు నేరుగా నామినేట్ అవుతారని బిగ్‌బాస్ ముందే చెప్పారు. అలా రామ్ ప్రసాద్, ఝాన్సీ ఉండటంతో కెప్టెన్‌గా ఉన్న సుధీర్‌ను అడగటంతో సుధీర్.. రామ్ ప్రసాద్‌ను నామినేట్ చేశాడు. రామ్ ప్రసాద్‌ను బిగ్‌బాస్ చైర్‌లో కూర్చోమనగానే తన చైర్‌లో కూర్చొన్నాడు. నామినేషన్ చైర్‌లో అని అంతా బాగా నవ్వుకున్నారు. మొత్తానికి నామినేషన్ లిస్ట్‌లో రామ్ ప్రసాద్ కూడా చేరిపోయాడు.

చరణ్ ఫస్ట్ నుంచి ఉండి ఉంటే తను చరణ్‌కే ఓటు వేసేవాడినని.. సెకండ్ ఛాన్స్ రావడంతో ఫస్ట్ నుంచి ఉన్న షాలినికి ఓటు వేసినట్టుగా చెప్పాడు. అది షాలినిని హర్ట్ చేసింది. అలా ఎందుకు చేశావంటూ నిలదీసింది. రోహిత్ కోపంతో వెళ్లిపోయాడు. షాలిని ఈ వారం ఎలిమినేట్ అయితే ఓకే కానీ లేదంటే రోహిత్ ఆట గోవింద. వాస్తవానికి లైవ్‌లో షాలిని చాలా పెద్ద గొడవ చేసింది. నీతూపై రెచ్చిపోయింది. కానీ షోలో అది చూపించలేదు. మరోవైపు తమకు సంబంధం లేకున్నా కూడా వంశీ, శివ్ నామినేషన్స్ మధ్యలోకి వెళ్లి నానా రచ్చ చేశారు. శివ్ స్ట్రాటజీ ఏంటో ఏమీ అర్ధం కావడం లేదు కానీ సెలబ్రిటీలకైతే ఫుల్ సపోర్ట్‌గా ఉంటూ వస్తున్నాడు. ఇక చూడాలి మున్ముందు ఎవరెలా మారుతారో..

Telugu Cinema 360

Recent Posts

అక్కినేని కోడలి గ్లామర్ షోపై ఫ్యాన్స్ గుర్రు.. శోభిత బికినీ ఫోటోషూట్ వివాదంలో తప్పెవరిది..?

టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత మళ్లీ కొత్త జీవితాన్ని…

8 hours ago

Bigg Boss 10 Telugu: షాలిని రచ్చ.. రామకృష్ణ కాళ్లు పట్టుకుని సారీ.. వైల్డ్ ఫైర్స్‌కు షాకిచ్చిన ఓజీలు!

ఇవాళ్టి షో కూడా గొడవలతోనే నడిచింది. అది కూడా మొత్తంగా షాలిని చేసిన రచ్చతో. నిన్న ముఖేష్‌ను నామినేట్ చేయవద్దని…

20 hours ago

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సెన్సార్ రివ్యూ.. ప్లస్ ఏంటి.. మైనస్ ఏంటి..?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన రణబాలి అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్…

2 days ago

అవకాశం ఇస్తాను పడుకుంటావా అని అడిగాడు.. హీరోయిన్ సంచలనం..!

సినిమా ఇండస్ట్రీ అంటేనే బయటికి ఎంతో గ్లామర్‌గా కనిపిస్తుంది. పేరు, ప్రఖ్యాతలు, డబ్బు అన్నీ ఒక రేంజ్‌లో ఉంటాయి. కానీ…

2 days ago

శ్రీకాంత్ కూతురు మేధ హీరోయిన్‌గా సక్సెస్ అవుతుందా..?

టాలీవుడ్‌లో హీరోల కొడుకులు ఎంట్రీ ఇవ్వడం, స్టార్‌లుగా ఎదగడం చాలా కామన్. వారసత్వం అనగానే అందరి దృష్టి వెంటనే కొడుకుల…

2 days ago

Biggboss10 Telugu: మరీ చిల్లరగా మారిన షాలిని.. ఈవారం ఎలిమినేట్ అవుతుందా?

బిగ్‌బాస్ 10 తెలుగు.. వైల్డ్ కార్డ్స్ వచ్చి ఇచ్చిన హింట్స్‌తో సెలబ్రిటీలంతా ఆట మార్చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమ ఆట…

2 days ago