విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన రణబాలి అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ కంటే ముందే ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఒక్క కట్ కూడా చెప్పకుండా U/A సర్టిఫికెట్ ఇవ్వడమే. ఇది నిజంగా అందరికీ చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ లోనే ఒక రేంజ్ లో వయోలెన్స్ చూయించారు. రక్తం ఏరులై పారే యాక్షన్ సీన్స్ తో పాటు డైలాగుల్లో కూడా బోలెడన్ని బూతులు వినిపించాయి. మామూలుగా అయితే ఇలాంటి సీన్స్ కు సెన్సార్ బోర్డ్ కత్తెర పడటం ఖాయం. కానీ ఆశ్చర్యకరంగా రణబాలి ఆ సెన్సార్ కత్తెర నుంచి చాలా ఈజీగా బయటపడింది. సినిమాలో ఆ వయోలెన్స్ అంతా ఎమోషన్ కు కరెక్ట్ గా సింక్ అవ్వడం వల్లే బోర్డ్ మెంబర్స్ కట్స్ చెప్పలేదని, ఇది సినిమాకు చాలా ప్లస్ అవుతుందని ఒక టాక్ అయితే నడుస్తుంది.
ఇక సినిమా ఇన్ సైడ్ టాక్ విషయానికి వస్తే, ఓవరాల్ గా సినిమా బాగానే వర్కవుట్ అయిందనే పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఒక మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే సినిమా స్లో నెరేషన్. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ ఫస్టాఫ్ లో అసలు కథలోకి వెళ్లడానికి చాలా ఎక్కువ టైమ్ తీసుకున్నాడని తెలుస్తోంది. క్యారెక్టర్స్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి, స్టోరీ బ్యాక్ డ్రాప్ ను సెట్ చేయడానికి ఫస్టాఫ్ అంతా కాస్త నెమ్మదిగా సాగుతుందనే ప్రచారం సాగుతుంది. అయితే కథ స్లోగా ఉన్నప్పటికీ, సినిమాలోని డీటైలింగ్ మాత్రం అదరగొట్టిందని చెబుతున్నారు. అప్పటి పరిస్థితులను, ఆ విజువల్స్ ను స్క్రీన్ మీద చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. కానీ మనకు ముందే తెలిసిన ఒక చారిత్రక కథను ఇలా కాస్త స్లోగా చెప్పడమే రణబాలికి పెద్ద మైనస్ అయిందనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ ఆడియన్స్ కు ఈ స్లో పేస్ ఏమాత్రం వర్కౌట్ అవుతుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
కానీ సెకండాఫ్ లో మాత్రం సినిమా రేంజ్ ఒక్కసారిగా మారిపోతుందని తెలుస్తోంది. ముఖ్యంగా కథలో అసలైన తిరుగుబాటు మొదలైన తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్ లో వర్కవుట్ అయ్యాయంటున్నారు. ఆ తిరుగుబాటు ఎపిసోడ్స్ ఆడియన్స్ కు మంచి గూస్ బంప్స్ ఇస్తాయని టాక్. అయితే ఇక్కడే మరో చిన్న చిక్కు కూడా వచ్చి పడింది. ఈ చారిత్రక నేపథ్యం, ఆ తిరుగుబాటు సీన్స్ చూస్తుంటే ప్రేక్షకులకు వెంటనే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా కచ్చితంగా గుర్తుకు వస్తాయని తెలుస్తుంది. రెండు సినిమాల థీమ్ ఒకేలా అనిపించడం వల్ల, పదే పదే సైరా షేడ్స్ కనిపించడం ఈ సినిమాకు కొంత మైనస్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. అప్పటికే చూసిన ఫీలింగ్ కలిగితే ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవ్వలేరు కాబట్టి, ఈ కంపారిజన్ నుంచి రణబాలి ఎలా బయటపడుతుందనేది చూడాలి.
ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే, విజయ్ దేవరకొండ తన యాక్టింగ్ తో అదరగొట్టేసాడనే మాట సెన్సార్ మెంబర్స్ నుంచి కూడా గట్టిగా వినిపిస్తోంది. రణబాలి క్యారెక్టర్ లో విజయ్ అగ్రెసివ్ నెస్, ఎమోషన్ సినిమాను నిలబెడతాయని అంటున్నారు. అలాగే రష్మిక మందన్న కూడా తన పాత్రకు 100 శాతం న్యాయం చేసిందని టాక్. మమ్మీ విలన్ వోస్లో పాత్ర కూడా అదిరిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. టెక్నికల్ గా చూసుకుంటే, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్-అతుల్ అందించిన మ్యూజిక్ చాలా కొత్తగా ఉందని, సినిమా మూడ్ ను బాగా ఎలివేట్ చేసిందని చెబుతున్నారు. మొత్తానికి 2.50 గంటల భారీ నిడివితో రణబాలి సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంత పెద్ద రన్ టైమ్ ఉన్న సినిమా ఆడియన్స్ ను బోర్ కొట్టించకుండా ఏ రేంజ్ లో మెప్పిస్తుంది, బాక్సాఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ అకౌంట్ లో ఎలాంటి హిట్ వేస్తుందో చూడాలిక.
టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత మళ్లీ కొత్త జీవితాన్ని…
ఇవాళ్టి షో కూడా గొడవలతోనే నడిచింది. అది కూడా మొత్తంగా షాలిని చేసిన రచ్చతో. నిన్న ముఖేష్‌ను నామినేట్ చేయవద్దని…
నిన్నటి నామినేషన్స్‌కు కంటిన్యూగా నేడు వర్షిణిని షాలిని నామినేట్ చేసింది. వర్షిణి ఇన్‌హ్యూమన్ అంటూ రోహిత్‌ను అన్నదానికి షాలిని నామినేట్…
సినిమా ఇండస్ట్రీ అంటేనే బయటికి ఎంతో గ్లామర్‌గా కనిపిస్తుంది. పేరు, ప్రఖ్యాతలు, డబ్బు అన్నీ ఒక రేంజ్లో ఉంటాయి. కానీ…
టాలీవుడ్లో హీరోల కొడుకులు ఎంట్రీ ఇవ్వడం, స్టార్లుగా ఎదగడం చాలా కామన్. వారసత్వం అనగానే అందరి దృష్టి వెంటనే కొడుకుల…
బిగ్‌బాస్ 10 తెలుగు.. వైల్డ్ కార్డ్స్ వచ్చి ఇచ్చిన హింట్స్‌తో సెలబ్రిటీలంతా ఆట మార్చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమ ఆట…