Menu
BREAKING
ఫ్లాప్ వాళ్లను ఆపలేదు.. రూట్ మార్చేలా చేసింది.. కుర్రాళ్ళూ జాగ్రత్త..!   |   లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు.. ది ట్రెండ్ సెట్టర్..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..   |   Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..   |   సాయి ధరమ్ తేజ్ కష్టాన్ని దోచేస్తున్నారా.. సంబరాల ఏటిగట్టు మళ్ళీ వాయిదా..?   |   చిరంజీవి టాక్ షో.. గెటప్ మార్చేస్తున్న బాస్.. ఎలా ఉండబోతుందో తెలుసా..?   |   రాజమౌళి కోసమే.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాపై మహేష్, తారక్ రివ్యూ..!   |   భయపెడుతున్న వారణాసి బిజినెస్.. రిలీజ్‌కు ముందే 1000 కోట్లు ఏంటి స్వామి..?   |   ఆ అగ్ర నిర్మాత చేతికి జైలర్ 2 రైట్స్.. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్ సడన్‌ ఎంట్రీ..!   |   Biggboss10 Telugu: ఎవరూ తగ్గట్లే.. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్లదే…   |   Biggboss10 Telugu: ఝాన్సీ గ్రాఫ్ పడగొట్టుకుంటోందా? ఇలా అయితే కష్టమే..   |   బాలయ్య కోసం రేసులో ఇద్దరు దర్శకులు.. కొరటాల సినిమా ఆగిపోయిందా..?   |   Biggbogss10 Telugu: ఫైర్ లేని నామినేషన్స్.. ఇదే తొలిసారి..   |   Biggboss10 Telugu: వామ్మో ఈ గొడవలేంటి? ఒకటా.. రెండా.. ప్రతిదీ రచ్చే..   |   ఇదెక్కడి దిక్కు మాలిన కథ.. ఇదెక్కడి సినిమా.. కీర్తి సురేష్‌కు ఏమైంది..?

Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..

Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..

ఇవాళ (శనివారం) నాగార్జున కంటెస్టెంట్స్‌ను చెడుగుడు ఆడుకున్నారు. కంట్రోల్ చేయకుంటే ఇబ్బంది అవుతుందని గ్రహించినట్టున్నారు. అందరినీ కంట్రోల్ చేశారు. శుక్రవారం ఏం జరిగిందో నాగార్జున చూపించారు. శుక్రవారమైతే పెద్దగా కంటెంట్ ఏమీ లేదు. కెప్టెన్ బాత్రూం దగ్గర జరిగిన చిన్న గొడవ తప్ప. ఇక రెండు ప్రమోషనల్ టాస్క్‌లు ఆడించారు. ఆ తరువాత నాగ్ కంటెస్టెంట్స్ ముందుకు వచ్చారు. అసలు హౌస్‌లో ఏం జరుగుతోందని ఎంట్రీతోనే ఫైర్ అయ్యారు. అమన్, త్రిగుణ్, రోహిత్‌లను గార్డెన్ ఏరియాలోకి పంపించారు.

రామ్ ప్రసాద్‌ని లేపి.. ‘నిన్ను నామినేషన్స్ గురించి డిస్కస్ చేయవద్దని చెప్పాను.. ఎందుకు డిస్కస్ చేశావు’ అని నాగ్ అడిగారు. నామినేషన్స్ సమయంలోనే చేయవద్దని అన్నారేమో అనుకున్నట్టుగా రామ్ ప్రసాద్ చెప్పాడు. అందుకే ‘నిన్ను కన్నింగ్ అనేది’ అని చెప్పారు. తనకు యాక్సిడెంట్‌లో మెడకు దబ్బ తగిలిందని ఎక్కువసేపు నిలబడితే ప్రాబ్లం అవుతుందని రామ్ ప్రసాద్ చెప్పాడు. అది ఎందుకు చెప్పలేదని నాగ్ అడిగారు. ఇది హౌస్‌లో ఎవరికీ తెలియకూడదనే అలా చెప్పినట్టుగా రామ్ ప్రసాద్ చెప్పాడు.

వాట్ ద ఎఫ్ ఈజ్ హ్యాపెనింగ్ అని షాలినిని నాగ్ అడిగారు. ఆమె అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వలన ట్రిగర్ అయ్యానని చెప్పింది. ఇవన్నీ రికార్డెడ్.. బయటకు వెళ్లనివ్వరని అన్నావా? అని అడిగారు. దాని గురించి ప్రస్తుతం ఎంత చెప్పినా తప్పే అవుతుందని షాలిని చెప్పింది. ‘మీ మాట తీరు మార్చుకోకుంటే ఆడియెన్స్ మిమ్మల్ని డిసైడ్ చేస్తారు. ప్రతిక్షణం ఆడియెన్స్ చూస్తున్నారు’ అని నాగ్ చెప్పారు. అంత గట్టిగా అరుస్తూ చెప్పాల్సిన అవసరం ఏముందని నాగ్ ప్రశ్నించారు. ఆట తీరు మార్చుకోమని చెప్పారు. తను ఆ వర్డ్ ఆడినందుకు సారీ చెప్పింది. సృష్టి, షాలిని ఏం మాట్లాడుకుంటుంటే విన్నావు… ఏం చూసి రోహిత్‌కు చెప్పావని నాగ్ అడిగారు. మరోసారి సరిగా వినకుండా ఇలాంటివి రిపీట్ చేయవద్దని చెప్పారు. వీడియో చూపించి తను, రోహిత్ మాట్లాడుకుంటుంటే అపూర్వ వచ్చిందని అప్పుడెందుకు అంతలా గొడవ చేశావని ప్రశ్నించారు. ఆడియెన్స్ అసహ్యించుకుంటే నీకే ప్రాబ్లమ్ అవుతుందని చెప్పారు.

Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..

అమన్‌ను హౌస్‌లోకి పిలిచారు. డ్యాగర్స్ కోసం ఇష్యూ అయ్యిందని అమన్ చెప్పాడు. నెక్ తిప్పాడని.. అబ్యూజింగ్ వర్డ్స్ త్రిగుణ్ వాడటంతో గొడవ జరిగిందని చెబుతుండగా.. నాగ్ చెప్పింది చాలు.. జస్టిఫై చేసింది చాలని సీరియస్‌గా ఆపేశారు. అమన్‌కు నాగ్ ఎల్లో కార్డు ఇచ్చారు. మరోసారి ఎల్లో కార్డు చూపించే పరిస్థితి వస్తే బయటకు పంపిస్తానని నాగ్ చెప్పారు. ఓ వీడియో ప్లే చేసి ఎందుకు అమన్‌కు ఎల్లో కార్డు ఇవ్వాల్సి వచ్చిందో నాగ్ చూపించారు. అది చూసి ఇక మీదట జాగ్రత్తగా ఆడతానని చెప్పాడు. బిగ్‌బాస్‌లో టాస్క్ ఆడుతున్నావా? బస్తీలో ఏదైనా కుస్తీ ఆడుతున్నావా? అని నాగ్ అడిగారు. అమన్ మాట్లాడిన మాటలు కరెక్టా? అని ఝాన్సీ అడిగితే.. అమన్ కోపంలో మాటలు జారుతున్నాడని చెప్పింది. తనను త్రిగుణ్.. ఎల్ వర్డ్ వాడాడని చెప్పాడు. అందుకే తను అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని తెలిపాడు. త్రిగుణ్ కోపంలో కూడా కంట్రోల్ చేసుకుని ఆగాడని.. నువ్వు కంట్రోల్ తప్పావని అమన్‌కు నాగార్జున క్లాస్ తీసుకున్నారు. అక్కడ జరగుతున్న దానికి మన రియాక్షన్ మన క్యారెక్టర్‌ని డిసైడ్ చేస్తుందని నాగ్ చెప్పారు. ట్రిగర్ చేస్తే ట్రిగర్ అవుతావా? అని అడిగారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున.. ఝాన్సీని మెచ్చుకున్నారు. ఇలా ఎవరైనా నోరు జారితే కంట్రోల్ చేస్తున్నావని ప్రశంసించారు. ఈ వారం ఆట బాగా ఆడావని.. కెప్టెన్సీ గెలిచింది నువ్వని.. అది గుర్తు పెట్టుకోమని అమన్‌కు చెప్పారు.

ముఖేష్‌ను లేపారు.. ఏంటి నువ్వు దాన్ని మెయిన్‌టైన్ చేస్తున్నావా? అని అడిగారు. అంటే లీడర్‌షిప్‌ను మెయిన్‌టైన్ చేస్తున్నావా? అని అడగబోయి అలా అడిగానని చెప్పానని ముఖేష్ చెప్పాడు. దాన్ని మరోలా అడగవచ్చు కదా అన్నారు. జనాల్లో నీ స్థాయి కిందకు పడిపోతుందని నాగ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో చూపించారు. దేబ్జానిని లేపి ముఖేష్ అన్నది.. కెప్టెన్సీ గురించా? అని అడిగారు. దేబ్జాని పాజిటివ్‌గా మాట్లాడితే.. ‘నీకు తెలిసినట్టుగా ముఖేష్ జనాలకు తెలియదు కదా’ అని కూర్చోబెట్టారు. పెద్దదో వైపు.. చిన్నదో వైపు అనడం కరెక్టా? అని నాగ్ అడిగారు. దీనికి సంబంధించిన వీడియో ప్లే చేసి చూపించారు. ఝాన్సీని లేపి మీ అన్నయ్య మాట్లాడిన మాటలు కరెక్టా? అని అడిగారు. తప్పేనని తను అప్పుడే చెప్పానని అన్నారు. వర్షిణిని లేపి ఏం చేయాలంటే.. సారీ చెప్పాలని చెప్పింది. ముఖేష్ సారీ చెప్పాడు. ‘నువ్వు మాట జారితే జనాలు నిన్ను కింద పడేస్తారు’ అని చెప్పారు. ముఖేష్ ఆట గురించి మాట్లాడుతూ.. ‘నీ ఆట ఎంత బాగుందంటే.. నీ కాళ్లకు మొక్కేంత ఉంది’ అని నాగ్ చెప్పారు. దీని గురించి తెలియాలంటే కెప్టెన్ వర్షిణితో సెపరేట్‌గా మాట్లాడమని చెప్పారు.

దేబ్జానిని లేపి చాలా బాగా ఆడావని చెప్పారు. ఫజిల్‌లో తాను చీటింగ్ చేయలేదని దేబ్జాని చెప్పింది. దీంతో వీడియో చూపిస్తాననగానే ‘ఐలవ్ యూ’ అంటూ దేబ్జాని గారాలు పోయింది. తను ఎంత ముద్దుగా మాట్లాడినా వీడియో చూపించకుండా ఆగనన్నారు. సంచాలక్‌గా ఉన్న త్రిగుణ్ చీటింగ్ చేసిన వీడియోను చూపించారు. వంశీని లేపి ఇమ్యూనిటీ సాధించావని చెప్పారు. దీని వలన హౌస్‌కు నీపై ఉన్న ప్రేమ తెలుస్తోందన్నారు. సృష్టి ఎంత మారావు.. ఎంత బాగా ఆడుతున్నావని నాగ్ పొగిడారు. ఆట అలా పెంచుకుంటూ పోతున్నావని ప్రశంసించారు. సుధీర్‌ను లేపి ఈ యాంగిల్ నీలో ఉందని తనకు తెలియదని.. బాగా ఆడావని ప్రశంసించారు. అందుకే ఇమ్యూనిటీ సాధించావని చెప్పారు. సృష్టి గురించి మాట్లాడుతుంటే తనకు చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు. చరణ్‌ను ‘నీ గురించి మాట్లాడటానికి ఏమీ లేదని చెప్పారు. నువ్వు హౌస్‌లోకి ఎందుకు వచ్చావో తెలియలేదు.. ఇంప్రూవ్ యువర్ గేమ్’ అని చెప్పారు.

Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..

ఆ తరువాత త్రిగుణ్‌ను హౌస్‌లోకి నాగ్ పిలిచారు. తనకు కోపం కారణంగా నోరు జారబోయి కంట్రోల్ చేసుకున్నానని చెప్పాడు. ఆ వీడియోను నాగ్ చూపించారు. ‘నీ నుంచి ఇలాంటిది ఎక్స్‌పెక్ట్ చేయలేదు’ అని నాగ్ చెప్పారు. రోహిత్‌ను ఆడంగోడు అనడంపై కూడా ప్రశ్నించారు. కాండ్రించి ఉమ్మేసిన వీడియోను చూపించాడు. అవతలి వాళ్లు ఇన్‌స్టిగేట్ చేస్తే అయిపోతావా? అని అడిగారు. షాలినిని లేపి ‘నిన్ను సపోర్ట్ చేయడానికి వాడాను అంటున్నాడు. అది కరెక్టా?’ అని నాగ్ అడిగితే అది తప్పని చెప్పింది. త్రిగుణ్ అనేవాడు మైండ్ గేమ్ ఆడుతాడు.. మైండ్‌లో చాలా స్ట్రాంగ్ అనుకునేవారు.. దీని తర్వాత మైండ్ గేమా.. తొక్కా కంట్రోల్‌లో ఉండడనే భావన జనాల్లో వచ్చిందని నాగ్ చెప్పారు. తనను ట్రిగర్ చేయడంతో అలా చేశానని చెప్పాడు. తనను పదే పదే గుచ్చడంతో అలా చేయాల్సి వచ్చిందన్నాడు. త్రిగుణ్‌కి కూడా నాగ్ ఎల్లో కార్డ్ ఇచ్చారు. ఇదే ఫైనల్ వార్నింగ్ అని చెప్పారు. ఇంకోసారి వార్నింగ్స్ ఉండవని చెప్పారు. ఇంకోసారి రిపీట్ అవదని త్రిగుణ్ చెప్పాడు.

ఇప్పుడు తాను చెప్పబోయేది హౌస్‌లో ఉన్నవారంతా జాగ్రత్తగా వినాలని చెప్పారు. బిగ్‌బాస్‌కు డోర్స్ ఓపెన్ చేయమని చెప్పారు. ఈ హౌస్‌లో ఉన్నవాళ్లందరూ ఆట తీరును రెస్పెక్ట్ చేశాకే లోపలికి వచ్చారని నాగ్ చెప్పారు. ఇప్పుడు తను చూపించబోయే క్లిప్ ఆడియెన్స్ చూడలేదన్నారు. చరణ్, రోహిత్ మాట్లాడుకుంటున్న వీడియో అది. ఈ వీకెండ్ లోపు నీకు రెడ్ కార్డు ఇవ్వకుంటే చూడరా అని చరణ్ అనగానే రోహిత్ వెంట్రుక పీకి చూపించాడు. రోహిత్‌ను అడగ్గానే తను షోను విమర్శించలేదని.. చరణ్‌ను టాంట్ చేస్తూ అన్నట్టుగా ఉందన్నాడు. అపూర్వను అడిగితే రెడ్ కార్డు చూపిస్తారురా అని చరణ్ అన్నప్పుడు రోహిత్ అలా చూపించడం రెడ్ కార్డుకే కనెక్ట్ అవుతుందని చెప్పింది. అంటే బిగ్‌బాస్ ‘నన్నేమీ పీకలేడురా’ అన్నట్టే ఉంది కదా అని నాగ్ అన్నారు. బిగ్‌బాస్ గురించి కాదనేవారు చేయి లేపాలని నాగ్ అడిగారు. అప్పుడు షాలిని, చరణ్ చెయ్యెత్తారు. షాలినిని లేపి అడిగితే బిగ్‌బాస్ గురించి చరణ్ అలా మాట్లాడడని చెప్పింది. ఆడియెన్స్ అంతా కూడా బిగ్‌బాస్ గురించే మాట్లాడాడన్నట్టుగా చేయి లేపారు. నీలాంటి వ్యక్తుల కోసం ఈ ఇల్లు లేదని నాగ్ చెప్పారు. ఇంటిని వదిలేసి వెళ్లమని చెప్పారు. రోహిత్ మాట్లాడుతూ.. ఎవరినీ డిస్‌రెస్పెక్ట్ చేయాలని కాదని చెప్పాడు. చరణ్‌ని ఏడిపిస్తూ చేసిందని చెప్పాడు. అలాంటప్పుడు చరణ్.. రెడ్ కార్డు అని ఎందుకు అన్నాడని అడిగారు. చరణ్ లేచి తననే అన్నాడని చెప్పాడు. ఆడియెన్స్‌లో ఒకరు చరణ్ కవర్ చేస్తున్నాడని చెప్పారు.

‘బిగ్‌బాస్ నిన్నేమీ పీకలేరు అనుకున్నావుగా.. నిన్ను పీకి చూపిస్తారు’ అని నాగ్ చెప్పారు. తను షో కానీ.. బిగ్‌బాస్ రిలేటెడ్ కాదని రోహిత్ చెప్పాడు. అది మిస్ కమ్యూనికేషనా? మిస్టేకా? అని నాగార్జున పదే పదే అడిగినా కూడా మిస్ కమ్యూనికేషన్ అని రోహిత్ చెప్పాడు. బిగ్‌బాస్‌కి, ఆట పట్ల రెస్పెక్ట్ చూపించకుంటే గేట్లు ఓపెన్ ఉన్నాయి.. బయటకు వెళ్లమని చెప్పాడు. నాగ్‌కి, బిగ్‌బాస్‌కి రోహిత్ క్షమాపణ చెప్పాడు. ఒక్క ఛాన్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తనకు తెలుసని.. ఒక్క మిస్టేక్‌తో జీవితం తలకిందులవుతుందని నాగ్ చెప్పి రోహిత్‌కు ఎల్లో కార్డు ఇచ్చారు. ఇలాంటిది టాలరైట్ చేయమని.. ఇదే ఫైనల్ వార్నింగ్ అని నాగ్ చెప్పారు. రోహిత్‌కు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరినీ రెస్పెక్ట్ చేయడం నేర్చుకోమని చెప్పారు. సమాజంలో కొందరిపైన చిన్న చూపు ఉందని దానితో అర్థమైందని చెప్పారు. బయట అయితే కొట్టేసేవాడినని అంటున్నావని.. నువ్వంత పోటుగాడివా? అని నాగ్ అడిగారు. సృష్టి చేతికి దెబ్బ తగిలిన వీడియోను నాగ్ చూపించారు. తను తన చెయ్యి అంటున్నా కూడా వినకుండా ఎందుకు అలా చేశావని అడిగారు. అపూర్వ పడిపోతుంటే ఎక్కడో ఉన్నవాడివి పరిగెత్తుకొచ్చావని.. అపూర్వకు ఉన్న విలువ సృష్టిపై లేదా? అని ప్రశ్నించారు.

మొత్తానికి రోహిత్‌కు ఈవారం కూడా అందరి కంటే ఎక్కువగా డోస్ పడింది. త్రిగుణ్‌కి ఎల్లో కార్డు ఇచ్చారనే కానీ.. అతను చేసినవి చాలా వరకూ హైడ్ చేశారు. ఇక ముఖేష్‌ను అయితే చాలా లైట్ తీసుకున్నారు. పైగా చాలా గొప్ప గేమ్ ఆడి తన వాళ్లను సేవ్ చేసుకున్నాడంటూ ప్రశంసలు కూడా కురిపించారు. వర్షిణిని ఇవాళైతే ఏమీ అనలేదు. మరి రేపు ఏమైనా అంటారేమో చూడాలి. ఇక రోహిత్‌కు ప్రతి వారం ఓవర్‌గా క్లాస్ తీసుకోవడం.. బయట అతనికి బాగా కలిసొస్తోంది. ఇది అతనిపై బయట సింపతి గెయిన్ అయ్యేలా చేస్తోంది. ఈ విషయాన్ని బిగ్‌బాస్ టీం ఎందుకు గ్రహించడం లేదో అర్థం కాలేదు. ఈరోజు హౌస్‌కి మూడు ఎల్లో కార్డులు ఇవ్వాల్సి వచ్చిందని అది తనకు ఇష్టం లేదని నాగ్ చెప్పి షో ముగించారు.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360