సినిమా వార్తలు

Biggboss 10 Telugu: కృష్ణుడు ఎలిమినేట్.. బెస్ట్ ప్లేయర్ ముఖేష్..

ఇవాళ్టి (ఆదివారం) షోకి హోస్ట్ నాగార్జున రాగానే తన తండ్రి జయంతి సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావును గుర్తు చేసుకున్నారు. నిన్న ఆగిపోయిన మ్యానిప్యులేటర్ అండ్ పప్పెట్ గేమ్ ఆడించారు. నరేష్ వచ్చేసి త్రిగుణ్‌ని మ్యానిప్యులేటర్ అని.. వంశీ పప్పెట్ అని చెప్పాడు. షాలిని బిగ్‌బాస్ రూల్స్ ఫాలో అవడం లేదని నరేష్ నామినేట్ చేశాడు కదా.. రామ్ ప్రసాద్ కూడా రూల్స్ ఫాలో అవడం లేదని మరి ఆయన్ను ఎందుకు నామినేట్ చేయలేదని నాగార్జున అడిగారు. షాలినికి బిగ్‌బాస్ వార్నింగ్ ఇవ్వడం వలనే తనలా చేయాల్సి వచ్చిందని నరేష్ చెప్పాడు. షాలినిని కూడా లేపి అడిగారు. అమన్‌ని అడిగితే మేకప్ వల్ల లేటు అవుతోందని మేకప్ బంద్ చేయాలని చెప్పాడు. నెక్ట్స్ వీక్ కూడా అలాగే చేస్తే వారం పాటు షాలినికి మేకప్ బంద్ అని నాగ్ చెప్పారు. వంశీ వచ్చేసి వర్షిణి మ్యానిప్యులేటర్ అని.. సుధీర్ పప్పెట్ అని చెప్పాడు. దేబ్జాని మాట్లాడిన దానిలో నీకు నచ్చనిదేంటని వంశీని నాగ్ అడిగారు. తనను స్టెరాయిడ్ అని అన్నదని అదే బాధనిపించిందని వంశీ అన్నాడు. దేబ్జాని సారీ చెప్పింది. దేబ్జాని కొన్ని ‘చిల్లర’ మాటలు మాట్లాడుతోందని అవి తగ్గించుకోవాలని దేబ్జానికి నాగ్ చెప్పారు.

వంశీని మొన్నటి కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో త్రిగుణ్‌కి ఫేవర్ చేశావా? అని అడిగారు. ఆట మీద ఫోకస్ పెట్టాలని.. అవతలి వాళ్లు అదెందుకు చేస్తున్నారో అర్థం చేసుకోమని నాగ్ చెప్పారు. ఆడుతున్న వాళ్లు నీకేమైనా కంప్లైంట్ చేస్తే అది తప్పు కాదని నాగ్ చెప్పారు. ఆ తరువాత నామినేషన్స్ నుంచి రోహిత్‌ను సేవ్ చేశారు. తరువాత అమన్‌.. వర్షిణి మ్యానిప్యులేటర్ అని.. సుధీర్ పప్పెట్ అని చెప్పాడు. అమన్‌ని నీ లక్ష్యమేంటని నాగ్ అడిగితే యాక్టర్ అవ్వాలని ఉందని చెప్పాడు. సృష్టిని ఒక ఇంటి దాన్ని చేయాలనేదే నీ గోల్ అని ఎందుకు చెప్పావని నాగ్ ఫన్నీగా అడిగారు. సరదాగా అన్నట్టుగా అమన్ చెప్పాడు. ముఖేష్ వచ్చేసి.. త్రిగుణ్ మ్యానిప్యులేటర్ అని.. వంశీ పప్పెట్ అని చెప్పాడు. నెక్ట్స్ నామినేషన్స్ నుంచి వర్షిణిని సేవ్ చేశారు. సుధీర్ వచ్చేసి త్రిగుణ్ మ్యానిప్యులేటర్ అని.. వంశీ పప్పెట్ అని చెప్పాడు.సుధీర్‌ని తను కనిపించడం లేదని.. సృష్టితో కనెక్ట్ అయితే కనిపిస్తానా? అని త్రిగుణ్‌ని అడిగావా? అని నాగ్ ప్రశ్నించారు. దానికి అడిగానని సుధీర్ చెప్పాడు. ఫస్ట్ వీక్ తను త్రిగుణ్‌కి పప్పెట్టేనని కూడా చెప్పాడు.

మాస్టర్ మ్యానిప్యులేటర్.. మాస్టర్ పప్పెట్ హౌస్‌లో ఉన్నారని.. వారిలో ముఖేష్ మ్యానిప్యులేటర్ అని.. వర్షిణి పప్పెట్ అని త్రిగుణ్ చెప్పాడు. ప్లేసెస్ మారాయని నాగ్ అన్నారు. త్రిగుణ్ ఆటను పూర్తిగా తన చుట్టూ తిప్పుకుంటున్నాడని.. అగ్రెసివ్‌గా ఫ్రంట్ ఫుట్‌లో ఆడుతున్నాడని.. ఈ విషయం రోహిత్ ఒక్కడికే అర్థమైందని నాగ్ చెప్పారు. రోహిత్ కూడా త్రిగుణ్ గురించి తనకు పూర్తిగా అర్థమైందని.. అందరికీ తాను అతను చెప్పేది వినమని.. కానీ మీ గేమ్ మీరు ఆడాలని చెబుతున్నట్టుగా రోహిత్ చెప్పాడు. త్రిగుణ్ గురించి నరేష్ చాలా బాగా చెప్పాడు. త్రిగుణ్ ఏదో చేస్తున్నాడని మీరంతా భ్రమ పడకండి.. తన గేమ్ తను ఆడుతున్నాడని నరేష్ చెప్పాడు. బ్రేక్‌లో త్రిగుణ్ గురించి అంతా మాట్లాడుకున్నారు. త్రిగుణ్‌ను మహాభారతంలోని శకునితో ముఖేష్ పోల్చాడు. రోహిత్ కూడా తనకు త్రిగుణ్ అనగానే వచ్చిన ఫస్ట్ పేరు శకుని అని రోహిత్ చెప్పాడు. తను షాలినికి చాలా సార్లు ఈ మాట చెప్పాడట. టు వీక్స్ పాటు త్రిగుణ్‌ని నామినేట్ చేయవద్దని రామ్ ప్రసాద్.. ముఖేష్, రోహిత్, నరేష్, సుధీర్‌లకు చెప్పాడు.

త్రిగుణ్.. ఎంతసేపూ అమ్మాయిలతోనే కూర్చుంటాడని చెబుతున్నావు.. మరి అమ్మాయిలు కూడా పని చేయడం లేదా? అని అడిగితే వాళ్లు పని చేస్తున్నారని కానీ ముఖేష్ మాత్రం పని చేయట్లేదన్నాడు. ఒకరు మాత్రం అతని మాట వినట్లేదన్నావు.. ఆ ఒకరు ఎవరని అడగ్గా ఝాన్సీ అని త్రిగుణ్ చెప్పాడు. పేర్లు తీయకుండా బాగా చెబుతున్నావని నాగ్ ప్రశంసించారు. ఆ తరువాత నామినేషన్స్ నుంచి త్రిగుణ్‌ని సేవ్ చేశారు. హౌస్‌మేట్స్‌ని రెండు టీమ్స్ కింద ఫామ్ చేసి.. సండే ఫన్‌డేలో భాగంగా గేమ్ ఆడించారు. రోహిత్‌ను లేపి ‘మాయాబజార్’ సినిమా చూశావా? అని అడిగారు. చూశానని చెప్పడంతో మాయాబజార్‌లో ఒక అల్టిమేట్ సీన్ ఉంటుంది. ప్రియదర్శిని ఓపెన్ చేస్తే తనకు ఇష్టమైన వారు కనిపిస్తారు. కృష్ణుడు ఓపెన్ చేస్తే శకుని కనిపించాడని.. అంటే కృష్ణుడికి అత్యంత ఇష్టమైన వాడు శకుని అని నాగ్ పేర్కొన్నారు. అంతకు ముందు ముఖేష్, రోహిత్‌ల మధ్య జరిగిన కాన్వర్సేషన్ గురించి నాగ్ చెప్పారు. రోహిత్.. కృష్ణుడని.. అతనికి ఇష్టమైన శకుని త్రిగుణ్ అన్నట్టుగా చెప్పారు.

ఒక టీమ్‌ ఏ, బిలుగా విభజించారు. టీమ్ ఏలో ఫస్ట్ సింగింగ్.. ఎవరు పాడతారంటే.. ఝాన్సీ లేచి ‘చమ్కీల అంగీలోడే’ పాట పాడింది. టీమ్ బి నుంచి త్రిగుణ్, అమన్ లేచి బిగ్‌బాస్ మీద పాట పాడారు. చాలా బాగా బాణీలు కట్టి పాడారు. తరువాత టీమ్ ఏ నుంచి ముఖేష్, దేబ్జాని ఓ పాటకు డ్యాన్స్ చేశారు. టీమ్ బి నుంచి చరణ్, వర్షిణి డ్యాన్స్ చేశారు. నామినేషన్స్ నుంచి సుధీర్‌ని సేవ్ చేశారు. ఆ తరువాత కృష్ణుడు, సృష్టిని యాక్టివిటీ రూమ్‌కి పిలిచి ఓ అవర్ గ్లాస్ సాయంతో సృష్టి సేఫ్ అయినట్టుగా ప్రకటించారు. కృష్ణుడిని ఎలిమినేట్ చేశారు. తనకు ముందే ఎలిమినేట్ అవుతానని తెలుసని.. నిన్ననే చెప్పినట్టుగా కృష్ణుడు తెలిపాడు. తన ఫాదర్‌ని గుర్తు చేశావని కృష్ణుడు వెళ్లిపోతుంటే రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. గేమ్ ఆడేటప్పుడు తనకు అర్థమవ్వాలని.. ఈ వారం తనకు అర్థమైందని కృష్ణుడు చెప్పాడు. అలా అని ఉండాల్సినది కాదని చిన్నోడివైనా అర్థం చేసుకున్నావని కృష్ణుడు పేర్కొన్నాడు. ఒకింత ఎమోషనల్ అయి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. త్రిగుణ్ కూడా తనకు పిల్లర్ ఆఫ్ స్ట్రెంత్ కృష్ణుడు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

బిగ్‌బాస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్ అయి స్టేజ్ పైకి వెళ్లాడు. బిగ్‌బాస్‌కి రావడం తనకు ఒక మెమరబుల్ మూమెంట్ అని కృష్ణుడు చెప్పాడు. రోహిత్‌కి స్టేజ్‌పై కూడా కృష్ణుడు సారీ చెప్పాడు. ఆ తరువాత ఆయన జర్నీని నాగ్ చూపించారు. హౌస్‌లో నలుగురు పాజిటివ్ పీపుల్.. నలుగురు నెగిటివ్ పీపుల్ గురించి చెప్పమంటే.. ఝాన్సీ, దేబ్జాని, సృష్టి, అమన్ పాజిటివ్ అని.. సుధీర్, ముఖేష్, వర్షిణి, చరణ్ నెగిటివ్ అని చెప్పాడు. నెగిటివ్ పీపుల్‌కి ఏమైనా చెప్పమంటే.. వారిలో హాఫ్ స్మైల్ అనిపించిందని.. కొంచెం నెగిటివిటి ఉందని.. అది సరి చేసుకుంటే మీకే మంచిదని కృష్ణుడు చెప్పాడు. హోల్ హార్టెడ్‌గా వాళ్లు లేరని కృష్ణుడు చెప్పాడు. ఒక్కసారిగా షుగర్ మానేయడం వల్ల వీక్ అయిపోయి ఇబ్బందిపడినట్టుగా కృష్ణుడు చెప్పాడు. నెక్ట్స్ వీక్ ఆట ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నాగ్ చెప్పారు. మీ దృష్టిలో బెస్ట్ ప్లేయర్ ఎవరంటే.. అంతా కూడా తమకు ఇష్టమైన వారి గురించే చెప్పారు.ఈ హౌస్‌లో బెస్ట్ ప్లేయర్ ఎవరంటే.. వర్షిణి, ఝాన్సీ, రామ్ ప్రసాద్, సుధీర్.. ముఖేష్ అని.. ముఖేష్ వర్షిణి పేరు, రాం ప్రసాద్ పేరు అమన్, నరేష్, దేబ్జాని.. రాంప్రసాద్ అని, వంశీ, త్రిగుణ్‌లు ఒకరి పేరు మరొకరు.. షాలిని అని రోహిత్, చరణ్.. రోహిత్ అని షాలిని, సృష్టి చెప్పారు. రోహిత్‌కి రెండు, ముఖేష్‌కి నాలుగు, రామ్ ప్రసాద్‌కి మూడు ఓట్లు వచ్చాయి. బెస్ట్ ప్లేయర్ బ్యాడ్జ్ ముఖేష్‌కి పెట్టారు. హౌస్‌మేట్స్‌కి ఎవరికి ఇష్టమైన వ్యక్తి పేరు వాళ్లు చెప్పారు.దీనికి ముఖేష్ బెస్ట్ ప్లేయర్ ఎలా అయ్యాడో చూసేవారికి అర్థం కావడం కష్టమే. మూడో వారం ఏం జరుగబోతోందో బిగ్‌బాస్ రివీల్ చేశారు. టెప్టేషన్ వర్సెస్ టెన్షన్ టాస్క్ మూడో వారం నిర్వహించనున్నట్టు చెప్పి నాగ్ ముగించారు.

Telugu Cinema 360

Recent Posts

‘ది ప్యారడైజ్’ దెబ్బతో నాని కీలక నిర్ణయం..

టాలీవుడ్‌లో నాని సినిమా ప్లానింగ్ గురించి, ఆయన వర్కింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏటా కనీసం…

4 hours ago

Bigg Boss 10 Telugu: చరణ్ ఎలిమినేషన్ వెనుక ట్విస్ట్.. షాలినికి ఓటేసిన హౌస్‌మేట్స్!

ఇవాళ హోస్ట్ నాగార్జున వచ్చీరాగానే ఎలిమినేషన్ ప్రారంభించారు. ముందుగా అపూర్వను ఎలిమినేట్ చేశారు. ఝాన్సీ గురించి ఎక్కువ బాధపడతానని.. బాగా…

4 hours ago

BiggBoss10 Telugu: రోహిత్‌కు నాగార్జున క్లాస్.. షాలిని కోసం ఆట మర్చిపోయాడా?

నాగ్ ఎంట్రీ సమయంలో చాలా కూల్‌గానే కనిపించారు. శుక్రవారం ఏం జరిగిందో చూశారు. రోహిత్, చరణ్ ఇద్దరూ ఎలిమినేషన్ గురించి…

16 hours ago

నానిని కావాలనే ఇరికిస్తున్నారా.. ‘ప్యారడైజ్’ రిలీజ్ తర్వాత వదలట్లేదా..?

నాని చుట్టూ ఏదో ఒక వివాదం లేదా రూమర్ ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. రీసెంట్‌గా వచ్చిన ది ప్యారడైజ్…

1 day ago

నానా పటేకర్ లాంటి దిగ్గజ నటుడికి ఇచ్చే గౌరవం ఇదేనా.. బాలీవుడ్ పట్టించుకోలేదా..?

బాలీవుడ్ సీనియర్ నటుడు, తనకంటూ ఒక ప్రత్యేకమైన యాక్టింగ్ స్టైల్ క్రియేట్ చేసుకున్న లెజెండ్ నానా పటేకర్ గుండెపోటుతో ఆకస్మికంగా…

2 days ago

విశ్వంభర టీం నమ్మకమేంటి… కాకా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తాడా..?

సంక్రాంతి అంటేనే బాక్సాఫీస్ దగ్గర సినిమాల సమరం కనిపిస్తుంది.. 2027 సంక్రాంతి కూడా దీనికి మినహాయింపు కాదు.. బరిలో నిలవాలని…

2 days ago