బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల పర్వం రానే వచ్చింది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో జరిగిన దాన్ని బట్టే నామినేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవాళ (సోమవారం) జరిగిన నామినేషన్స్‌కు సంబంధించిన ఫస్ట్ ప్రోమో విడుదలైంది. సుధీర్ దగ్గరకు వెళ్లి సృష్టి తనను ఫ్రెండ్‌గా భావిస్తున్నారా? లేదా? అని అడిగింది. దానికి సుధీర్.. వర్షిణిని పిలిచాడు. దీంతో తనకు అవసరం లేదని అక్కడి నుంచి సృష్టి వెళ్లిపోయింది. కిచెన్‌లోనూ వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. సుధీర్ ఎవరితోనో.. ‘నా దగ్గర ఫైవ్ మెంబర్స్ ఉన్నారు. సృష్టి దగ్గర ట్రైనింగ్ తీసుకుని వాళ్లను వెదకాలి’ అన్నాడట. ఆ విషయం తనకు తెలిసిందని.. ఎంత చెత్తలాగా ఉంటుందో తెలుసా? అని సృష్టి కోపంగా వెళ్లిపోయింది.
ఆ తరువాత బిగ్‌బాస్ నామినేషన్స్ ప్రక్రియను వివరించాడు. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి నెత్తిపై చెత్తపోసి కారణాలు చెప్పాలి. ప్రోమోను బట్టి చూస్తే సృష్టి, రోహిత్ ఇద్దరూ సుధీర్‌ని నామినేట్ చేసినట్టుగా తెలుస్తోంది. బ్లాక్ కీ ఎవరికి ఇవ్వాలి అనగానే మీరు (సుధీర్) చెప్పిన రీజన్ ఏంటంటే.. సుధీర్ అంటే సృష్టి కదా.. సో సుధీర్ అనగానే నా నోటిలో నుంచి సృష్టి పేరు గుర్తొచ్చింది’ అని సుధీర్ అన్నాడని రోహిత్ చెప్పాడు. ఎన్ని సార్లు అడిగినా కూడా ‘సుధీర్ అంటే సృష్టి కదా’ అని చెబుతూనే ఉన్నాడని సృష్టి కూడా ఫైర్ అయిపోయింది. ‘అది నా స్ట్రాటజీ.. నేనలా ఆడతా’ అని సుధీర్ అనగానే అబద్ధాలు చెప్పడం మీ స్ట్రాటజీనా? అని రోహిత్ ప్రశ్నించాడు.
‘నేను.. సృష్టి హౌస్‌లో ఫ్రెండ్స్ మాత్రమే’ అనగానే అది కూడా కాదని సృష్టి చెప్పింది. ‘బిగ్‌బాస్ నాకు ఫ్రీడం వచ్చింది’ అంటూ సుధీర్ అరిచాడు. దీంతో సృష్టి బాగా ఫైర్ అయిపోయింది. ‘ఫస్టే చెప్పాను నీకు.. నువ్వు నా టైప్ కాదు అని.. నువ్వు నాకు చెప్పకు.. పిచ్చి వేషాలు వేస్తావు.. ఒక్క గుద్దు గుద్దితే పళ్లు రాలిపోతాయి’ అంటూ సృష్టి మండిపడింది. ‘నేనేమన్నా నాకు ఫ్రీడం వచ్చిందని అన్నా’ అని సుధీర్ అనడంతో.. ‘నేనేమైనా పట్టుకుని కూర్చున్నానా? నోరు మూసుకో నేను మాట్లాడేటప్పుడు’ అని సృష్టి ఫైర్ అయ్యింది. ఆ తరువాత సృష్టి ఏడుస్తూ హౌస్ లోపలికి పరిగెత్తింది. ఆమె వెంట అంతా పరిగెత్తారు. అసలు దీని గురించి పూర్తిగా తెలియాలంటే.. ఎపిసోడ్ చూడాలి.
ఇవాళ్టి (ఆదివారం) షోకి హోస్ట్ నాగార్జున రాగానే తన తండ్రి జయంతి సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావును గుర్తు చేసుకున్నారు. నిన్న…
బిగ్‌బాస్ 10 తెలుగు నేడు (శనివారం) హోస్ట్ నాగార్జున వచ్చారు. శుక్రవారం ఏం జరిగిందో నాగ్ చూశారు. బ్లాక్ కాఫీ…
వీకెండ్ రానే వచ్చింది. సాధారణంగా వీకెండ్ వస్తోందంటేనే సందడి నెలకొంటుంది. బిగ్‌బాస్ హౌస్‌లో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. హోస్ట్…
నిన్నటి టాస్క్‌లో చరణ్‌ను గెలిపించడంపై త్రిగుణ్, కృష్ణుడు, వంశీ మధ్య చర్చ జరిగింది. ముగ్గురూ వాడిని (చరణ్) గెలిపించారే అందరూ…
నిన్నటి కెప్టెన్సీ టాస్క్ గురించి దేబ్జాని ఆవేదన చెందడం.. వర్షిణి వారించడంతో నేటి (గురువారం) షో ప్రారంభమైంది. ‘ముఖేష్ నిన్ను…
బిగ్‌బాస్ 10 తెలుగులో ఎలిమినేషన్ పర్వం తిరిగి ప్రారంభమైందా? అంటే ఇవాళ్టి సెకండ్ ప్రోమో చూస్తే మనకు అదే అనిపిస్తుంది.…