సినిమా వార్తలు

Biggboss 10 Telugu: ఓవర్‌గా క్లాసుల్లేవ్.. చురకలే..

బిగ్‌బాస్ 10 తెలుగు నేడు (శనివారం) హోస్ట్ నాగార్జున వచ్చారు. శుక్రవారం ఏం జరిగిందో నాగ్ చూశారు. బ్లాక్ కాఫీ దేబ్జానికి చెప్పకుండా దొంగతనంగా త్రిగుణ్ తాగాడు. ఈ విషయాన్ని రామ్ ప్రసాద్.. దేబ్జానికి చెప్పాడు. తరువాత త్రిగుణ్ వచ్చి నీకో విషయం చెప్పాలంటే.. నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదు అని దేబ్జాని చెప్పింది. త్రిగుణ్ సారీ చెప్పాడు. ఆ తరువాత ప్రమోషన్ టాస్క్ నిర్వహించారు. అంతా రోహిణి – షాలిని అంటున్నారని దానిపై రోహిత్, షాలిని, చరణ్ మధ్య జరిగింది. ‘నువ్వొక గుడ్ ఫ్రెండ్ టు మి’ అని చెప్పింది. రోహిత్ గురించి ఏమనిపించిందని చరణ్ అడిగాడు. దానికి అలాంటిదేమీ లేదని చెప్పింది. చరణ్ వచ్చేసి ఆడియెన్స్‌తో రోహిత్-షాలినిల మధ్య ఏం లేదని.. ఏమైనా ఉంటే తానే చెబుతానన్నాడు. దీనికి షాలిని బట్ ఐ లైక్ రోహిత్ అని చెప్పాడు.

ఆ తరువాత నాగ్ హౌస్‌మేట్స్‌తో మాట్లాడారు. ఈ వారం తనకు చాలా బాగా నచ్చిందని చెప్పారు. హౌస్‌లో 15 మంది ఉండగా.. తనకు 13 మందే కనిపించారని నాగ్ చెప్పారు. ఆ ఇద్దరూ కృష్ణుడు, సృష్టి. మీ ఇద్దరూ టోటల్లీ మిస్సింగ్ అని నాగ్ చెప్పారు. మాస్క్ మెన్‌ని హౌస్‌లోకి పంపించి గ్లాస్ పగులగొట్టించారు. ఆ తరువాత కృష్ణుడు, సృష్టిని స్టోర్ రూంలోకి పంపించి ప్రేక్షకుల మాదిరిగానే జరుగుతున్నది చూడాలని చెప్పారు. ఝాన్సీ కెప్టెన్ అయినందుకు ప్రశంసించారు. త్రిగుణ్‌ని లేపి నాగ్ కాఫీ గురించి అడిగారు. తను చేస్తే సీరియస్ అవుతున్నారని.. అలిగి తనతో దేబ్జాని మాట్లాడటం మానేసిందని త్రిగుణ్ చెప్పాడు. త్రిగుణ్‌ని అతి పెద్ద సీక్రెట్ చెప్పాలని నాగ్ అన్నారు. అప్పుడు దెయ్యం ఉందని చెప్పానని.. అది టాస్క్ అని బయటపెట్టాడు. రామ్ ప్రసాద్ సీక్రెట్ చెప్పాడు. రామ్ ప్రసాద్ కారులో వెళుతుండగా.. పోలీస్ చెకింగ్ జరుగుతోందట. డ్రింక్ చేసి ఉండటంతో ఓ వ్యక్తిని అడిగి తన కారును పోలీసుల నుంచి దాటించమని చెప్పాడట. అలా డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి బయటపడ్డాడట.

త్రిగుణ్ సీక్రెట్ వచ్చేసి తనకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని.. ఒకరి గురించి మరొకరికి తెలియదని త్రిగుణ్ చెప్పాడు. వంశీకి ఆరవ తరగతిలో ఒక అమ్మాయిపై క్రష్ ఉండేదట. ఆ అమ్మాయి కోసం లవ్ లెటర్ రాసి బుక్‌లో దాచుకుని ఉండేవాడట. ఇంటర్‌లో తన కాలేజీకి దగ్గరలోనే వాళ్ల అపార్ట్‌మెంటు అని తెలిసి వాళ్లింటికి వెళ్లాడట. ఆ అమ్మాయి ఫాదర్‌ని తనను చూడాలని ఉందని చెప్పాడట. ఆయన చూడనివ్వకుండా గెంటేశారట. ఇష్యూస్ మాట్లాడుకుంటూ కంటెస్టెంట్స్‌తో నాగ్ ఒక గేమ్ ఆడించారు. మ్యానిప్యులేటర్, పప్పెట్ ఎవరనేది గేమ్. చరణ్ వచ్చేసి వర్షిణిని మ్యానిప్యులేటర్ అని.. సుధీర్ పప్పెట్ అని చెప్పాడు. సుధీర్‌ని కూడా పప్పెట్‌లా వాడుతున్నావని అన్నాడు.. మరి ఆ కూడా ఎవరని చరణ్‌ని అడగమని నాగ్ చెప్పారు. ఇక టాస్క్ గురించి చరణ్‌ని నాగ్ అడిగారు. బిగ్‌బాస్ నిన్ను కన్ఫ్యూజ్ చేస్తారు.. నాలుగు రూల్స్ ఫాలో అవకుంటే ఎలాగని నాగ్ ప్రశ్నించారు. దానికి తనకు వేరేలా అర్థమైందని చరణ్ చెప్పాడు.

రామ్ ప్రసాద్ వచ్చేసి మ్యానిప్యులేటర్ త్రిగుణ్ అని.. పప్పెట్ వంశీ అని అన్నారు. ఆడియెన్స్‌ను అడిగారు. వంశీ పప్పెటా? కాదా? అంటే 70 శాతం మంది దానికి ఓకే చెప్పారు. రామ్ ప్రసాద్‌కి హెడ్ ఫోన్స్ ఇచ్చి కుక్కలు అరిచేది వినిపించారు. రామ్ ప్రసాద్‌‌తో పాటు మరికొందరు కంటెస్టెంట్స్ నిద్ర పతున్న చాలా వీడియోలను నాగ్ చూపించారు. దానికి పనిష్మెంట్ కూడా ఇచ్చారు. నైట్ నిద్ర పోయే సమయంలో తప్ప మరే సమయంలోనూ కంటెస్టెంట్స్ అందరికీ బెడ్ రూమ్ యాక్సెస్ లేదని నాగ్ చెప్పారు. రామ్ ప్రసాద్ సంచాలక్‌గా చేసిన తప్పు గురించి నాగ్ ప్రశ్నించారు. రోహిత్‌తో కలిసి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడిన దాని గురించి దేబ్జానిని నాగ్ ప్రశంసించారు. వర్షిణి వచ్చేసి రోహిత్ మ్యానిప్యులేటర్ అని.. చరణ్ పప్పెట్ అని చెప్పింది. వర్షిణి బెస్ట్ సంచాలక్ అని చెప్పి ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టించారు. వర్షిణి బెస్ట్ సంచాలక్ కాదని ప్రేక్షకులు యునానిమస్‌గా తీర్పిచ్చారు.

ఆట ఆటగా ఆడించలేదని.. నువ్వు ఫౌల్ గేమ్ ఆడించడానికి కారణం ముఖేష్ అని నాగ్ అన్నారు. ప్రేక్షకులంతా కూడా అదే చెప్పారు. ముఖేష్ గేమ్‌లో ఉన్నప్పుడు వర్షిణికి సంచాలక్ ఇవ్వకూడదనే పనిష్మెంట్ ఇవ్వాలని రోహిత్ చెప్పాడు. ఈ వారం సేవ్ అయితే వర్షిని వారమంతా సంచాలక్‌గా ఉండటానికి లేదని నాగ్ చెప్పారు. షాలినిని నామినేషన్స్‌లో భాగంగా వర్షిణి టచ్ చేయడాన్ని నాగ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రోహిత్‌ని సైతం నాగ్ ప్రశ్నించారు. షాలిని.. వర్షిణి మీదకు వెళ్లడం కరెక్టా అని అడిగారు. అంపైర్ లైన్ దాటి ముందుకు వచ్చింది షాలిని అని నాగ్ చెప్పారు. ఈ విషయంలో నాగ్ వర్షిణిని వెనుకేసుకొచ్చారు. ఝాన్సీని లేపి షాలినికి ఏం పనిష్మెంట్ ఇద్దామనగా.. డిష్ వాష్ అని చెప్పింది. ప్రస్తుతం ఎవరు చేస్తున్నారని నాగ్ అడిగితే ముఖేష్ అని చెప్పింది. ముఖేష్ కోసం షాలిని పేరు చెప్పావా? అని నాగ్ అడిగారు. ఇక ఎలిమినేషన్స్ నుంచి మొదటగా ముఖేష్‌ను సేవ్ చేశారు. ఆ తరువాత దేబ్జానిని సేవ్ చేశారు.

మ్యానిప్యులేటర్ త్రిగుణ్ అని.. పప్పెట్ వంశీ అని దేబ్జాని చెప్పింది. ఆతరువాత నామినేషన్స్‌లో ఉన్నవారి నుంచి రామ్ ప్రసాద్‌ను సేవ్ చేశారు. దేబ్జానిని లివింగ్ రూమ్‌కి పిలిచారు. వర్షిణి మ్యానిప్యులేదర్ అని.. సుధీర్ పప్పెట్ అని షాలిని చెప్పింది. త్రిగుణ్ బిగ్గెస్ట్ మ్యానిప్యులేటర్ ఇన్ ద హౌస్ అని షాలినికి నాగ్ చెప్పారు. రోహిత్ వచ్చేసి మ్యానిప్యులేటర్ త్రిగుణ్ అని.. పప్పెట్ వంశీ అని చెప్పాడు. వంశీకి నోరు పారేసుకోవద్దని నాగ్ చెప్పారు. సడెన్‌గా ఫ్లేర్ అవ్వాల్సిన అవసరమేంటని వంశీని ప్రశ్నించారు. అందరి గురించి ఆలోచించి అరవద్దని చెప్పారు. కనపడాలంటే.. కంటెంట్ ఇవ్వాలంటే ఇది సరైన పద్ధతి కాదని నాగ్ చెప్పారు. ఆ తరువాత కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో త్రిగుణ్‌ని రోహిత్ పడేసిన వీడియో చూపించారు. రోహిత్ ఆడిన పద్ధతి కరెక్టేనా? అని ప్రేక్షకులను అడిగితే అంతా కరెక్ట్ కాదని చెప్పారు. వర్షిణి కూడా రోహిత్‌ది తప్పేనని కానీ ముందుగా త్రిగుణే ట్రిగర్ చేశాడని చెప్పింది. రోహిత్ ఆట గురించి తప్పుబట్టట్లేదని.. ఆడే తీరు మార్చుకోమని చెప్పారు. త్రిగుణ్ దగ్గర ప్రొవోక్ అయి ఆడినట్టుగా రోహిత్ చెప్పాడు. అందరి గురించి డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నావని.. నీ గురించి నువ్వు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోమని చెప్పారు. రోహిత్ ఆట బాగుందని అన్నారు.

ఆ తరువాత నామినేషన్స్ నుంచి షాలినిని సేవ్ చేశారు. మ్యానిప్యులేటర్, పప్పెట్ రేపు కొనసాగుతుందని చెప్పారు. ఈ వారం నాగ్ ఎవరికీ గట్టిగా క్లాస్ తీసుకోలేదు. కాస్తో కూస్తో రోహిత్‌, షాలినిలకు క్లాస్ తీసుకున్నారు. కూల్‌గా చురకలు మాత్రం అంటించారు. ఎవరిని ఏమంటే.. ఎక్కడ భయపడిపోయి వెనక్కి తగ్గుతారోనని ఎవరికీ పెద్దగా క్లాస్ అయితే నాగ్ తీసుకోలేదని తెలుస్తోంది.

Telugu Cinema 360

Recent Posts

Biggboss10 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్…

వీకెండ్ రానే వచ్చింది. సాధారణంగా వీకెండ్ వస్తోందంటేనే సందడి నెలకొంటుంది. బిగ్‌బాస్ హౌస్‌లో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. హోస్ట్…

2 days ago

Biggboss 10 Telugu: ఇంట్రస్టింగ్‌గా కెప్టెన్సీ రేస్.. నక్కతోక తొక్కిన ఝాన్సీ

నిన్నటి టాస్క్‌లో చరణ్‌ను గెలిపించడంపై త్రిగుణ్, కృష్ణుడు, వంశీ మధ్య చర్చ జరిగింది. ముగ్గురూ వాడిని (చరణ్) గెలిపించారే అందరూ…

2 days ago

Biggboss 10 Telugu: ఎంట్రీ ఇచ్చిన చరణ్.. మారుతున్న ఈక్వేషన్స్..

నిన్నటి కెప్టెన్సీ టాస్క్ గురించి దేబ్జాని ఆవేదన చెందడం.. వర్షిణి వారించడంతో నేటి (గురువారం) షో ప్రారంభమైంది. ‘ముఖేష్ నిన్ను…

3 days ago

Biggboss 10 Telugu: హౌస్ నుంచి షాలిని అవుట్.. అవాక్కైన కంటెస్టెంట్స్

బిగ్‌బాస్ 10 తెలుగులో ఎలిమినేషన్ పర్వం తిరిగి ప్రారంభమైందా? అంటే ఇవాళ్టి సెకండ్ ప్రోమో చూస్తే మనకు అదే అనిపిస్తుంది.…

3 days ago

Biggboss10 Telugu: రచ్చ లేపిన ఫుడ్ గొడవ.. కెప్టెన్సీ టాస్క్ వేరే లెవల్..

బిగ్‌బాస్ 10 తెలుగు హాట్ హాట్‌గా నడుస్తోంది. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటున్నారో అర్థం కాకుండా ఉంది. ఎవరెవరు మిత్రులవుతారో..…

3 days ago

Biggboss10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి చరణ్.. ఎంట్రీ ఎప్పుడంటే..!

బిగ్‌బాస్ 10 తెలుగు ఆసక్తికరంగా సాగుతోంది. అయితే బిగ్‌బాస్ చరిత్రలో ఇప్పటి వరకూ హౌస్‌మేట్స్ ఓటింగ్ ద్వారా ఎవరూ బయటకు…

4 days ago