Menu
BREAKING
అక్కినేని కోడలి గ్లామర్ షోపై ఫ్యాన్స్ గుర్రు.. శోభిత బికినీ ఫోటోషూట్ వివాదంలో తప్పెవరిది..?   |   Bigg Boss 10 Telugu: షాలిని రచ్చ.. రామకృష్ణ కాళ్లు పట్టుకుని సారీ.. వైల్డ్ ఫైర్స్‌కు షాకిచ్చిన ఓజీలు!   |   Biggbogss10 Telugu: నామినేషన్స్‌లో వంశీ, శివ్ రచ్చ.. దేబ్జాని బిహేవియర్ వరస్ట్..   |   విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సెన్సార్ రివ్యూ.. ప్లస్ ఏంటి.. మైనస్ ఏంటి..?   |   అవకాశం ఇస్తాను పడుకుంటావా అని అడిగాడు.. హీరోయిన్ సంచలనం..!   |   శ్రీకాంత్ కూతురు మేధ హీరోయిన్‌గా సక్సెస్ అవుతుందా..?   |   Biggboss10 Telugu: మరీ చిల్లరగా మారిన షాలిని.. ఈవారం ఎలిమినేట్ అవుతుందా?   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌ను టార్గెట్ చేస్తున్న హౌస్‌మేట్స్.. షాలినిని కాపాడుతున్నారా?   |   జైలర్ 2కు అక్కడ షోస్ క్యాన్సిల్.. రజినీకాంత్ పప్పులు ఉడకలేదు..!   |   సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ మధ్య ఏం జరుగుతుంది.. అక్కడే బీజం పడిందా..?   |   400 కోట్ల సినిమాకు ఇదేం తిప్పలు.. హనుమాన్ అంశ్ తెలుగులో అందుకే ఆడలేదా..?   |   అమలాపాల్ ఆపసోపాలు చూస్తున్నారా… ఇప్పుడు వర్కవుట్ అవుతుందా..?   |   దసరాకు పాంచ్ పటాకా.. 5 సినిమాల్లో గెలిచేది ఎవరో..?   |   ‘ది ప్యారడైజ్’ దెబ్బతో నాని కీలక నిర్ణయం..   |   Bigg Boss 10 Telugu: చరణ్ ఎలిమినేషన్ వెనుక ట్విస్ట్.. షాలినికి ఓటేసిన హౌస్‌మేట్స్!

Biggboss10 Telugu: మరీ చిల్లరగా మారిన షాలిని.. ఈవారం ఎలిమినేట్ అవుతుందా?

Biggboss10 Telugu: మరీ చిల్లరగా మారిన షాలిని.. ఈవారం ఎలిమినేట్ అవుతుందా?

బిగ్‌బాస్ 10 తెలుగు.. వైల్డ్ కార్డ్స్ వచ్చి ఇచ్చిన హింట్స్‌తో సెలబ్రిటీలంతా ఆట మార్చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమ ఆట తీరును మార్చుకున్నారు. తమ మెయిన్ ప్రత్యర్థిగా రోహిత్‌ను ఎంచుకుని మరీ గేమ్ ఆడుతున్నారు. ఇక నిన్న (సోమవారం), ఇవాళ నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. నిన్న వచ్చేసి పెద్దగా ముందుకు సాగలేదు. రోహిత్, షాలిని నామినేట్ చేయాల్సిన ఇద్దరిలో ఒకరిని చేయడంతో షో ముగిసింది. రోహిత్ వచ్చేసి వంశీని స్ట్రాంగ్ పాయింట్స్‌తో ఝాన్సీని నామమాత్రపు పాయింట్స్‌తో నామినేట్ చేశాడు. దీంతో ఆటోమేటిక్‌గా వంశీ నామినేషన్స్‌లోకి వచ్చాడు. ఇక నిన్న షాలిని వచ్చేసి దేబ్జానిని నామినేట్ చేసింది. ఇవాళ మరొకరిని నామినేట్ చేయనుంది.

అయితే దేబ్జాని వచ్చేసి ఇద్దరిని నామినేట్ చసింది. షాలినిని స్ట్రాంగ్ పాయింట్స్‌తో.. రామ్ ప్రసాద్‌ను నామమాత్రపు పాయింట్స్‌తో నామినేట్ చేసింది. దీంతో షాలిని నామినేషన్స్‌లోకి వచ్చింది. ఇక మొన్నటి నుంచి షాలిని బాగా ఒత్తిడిలో ఉన్నట్టుగా ఉంది. వైల్డ్ కార్డ్స్ అంతా షాలినిని టార్గెట్ చేయడంతో ఆమె బాగా స్ట్రెస్ ఫీలవుతోందో.. మరొకటో కానీ ఎవరు కదిలించినా వాళ్ల మీదకు మాటలతో దారుణాతి దారుణంగా దాడి చేస్తోంది. అగ్నిపరీక్షలో ఆమె చాలా బ్యాడ్ అయిపోయింది. అయితే బిగ్‌బాస్‌లో అంతకు మించి బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది. ఇక ఈవారం ఆమె చేస్తున్న హంగామా చూస్తుంటే ప్రేక్షకులకే చిరాకు వస్తోంది.

ఈ క్రమంలోనే రోహిత్ ఫ్యాన్స్ కూడా షాలిని ఎప్పుడు నామినేషన్స్‌లోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఆమె ఎలిమినేట్ అవకుంటే రోహిత్ ఆట మొత్తం పోతుంది. త్వరలోనే బయటకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో షాలినిని ఈ వారం బయటకు తీసుకొచ్చేందుకు అస్త్ర శస్త్రాలను వినియోగిస్తారు. క్రాస్ ఓటింగ్ బాగా పడే అవకాశం ఉంది. మరోవైపు స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరూ నామినేషన్స్‌లో ఉండబోవడం లేదనిపిస్తోంది. దీంతో స్ట్రాంగ్ ప్లేయర్స్‌కు సంబంధించిన ఓటింగ్ అంతా షాలినికి పడే అవకాశం ఉంది. అంటే షాలినిని బయటకు లాగాలని రోహిత్ ఫ్యాన్స్.. ఆమెను హౌస్‌లోనే ఉంచాలని ముఖేష్, త్రిగుణ్ ఫ్యాన్స్ ఓటింగ్ చేసే అవకాశం ఉంది. దీంతో షాలిని బయటకు వస్తుందా? లేదంటే హౌస్‌లోనే ఉంటుందా? అనేది తెలియాలంటే వీకెండ్ వరకూ ఆగాల్సిందే.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360