
సౌత్ ఇండియాలో మలయాళ ఇండస్ట్రీ గురించి ఒక రేంజ్లో చర్చ జరుగుతోందిప్పుడు. దానికి కారణం వాళ్ళు తీస్తున్న అద్భుతమైన కంటెంట్ ఒకటైతే, ఆ కంటెంట్ కోసం వాళ్ళు పెడుతున్న బడ్జెట్ మరొకటి. బడ్జెట్ విషయంలో మలయాళ మేకర్స్ చాలా జాగ్రత్తగా, పక్కా ప్లానింగ్‌తో అడుగులేస్తున్నారు. అక్కడ వచ్చే పెద్ద పెద్ద బ్లాక్‌బస్టర్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లోనే పూర్తయిపోతున్నాయి. కథ మీద ఉన్న నమ్మకంతో సినిమా తీస్తున్నారు తప్ప, అనవసరమైన ఖర్చులకు వాళ్ళు ఆమడ దూరంలో ఉంటున్నారు. సూర్య, మోహన్ లాల్ లాంటి బడా హీరోలు సైతం ఫామ్‌లో ఉన్నప్పుడు కూడా కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ బడ్జెట్‌కు ఏమాత్రం కాదు. మన దగ్గర ఒక స్టార్ హీరో సినిమా అంటే వందల కోట్లు ఖర్చు పెట్టాలి, భారీ సెట్టింగ్స్ వేయాలి అనే మైండ్ సెట్ ఉంది. కానీ మలయాళ ఇండస్ట్రీ మాత్రం కేవలం కంటెంట్ ఉంటే చాలు, కోట్లు కుమ్మరించాల్సిన పని లేదు అని ప్రూవ్ చేస్తోంది. ఈ విషయం మన టాలీవుడ్ మేకర్స్ కు ఒక పెద్ద పాఠం అని చెప్పాలి. కంటెంట్ ఈజ్ కింగ్ అనే మాటను మాలీవుడ్ మేకర్స్ అక్షరాలా పాటిస్తూ బాక్సాఫీస్ దగ్గర ఎవరూ ఊహించని మ్యాజిక్ చేస్తున్నారు.
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా సూర్య నటించిన సీన్ సినిమా గురించే మాట్లాడుకోవాలి. ఈ సినిమా బడ్జెట్ వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే దర్శకుడు జీతూ మాధవన్ ఈ సినిమా మొత్తాన్ని కేవలం మూడు నాలుగు లొకేషన్స్‌లోనే కంప్లీట్ చేసేశారు. సూర్య ఇప్పుడు పీక్ ఫామ్‌లో ఉన్నాడు, తన మార్కెట్ కూడా భారీగా పెరిగింది. కావాలంటే నిర్మాతలతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి భారీ విజువల్స్ ప్లాన్ చేయొచ్చు. కానీ సూర్య గానీ, డైరెక్టర్ గానీ ఆ పని చేయలేదు. కథకు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టారు. దీనివల్ల సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా చాలా తక్కువ రేట్లకే జరిగింది. బడ్జెట్ తక్కువ, బిజినెస్ తక్కువ కావడంతో సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంతా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. రిస్క్ లేకుండా సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టడం ఎలాగో ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు. అనవసరమైన హంగులు, ఆర్భాటాలు లేకుండా సినిమాను ఎంత సింపుల్ గా, ఎంత ఎఫెక్టివ్ గా తీయొచ్చో ఈ చిత్రం ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది.
ఇక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన దృశ్యం 3 సినిమా లెక్కలు చూస్తే ట్రేడ్ పండితుల బుర్రలు కూడా హీటెక్కిపోతాయి. దృశ్యం ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానికి నేషనల్ రేంజ్లో మార్కెట్ ఉంది. మోహన్ లాల్ సొంతంగా నిర్మించిన ఈ చిత్రం అంత పెద్ద ఫ్రాంచైజీ నుంచి వచ్చినా కూడా బడ్జెట్ కనీసం 20 కోట్లు కూడా దాటలేదు. బిజినెస్ కూడా కేవలం 30 కోట్ల లోపే క్లోజ్ చేశారు. కానీ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కు వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఏకంగా 230 కోట్లు. పెట్టిన పెట్టుబడికి దాదాపు పదింతలు లాభాలు వచ్చాయి. అలాగే మరో అద్భుతమైన సినిమా లోక ఛాప్టర్ 1 బడ్జెట్ కూడా 30 కోట్ల లోపే ఉంటుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా చేసిన వసూళ్లు ఏకంగా 300 కోట్లు దాటేశాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్, వందల మంది ఫైటర్స్, కోట్లు ఖర్చు పెట్టి తీసిన పాటలు, విదేశీ లొకేషన్స్ ఇవేమీ లేకుండానే కేవలం స్క్రీన్ ప్లే, ఎమోషన్స్, క్యారెక్టరైజేషన్స్ తో ఇంత పెద్ద హిట్స్ కొట్టొచ్చని వీళ్లు నిరూపిస్తున్నారు. బడ్జెట్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే అని, సినిమా సక్సెస్ ను డిసైడ్ చేసేది అందులోని ఎమోషన్ మాత్రమే అని ఈ చిత్రాలు మరోసారి ప్రూవ్ చేశాయి.

చిన్న సినిమాలతో వందల కోట్లు కొల్లగొట్టడం మలయాళ మేకర్స్ కు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో వచ్చిన వాలా 2, మంజుమ్మెల్ బాయ్స్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో మనం అందరం చూశాం. ఈ రెండు సినిమాల బడ్జెట్ కూడా 20 కోట్ల లోపే ఉంటుంది. కానీ కలెక్షన్స్ మాత్రం 250 కోట్లకు పైగా వచ్చాయి. మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలో అయితే ఎలాంటి స్టార్ క్యాస్ట్ కూడా లేదు. అయినప్పటికీ ఆడియన్స్ ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. వాళ్ల మేకింగ్ స్టైల్, ఆ రియలిస్టిక్ అప్రోచ్ ప్రేక్షకులను స్క్రీన్ కు కట్టిపడేస్తాయి. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే సెట్స్ వేస్తారు తప్ప, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయరు. సినిమా మేకింగ్ లో ప్రతీ రూపాయిని స్క్రీన్ మీద కనిపించేలా చాలా కేర్ తీసుకుంటారు. అందుకే వాళ్ళ సినిమాలు ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా నిర్మాతలకు పెద్దగా నష్టాలు రావు. అదే ఆ సినిమా జనాలకు కనెక్ట్ అయ్యి హిట్ అయితే మాత్రం కళ్లు చెదిరే రేంజ్ లో లాభాలు వస్తాయి. ఇదొక పర్ఫెక్ట్ బిజినెస్ మోడల్ అని ఇండస్ట్రీ వర్గాలు కూడా ప్రశంసిస్తున్నాయి.
ఇదంతా చూస్తున్నప్పుడు మన తెలుగు దర్శక నిర్మాతలు ఎందుకు ఇలా చేయలేకపోతున్నారు అనే ప్రశ్న రాకమానదు. మన దగ్గర ఇదే రేంజ్ స్టోరీతో ఒక మీడియం రేంజ్ సినిమా చేయాలన్నా కూడా కనీసం 100 కోట్లకు పైగానే బడ్జెట్ వేస్తున్నారు. హీరోలు, డైరెక్టర్ల రెమ్యూనరేషన్స్ కే సగం బడ్జెట్ కరిగిపోతుంది. ఆ తర్వాత భారీ యాక్షన్ సీక్వెన్సులు, ఫారిన్ లొకేషన్స్, స్పెషల్ సాంగ్స్ అంటూ బడ్జెట్ ను అమాంతం పెంచేస్తున్నారు. దీనివల్ల సినిమాకు 100 కోట్లు వచ్చినా కూడా బయ్యర్లు సేఫ్ అవ్వలేని పరిస్థితికి మన టాలీవుడ్ వచ్చేసింది. బడ్జెట్ పెరిగిపోవడం వల్ల థియేటర్లలో టికెట్ రేట్లు పెంచాల్సి వస్తోంది, దాంతో ఆడియన్స్ కూడా థియేటర్లకు రావడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. కానీ మలయాళ ఇండస్ట్రీ అలా కాదు, వాళ్ళ హీరోలు సినిమా కంటెంట్ గురించి, సేఫ్ ప్రాజెక్ట్ గురించి ముందు ఆలోచిస్తారు. మన నిర్మాతలు, డైరెక్టర్లు కూడా మాలీవుడ్ మేకర్స్ ఫాలో అవుతున్న ఈ బడ్జెట్ కంట్రోల్ మోడల్ ను స్టడీ చేయాలి. బడ్జెట్ భారీగా ఉంటేనే సినిమా సూపర్ హిట్ అవుతుంది అనే భ్రమల నుంచి బయటికి రావాలి. కథలో దమ్ముంటే తక్కువ బడ్జెట్ సినిమా కూడా నేషనల్ లెవెల్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని మన వాళ్ళు రియలైజ్ అవ్వాల్సిన టైమ్ వచ్చేసింది.
