
నిన్న నామినేషన్స్ ముగిసిన తర్వాత నుంచి ఇవాళ్టి (మంగళవారం) షో ప్రారంభమైంది. వర్షిణి, త్రిగుణ్‌కి ఒక డీల్ ఉందట.. కాబట్టి ఒకరినొకరు నామినేట్ చేసుకోరు అని దేబ్జానికి ముఖేష్ చెప్పాడట. ఆ విషయాన్ని వర్షిణికి చెప్పి ముఖేష్‌కు ఎందుకు చెప్పావని త్రిగుణ్ అడిగాడు. అసలు డీల్ ఎప్పుడు జరిగింది? అని వర్షిణి హైడ్రామా స్టార్ట్ చేసింది. బయట కాల్లో మాట్లాడుకున్నాం కదా త్రిగుణ్ షాక్ అయిపోయి ఉన్నాడు. ముఖేష్ దగ్గరికి వెళ్లి మా ఇద్దరికీ డీల్ ఉందని దేబ్జానికి చెప్పావా? అని వర్షిణి అడిగింది. లేదని అతను చెప్పాడు. దేబ్జానిని అడిగితే తనలా చెప్పలేదని చెప్పింది. మరోవైపు త్రిగుణ్.. తను ఫ్రెండ్షిప్ కారణంగా చాలా కోల్పోయానని చెప్పాడు. తనకు తన ఫ్యామిలీయే ముఖ్యమన్నట్టుగా చెప్పాడు. ఈ గేమ్‌కి తనకోస మాత్రమే వచ్చానని శ్వేతకు చెప్పాడు. గత వారమే వంశీ తన ఫ్రెండ్ అని తన కోసం గేమ్ వదిలి వెళ్లేందుకు సైతం సిద్ధమని త్రిగుణ్ చెప్పాడు. కరెక్ట్‌గా వారంలో మాట మార్చేశాడు. వర్షిణి వాళ్ల రేపు ఆడపిల్లను పంపించా.. సరిగా చూసుకోలేదని అంటే తనేం చెప్పాలని త్రిగుణ్ డ్రామా ప్రారంభించాడు. వర్షిణికి ప్రతి మూమెంట్లో ఉన్నానని.. ఒక్కసారి లేకుంటే నువ్వు లేవని చెబితే ఎలా అని శ్వేతతో త్రిగుణ్ అన్నాడు.
త్రిగుణ్ వచ్చేసి స్మోకింగ్ జోన్లో.. బయట వర్షిణి.. ‘నిజంగా నువ్వేనా? నాకు తెలిసిన పర్సన్ ఇదేనా?’ అని అడిగింది. అది గేమ్ అని.. అర్థం చేసుకోమని చెప్పాడు. నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు. దానిని యాక్సెప్ట్ చేసి వదిలేశా కానీ మళ్లీ వచ్చి నామినేట్ చేయడం కూడా ఓకే కానీ తను హర్ట్ అయిన విషయాన్ని తిప్పి తీసుకొచ్చి మళ్లీ చెప్పావు. అది కరెక్టేనా? అని అడిగింది. ‘షాలినిని కిస్ గురించి అడిగావా?’ అని వర్షిణిని అడిగాడు. మరోవైపు రామ్ ప్రసాద్ ఆ అమ్మాయికి ఆడటం రావట్లేదు. భయపడుతోంది. అష్టా చెమ్మా ఇస్తే అమ్మో పిక్కలు బరువున్నాయని అంటే ఎలా? అని రోహిత్‌కి చెప్పాడు. ఈ సమయంలో తనకు త్రిగుణ్ ఉన్నాడని చెప్పడమెందుకని అతను అంటాడు. మరోవైపు త్రిగుణ్, వర్షిణి మధ్య గొడవ కొనసాగుతూనే ఉంది. ‘నువ్వు నన్ను హర్ట్ చేసి మళ్లీ ఆ విషయాన్ని తీసుకొచ్చి నాపై రుద్దడం నీకు ఫెయిర్ అనిపిస్తోందా?’ అని వర్షిణి అడిగింది. ‘నేనేదో మోసం చేసినట్టుగా మాట్లాడతావేంటి? అది గేమ్’ అన్నట్టుగా త్రిగుణ్. ఏమాత్రం తెగడం లేదు.. ముడిపడటం లేదు.

ముఖేష్ దగ్గరకు వర్షిణి వెళ్లి.. మేము నామినేషన్లో మాట్లాడుతుంటే నీకు ఫన్నీగా అనిపించిందా? అంటే నాకే కాదు.. ప్రతి ఒక్కరికీ ఫన్నీగా అనిపించిందని చెప్పాడు. నవ్వావా? అంటే నేనే ాదు.. అందరూ నవ్వారని చెప్పారు. ఆ తరువాత మీ ఫన్నీ నామినేషన్ కంటే నాకు చికెన్ ముఖ్యమని చెప్పాడు. మరి నేనెవరితో మాట్లాడాలంటే దయచేసి నాతో మాత్రం మాట్లాడకు అని వర్షిణికి ముఖేష్ చెప్పాడు. ఎండ్యూరెన్స్ టాస్క్‌లో చివరి వరకూ ఎవరుంటారో వాళ్లు గెలవరని నరేష్ చెప్పాడు. ఇక ఆ టాస్క్‌లో ఎవరెలా చేశారో రామ్ ప్రసాద్, నరేష్ చేసి చూపించారు. ఇక నామినేషన్ రెండవ దశను బిగ్‌బాస్ ప్రారంభించారు. గోట్ సభ్యులు జడ్జిలుగా ఉంటారు. ఎల్లో లెవల్లో ఉన్న సభ్యుల్లో ముగ్గురికి మాత్రమే నామినేట్ చేసే అధికారం ఉంది. ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయవచ్చు. ఆ ఇద్దరిలో ఎవరికి సంబంధించిన నామినేషన్ పాయింట్స్ బాగుంటే వాళ్లు నామినేట్ అవుతారు. ఇక గోట్ సభ్యుల్లో పర్మినెంట్ జడ్జి ఎవరు అవుతారో డిసైడ్ చేసుకోమని బిగ్‌బాస్ చెప్పారు. ఐదుగురూ చర్చించుకుని పర్మినెంట్ జడ్జిగా నీతూ ఉంటుంది.
ఫస్ట్ నరేష్ వచ్చి ఝాన్సీ, వర్షిణిని నామినేట్ చేశాడు. వర్షిణి అన్నింటిలో బాగానే ఇన్వాల్వ్ అవుతోంది కానీ గేమ్ విషయంలో బ్యాక్ అవుతున్నావన్నట్టుగా చెప్పాడు. కొన్ని గేమ్స్‌లో గివ్ అప్ ఇస్తున్నావని అలా చేస్తే ఫ్యూచర్లో నిన్నెవరూ గేమ్‌లోకి తీసుకోరని చెప్పాడు. ఇదొక గేమ్ షో కాదని.. పర్సనాలిటీ షోఅని వర్షిణి చెప్పింది. గోట్ టాస్క్‌లో త్రిగుణ్ తనను ఎందుకు తీసుకోలేదో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని చెప్పింది. తనకు సర్జరీ జరిగింది కాబట్టి తను పర్ఫెక్ట్గా ఆడలేనని చెప్పింది. అలా ఉంటే రేపు తనతో కలిసి ఆడాల్సి వస్తే కష్టమని.. తను 100 పర్సెంట్ ఆడలేనని కానీ తనతో ఉన్నవారైనా 100 పర్సెంట్ ఆడాలనుకుంటున్నట్టు చెప్పారు. అయితే ఈ నామినేషన్‌ను సపోర్ట్ చేసే వారు ఎవరైనా ఉన్నారా? అప్పుడు శివ్ స్టార్ట్ చేశాడు. దొంగ అండ్ పోలీస్ టాస్క్‌లో గేమే ముఖ్యమని శివ్ చెప్పాడు. ఆ గేమ్‌లో తనతో మాట్లాడనని వర్షిణి అన్నదని తన ఫ్రెండ్ త్రిగుణ్ మాత్రమేనని అతనితోనే మాట్లాడతానని చెప్పిందని అది పర్సనాలిటీనా? అని శివ్ అడిగాడు. తన ఫ్రెండ్, మరొక పర్సన్ ఎదురుగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడతానన్న బేసిక్ సెన్స్ కూడా శివ్‌కి లేదని వర్షిణి చెప్పింది.
సెకండ్ ఝాన్సీని నరేష్ నామినేట్ చేశాడు. ప్రతి విషయానికి ఈ మధ్య ఏడుస్తున్నావని.. అలా ఏడిస్తే సింపతి అనుకుంటారని నరేష్ చెప్పాడు. ప్రతిసారీ రెడ్‌లో ఉన్నానని పదే పదే అంటున్నావు కానీ స్ట్రాంగ్‌గా ఆడి గ్రీన్‌లోకి రావాలనుకోవడం లేదని నరేష్ చెప్పాడు. ఆ రెడ్‌లో చూసినప్పుడు డిజప్పాయింట్ అయ్యానని.. ఏదో చూపించాలని యాక్టింగ్ చేయడం లేదని.. బయట ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అలాగే ఉంటున్నానని ఝాన్సీ చెప్పింది. వర్షిణి పదే పదే ఫ్రెండ్ అంటోందని అలాంటప్పుడు గేమ్ ఆడగలుగుతుందా? అని త్రిగుణ్ అన్నాడు. ఫ్రెండ్షిప్ అనేది ఎంత వరకూ అనేది తెలియాలని అన్నాడు. ఒక స్నేహం ఒకరిని చెడగొట్టడంలో ఉందా? వారిని ముందుకు తీసుకెళ్లడంలో ఉందా? అనేది తెలుసుకోవాలి. ఐ విల్ గో అనడానికి ముందు ఐ విల్ సమ్‌థింగ్ ఫర్ గో అని చెప్పాలని అది లేదని ముఖేష్ అన్నాడు. వంశీకి త్రిగుణ్‌తో ఉండటం ఇష్టం లేదని వర్షిణి వచ్చేసి రోహిత్, సుధీర్‌కి చెప్పాడు. ముఖేష్.. ఝాన్సీని బాగా సపోర్ట్ చేశాడు. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని త్రిగుణ్, ముఖేష్, నీతూ చర్చించకుని వర్షిణిని నామినేట్ చేశారు.
ప్రతి దానిలోనూ త్రిగుణ్ దూరుతాడని ముఖేష్ తరువాత నీతూకి చెప్పాడు. అతను చెప్పిన ప్రతి దానికీ తల ఊపవద్దని చెప్పాడు. పర్మినెంట్ జడ్జిని మార్చే అవకాశాన్ని బిగ్‌బాస్ ఇచ్చారు. ఈ ఎన్నుకునే క్రమంలో ముఖేష్, నీతూ మధ్య గొడవ జరిగింది. ఈసారి పర్మినెంట్ జడ్జిగా అమన్‌ను గోట్ సభ్యులు ఎన్నుకున్నారు. ఈసారి సభ్యులుగా త్రిగుణ్, దేబ్జాని కూర్చొన్నారు. నెక్ట్స్ శివకు నామినేట్ చేసే అధికారాన్ని ఇచ్చారు. వంశీ, సుధీర్లను నామినేట్ చేశాడు. వంశీ అంటే తనకు చాలా ఇష్టమని.. నామినేషన్స్‌లో మంచి పాయింట్స్ పెడతారని చెప్పాడు. ఫస్ట్ ఆయనకు సరిగా టు రాంగ్ నామినేషన్స్ అని చెప్పాడు. ఈ క్రమంలోనే ముఖేష్ వైపు చేయి చూపించాడు. దీంతో ముఖేష్ చేయి అలా చూపించకని గొడవకు దిగాడు. సరిగా పాయింట్స్ వంశీ పెట్టలేదని చెప్పాడు. వంశీకి గ్రాటిట్యూడ్ లేదని చెప్పాడు. మధ్యలో ముఖేష్ లేచి వచ్చి అసలు శివ్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని అమన్‌తో అన్నాడు. దేబ్జాని కల్పించుకుని నువ్వెళ్లి కూర్చోపో అని చెప్పింది. దీనికి నరేష్‌తో ఆడుకున్నది చాలని ముఖేష్ చెప్పాడు. పక్కకెళ్లి ఆడుకోపో.. నీ టూ ఫేసెస్ తెలుసని దేబ్జానిని ముఖేష్ అన్నాడు.
శివ్ వచ్చేసి ముఖేష్‌ని ఇలా ప్రతి దానిలోనూ దూరుతాడని చెప్పడంతో మధ్యలో వర్షిణి వచ్చి గొడవను పెద్దది చేసింది. ఎవరిదైనా పేరు వస్తే మాట్లాడాలని ముఖేష్ చెప్పాడు. ‘మీకు గ్రాటిట్యూడ్ జీరో అని ముఖేష్ చెప్పాడు. అయితే మీకు అవకాశం వచ్చినప్పుడు తిరిగి ఇవ్వలేదని అంటున్నాడు. మరి మీ మాటేంటంటే.. వర్షిణి కోసమే ముఖేష్ సేవ్ చేశాడని చెప్పారు. మరి ఆ సమయంలో ముఖేష్‌కు చెప్పి ఉండొచ్చు కదా.. అలా చెప్పి ఉంటే మీ గేమ్ వేరే లెవల్లో ఉండేది’ అని చెప్పి వంశీని శివ్ నామినేట్ చేశాడు. ఆ తరువాత సుధీర్‌తో మీకు చాలా పేర్లు వచ్చాయి. ‘‘మీకు మిస్టర్ బ్యాక్ ఫుట్ అనే పేరు కూడా యాడ్ చేస్తున్నా. ఏదైనా గొడవ జరిగినప్పుడు మీరు సైడ్ అయిపోవడానికే చూస్తారు. మీరు వేస్ట్ కెప్టెన్ అని అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ విషయానకి వస్తే మన దగ్గర ఒక మంచి, రెండు విధాలుగా చెబుతాడు. అవసరం వచ్చినప్పుడు మంచినే తీసుకుంటాడు. మీరు ఎవరితోనైనా పెట్టుకోండి కానీ త్రిగుణ్‌తో ఆడవద్దు అని చెప్పాడు. కొందరు నాకు చెప్పిందేంటంటే.. ఆ మనిషి ఒకరి షాడో అని చెప్పారు’’ అని శివ్ చెప్పాడు. తను ఈ హౌస్‌లో ఉన్నా వరస్ట్ కెప్టెనో ఏదైనా తను అందరితో బాగానే ఉన్నానని సుధీర్ చెప్పాడు. ‘‘వచ్చిన కొత్తవాళ్లందరికీ బెడ్స్, ర్యాక్స్ అన్నీ సెట్ చేయాల్సి ఉందని సుధీర్ చెప్పాడు. శివ్ వచ్చినప్పుడు త్రిగుణ్‌తో కాస్త జాగ్రత్తగా ఉండాలని.. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేరుగా ఉంటాయని చెప్పా. నేనెప్పుడూ అరుచుకుంటూ మాట్లాడతా.. ఇతనిపై అరిచినా వేస్ట్’’ అని సుధీర్ చెప్పాడు. జడ్జిలు సుధీర్‌ను నామినేట్ చేశారు.
రామ్ ప్రసాద్ వచ్చేసి శివ్, శ్వేతను నామినేట్ చేశాడు. శివ్ వచ్చీ రాగానే సోలో ప్లేయర్ అని చెప్పి.. నెక్ట్స్ గేమ్‌కే కలిసి ఆడుదామన్నావని చెప్పాడు. త్రిగుణ్ చేతిలో దారుణంగా మోసపోయావని.. అలాంటి త్రిగుణ్కే గోట్ ఇచ్చి కలిసిపోయావని చెప్పాడు. తన గేమ్ ప్లాన్ ఉందని.. అది చెప్పనని చెప్పాడు. శ్వేతకు దేబ్జాని కరెక్ట్ పాయింట్స్ పెట్టాలని.. దానిని తను సపోర్ట్ చేయలేదని ఏడ్చావని రామ్ ప్రసాద్ చెప్పాడు. దేబ్జాని, నీ మధ్యకు నేను రానని.. మీరు మీరు చూసుకోవడమేనని చెప్పాడు. మరి తనను క్లోజ్ ఫ్రెండ్ అని అలా చేయడంపై ఏడ్చానని శ్వేత చెప్పింది. ఎండ్యూరెన్స్ టాస్క్‌లో మరి తనకు శాక్స్ ఎక్కువ వేశావుగా అని రామ్ ప్రసాద్ అడిగాడు. తనకు అమన్ గెలవాలనిపించిందని అందుకే రామ్ ప్రసాద్‌కు శాక్స్ వేశానని చెప్పింది. దీనిలో శివ్‌ను నామినేట్ చేశారు. రెడ్ లెవల్ సభ్యులకు కూడా నామినేట్ చేసే అవకాశం బిగ్‌బాస్ ఇచ్చారు. అయితే వారు ఒక్కరినే నామినేట్ చేయాల్సి ఉంటుంది.

రోహిత్ వచ్చేసి నరేష్‌ను నామినేట్ చేశాడు. తనకు ఒక్కటే పాయింట్ అని.. లాస్ట్‌లో నువ్వూ, నేనూ మిగిలిపోతే 100 పర్సెంట్ ఇవ్వలేను అన్నారు.. మిమ్మల్ని మీరిలా తక్కువ చేసుకోవడం నచ్చలేదని రోహిత్ చెప్పాడు. నరేష్ నామినేట్ అయ్యాడు. రామకృష్ణ వచ్చేసి వర్షిణిని నామినేట్ చేశాడు. ఇక్కడ గేమ్ అనేది పార్ట్ అన్నారని.. ఇక్కడ గేమ్ మాత్రమే కీలకమని రామకృష్ణ చెప్పాడు. గేమ్‌లో చాలా వీక్ ఉన్నారని చెప్పాడు. వర్షిణి వచ్చేసి తను ఎల్లోలో ఉన్నా కాబట్టి తను గేమ్‌లో పర్ఫెక్ట్ అని చెప్పింది. వర్షిణి నామినేట్ అయ్యింది. నెక్ట్స్ ఝాన్సీ వచ్చి శివ్‌ను నామినేట్ చేసింది. వచ్చిన తొలివారం చైర్స్ టాస్క్ ఆడామని.. అప్పుడు తొడగొట్టి మరీ గెలుస్తామని చెప్పారు. అప్పుడు కంటెండర్ అయ్యే అవకాశమే లేదని ఫీలయ్యారని.. కానీ గోట్ అయ్యే అవకాశం వస్తే మాత్రం వదిలేశారని ఝాన్సీ చెప్పి శివ్‌ను నామినేట్ చేసింది. అమన్ వచ్చేసి శివ నీకు చూపిస్తానంటే అప్పుడు రమ్మని తొడ కొట్టానని శివ చెప్పాడు. శ్వేత వచ్చేసి ఝాన్సీని నామినేట్ చేసింది. ఝాన్సీ కారణంగా తన గేమ్ ఎఫెక్ట్ అయ్యిందని శ్వేత చెప్పింది. బోన్ టాస్క్‌లో తనను స్ట్రాంగ్ అని.. దక్షిని వీక్ అని తీసేసిందని చెప్పింది. అసలు తను ఎవరితో ఆడాలనుకుంటోందో తెలియలేదని చెప్పింది. ఇండివిడ్యువల్ అని చెప్పి అలయెన్స్‌లో ఆడుతోందని చెప్పింది.
ఈవారం ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, సుధీర్, రామ్ ప్రసాద్, వర్షిణి, శివ నామినేట్ అయ్యారు. శ్వేత, నరేష్, వంశీలు నామినేట్ అవలేదని.. వారిలో ఒకరిని ఎలాంటి చర్చలూ లేకుండా చెప్పాలని బిగ్‌బాస్ చెప్పారు. ముఖేష్ వేరొకరితో చర్చిస్తుంటే మీలో మీరు చర్చించుకోవాలని బిగ్‌బాస్ చెప్పారు. దీంతో వంశీని నామినేట్ చేశారు. మొత్తానికి నామనేషన్స్ కన్నా వర్షిణి, త్రిగుణ్ బిగ్‌బాస్‌కి రావడానికి ముందు పెట్టుకున్న డీలే హైలైట్ అయ్యింది. ఈ డీల్‌లో నామినేషన్సా? మరింకేమైనా విషయాలున్నాయా? అనేది తెలియరాలేదు. ఇద్దరూ వచ్చి తొలి రెండు వారాలు రోహిత్‌నే టార్గెట్ చేశారు. ఇది కూడా డీల్‌లో భాగమే అయ్యుండొచ్చని ఆల్రెడీ టాక్ ప్రారంభమైపోయింది.
