Menu
BREAKING
Biggboss10 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి షాలిని ఎలిమినేట్.. ఇక వార్ వన్‌సైడేనా?   |   Biggboss10 Telugu: తప్పులన్నీ రోహిత్‌వే.. రోస్ట్ చేసిన నాగ్..   |   ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ‘తొలిప్రేమ’ సంగీత దర్శకుడు కన్నుమూత..!   |   అక్కినేని కోడలి గ్లామర్ షోపై ఫ్యాన్స్ గుర్రు.. శోభిత బికినీ ఫోటోషూట్ వివాదంలో తప్పెవరిది..?   |   Bigg Boss 10 Telugu: షాలిని రచ్చ.. రామకృష్ణ కాళ్లు పట్టుకుని సారీ.. వైల్డ్ ఫైర్స్‌కు షాకిచ్చిన ఓజీలు!   |   Biggbogss10 Telugu: నామినేషన్స్‌లో వంశీ, శివ్ రచ్చ.. దేబ్జాని బిహేవియర్ వరస్ట్..   |   విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సెన్సార్ రివ్యూ.. ప్లస్ ఏంటి.. మైనస్ ఏంటి..?   |   అవకాశం ఇస్తాను పడుకుంటావా అని అడిగాడు.. హీరోయిన్ సంచలనం..!   |   శ్రీకాంత్ కూతురు మేధ హీరోయిన్‌గా సక్సెస్ అవుతుందా..?   |   Biggboss10 Telugu: మరీ చిల్లరగా మారిన షాలిని.. ఈవారం ఎలిమినేట్ అవుతుందా?   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌ను టార్గెట్ చేస్తున్న హౌస్‌మేట్స్.. షాలినిని కాపాడుతున్నారా?   |   జైలర్ 2కు అక్కడ షోస్ క్యాన్సిల్.. రజినీకాంత్ పప్పులు ఉడకలేదు..!   |   సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ మధ్య ఏం జరుగుతుంది.. అక్కడే బీజం పడిందా..?   |   400 కోట్ల సినిమాకు ఇదేం తిప్పలు.. హనుమాన్ అంశ్ తెలుగులో అందుకే ఆడలేదా..?   |   అమలాపాల్ ఆపసోపాలు చూస్తున్నారా… ఇప్పుడు వర్కవుట్ అవుతుందా..?

Biggboss10 Telugu: తప్పులన్నీ రోహిత్‌వే.. రోస్ట్ చేసిన నాగ్..

Biggboss10 Telugu: తప్పులన్నీ రోహిత్‌వే.. రోస్ట్ చేసిన నాగ్..

షో ప్రారంభం కాగానే శుక్రవారం ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూశారు. ఝాన్సీ గురించి ముఖేష్, వర్షిణి మాట్లాడుకుంటున్నారు. తను కెప్టెన్సీ టాస్క్ నుంచిచ వైదొలగడానికి కారణం ఝాన్సీయేనని ముఖేష్ బాధపడుతున్నాడు. మరోవైపు ముఖేష్ అతని వైపు చూడలేదని ఝాన్సీ పెద్దగా ఏడుపు లంకించుకుంది. వంశీ, త్రిగుణ్.. ముఖేష్ గురించి మాట్లాడుకుంటున్నారు. పాముకు పాలు పోసినా దాని బుద్ది చూపిస్తుందని త్రిగుణ్ అన్నాడు. నాడు ఎలిమినేషన్‌లో వర్షిణి ఉండటం వల్లనే సేవ్ చేశాడని తన కోసం సేవ్ చేయలేదని వంశీ అన్నాడు. తనపై చిన్న కన్సిడరేషనే ఝాన్సీకి లేదని ముఖేష్ బాధ పడుతున్నాడు. ‘వాళ్ల బొమ్మలాగా ఉంటే నువ్వు గుడ్.. లేదంటే ఎగెనెస్ట్’ అని ఝాన్సీకి దేబ్జాని హిత బోధ చేసింది. ఆ తరువాత ఒక ప్రమోషనల్ టాస్క్ జరిగింది. ఆ తరువాత ముఖేష్ వెళ్లి ఝాన్సీని ఓదార్చాడు. రామ్ ప్రసాద్ వెల్లి వాష్‌రూమ్‌లో కూర్చొన్నాడు. అక్కడ బట్టలు ఉంటే తీసి త్రిగుణ్ కిందేశాడు. ఇక్కడ జబ్బులున్న మృగాలు చాలా ఉన్నాయని సుధీర్‌తో త్రిగుణ్ అన్నాడు. హిపోక్రేట్, డబుల్ స్టాండర్డ్ అని షాలినిని త్రిగుణ్ కామెంట్ చేశఆడు.

బట్టలు తీసి కిందేయడంపై త్రిగుణ్‌తో రోహిత్‌ గొడవపడ్డాడు. ఈసందర్భంగా బట్టలు కింద పడేసి తొక్కుకుంటూ వెళ్లాడని రోహిత్ బాగా ఫైర్ అయ్యాడు. జనాలు ఈడ్చి కొడతారని..బుద్ది లేదని.. సిగ్గు లేదని రోహిత్ చాలా మాటలు జారాడు. నిన్నటి నంచి అతన్ని మెంటల్‌గా త్రిగుణ్ ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో బాగా ఫ్రెస్టేట్ అయినట్టున్నాడు. తను ఇంటికి వెళ్లిపోవాలని డిసైడ్ అయితే మాత్రం ఎవరికి ఇవ్వాల్సినవి ఇచ్చేసి వెళ్లిపోతానని చెప్పాడు. ఇద్దరూ ఈ నేపథ్యంలో గట్టిగా గొడవ పడ్డారు. గాడిదల్లా ఉన్నారు.. ఇలా చీప్ పనులు చేస్తున్నారని రోహిత్.. పందుల్లా ఉన్నారని త్రిగుణ్ నానా రచ్చ. తరువాత ఫోన్‌పే నుంచి కెప్టెన్‌కు గోల్డ్ కాయిన్స్ వచ్చాయి. వాటిని నరేష్‌, దేబ్జానిలకు రామ్ ప్రసాద్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ తరువాత మరో ప్రమోషనల్ టాస్క్. ఆ తరువాత రోహిత్, షాలిని మధ్య తనను పేరుతో పిలిచే విధానంలో మార్పు వచ్చినందుకు ఆమె అతడిని ప్రశ్నించింది. మళ్లీ వీళ్లిద్దరి మధ్య గుసగుసలు ప్రారంభమయ్యాయి. బిగ్‌బాస్ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా వీళ్లిద్దరూ మారనే మారరు. త్రిగుణ్ వచ్చి కామెడీ చేశఆడు. మరోవైపు ముఖేష్, వర్షిణి కూడా గుసగుసలాడుతున్నారు. వాళ్లకు కూడా బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చారు. పడుకున్న తర్వాత కూడా ఇద్దరూ సైగలు చేసుకున్నారు. దీంతో బిగ్‌బాస్ మళ్లీ వార్నింగ్ ఇచ్చారు.

Biggboss10 Telugu: తప్పులన్నీ రోహిత్‌వే.. రోస్ట్ చేసిన నాగ్..

నాగ్ చాలా సీరియస్‌గా కంటెస్టెంట్స్ ముందుకు వెళ్లారు. తరువాత రామ్ ప్రసాద్‌కు కంగ్రాట్స్ చెప్పారు. ‘నువ్వు కొంచెం కన్నింగే కానీ గేమ్ కోసం కన్నింగ్ అని వాళ్లకు తెలుసు’ అని నాగ్ అన్నారు. కెప్టెన్‌గా మీ కెపాసిటీ డిసైడ్ చేస్తానని వాష్‌రూమ్ గొడవ గురించి తీశారు. దానిలో ఎవరిది తప్పు? అని రామ్ ప్రసాద్‌ను నాగ్ అడిగారు. త్రిగుణ్‌దే తప్పని.. రోహిత్ బట్టలను కిందేసి తొక్కి వెళ్లాడని తనకు రోహిత్ చెప్పాడని రామ్ ప్రసాద్ చెప్పాడు. ఆ వీడియో ప్లే చేసి చూపించారు. ఆ సమయంలో రామ్ ప్రసాద్ కూడా అక్కడే ఉన్నాడు. తప్పు ఎవరిది అని నాగ్ మరోసారి రామ్ ప్రసాద్‌ను అడిగారు. వాష్‌రూమ్‌లో బట్టలు ఎక్కడపడితే అక్కడ ఎందుకు ఉంటున్నాయని నాగ్ అడిగారు. బట్టలు సర్దుకునే సమయం ఉండట్లేదా? అని నాగ్ అడిగారు. వాష్‌రూమ్ గొడవలో తప్పెవరిదని మళ్లీ నాగ్ అడిగారు. రోహిత్ తన బట్టలు అక్కడే పెట్టడం అతనిదే తప్పని చెప్పాడు. రోహిత్ బట్టలు తెలియక పెట్టానని త్రిగుణ్ చెప్పాడు. అసలు డైలీ చూస్తున్నప్పుడు ఎవరి బట్టలేవో తెలియకుండా ఎలా ఉంటుంది? దీనికి త్రిగుణ్ తనకు తెలియదనడం.. నాగ్ నమ్మడం ఇంట్రస్టింగ్. ఈ బట్టల గురించి చాలా సేపు చర్చ జరిగింది. సుధీర్‌ను కూడా ఎందుకు కంటెస్టెంట్స్‌కు చెప్పలేదని అడిగారు. శివ్ అయితే వాష్‌రూమ్‌లో బట్టల గురించి చెప్పినా కూడా సుధీర్ పట్టించుకోలేదని చెప్పాడు. తను ప్రాబ్లమ్ సాల్వ్ చేశానని రామ్ ప్రసాద్ చెప్పాడు. ఫ్యూచర్‌లో ఇక మీదట గొడవ రాదని రోహిత్, త్రిగుణ్‌కు థాంక్స్ చెప్పమని నాగ్ చెప్పారు.

కంటెస్టెంట్స్ అందరినీ ‘మీకు సిగ్గులేదా? 24 అవర్స్ లైవ్ వస్తోంది. మీ బట్టలు మీరు చూసుకోలేరా?’ అని నాగ్ ఫైర్ అయ్యారు. ఆ తరువాత త్రిగుణ్ లేచి తను ఆ ప్రాబ్లమ్ గురించి చెబుతూనే ఉన్నానని కానీ ఎవరూ సాల్వ్ చేయలేదని చెప్పాడు. అప్పుడు త్రిగుణ్‌తో.. ‘ప్రాబ్లమ్‌ని రైజ్ చేస్తావు.. దానిని చాలా పెద్దదాన్ని చేస్తావు. ఫైనల్‌గా నీకు సంబంధం లేదని చెబుతావు’ అని నాగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ తరువాత ‘కోచ్ నీతూ కన్ఫెషన్ రూమ్‌కి రా’ అని పిలిచారు. ‘నువ్వు గేమ్ ఆడటానికి వచ్చావా? కంటెస్టెంట్స్‌కి కోచింగ్ ఇవ్వడానికి వచ్చావా?’ అని నాగ్ అడిగారు. ఈ సందర్భంగా నీతూ, రోహిత్‌కి సంబంధించిన వీడియోలను ప్లే చేశారు. రోహిత్‌కు షాలినికి దూరంగా ఉండమంటూ చెప్పిన వీడియోలవి. ఎందుకు రోహిత్‌కు చెప్పావని అడిగారు. రోహిత్ వాళ్లమ్మగారు కాల్ చేసి ఏడ్చారని.. అందుకే చెప్పాల్సి వచ్చిందని నీతూ చెప్పింది. ‘నీకు అవన్నీ అవసరమా?’ అని నాగ్ అడిగారు. వైల్డ్ కార్డ్స్‌లో పవర్ గెలిచిన ఒకే ఒక కంటెస్టెంట్ నువ్వని నాగ్ చెప్పారు. ఇప్పుడు ఆ ఆట ఎక్కడిదని అడిగారు. టాస్క్ అయిపోయిన తర్వాత ఎందుకు గొడవ.. ముందు ఏం చేస్తున్నావని అడిగారు. కేవలం నీ కోసమే వచ్చాక వేరొకరితో నీకెందుకని అడిగారు. వేరే వాళ్లకి ఎందుకు చెప్పలేదంటే.. అందరికీ చెప్పానని నీతూ చెప్పింది. అందరికీ చెప్పావు కదా.. నీకు పనిష్మెంట్ ఏంటని నాగ్ అడిగారు. నాగ్‌నే చెప్పమని చెప్పడంతో.. ఇది కంప్లీట్ వైలెన్స్ ఆఫ్ బిగ్‌బాస్ రూల్ అని ఇంకోసారి బ్రేక్ చేస్తే గేట్లు తీసి బయటకు పంపిస్తానని నాగ్ వార్నింగ్ ఇచ్చారు.

షాలినిని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. నీతూ వీడియో చూపించారు. సోలో ఆడమంటూ రోహిత్‌కు సలహా ఇచ్చిన వీడియోను ప్లే చేసి చూపించారు. ఆ తరువాత నామినేషన్ రూల్స్ ఎందుకు బ్రేక్ చేశారని నాగ్.. షాలిని, అమన్, రోహిత్‌ను అడిగారు. దానికి సంబంధించిన వీడియో ప్లే చేసి చూపించారు. మూడు వారాలుగా చెబుతున్నా కూడా పట్టించుకోవడం లేదని.. ఎన్నిసార్లు తన మేలు గురించి చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని.. ఈ ముగ్గురికి ఈవారం కెప్టెన్సీ కంటెండర్‌షిప్ ఉండదని నాగ్ పనిష్మెంట్ ఇచ్చారు. షాలిని సారీ చెబితే చాలా విషయాలకు నువ్వు సారీ చెప్పాలని అన్నారు. ఆ తరువాత నిన్నటి టాస్క్‌లో షాలిని.. త్రిగుణ్‌ను బూతు మాట మాట్లాడిన వీడియోను చూపించారు. తను ఆ వర్డ్ అన్నది బ్యాడ్‌గా కాదని.. అది వినడానికి రూడ్‌గా ఉందని షాలిని చెప్పింది. కారణం ఏదైనా కావొచ్చు.. ఫౌల్ లాంగ్వేజ్ అని నాగ్ చెప్పారు. ఆడియెన్స్ కూడా ఆ మాట తప్పేనని షాలిని చెప్పింది. తను అలా మాట్లాడటం తప్పని చెప్పారు. అంతకంటే హార్ట్ బ్రేక్ అయిన సిట్యువేషన్ లేదా నీకు అని నాగ్ అడిగారు. త్రిగుణ్ గురించి ఎంత మంది చెప్పినా తను వినలేదని తన అన్న అనుకున్నానని కానీ ఎంత అడిగినా కానీ త్రిగుణ్ వినలేదని షాలిని చెప్పింది. షాలిని చెబుతుంటే త్రిగుణ్ చాలా వెటకారంగా నవ్వుతూ ఉన్నాడు.

డ్యాగర్ గేమ్‌లో రోహిత్ నీకు డ్యాగర్ ఇచ్చినప్పుడు అది కరెక్టా? అని అడిగారు. మధ్యలో రోహిత్ రావడంతో ఇదేమైనా నామినేషనా? మధ్యలోకి వస్తున్నావని నాగ్ ప్రశ్నించారు. సుధీర్‌ను కూడా నీ కెప్టెన్సీలో నామినేషన్స్ మధ్యలో అలా వేరేవాళ్లు వస్తుంటే సైలెంట్‌గా ఉండటం కరెక్ట్ కాదని చెప్పారు. అసలు నామినేషన్స్ మధ్యలోకి సుధీరే ప్రతి దానిలోనూ దూరిపోయాడు. కానీ నాగ్ దాని గురించి ప్రశ్నించలేదు. డ్యాగర్ గేమ్ అనేది ఇండివిడ్యువల్.. దానిని నిన్నటి టాస్క్‌తో లింక్ పెట్టడం చూస్తుంటే సెలబ్రిటీలకు పూర్తిగా ఫేవరిటిజం చూసిస్తున్నట్టుగా ఉంది. ఇక షాలిని.. త్రిగుణ్‌కు సారీ చెప్పింది. షాలినికి ఏ పనిష్మెంట్ ఇద్దామని రోహిత్‌ను నాగ్ అడిగారు. డబుల్ డ్యూటీ ఇద్దామని రోహిత్ చెప్పాడు. ఇక షాలినికి సంబంధించి మరో వీడియో నాగ్ చూపించారు. నామినేషన్స్‌లో నీతూ, షాలినికి మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో అది. నీతూ నిన్ను తోసిందా? అని షాలినిని అడిగారు. తనను కొట్టినప్పుడు అని అడగ్గానే కొట్టిందా? అని నాగ్ అడిగారు. ట్యాప్ చేసిందని.. మెంటల్ అనడం నీ స్లాంగా? అని నాగ్ అడిగారు. నీతూ, షాలిని గొడవలో తప్పెవరిదని నాగ్ రోహిత్‌ను అడిగారు. అప్పుడు షాలినిదే తప్పని రోహిత్‌ చెప్పాడు. ఎవరైనా హౌస్‌లోకి వచ్చాక వ్యక్తులు మారారని అలా గొడవ చేస్తే చూసేవాళ్లు నీకు మెంటల్ అనుకుంటారని షాలిని చెప్పింది. జరగనిది జరిగినట్టుగా చెప్పినందుకు నీతూ కాళ్లు మొక్కుతావా? అని అడిగారు. కాళ్లు మొక్కేందుకు తనకు ఏ ప్రాబ్లం లేదని షాలిని చెప్పింది. తనకు తెలుసని కానీ కాళ్లు మొక్కించుకునే వాళ్లకు ఉండాలి కదాని రోహిత్ కాళ్లు పట్టుకున్న టాపిక్‌ను తీశారు. ఇక మీదట నువ్వు మారకుంటే నిన్నెవరూ కాపాడలేరని షాలినికి నాగ్ చెప్పారు.

ఇక ఆ తరువాత అమన్‌ను లేపి.. నీయమ్మ అన్నందుకు సారీ చెప్పావని.. అది కావాలని అనలేదని అన్నావని.. కానీ గొడవ సమయంలో కావాలనే అన్నట్టుగా చెప్పావని నాగ్ అన్నారు. ఆ వీడియోను ప్లే చేసి చూపించారు. ఆ తరువాత రోహిత్‌తో నీ గొడవ ఏంటని ప్రశ్నించారు. రోహిత్, షాలిని వచ్చి హెల్ప్ అడిగారని అమన్ చెప్పాడు. కానీ అది తప్పని తను, రోహిత్ కాదని.. తనొక్కదాన్నే వెళ్లి అడిగానని చెప్పింది. ఇందాక త్రిగుణ్ చేసిన దానికి చాలా బాధపడ్డావు కానీ నువ్వు చేసింది కూడా అదే కదా అని నాగ్ ప్రశ్నించారు. తనకు త్రిగుణ్, దేబ్జాని చెప్పడం వల్లనే తను అమన్‌తో మాట్లాడానని షాలిని చెప్పింది. తను రామ్ ప్రసాద్‌తో ఎలాంటి డీల్ మాట్లాడలేదని దేబ్జాని చెప్పింది. తను షాలినిని ‘సపోర్ట్ చేయడానికి నీకు ఎవరైనా ఉన్నారా?’ అని మాత్రమే అడిగానని దేబ్జాని చెప్పింది. త్రిగుణ్‌ని లేపి అమన్‌తో మాట్లాడమని చెప్పావా? అని నాగ్ అడిగారు. అవునని త్రిగుణ్ చెప్పాడు. షాలిని చెప్పేది నిజమా? త్రిగుణ్ చెప్పేది నిజమా? అని అమన్‌ను అడిగారు. త్రిగుణ్ చెప్పేది నిజమని అమన్ చెప్పాడు. అప్పుడు షాలినిని అడిగారు. ప్రతి ఒక్కరికీ ఒక్కో రౌండ్‌లో ఆడటానికి వచ్చిందని.. కానీ తనకు అవకాశమివ్వలేదని చెప్పింది. రోహిత్ లేచి షాలిని చేసింది 100 పర్సెంట్ కరెక్ట్ అని రోహిత్ చెప్పాడు. షాలిని చేసింది కరెక్ట్ అనే తను చెబుతున్నానని.. అవతలి వాళ్లు ఏం చేస్తున్నారో మీరూ అదే చేస్తున్నారని చెప్పింది. దీని గురించి చాలా సేపు చర్చ జరిగింది. మొత్తానికి నాగ్.. త్రిగుణ్ చేసింది కూడా రైటే అన్నట్టుగా చెప్పారు. బ్యాక్‌స్టాబ్ కాదని తేల్చారు. ఇప్పటికే సోషల్ మీడియా త్రిగుణ్‌పై భగ్గుమంటోంది.

నాగ్ బ్రేక్ ఇచ్చినప్పుడు షాలిని, అమన్‌ల మధ్య గొడవ జరిగింది. ఇప్పటి వరకూ నిన్ను చూసినప్పుడు మన అనుకున్నానని.. ఈ రోజు నుంచి మన అనేది ఉండదని అమన్ చెప్పాడు. మరోవైపు త్రిగుణ్ వాళ్లు చేసిన వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదు? అవన్నీ ఎటు పోతున్నాయి? ఏడుపు వస్తోందని రామ్ ప్రసాద్‌కు రోహిత్ చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది నిజమే సెలబ్రిటీలు చేసిన ఏ వీడియో కూడా నాగ్ ప్లే చేయరు. దీనిపై బయట ఎంత రచ్చ జరుగుతున్నా కూడా పట్టించుకోరు. తనే నాగ్‌ను స్ట్రాంగ్ ప్లేయర్స్ కంటెండర్ రేసులో లేకుంటే ఎలా అని అడుగుతానని రామ్ ప్రసాద్ చెప్పాడు. రామ్ ప్రసాద్‌ను నాగ్ లేపి తనకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అని అడిగారు. వాళ్ల ముగ్గురినీ ఎక్స్‌క్యూజ్ చేయమని చెప్పాడు. కానీ మూడు సార్లు వాళ్లు తప్పు చేస్తే క్షమించాలా? అని రామ్ ప్రసాద్‌ను అడిగారు. అవసరం లేదని చెప్పాడు. రోహిత్‌ను లేపి నీ బాధ ఏంటని నాగ్ అడిగారు. మనమంతా తన గురించి మాట్లాడాలన్నదే త్రిగుణ్ ఇన్‌టెన్షన్ అని నాగ్ చెప్పారు. అతను.. అతను అంటున్నావని అతని ఇంటెన్షన్ నెరవేరిందని నాగ్ చెప్పడంతో అతను కూల్ అయ్యాడు. తిండి దగ్గర అంత గొడవ ఎందుకని అమన్‌ను లేపి నాగ్ అడిగారు. దొబ్బితింటున్నారని నీ గురించి మాత్రమే రోహిత్ అన్నాడా? అవునన్నట్టుగా అమన్ చెప్పాడు. రోహిత్ దొబ్బితింటున్నారని అన్న వీడియోను నాగ్ చూపించారు. దానిని చూసి అమన్‌నే అంటున్నట్టుగా ఉందని రామ్ ప్రసాద్ చెప్పాడు.

తింటున్నప్పుడు అలా అనడం కరెక్ట్ కాదని.. ఇప్పుడు ఏం చేద్దామని రామ్ ప్రసాద్‌ను నాగ్ అడిగారు. రోహిత్‌కు పనిష్మెంట్ ఇద్దామన్నారు. పనిష్మెంట్ అతను అంగీకరించడు కదాని నాగ్ అడిగారు. నరేష్‌ను లేపి ఇప్పుడు వీడియో చూశావు కదా అని తప్పెవరిదని నాగ్ అడిగారు. రోహిత్‌దేనని నరేష్ చెప్పాడు. అప్పుడు రామ్ ప్రసాద్ కూడా రోహిత్‌దే తప్పని పనిష్మెంట్ ఇద్దామన్నాడు. దానికి అమన్‌ను రోహిత్ నీ క్లోజ్ ఫ్రెండ్ కదా.. ఏదైనా మాట అంటే లైట్ తీసుకోవాలని నాగ్ చెప్పారు. అతను ఫాస్టింగ్‌లో ఉండి ఫ్రెస్టేషన్‌లో ఏదో మాట్లాడితే అంత గొడవ చేస్తావా? అని నాగ్ అడిగారు. ఇక అమన్ ఆటను ‘గెలుపు గుర్రం’ అని చెప్పారు. రోహిత్ మాత్రం ఇవాళ బాగా డౌన్ అయిపోయినట్టుగా అనిపించాడు. నాగ్ ప్రతి దానికీ రోహిత్ సెంట్రిక్‌గా ఇస్తున్న కౌంటర్స్‌తో అతనికి మొహంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. మొత్తానికి నాగ్ అయితే రోహిత్‌ను బాగా రోస్ట్ చేశారు. తరువాత త్రిగుణ్‌ను లేపి నీ ఆలోచనా ధోరణిని మార్చుకోమని చెప్పారు. రొట్ట గ్యాంగ్ అని ఎందుకు అన్నావని అడిగారు. తన వెనుక ప్లాటింగ్ చేస్తున్నారని అందుకే అలా మాట్లాడానని చెప్పాడు. ప్లాటింగ్ గురించి నువ్వు చెబుతున్నావా? అని నాగ్ అడిగారు. ‘అవతలి వాళ్లకు నువ్వేం చేస్తున్నావో.. వాళ్లూ అదే చేస్తున్నారని.. కంట్రోల్ యువర్ టంగ్’ అని నాగ్ చెప్పారు.

Biggboss10 Telugu: తప్పులన్నీ రోహిత్‌వే.. రోస్ట్ చేసిన నాగ్..

త్రిగుణ్ ఏదో చెబుతుంటే.. నువ్వేం చెప్పినా తాను మ్యానిప్యులేట్ అవనని నాగ్ చెప్పారు. వంశీ, శివ్ టాస్క్‌లో నువ్వు తీసుకున్న నిర్ణయం ఫెంటాస్టిక్ అని నాగ్ ప్రశంసించారు. ఫుడ్ విషయంలో అన్ని గొడవలు ఎందుకు చేస్తున్నావని అడిగారు. త్రిగుణ్, రోహిత్ ఫుడ్ విషయంలో ఎవరిది రాంగ్ అంటే త్రిగుణ్‌దని సుధీర్ చెప్పాడు. వర్షిణిని లేపి అడిగితే తనకు ఆకలి అవుతుందని చెప్పాను కానీ తను రెడీ అవుతున్న ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పింది. తనైదే వాళ్లను అడిగి పెట్టేదాన్నని వర్షిణి చెప్పింది. దానికి సంబంధించిన వీడియో నాగ్ చూపించారు. మొత్తానికి ఆ గొడవలో సుధీర్‌ది తప్పని నాగ్ చెప్పారు. మోస్ట్ లీనియంట్, హోప్‌లెస్ కెప్టెన్ అని సుధీర్‌ను విమర్శించారు. త్రిగుణ్‌ను నువ్వు చేసింది మంచి పనే అయినా కూడా నువ్వు దానిని చెప్పకపోవడం వలన అది రాంగ్‌గా పోట్రే అవుతోందని నాగ్ చెప్పారు. రోహిత్‌ను లేపి త్రిగుణ్‌కు ఏం పనిష్మెంట్ ఇద్దామని నాగ్ అడిగారు. కిచెన్‌లోని ఏ పనిలోనూ ఇన్వాల్వ్ కాకుండా చూడమని చెబితే అది కుదరదని నాగ్ చెప్పారు. అయితే క్షమించేద్దామని రోహిత్ చెప్పాడు. ఈవారం టాస్క్‌లు ఆడావా? అంటే ఒక్కటే ఆడే టాస్క్ వచ్చిందనడంతో ఛాన్స్ రాదని తీసుకోవాలని నాగ్ చెప్పారు. తీసుకోవాలంటే అంతా యాక్సెప్ట్ చేయాలి కదా. వైల్డ్ ఫైర్స్‌ను లేపి బిగ్‌బాస్ వీళ్లనా మీరు వైల్డ్ ఫైర్స్ అన్నదని నాగ్ అన్నారు. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందామని చెప్పి షో ముగించారు. మొత్తానికి తప్పులన్నీ రోహిత్ నెత్తిపైనే వేసి నాగ్ రోస్ట్ చేశారు.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360