
బిగ్‌బాస్ హౌస్‌లో ఈ సీజన్‌లో గొడవ లేని రోజంటూ ఉందా? ఇవాళ కూడా గొడవలు అయ్యాయి. అయితే ఇంతకు ముందు రోజులతో పోలిస్తే అంత పెద్ద గొడవలైతే కావు. ఇక ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. రోహిత్ కర్రీ పడేశాడని.. అలా చేయవద్దని చెప్పమని అమన్‌కు త్రిగుణ్ చెప్పాడు. అమెజాన్ నుంచి ఝాన్సీ, ముఖేష్‌లకు గిఫ్ట్‌లు వచ్చాయి. దేబ్జానిని చరణ్ ఫ్లర్ట్ చేస్తున్నాడు. ఆమె రైస్ కడుగుతుంటే వెళ్లి నీ అమృత హస్తాలతో వండుతున్నావు కాబట్టే కొంచెం తిన్నా కడుపు నిండుతోందని చెప్పాడు. అపూర్వ మాట్లాడిన మాటల గురించి త్రిగుణ్ వెళ్లి షాలిని, రోహిత్‌కు చెబుతున్నాడు. మరోవైపు అక్కడేం జరుగుతోందో తెలుసుకోవాలని దేబ్జాని అంటోంది. అసలే దేబ్జాని ఈ మధ్య నెగిటివ్ అవుతోంది. ఇలాంటి పనులతో మరింత నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. వర్షిణి అమన్, చరణ్, అపూర్వ ఉన్న దగ్గరకు వచ్చి వెళ్లిపోతుంటే.. అమన్ ఆపాడు. ‘పిల్ల బచ్చా’ డిస్కషన్స్ దగ్గర తానుండని వర్షిణి సెటైర్ వేసింది. ఏ క్షణమైతే ‘పని దొంగా’ అంటూ త్రిగుణ్ పాడాడో కానీ అది అందరి నోళ్లలో నానుతోంది. అమన్ వాష్ రూమ్‌కి వెళ్లాడట.. అప్పుడు అపూర్వ వెళ్లి అమన్ త్వరగా బయటకు రా అని అడిగిందట. ఆ విషయం చెప్పడంతో అపూర్వ ఫీలై వెళ్లిపోయింది. మరోవైపు ఝాన్సీ.. రామ్ ప్రసాద్ దగ్గర కూర్చొని త్రిగుణ్ ఎంత చెప్పినా రోహిత్ వినడని.. వాళ్లసలు రోహిత్‌ను నామినేట్ చేయరని చెబుతోంది. ఇలాంటి విషయాలు చెప్పి ఝాన్సీ నెగిటివ్ అవుతోంది.
ఇప్పుడు అమన్ వంతు. చరణ్ ఫ్లర్ట్ చేసిన కాసేపటికే దేబ్జానిని ఫ్లర్ట్ చేయడం అమన్ మొదలు పెట్టాడు. నెక్ట్స్ టాస్క్ ప్రారంభమైంది. ఆ టాస్క్ పేరు ‘స్టెప్ రోల్ స్క్రోల్’. ఈ టాస్క్ అందరికంటే ముందుగా పూర్తి చేసిన వారికి 100 పాయింట్స్ వస్తాయి. ఆ తరువాత నుంచి ఒక్కొక్కరికి 20 చొప్పున తగ్గుతాయి. ఈ టాస్క్ మధ్యలో బ్రేక్ వచ్చింది. ఇక నెక్ట్స్ టాస్క్ ఎలా ఆడాలో రోహిత్, షాలినికి రామ్ ప్రసాద్ సలహాలు ఇస్తున్నాడు. ఆ సమయంలో అమన్, షాలిని వచ్చి కూర్చొన్నారు. వాళ్లిద్దరినీ రోహిత్ బయటకు వెళ్లమన్నాడు. ఈ టాస్క్‌ను ఫస్ట్ నుంచి అమన్, రామ్ ప్రసాద్, ముఖేష్, షాలిని, అపూర్వ వరుసగా పూర్తి చేశారు. బాల్ స్లాట్‌కి వెళితే చాలు అన్నారని కానీ తను వేసిన బాల్స్‌ను కన్సిడర్ చేయలేదని అపూర్వ చాలా గొడవ చేసింది. దీనిపై వంశీ అపూర్వను గట్టిగా అరిచాడు. అపూర్వ మాట్లాడుతుంటేనే ఆమెతో మాట్లాడటం వర్త్ లెస్ అని అక్కడి నుంచి దేబ్జాని వెళ్లిపోయింది. వాస్తవానికి దేబ్జాని ఎదుటి వ్యక్తి చెప్పేది వినేందుకు సిద్ధంగా లేదు. మొన్న రోహిత్‌ను నామినేట్ చేసి కూడా ఇలాగే చేసింది. రోహిత్.. అపూర్వతో తను రామ్ ప్రసాద్‌తో మాట్లాడుతుంటే బయటకు వెళ్లమన్నందుకు కారణం చెప్పాడు. ఆ సమయంలో షాలిని వచ్చి కూల్‌గా ఉన్న వ్యవహారాన్ని హాట్‌గా చేసింది. రోహిత్ ఏదో మాట్లాడుతుంటే మధ్యలో చేరి షాలిని రచ్చ చేయడం దారుణం. రోహిత్‌కు షాలిని పెద్ద అవరోధంగా మారింది. షాలినితో ఇదే కంటిన్యూ అయితే విన్నర్ కాదు కదా.. రన్నరప్ కూడా అవలేడు.

త్రిగుణ్.. అపూర్వ దగ్గరికి వచ్చి అరవనంటే ఒక విషయం చెబుతానని ఆమెను టాస్క్ విషయంలో కన్విన్స్ చేశాడు. ఆ తరువాత షాలిని దగ్గరకు వెళ్లి అపూర్వ గురించి మాట్లాడటం ప్రారంభించాడు. రామ్ ప్రసాద్ తమతో మాట్లాడుతుంటే అపూర్వ రావడం గురించి ఆ తరువాత ఏం జరిగిందో త్రిగుణ్‌కు వివరించింది. త్రిగుణ్, షాలిని మాట్లాడుకోవడం చూసిన రోహిత్.. ఆమెను వాళ్లు రెచ్చగొడుతున్నారని.. ఆమె అదే కరెక్ట్ అనుకుని రెచ్చిపోతున్నాడని చెప్పింది. ఇక స్కోర్స్ వచ్చాయి. అమన్, త్రిగుణ్‌కి 180, షాలిని, రోహిత్‌కి 60.. మిగిలిన మూడు టీమ్స్‌కి 120 పాయింట్స్ వచ్చాయి. షాలిని, రోహిత్ లీస్ట్‌లో ఉన్నారు కాబట్టి వాళ్లే ఎలిమినేట్ అవుతారు కదాని దేబ్జాని అంటుంటే ఎస్ అని సుధీర్ చెప్పాడు. మొత్తానికి వీళ్లు రోహిత్, షాలిని ఎలిమినేట్ అవుతారని గట్టిగా అనుకుంటున్నారు. త్రిగుణ్ గురించి దేబ్జాని, వర్షిణికి చెబుతోంది. రోహిత్ వాళ్ల నుంచి ఇన్ఫర్మేషన్ గేదర్ చేసే పనిలో ఉన్నాడని చెప్పింది. ఇక అందరూ కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో దిగి ఎంజాయ్ చేశారు. వర్షిణి, ముఖేష్ స్విమ్మింగ్ పూల్‌లో దారుణం.. దానికి తగ్గట్టుగా బిగ్‌బాస్ సాంగ్ వేశాడు. మరోవైపు రోహిత్ షాలిని బయట డ్యాన్స్. ఈ దారుణాలు బిగ్‌బాస్ చూసేవారికి పెద్ద పరీక్షే.

ఆ తరువాత ‘రోడ్ టు రీలోడ్’లో భాగంగా తొలి రెండు టాస్క్‌ల్లో విజయం సాధించడంతో ఆ ఇద్దరికీ నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ లభించింది. వారిద్దరి ఫోటోలను ఎండిన చెట్టు నుంచి వికసించిన చెట్టుకి తగిలించారు. ఆ తరువాత మూడవ టాస్క్ ప్రారంభమైంది. టాస్క్ పేరు ‘చిత్రం భళారే విచిత్రం’. సంచాలకులు కొన్ని చిత్రాలను గీస్తారు. అవి గుర్తు పెట్టుకుని బోర్డుపై గీయాలి. సంచాలక్ నంబర్ చెప్పినప్పుుడు ఆ నంబర్‌లోని వస్తువును తీసుకొచ్చి అక్కడున్న సర్కిల్‌లో పెట్టాలి. నరేష్, అపూర్వ, ఝాన్సీ, షాలిని గీశారు. వస్తువులను రామ్ ప్రసాద్, చరణ్, ముఖేష్, రోహిత్ తీసుకొచ్చారు. లెవల్ 1లో రోహిత్ తీసుకొచ్చాడు. అయితే ఆర్టిస్టులు గీసినవి గుర్తించడం చాలా కష్టంగా ఉండటంతో మరోసారి డ్రా చేయించమని బిగ్‌బాస్ చెప్పారు. ముఖేష్‌కు ఝాన్సీ మొత్తం చెప్పేసింది. ఇది చెప్పడమేంటని షాలిని ప్రశ్నించింది. దీని గురించి గొడవ జరిగింది. షాలిని కూడా చెప్పడం చూశానని త్రిగుణ్ చెప్పాడు. దీంతో తనకు చెప్పలేదని ఒకవేళ చెప్పినట్టుగా నిరూపిస్తే గేమ్ నుంచి డిస్‌క్వాలిఫై అవుతానని.. ఓపెన్ ఛాలెంజ్ అని రోహిత్ చెప్పాడు. ఝాన్సీ అయితే ఈ టాస్క్‌లో చీటింగ్ చేసింది. మళ్లీ టాస్క్ ప్రారంభమైంది.

ఝాన్సీ మొత్తం చెప్పిన తర్వాత సీక్వెన్స్ మారలేదని.. ఇదెలా అని షాలిని ప్రశ్నించింది. దీంతో గొడవ జరిగింది. ఎల్లో టీం మినహా అందరినీ త్రిగుణ్ డిస్‌క్వాలిఫై చేశాడు. తరువాత ముఖేష్‌కు ఝాన్సీ సైగలు చేసిందని ఆ రౌండ్ నుంచి ముఖేష్‌ను తొలగించాడు త్రిగుణ్. దీంతో తనను డిస్‌క్వాలిఫై చేశారని ముఖేష్ ఫైర్ అయ్యాడు. రెండో రౌండ్‌లో రోహిత్ గెలిచాడు. మూడో రౌండ్‌లో రామ్ ప్రసాద్ గెలిచాడు. నాలుగో రౌండ్‌లో చరణ్ గెలిచాడు. ఐదో రౌండ్‌లో రామ్ ప్రసాద్ గెలిచాడు. ఆరో రౌండ్ రామ్ ప్రసాద్.. ఏడో రౌండ్ చరణ్ గెలిచాడు. ఎనిమిదో రౌండ్ కూడా రామ్ ప్రసాద్ గెలిచాడు. లోపల ఉన్న వర్షిణి ప్లేసులు మార్చడం లేదని రోహిత్ కంప్లైంట్ చేశాడు. అయితే గ్రేప్స్ మార్చలేదని రామ్ ప్రసాద్ కూడా చెప్పాడు. అందరి కంటే ఎక్కువ పాయింట్స్ సాధించి ఈ టాస్క్‌లో రామ్ ప్రసాద్, నరేష్ టాప్‌లో ఉన్నారు. రెండో స్థానంలో షాలిని, రోహిత్.. అపూర్వ, చరణ్ సెకండ్ పొజిషన్.. ఝాన్సీ, ముఖేష్ మూడో స్థానంలో ఉన్నారు. ఝాన్సీ అన్నీ చెప్పేసిందని రామ్ ప్రసాద్ లోపలికి వచ్చి చెప్పాడు. అపూర్వ చెప్పడం కూడా తాను చూశానని రామ్ ప్రసాద్ చెప్పాడు. షాలిని కూడా ఒకటి చెప్పిందని రోహిత్ అన్నాడు. తమను డిస్‌క్వాలిఫై చేయడం గురించి రోహిత్, షాలిని చర్చ. ఇక్కడ కూడా అపూర్వ ప్రస్తావన తీసింది షాలిని. ఇక ఈ టాస్క్ తర్వాత పాయింట్స్ విషయానికి వస్తే రామ్ ప్రసాద్, నరేష్ 220, చరణ్, అపూర్వ 200, ముఖేష్, ఝాన్సీ 160, రోహిత్, షాలిని 140లో ఉన్నారు.
