Menu
BREAKING
Bigg Boss10 Telugu: నేడు షో మొత్తం ముఖేష్ చుట్టూనే.. నోరు జారిన దేబ్జాని   |   Bigg Boss10 Telugu: అన్ని భాషల్లోనూ విజయ్‌కు ఐలవ్యూ చెప్పానన్న రష్మిక… నీతూ ఎలిమినేట్   |   Bigg Boss10 Telugu: వంశీకి క్లాస్.. త్రిగుణ్‌కు మాస్ ఎలివేషన్   |   Bigg Boss10 Telugu: ఈవారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు?   |   Bigg Boss10 Telugu: కెప్టెన్ అయిన అమన్.. నరేష్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న రామ్ ప్రసాద్   |   Bigg Boss10 Telugu: నాగ్ సహా ఒక్కొక్కరినీ ఉతికి ఆరేసిన చరణ్   |   మారిపోయిన జేమ్స్ బాండ్.. నయా బాంబ్ బాబు ఎవరో తెలుసా..?   |   2000 కోట్ల దిశగా రామాయణ.. ఆ రికార్డు రాముడి సొంతం అవుతుందా..?   |   నేను రాను.. వచ్చే సమస్యే లేదు.. కుండ బద్ధలు కొట్టిన రోహిత్ నాయుడు..!   |   ట్రెండింగ్‌లో జటాయు ఎర్త్స్ సెంటర్.. ఆ వైరల్ ప్లేస్ ఎక్కడుందో తెలుసా..?   |   ‘వారణాసి’ వాయిదా దాదాపు ఖాయమేనా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా..?   |   ఫేక్ గాళ్ల తాట తీయండి.. కేంద్రమంత్రికి ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి విన్నపం..!   |   అనిల్ రావిపూడితో జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు అవసరమా.. అవసరమే..!   |   బాహుబలి 2 ఔట్.. నెక్ట్స్ టార్గెట్ ధురంధర్ 2.. అక్కడ రామాయణ ఊచకోత..!   |   రియల్ స్టార్ శ్రీహరి ఇంట శుభకార్యం.. పెళ్ళి కొడుకు అవుతున్న పెద్ద కొడుకు..!

Biggbogss10 Telugu: రోహిత్‌కు గుదిబండలా తయారైన షాలిని.. లవ్ ట్రాక్ ఇబ్బందే..

Biggbogss10 Telugu: రోహిత్‌కు గుదిబండలా తయారైన షాలిని.. లవ్ ట్రాక్ ఇబ్బందే..

బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరం అనే కన్నా.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉందనడం ఉత్తమమేమో. ఎవరూ తక్కువోళ్లు కాదు. కానీ సెలబ్రిటీలంతా అతి తెలివి ప్రదర్శించడంలో ఒక అడుగు ముందున్నారు. ఇక ఝాన్సీ కామనర్స్‌తో ఉంటూ సెలబ్రిటీలకు పావులా మారింది. ఆమె గేమ్ ప్లే ఆమెది. ఎవరిని తప్పుబట్టాలో.. ఎవరిని ఒప్పు అనాలో తెలియని పరిస్థితి. ఇక రోహిత్‌కి అంతా బాగుందనుకుంటున్న తరుణంలో అతని ఓటు బ్యాంకుకు షాలిని బ్రేకర్‌లా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే అతని పాలిట గుదిబండలా షాలిని తయారైంది. ఆమె బిహేవియర్ కారణంగా రోహిత్ చిక్కుల్లో పడుతున్నాడు. అది మాత్రమే కాకుండా అదో లవ్ ట్రాక్‌లా అనిపిస్తోంది. ఎప్పుడైనా లవ్ ట్రాక్‌లు కంటెస్టెంట్స్ మెడకు గుదిబండలే అవుతాయనడంలో సందేహం లేదు.

గతంలో కూడా ఎన్నో లవ్ స్టోరీలు చూశాం. కానీ హౌస్‌ను వీడి బయటకు వచ్చాక ఒక్కటంటే ఒక్కటి కూడా నిలవలేదు. రోహిత్, షాలిని లవ్ స్టోరీ బయటకు వచ్చాక ఎలా ఉన్నా పర్వాలేదు కానీ హౌస్‌లో మాత్రం అతనికి ఇబ్బందే కానుంది. ముఖ్యంగా షాలిని కామ్‌గా ఉండే రకం కాదు.. ప్రతి దానికి గొడవ చేస్తూ ఉంటుంది. ఆమె వాయిస్ ఆమెకే కాకుండా రోహిత్‌కు కూడా ఇబ్బందే కానుంది. ఇవాళ షాలిని, అపూర్వకు గొడవ జరిగింది. రోహిత్ అరవొద్దని ఎంత మొత్తుకున్నా షాలిని వినే పరిస్థితి లేదు. పైగా త్రిగుణ్, రామ్ ప్రసాద్ దగ్గర పంచాయతీ పెట్టింది. రోహిత్ ఎంత వారిస్తున్నా ఆమె ఆవేశం మాత్రం తగ్గడం లేదు. చూసేందుకు షార్ట్ టెంపర్‌లా కనిపిస్తోంది. రోహిత్ ఆమెను వదిలించుకుని తన గేమ్ తను ఆడకుంటే మాత్రం షాలిని అతనికి ఇబ్బందికరంగా మారుతుందనడంలో సందేహమే లేదని తెలుస్తోంది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360