
టాలీవుడ్ స్థాయిని పెంచడమే కాదు, ఏకంగా ఇండియన్ సినిమా ముఖచిత్రాన్ని, రూపురేఖలను పూర్తిగా మార్చేస్తున్న ఏకైక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మగధీర సినిమాతో తెలుగు సినిమా స్టామినాను పరిచయం చేసి, బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా ట్రెండ్ మొదలుపెట్టి, ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్లిన జక్కన్న, ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్ట్ తో వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గ్లోబల్ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘వారణాసి’ ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హాట్ టాపిక్ గా మారింది. కేవలం మన దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఈ సినిమా మీద భారీ చర్చ జరుగుతోంది. సినిమా సినిమాకు తన రేంజ్ తో పాటు టార్గెట్ ను కూడా పెంచుకుంటూ పోయే రాజమౌళి, ఈసారి వారణాసి సినిమాతో ఊహకు అందని నంబర్స్ ను టచ్ చేయబోతున్నారు. అసలు ఈ సినిమా బిజినెస్ లెక్కలు వింటుంటేనే అందరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కేవలం అనౌన్స్మెంట్ తోనే నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్, ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ లో టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సరికొత్త రికార్డులకు తెరతీస్తోంది.
వారణాసి సినిమా దండయాత్ర ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచే అత్యంత భారీ స్థాయిలో మొదలు కాబోతోంది. కేవలం తెలుగు వెర్షన్ హక్కుల కోసమే ఏకంగా 275 కోట్ల రూపాయల భారీ బిజినెస్ జరుగుతుందని ఇండస్ట్రీలో గట్టి టాక్ నడుస్తోంది. మహేష్ బాబుకు రెండు దశాబ్దాలుగా తెలుగునాట ఉన్న తిరుగులేని ఫాలోయింగ్, దానికి రాజమౌళి బ్రాండ్ తోడవడంతో ఇంతటి రేంజ్ ఫిగర్స్ వినిపిస్తున్నాయి. ఈ హక్కులను దక్కించుకోవడం కోసం టాలీవుడ్ కు చెందిన ఓ అగ్ర నిర్మాత కూడా తన సర్వశక్తులు ఒడ్డుతూ చాలా గట్టిగానే పోటీ పడుతున్నట్లు సమాచారం. గతం చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ రాజమౌళి తెరకెక్కించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ట్రిపుల్ ఆర్ సినిమా పేరు మీదే ఉండిపోయింది. ఆ సినిమా అప్పట్లో 225 కోట్ల బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు వారణాసి సినిమా ఆ పాత రికార్డును చాలా ఈజీగా బ్రేక్ చేసి, మరో 50 కోట్లు అదనంగా పలకడం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్ బిజినెస్ లెక్కల్లో వారణాసి క్రియేట్ చేస్తున్న ఈ బజ్ చూసి మిగతా నిర్మాతలు సైతం అవాక్కవుతున్నారు.
ఇక వారణాసి క్రేజ్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా అన్ని చోట్లా అదే స్థాయిలో ఉప్పెనలా కనిపిస్తోంది. రాజమౌళికి నార్త్ ఇండియాలో ఉన్న పాపులారిటీ, మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు చెబితే చాలు బాలీవుడ్ జనాలు థియేటర్లకు క్యూ కడతారు. అందుకే హిందీ మార్కెట్ నుంచి ఈ సినిమా రైట్స్ కోసం కనీసం 200 కోట్ల రూపాయల బిజినెస్ ను ఆశిస్తున్నారు మేకర్స్. బాలీవుడ్ బయ్యర్లు సైతం ఈ రేటు ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడటం లేదట. ఇక ఓవర్సీస్ మార్కెట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా ఎలాంటిదో, ఆయన సినిమాలకు అక్కడ వచ్చే ఓపెనింగ్స్ ఎలాంటివో అందరికీ తెలిసిందే. దానికి జక్కన్న టేకింగ్ కూడా తోడైతే కలెక్షన్స్ సునామీ రావడం వంద శాతం గ్యారెంటీ. అందుకే అక్కడ కూడా మరో 150 కోట్ల బిజినెస్ జరుగుతుందని పక్కాగా లెక్కలేస్తున్నారు. మిగిలిన సౌత్ భాషలైన తమిళం, కన్నడ, మలయాళం ఇండస్ట్రీలు అన్నీ కలిపి మరో 100 కోట్ల మేర బిజినెస్ జరగడం ఖాయంగా కనిపిస్తుంది. అంటే కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఈ సినిమా వందల కోట్ల వ్యాపారం చేస్తూ ట్రేడ్ వర్గాలకు నిద్ర లేకుండా చేస్తోంది.

ఈ భారీ థియేట్రికల్ నంబర్స్ కు తోడు నాన్ థియేట్రికల్ హక్కులు కూడా కలిపితే వారణాసి బిజినెస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఉన్న డిజిటల్ ట్రెండ్ ప్రకారం ఓటీటీ రైట్స్, శాటిలైట్ హక్కులు, అలాగే ఆడియో హక్కులు అన్నీ కలుపుకుంటే రిలీజ్ కు ముందే ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల మార్క్ ను చాలా సునాయాసంగా అందుకుంటుంది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటి వరకు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 సినిమా చేసిన 617 హైయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా రికార్డుల్లో నిలిచింది. ఇప్పుడు వారణాసి సినిమా ఆ రికార్డును అలవోకగా తుడిచిపెట్టేసి, ఏకంగా 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో నంబర్ వన్ స్థానంలో దర్జాగా కూర్చోబోతోంది. ఇంత భారీ బిజినెస్ చేసిన తర్వాత ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్లను లాభాల్లోకి తీసుకురావాలంటే వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 1500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలనేది ఒక మెగా టార్గెట్ గా రంగంలోకి దిగుతుంది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి, పాజిటివ్ టాక్ వస్తే ఈ 1500 కోట్ల టార్గెట్ పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
సాధారణంగా ఒక సినిమా మీద ఇన్ని వందల కోట్లు ఇన్వెస్ట్ చేయాలంటే ఏ బయ్యర్ కైనా, డిస్ట్రిబ్యూటర్ కైనా కాస్త లోపల భయం ఉంటుంది. కానీ వారణాసి సినిమా విషయంలో బయ్యర్లు ఎక్కడా ఎలాంటి భయం లేకుండా ముందుకు వస్తున్నారు, అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. దీనికి ఏకైక కారణం అపజయమెరుగని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన ట్రాక్ రికార్డ్ మీద ఉన్న అపారమైన నమ్మకం, మహేష్ బాబు లాంటి గ్లోబల్ అప్పీల్ ఉన్న సూపర్ స్టార్ ఆయనకు అండగా నిలబడటమే బయ్యర్లకు కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. వాళ్లిద్దరి కాంబినేషన్ కచ్చితంగా విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తుందని, ఎంత రేటు పెట్టి కొన్నా సరే ఫుల్ రన్ లో డబుల్ ప్రాఫిట్స్ వస్తాయని డిస్ట్రిబ్యూటర్లు బలంగా నమ్ముతున్నారు. ఈ భారీ గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ను అన్నీ అనుకున్నట్లుగానే పక్కా ప్రణాళికతో, ఇంటర్నేషనల్ క్వాలిటీతో పూర్తి చేసి ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురానున్నారు. మరి ఈ కళ్ళు చెదిరే రేంజ్ బిజినెస్, కనివినీ ఎరుగని క్రేజ్ తో వస్తున్న వారణాసి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో, ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్ని సరికొత్త చరిత్రలు లిఖిస్తుందో చూడాలంటే ఆ రిలీజ్ రోజు వరకు ఎంతో ఆసక్తిగా వేచి చూడాల్సిందే.
