
బిగ్‌బాస్ 10 తెలుగు చాలా ఆసక్తికరంగా సాగుతోంది. నిన్న నామినేషన్స్ రచ్చ లేపాయి. వాస్తవానికి శనివారం హోస్ట్ నాగార్జున అందరినీ వదిలేసి రోహిత్‌కు మాత్రమే క్లాస్ తీసుకున్నారు. షో అంతా కూడా రోహిత్‌ను ఏదో ఒకరకంగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఆట తీరు మార్చుకోమని కూడా సలహా ఇచ్చారు. ఇంత జరిగిన తర్వాత ఇక అంతా రోహిత్‌కు ఎగెనెస్ట్ అవుతారని భావించారు. కానీ అనూహ్యంగా త్రిగుణ్‌కు ఎగెనెస్ట్ అవడం చూసే ఆడియెన్స్‌నే కాకుండా అతడిని సైతం షాక్‌కు గురి చేసింది. ఇక ఆసమయంలో రోహిత్‌కు అడుగడుగునా సపోర్ట్ ఇస్తూ వెళ్లింది షాలిని. వాస్తవానికి రోహిత్ దగ్గర డిఫెండింగ్ స్కిల్ ఉంది. అలాగే పాయింట్స్ గట్టిగా పెట్టగలడు. అతనికి సపోర్ట్ చేయడమంటే.. అతడిని ఇరుకున పెట్టడమే. కానీ అదేమీ గ్రహించకుండా షాలిని ప్రతి దానిలోనూ ఇన్వాల్వ్ అయిపోయింది.
ఇక అన్‌సీన్ వీడియోలో అమన్, దేబ్జానీ, రామ్ ప్రసాద్, నరేష్ సరదాగా కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో అమన్‌ను దేబ్జాని.. ‘మీరంతా అగ్నిపరీక్ష నుంచి వచ్చారు కదా.. నువ్వెందుకు షాలినిని కానీ సృష్టిని కానీ ట్రైచేయడం లేదు?’ అని అడిగింది. దానికి అమన్.. తనకు, షాలిని అసలు సెట్ కాదని చెప్పాడు. అప్పుడు రామ్ ప్రసాద్ ‘షాలినికి రోహిత్ అంటే ఇష్టం కదా.. బాగా ఇష్టం’ అని అనడంతో అమన్ అది ఫ్రెండ్సా ఏంటనేది తెలియదన్నాడు. బాండింగ్ అయితే ఉందని రామ్ ప్రసాద్ అన్నాడు. వాళ్లిద్దరి మధ్య జెన్యూన్‌గా లవ్ స్టార్ట్ అయ్యిందని అన్నాడు. అవునా? అని అమన్ అన్నాడు. ఈ వీడియో ఎక్కడ ప్లే చేస్తారోనని జాగ్రత్తగా అమన్ మాట్లాడుతున్నాడని దేబ్జాని సెటైర్ వేసింది. మొత్తానికి రోహిత్, షాలిని మధ్య కంటెంట్ కోసం కాకుండా జెన్యూన్‌గా లవ్ ప్రారంభమైందని రామ్ ప్రసాద్ చెప్పాడు.
