Menu
BREAKING
విశ్వంభరను మరిచిపోదామా.. బాస్ సినిమా బాక్సుల్లోంచి బయటికి రానట్లేనా..?   |   కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!   |   Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..   |   ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?   |   Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..   |   లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!   |   Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..   |   Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ED సోదాలు.. అసలు నిజమేంటో తెలుసా..?   |   AK47: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. అసలు కారణం అదన్నమాట..!   |   Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?   |   Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్   |   Anil Ravipudi: అనిల్ రావిపూడి యామినేషన్ సినిమా వెనక అంత పెద్ద కథ ఉందా..?   |   ఫ్లాప్ వాళ్లను ఆపలేదు.. రూట్ మార్చేలా చేసింది.. కుర్రాళ్ళూ జాగ్రత్త..!   |   లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు.. ది ట్రెండ్ సెట్టర్..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..

Biggboss10 Telugu: సంచాలక్‌గా వర్షిణి వరస్ట్.. ఎవరి స్కెచ్‌లు వారివే..

Biggboss10 Telugu: సంచాలక్‌గా వర్షిణి వరస్ట్.. ఎవరి స్కెచ్‌లు వారివే..

నామినేషన్స్ గురించి కంటెస్టెంట్స్ అంతా చేస్తున్న డిస్కెషన్ ఇవాళ్టి (మంగళవారం) షో ప్రారంభమైంది. సృష్టితో సుధీర్ తనను బ్యాక్‌స్టాబ్ చేశాడని చెప్పుకొచ్చాడు. సుధీర్ మొహం కూడా చూడలేదని తనకు లేదని చెప్పాడు. ఫజిల్ గేమ్‌లో తనకు హెల్ప్ చేశానని చెప్పుకొచ్చాడు. నరేష్, దేబ్జాని మధ్య కూడా నామినేషన్స్ గురించి డిస్కషన్ జరిగింది. త్రిగుణ్ టాప్ 5లో ఉంటాడని రోహిత్ చెప్పాడు. బలాలు, బలహీనతల గురించి తెలుసుకుని వచ్చాడని.. తాను కూడా అదే చేశానని రోహిత్ చెప్పాడు. హౌస్‌లో వినాయకచవితి సెలబ్రేషన్స్‌ను కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్వహించారు. సుధీర్, త్రిగుణ్‌ను సృష్టి కలిపింది. వాళ్లిద్దరూ కలిసి వాళ్ల మధ్య వచ్చిన విభేదాల గురించి చర్చించుకున్నారు. తన క్యారెక్టర్ అసాసినేషన్ చేశావని.. తమ్ముడిలా చూశానని అది బాధ అనిపించిందని త్రిగుణ్ చెప్పాడు.

కెప్టెన్సీ టాస్క్‌ను బిగ్‌బాస్ ప్రారంభించారు. ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎనిమిది మందిని ఫైనల్ చేశారు. ఈ టాస్క్ రెండు లెవల్స్‌లో జరుగుతుందని బిగ్‌బాస్ చెప్పారు. మొదటి లెవల్‌లో నలుగురు పాల్గొనాలి. ఆ టాస్క్.. పగిలితే పోయినట్టే. జంబుల్డ్ పదాన్ని చూపస్తారు. అదేంటో కనుక్కుని బోర్డుపై పెట్టాలి. సంచాలకులు ఎవరి వచ్చి బెలూన్ పగలగొట్టాలనేది సూచిస్తారు. ఈ టాస్క్‌కి వర్షిణి సంచాలక్‌గా వ్యవహరించింది. తొలి జంబుల్డ్ పదాన్ని ఐదుగురు కరెక్ట్‌గా రాశారు. తొలి ఛాన్స్ ఝాన్సీకి వర్ణిణి ఇచ్చింది. ఝాన్సీ వెళ్లి రోహిత్‌ బెలూన్ పగులగొట్టింది. ముఖేష్.. త్రిగుణ్ బెలూన్ పగులగొట్టాడు. దేబ్జాని.. త్రిగుణ్ బెలూన్ పగులగొట్టింది. అమన్ వచ్చి షాలిని బెలూన్ పగులగొట్టాడు. ఆ తరువాత షాలిని వచ్చి త్రిగుణ్ బెలూన్ పగుల గొట్టింది.

Biggboss10 Telugu: సంచాలక్‌గా వర్షిణి వరస్ట్.. ఎవరి స్కెచ్‌లు వారివే..

నెక్ట్స్ పదం ఏంటో వర్షిణి చూపించింది. రామ్ ప్రసాద్ వచ్చి రోహిత్‌ను తీసేశాడు. రోహిత్ వచ్చి రామ్ ప్రసాద్ బెలూన్ పగులగొట్టాడు. తరువాత దేబ్జాని వచ్చి షాలిని బెలూన్.. త్రిగుణ్ వచ్చేసి ముఖేష్ బెలూన్.. ఝాన్సీ వచ్చి దేబ్జాని బెలూన్ పగులగొట్టింది. తను కరెక్ట్‌గా రాసినా కూడా ఛాన్స్ ఇవ్వలేదని షాలిని గొడవపడింది. ఝాన్సీ స్పెల్లింగ్ రాసినా కూడా ఆమెకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది. షాలిని కరెక్ట్‌గా రాసినా కూడా సంచాలక్ అయిన వర్షిణి ఛాన్స్ ఇవ్వకపోవడంతో గొడవ జరిగింది. బ్లేమ్ తీసుకోవడానికి తాను సిద్ధమని తెలిపింది. త్రిగుణ్ కల్పించుకుని షాలినికి ఛాన్స్ ఇవ్వాలని.. అదే కరెక్ట్ అని తెలిపాడు. ఎండ్ బజర్ వచ్చాక కూడా ముఖేష్ రాయడాన్ని వంశీ అభ్యంతరం తెలిపాడు.షాలిని వచ్చి రామ్ ప్రసాద్ బెలూన్ పగులగొట్టింది. అమన్‌ వచ్చేసి దేబ్జాని బెలూన్ పగులగొట్టాడు. ముఖేష్ వచ్చేసి త్రిగుణ్ బెలూన్ పగులగొట్టాడు. దీంతో త్రిగుణ్ గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.

ఆ తరువాత రామ్ ప్రసాద్ వచ్చేసి షాలిని బెలూన్ పగులగొట్టాడు. రోహిత్ బెలూన్‌ను ముఖేష్ పగులగొట్టాడు. రోహిత్ తన కంటే స్ట్రాంగ్ అని రామ్ ప్రసాద్ బెలూన్.. ఝాన్సీ వచ్చి రోహిత్ బెలూన్ పగులగొట్టడంతో గేమ్ నుంచి అతను ఎలిమినేట్ అయ్యాడు. షాలిని వచ్చి రామ్ ప్రసాద్ బెలూన్ పగులగొట్టడంతో అతని బెలూన్స్ అయ్యి పగిలిపోయాయి. దీంతో రామ్ ప్రసాద్ గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అమన్, ముఖేష్‌లు ఒకరి బెలూన్ మరొకరు పగులొట్టుకున్నారు. షాలిని వచ్చి దేబ్జాని బెలూన్.. దెబ్జాని వచ్చి అమన్ బెలూన్ పగులగొట్టింది. ఝాన్సీ వచ్చి దేబ్జాని బెలూన్ పగులగొట్టింది. వచ్చి అమన్ బెలూన్ పగులగొట్టాడు. నెక్ట్స్ రౌండ్‌లో అమన్ వచ్చి ముఖేష్ బెలూన్ పగులగొట్టాడు. దేబ్జానికి తెలుగు రాదని.. ఝాన్సీ వచ్చేసి దేబ్జాని బెలూన్ పగులగొట్టడాన్ని రోహిత్ సహా అగ్నిపరీక్ష టీం అపోజ్ చేసింది. తనకు అగ్ని పరీక్ష టీం వచ్చి సపోర్ట్ చేసిందని… ఇదే తనకు అసలైన గెలుపని దేబ్జాని తెలిపింది. షాలిని, ముఖేష్, ఝాన్సీ, అమన్ ఫ్రేమ్స్‌లో బెలూన్స్ మిగిలి ఉన్నందున మొదటి లెవల్‌లో వారు పోటీ పడతారని బిగ్‌బాస్ చెప్పారు.

Biggboss10 Telugu: సంచాలక్‌గా వర్షిణి వరస్ట్.. ఎవరి స్కెచ్‌లు వారివే..

మొత్తానికి కెప్టెన్సీ కోసం జరిగిన పోరులో కూడా వార్ జరిగింది. అయితే వర్షిణి.. ముఖేష్ విషయంలో సపోర్ట్ ఉంటుందని చూసుకోండని రోహిత్, షాలినికి త్రిగుణ్ చెప్పాడు. అది కాస్తా వాళ్లు బయటపెట్టడంతో వర్షిణి వచ్చి త్రిగుణ్ ముందే అడిగింది. ఆ తరువాత అమన్, షాలిని మధ్య చిన్న కాన్వర్సేషన్. అంటే షాలిని బెలూన్ పగులగొట్టిన విషయమై క్లారిటి ఇచ్చాడు. సంచాలక్‌‌గా వర్షిణి చాలా తప్పు చేసిందని షాలిని చెప్పింది. వాస్తవానికి సంచాలక్‌గా వర్షిణి వరస్ట్ అనే చెప్పాలి. ఝాన్సీతో ముఖేష్.. దేబ్జాని బెలూన్ పగులగొట్టకుండా షాలిని బెలూన్ పగులగొట్టి ఉంటే నీకు ప్లస్ అయి ఉండేదని చెప్పాడు. మొత్తానికి ఎవరి స్కెచ్‌లు వాళ్లు వేసుకుంటున్నారు.ఇక ఇవాళ కూడా బిగ్‌‌బాస్ టాస్క్ పెద్ద చెప్పుకోదగినదేమీ కాదు కానీ కంటెంట్ మాత్రం బాగానే క్రియేట్ చేయగలింది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360