Menu
BREAKING
Biggboss 10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఆపరేషన్ త్రిగుణ్ సక్సెస్   |   The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు.. స్క్రీన్ షేక్ అయిపోతుందేమో మరి..?   |   Fauzi: ‘ఫౌజీ’ సమస్యేంటి.. ప్రభాస్‌కు క్లారిటీ లేదా..? హను కన్ఫ్యూజ్ అవుతున్నాడా..?   |   Biggboss10 Telugu: మారిపోయిన సుధీర్.. త్రిగుణ్‌కు షాక్   |   ముఖేష్ అంటే చాలా ఇష్టమన్న దేబ్జాని.. ప్రేక్షకుల చేతుల్లో పవర్..   |   Biggboss 10 Telugu: సోషల్ మీడియాలో మారుమోగుతున్న రోహిత్..   |   Biggboss 10 Rohith: రోహిత్‌నే టార్గెట్ చేసిన నాగ్.. ఇకపై పెరగనున్న అటాక్..   |   Biggboss Telugu 10: రోహిత్‌కు క్లాస్.. త్రిగుణ్‌కు పనిష్మెంట్   |   Biggboss 10 Telugu: ఎలిమినేషన్‌లో భారీ ట్విస్ట్.. ఎవరూ ఊహించలే..   |   బిగ్ బాస్ లో ట్విస్ట్‌లు ఉంటాయంటే ఏమో అనుకున్నాం కానీ భారీ ట్విస్ట్‌లు…   |   ‘ఇరుముడి’తో ఏం నేర్చుకున్నారు.. మీకు ఇప్పటికైనా అర్థమవుతుందా స్టార్ హీరోలు..?   |   Biggboss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్ స్టార్ట్..!   |   Biggboss 10 Telugu: చైత్ర వర్సెస్ షాలిని.. హౌస్‌మేట్స్‌గా రోహిత్, వంశీ   |   Biggboss 10 Telugu: మిడ్‌వీక్ ఎలిమినేషన్ నిజమేనా? అసలా వ్యక్తే ఎందుకు?   |   Biggboss 10 Rohith: రోహిత్‌కు కప్ చేతిలో పెట్టడమే వాళ్ల లక్ష్యమా?

ముఖేష్ అంటే చాలా ఇష్టమన్న దేబ్జాని.. ప్రేక్షకుల చేతుల్లో పవర్..

ముఖేష్ అంటే చాలా ఇష్టమన్న దేబ్జాని.. ప్రేక్షకుల చేతుల్లో పవర్..

బిగ్‌బాస్ 10 తెలుగు ఆదివారం ఎపిసోడ్ (Bigg Boss 10 Telugu Sunday episode) ‘జై జై గణేశ’ సాంగ్‌తో ప్రారంభమైంది. నిన్న హృదయానికి దగ్గర ఎవరు? దూరమెవరు? అనే టాస్క్ కంటెస్టెంట్స్‌కి ఇచ్చారు. కొందరు చెప్పారు. మరికొందరు చెప్పాల్సి ఉంది. వారితో నేడు ఎపిసోడ్ స్టార్ట్ చేశారు. హౌస్‌లో కొందరు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారని అది బయటి వారికి చాలా ఇబ్బందికరంగా ఉందని నాగ్ చెప్పారు. దానిని మార్చుకోమని రోహిత్, సృష్టి, షాలినిలకు చెప్పారు. ఇక నెక్ట్స్ హౌస్‌మేట్ ఎవరనేది రివీల్ చేశారు. అది మరెవరో కాదు.. అమన్ (Aman). తరువాత అమన్ తన హృదయానికి దేబ్జాని దగ్గర అని.. దూరం రామ్ ప్రసాద్ అని చెప్పాడు. ‘నరేష్‌తో టాస్క్‌లో ఓడిపోయినందుకు నిన్ను హైరిస్క్ జోన్‌లో పెట్టాను’ అని రామ్ ప్రసాద్ (Ram Prasad) చెప్పాడని.. ఆ ఒక్క కారణంతో ఆయనకు ఇస్తున్నట్టు చెప్పాడు. అప్పుడు నాగ్.. రోహిత్ (Rohith) పర్ఫెక్ట్ అన్న మాటను తీసి.. ‘నిన్ను పర్ఫెక్ట్ అంటే నీకు బాధ అనిపించలేదా?’ అని అమన్‌ని అడిగారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ప్లే చేసి చూపించి.. క్లారిటీ వచ్చిందా? అని అమన్‌ను అడిగారు.

వాస్తవానికి అమన్ విషయంలోనే రోహిత్ ‘పర్ఫెక్ట్’ అని అన్నాడు. ఆ విషయాన్ని చైత్ర.. అమన్‌కు చెప్పింది. అప్పుడు తానన్న సందర్భం వేరంటూ రోహిత్ మాట మార్చాడు. అదే విషయాన్ని నాగ్ వీడియోతో చూపించారు. రామ్ ప్రసాద్.. దేబ్జానికి హృదయానికి దగ్గర అని.. తనకు షాలిని దూరం అని చెప్పాడు. కృష్ణుడు వచ్చేసి దేబ్జాని తనకు దగ్గర అని.. రోహిత్ తనకు దూరమని.. రోహిత్ దూరమని చెప్పాడు. ముఖేష్.. తనకు దగ్గర ఝాన్సీ అని.. రోహిత్ దూరమని చెప్పాడు. నరేష్ వచ్చేసి దగ్గరగా దేబ్జాని.. దూరం సృష్టి అని చెప్పాడు. తను దగ్గర చేసుకోవాలనుకుంటున్నది రామ్ ప్రసాద్‌ని అని.. దూరం అమన్ అని చెప్పింది. సుధీర్ వచ్చేసి తనకు దగ్గర ముఖేష్ అని.. దూరం వర్షిణి అని చెప్పాడు. వంశీ ఇంకా దగ్గరవ్వాలని కోరుకుంటోంది రోహిత్ అని.. దూరం సుధీర్ అని చెప్పాడు. తనకు దగ్గర రోహిత్ అనడంతో అతనే షాక్ అయ్యాడు. దేబ్జానిని హౌస్‌లో మెజారిటీ దగ్గర అని చెబుతోందన్నారు. అలాగే హృదయానికి దూరంగా ఐదు ఓట్లు పడ్డాయని రోహిత్‌కి చెప్పి ఆట తీరు మార్చుకోవాలని సూచించారు. అతని ఆట వాస్తవానికి చాలా బాగుంది. కావాలనే అతడిని డౌన్ చేయాలని బిగ్‌బాస్ టీం చూస్తోందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికి బలం చేకూర్చేలా నాగ్ మాటలుండటం గమనించాలి.

Anchor Varshini in Bigg Boss 10 Telugu

నెక్ట్స్ హౌస్‌మేట్‌గా ముఖేష్‌(Mukesh)ని నాగ్ ప్రకటించారు. ఆ తరువాత తన దగ్గర బ్లాక్ కీ ఉందని.. అది లేని వారు ఇంకా ఆరుగురు ఉన్నారు. వారిలో బ్లాక్ కీ ఎవరికి ఇవ్వాలో హౌస్‌మేట్స్ డిసైడ్ చేయాలన్నారు. మెజారిటీ హౌస్‌మేట్స్ సృష్టి పేరు చెప్పారు. దీంతో బ్లాక్ కీ సృష్టికి ఇచ్చారు. హౌస్‌లో ఇంకా ఏ పవర్ లేనివారు నలుగురు ఉన్నారని వారికి ఓ టాస్క్ పెట్టారు. అమన్, రోహిత్, సుధీర్, దేబ్జానిలకు టాస్క్. శాండ్ బాక్సులో ఉన్న బాల్స్ వారి ఎదురుగా ఉన్న హోల్‌లో ఐదు వేస్తే వారికి పవర్ వస్తుందని చెప్పారు. సుధీర్ ముందుగా ఐదు వేసి పవర్ బాక్స్ గెలుచుకున్నాడు. నెక్ట్స్ ఇద్దరు హౌస్‌మేట్స్‌ని నాగ్ ప్రకటించారు. ఆ ఇద్దరు సృష్టి, నరేష్. దీంతో మొత్తంగా 10 మంది హౌస్‌మేట్స్ అయ్యారు. ఆ తరువాత కంటెస్టెంట్స్‌తో సన్‌డే.. ఫన్ డే ఆడించారు. నెక్ట్స్ హౌస్‌మేట్‌ను రోహిత్, వంశీ(Vamsi)లతో రివీల్ చేయించారు. నెక్ట్స్ హౌస్‌మేట్.. ఝాన్సీ (Jhansi). తరువాత దేబ్జాని (Debjani) తనకు కాఫీ క్రేవింగ్ ఉందని చెప్పడంతో ఎవరికీ చెప్పని సీక్రెట్ చెప్తే ఇస్తామని నాగ్ చెప్పారు. తాను ఆరో తరగతి ఫెయిల్ అయ్యానని దేబ్జాని చెప్పింది. అది సీక్రెట్‌లా అనిపించలేదని నాగ్ అనడంతో.. తనకు వచ్చిన దగ్గర నుంచి ముఖేష్ అంటే చాలా ఇష్టమని దానిని చెప్పలేకపోయానని దేబ్జాని చెప్పింది. ముఖేష్ (Mukesh) ఇటు సైడ్.. అటు సైడ్ పులిహోర కలుపుతుండటంతో తాను చెప్పలేకపోయానని తెలిపింది. నాగ్ (Nagarjuna) కాఫీ శాంక్షన్ చేశారు.

ముఖేష్ అంటే చాలా ఇష్టమన్న దేబ్జాని.. ప్రేక్షకుల చేతుల్లో పవర్..

హౌస్‌మేట్స్ కాని ముగ్గురు సుధీర్, వర్షిణి (Anchor Varshini), కృష్ణుడి(Krishnudu)ని యాక్టివిటి రూమ్‌కి పిలిచారు. ముగ్గురిలో ఎవరు హౌస్‌మేట్స్ అవుతారో.. ఎవరో ఎలిమినేట్ అవుతారో చూద్దామని.. ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. ముగ్గురి వెనుక మూడు డోర్స్ ఉన్నాయని.. ఎవరి పేరు చెబితే వారు ఆ డోర్ ఓపెన్ చేయాలన్నారు. ఒకరి డోర్ వెనుక ఎలిమినేషన్ ఉందన్నారు. ముందుగా కృష్ణుడు.. అతనికి హౌస్‌మేట్ అని వచ్చింది. తరువాత వరుసగా వర్షిణి, సుధీర్ ఓపెన్ చేశారు. ఇద్దరూ హౌస్‌మేట్స్ అని ప్రకటించారు. ఈ వారం నో ఎలిమినేషన్ అని చావు కబురు చల్లగా చెప్పారు నాగ్. ఈ వారం జరిగింది మహాపరీక్ష అని.. నెక్ట్స్ వీక్ మరింత టఫ్‌గా ఉండబోతోందని నాగ్ చెప్పారు. తరువాత సీజన్ 10 ఎలా ఉండబోతోందో గ్లింప్స్ వేసి చూపించారు. వీక్‌ 2లో హౌస్‌ అంతా ఆడియెన్స్ చేతిలో ఉంటుందన్నారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా కెప్టెన్సీ కంటెండర్‌‌ని డిసైడ్ చేస్తామని బిగ్‌బాస్ చెప్పారు.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360