
ఇది ఫ్యామిలీ వీక్ కాబట్టి హౌస్ అంతా సందడిగా మారింది. అందరినీ ఫ్రీజ్ చేసి ముఖేష్ వాళ్ల అమ్మను లోపలికి పంపించారు. ఆమె రాగానే ముఖేష్‌ను హగ్ చేసుకుని ఏడుస్తూ హ్యాపీ బర్త్‌డే చెప్పారు. అంతా అది చూసి ఎమోషనల్ అయ్యారు. తన ముఖంపై ఉన్న కుంకుమ తీసి ముఖేష్‌కు పెట్టారు. స్ట్రాంగ్‌గా ఉండమని చెప్పారు. అక్కను తీసుకురావాల్సింది అని ముఖేష్ చెప్పాడు. ఆ తరువాత వర్షిణి, శివ్ అంతా ముఖేష్ వాళ్లమ్మను పలుకరించారు. తన కొడుకు మిమ్మల్ని చాలా గౌరవిస్తాడని రామ్ ప్రసాద్‌కు చెప్పారు. నరేష్‌ను తన ఫేవరెట్ అని చెప్పారు. తన మనవడికి కూడా నరేష్ మామా అంటే చాలా ఇష్టమని చెప్పారు. నీ ఫ్యాన్స్ అంతా నిన్ను చాలా ఇష్టపడుతున్నారని ముఖేష్‌కు చెప్పారు. గెలిచి రమ్మని చెప్పారు. తనకు ఫ్యామిలీ చాలా గుర్తొస్తోందని.. అక్క ట్రీట్మెంట్ గురించి ఆవేదన చెందుతున్నట్టుగా తల్లికి చెప్పాడు. వర్షిణి టీ తీసుకుని వెళ్లింది. ఒక కుటుంబంలా కలిసి ఉండాలని వర్షిణికి ముఖేష్ వాళ్ల అమ్మ చెప్పారు. నీ గేమ్ నువ్వు ఆడమని.. టాస్క్‌లో గెలుపు ఓటములు సహజమని కోప్పడవద్దని చెప్పారు. చాముండేశ్వరి అమ్మ ఆశార్వాదం నీకు ఉంటుందని ముఖేష్‌కు చెప్పారు. నిజంగా ఈ అమ్మాయి చాలా మంచిదని వర్షిణి గురించి తన తల్లికి ముఖేష్ చెప్పాడు.
తనకే ఒకరకంగా అనిపిస్తోందని.. తెలియకుండానే ఏడుపు వస్తుందని చెప్పింది. తాను చాలా స్ట్రాంగ్‌గా ఉంటానని.. నువ్వు ఏడవొద్దని ముఖేష్‌కు ఆమె చెప్పారు. తన తల్లి రావొట్లేదని వర్షిణి చెబితే వస్తారని ధైర్యం చెప్పారు. సుధీర్ రాగానే ముఖేష్ వాళ్ల అమ్మ ఎదురెళ్లి మరీ రిసీవ్ చేసుకుని అన్నాతమ్ముళ్ల మాదిరిగా ఉండాలని.. గొడవలు వద్దని చెప్పారు. సుధీర్ కూడా ముఖేష్‌ను హగ్ చేసుకున్నాడు. ఇక్కడకు వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలుగులో చెప్పారు. గులాబీ జామూన్ తీసుకొచ్చి అందరికీ తినిపించారు. త్రిగుణ్‌కు మీ బేబి చాలా బాగుందని.. ఫోటో చూశానని చెప్పారు. ప్రతి ఒక్కరినీ పేరు పెట్టి పిలుస్తూ మరీ స్వీటు తినిపించిన తీరు చాలా బాగుంది. ఇన్నేళ్లలో ఏనాడూ తన తల్లి లేకుండా తన బర్త్‌డే జరుపుకోలేదని ఇప్పుడు బర్త్‌డే బ్లెస్సింగ్స్ తీసుకుంటానని తీసుకోవడంతో ఆవిడ కల్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారు. ఈ ఇంట్లో ముఖేష్ ప్రయాణం మీకెలా అనిపిస్తోంది చెప్పమని బిగ్‌బాస్ అడిగారు. బాగా ఆడుతున్నావు కానీ గతంలో కన్నా కొంచెం స్ట్రాంగ్‌గా ఆడుతున్నాడు. సంతోషంగా ఉంది. ఈ మధ్య కొంచెం ఎమోషనల్ అయిపోయాడు. అది తనకు నచ్చలేదని చెప్పింది. తాను ఏడవడం తన తల్లి కూడా చూడలేదని ముఖేష్ చెప్పాడు. ఓవరాల్‌గా తను హ్యాపీ అని చెప్పాడు.
ముఖేష్ వాళ్ల అక్క మాట్లాడారు. ముఖేష్‌ను బిగ్‌బాస్ హౌస్‌లో చూసి చాలా ఆనందంగా అనిపించిందని.. తన ఆరోగ్యం బాగుందని చెప్పింది. స్ట్రాంగ్‌గా ఆడమని చెప్పింది. ముఖేష్ బావ, వారి కొడుకు కూడా ముఖేష్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. తనకు ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉందని.. రికవరీ తప్పక అవుతావని.. తను వచ్చాక పూర్తిగా రికవరీ అయిన నిన్ను చూస్తానని తన సోదరి దివ్యకు ముఖేష్ చెప్పాడు. 13 ఏళ్ల క్రితం తన తండ్రికి స్ట్రోక్ వచ్చినప్పుడు తన తండ్రికి రెండేళ్లు కంటిన్యువస్‌గా చూసుకుందని.. తను ఓపిక కోల్పోయినా కూడా తన తల్లి మాత్రం ఎలాంటి హోప్ కోల్పోలేదని ముఖేష్ చెప్పాడు. అదంతా చూసిన తర్వాత ఏదైనా సాధించే చావాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పాడు. తను ఏదైనా తప్పు చేసినప్పుడు తనకు తన ఫ్యామిలీ గుర్తొస్తుందని చెప్పాడు. అందరినీ మైసూర్‌కు ఇన్వైట్ చేశారు. అందరితో మంచిగా ఉండమని.. స్ట్రాంగ్‌గా ఉండమని ముఖేష్‌కు చెప్పారు. ముఖేష్‌ను హగ్ చేసుకుని త్రిగుణ్ కన్నీళ్లు పెట్టుకోవడం చాలా బాగా అనిపించింది. సులోచన కూడా త్రిగుణ్‌కు ధైర్యం చెప్పారు. తమ పాపే అమ్మలా వస్తోందని చెప్పాడు. అందరికీ చాముండేశ్వరి తల్లి మంచి చేస్తుందని చెప్పారు. అందరినీ ఎమోషనల్, ఖుషీ చేసి సులోచన వెళ్లారు.
దేబ్జాని తెలుగు టీచర్‌గా వచ్చి కాసేపు ఎంటర్టైన్ చేసింది. నెక్ట్స్ అమన్ ఫాదర్ మసూద్ వచ్చారు. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. మై హీరో ఈజ్ హియర్ అంటూ అమన్ సంబరపడిపోయాడు. అందరినీ పేరు పేరునా పలకరించారు. ముఖేష్ వచ్చి అన్నాతమ్ముళ్లలా ఉన్నారని చెప్పాడు. అందరికీ తాను చెప్పే మాటొక్కటేనని.. టాలెంట్ ఎవరి సొత్తూ కాదని చెప్పాడు. బయట జనం.. తమ అన్న, తమ్ముడు అని అనుకుంటున్నారని మసూద్ తన కొడుకుకు బూస్ట్ ఇచ్చారు. అందరూ గేమ్ గెలవడానికి వచ్చారని.. నువ్వు కూడా అదే తపనతో ఆడమని చెప్పారు. అమన్ హౌస్‌లో ఉండటం చాలా సంతోషంగా ఉందని.. ఇంతకు ముందు మసూద్ కొడుకు అమన్ అనేవారని.. ఇప్పుడు అమన్ తండ్రి మసూద్ అంటున్నారని తెలిపారు. అమన్ తండ్రి ఫుటేజ్ మొత్తమ్మీద ఒక ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే వచ్చింది. ఇది కోహినూర్ డైమండ్ అని అందరూ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మసూద్ వెళ్లిపోయారు.

ఆ తరువాత ప్రియాంక ఎంట్రీ ఇచ్చింది. ఆమె వచ్చే సమయానికే బయట ఒక స్టేజ్ అరేంజ్ చేసి మహారాజా సోఫా వేశారు. ఆమె దానిలో ముసుగు వేసుకుని కూర్చొంది. ఆ తరువాత అందరినీ బయటకు వదిలారు. కానీ దూరం నుంచి చూడగానే ఆమె పరి అని శివ్ చెప్పాడు. ఇద్దరూ హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు. మంచిగా మాట్లాడుతూనే ఎందుకు కొడుతున్నారని నీతూని ప్రియాంక అడిగింది. రామకృష్ణను ఎందుకంత ఇన్నోసెంట్‌గా ఉన్నావని అడిగింది. ముఖేష్‌కు బిలేటెడ్ హ్యాపీ బర్త్‌డే చెప్పింది. అందరికీ ఫ్యామిలీస్ వస్తున్నారని తెలుసని.. మూడేళ్ల క్రితం నువ్వొస్తున్నప్పుడు నేనెలా రెడీ అయ్యానో నీకు తెలుసని.. ఒక డ్రెస్ ఇచ్చింది. అది వేసుకోవడానికి వెళ్లినప్పుడు చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదని.. ఈ హౌస్‌లో తాము ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్టుగా చెప్పింది. బడ్జెట్ తగ్గుతుందని రామ్ ప్రసాద్ సరదాగా అన్నాడు. గిఫ్ట్‌లు ఏమీ ఎక్స్పెక్ట్ చేయవద్దని చెప్పాడు. శివ్ గెలిస్తే బాగుంటుందని అంతా ఎదురు చూస్తున్నారని.. మంచితనం ప్రతిచోట మంచిది కాదని.. త్యాగాలు చేయవద్దని ప్రియాంక చెప్పింది. తను ఉండలేకపోతున్నానని.. నిన్ను చాలా మిస్ అవుతున్నానని ప్రియాంక చెప్పింది. నీ ఆటను చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పింది.
హౌస్మేట్స్ అంతా రెడీ అయి వచ్చి శివ, ప్రియాంకల ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిపించారు. జెంట్స్ అంతా కలిసి ప్రియాంకను తీసుకొచ్చారు. లేడీస్ అంతా శివ్‌ను తీసుకొచ్చారు. తన తల్లిని చాలా ప్రేమిస్తానని.. ప్రియాంకను కూడా అంతే ప్రేమిస్తానని చెప్పాడు. తన తల్లి, ప్రియాంక లేకుండా తను బతకలేనని.. తనకేంటి ఇచ్చేది… తనే నాకు అన్నీ ఇస్తుందని చెబుతుంది. సంపాదించి ఏం చేస్తాం.. తనతో ఉండమని ఎప్పుడూ చెబుతుందట. అన్నింటి కన్నా తన జీవితంలో తన తల్లి, పరికి మించి ఏమీ లేదని శివ్ చెప్పాడు. తను గిన్నెలు కడుగుతానని.. గోరింటాకు కూడా తనే పెట్టుకుని వచ్చానని సరదాగా ప్రియాంక చెప్పింది. తనే ఎక్కువగా ప్రేమిస్తానని చెప్పింది. తనకు ఐఫిల్ టవర్ దగ్గర ప్రపోజ్ చేయాలని ఉండేదని.. బిగ్‌బాస్ హౌస్ అంతకు మించి అని భావిస్తున్నట్టుగా ప్రియాంక చెప్పింది. మొత్తానికి ఇద్దరూ ఒకరికొకరు ఎంగేజ్మెంట్ రింగ్స్ పెట్టుకున్నారు. ఆ తరువాత అంతా కలిసి సందడి చేస్తూ పూలదండలు మార్పించారు. ఇద్దరితో పేర్లు చెప్పించి హౌస్‌లోకి తీసుకొచ్చారు.

అంతా చాలా బాగా ఆడుతున్నారని.. నీ గేమ్ నువ్వు ఆడమని ప్రియాంక చెప్పింది. నువ్వు చాలా బాగా ఆడుతున్నావని.. ఆటలో నిన్ను టచ్ చేసే వాళ్లే ఉండరని చెప్పింది. ఒంటరిగా ఉన్నా కాబట్టి కొన్నిసార్లు భయపడుతున్నానని చెప్పాడు. శివ్‌కు ధైర్యం చెప్పి రెచ్చగొడితే రెచ్చిపోవద్దని చెప్పింది. మన మిస్టేక్స్‌ను మనం ఒప్పుకోవడం చాలా గొప్పతనమని.. అలా అంగీకరిస్తున్నావని అదే తనకు నచ్చుతోందని చెప్పింది. మంచిగా ఆడాలని.. అందరితో మంచిగా ఉండాలని ప్రియాంక చెప్పింది. మిమ్మల్ని చూడటం చాలా ట్రీట్‌లా ఉందని.. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని చెప్పింది. బయట కొన్ని మాటలకు హర్ట్ అవుతున్నామని.. అది చూసుకోమని చెప్పింది. ఎంగేజ్మెంట్ సందర్భంగా బిగ్‌బాస్ ప్రియాంక, శివ్లను అభినందించారు. శివ కోసం ఓ వీడియో మెసేజ్ పంపించారు. అది శివ తల్లి వీడియో. మీ ఎంగేజ్2మెంట్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. శివ చాలా బాగా ఆడుతున్నావని.. గెలిచి రావాలని… దేవుడు నీకు స్ట్రెంత్ ఇవ్వాలని కోరారు. తనకు ఇదొక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అని శివ్ చెప్పాడు. నువ్వు మంచిగా నిజాయితీగా ఆడతావని చెప్పింది. అందరితో మంచిగా ఉండమని చెప్పింది. వాడి మీద ప్రెజర్ పెట్టేస్తున్నట్టుగా అనిపిస్తోందని నీతూకి త్రిగుణ్ చెప్పాడు. వదిలేయాలని అన్నాడు. కప్ కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పి వెళ్లిపోయింది. త్రిగుణ్ అన్నట్టుగా నిజంగానే శివ్‌కి ప్రెజర్ పెట్టి వెళ్లింది.
మొత్తానికి ముఖేష్ తల్లి సులోచనకు షోలో ఎక్కువగా స్క్రీన్ స్పేస్ దొరికింది. ఆ తరువాత ప్రియాంక జైన్‌కు… అమన్ తండ్రికి చాలా తక్కువ దొరికింది. ముఖేష్ తల్లి అదరగొట్టారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని సందడి చేశారు. ఆమె సూపర్బ్. ముఖేష్‌కు ఒక్కటే ఒక హింట్ ఇచ్చారు. గేమ్‌లో గెలుపోటములు సహజమని.. సీరియస్‌గా తీసుకుని ట్రిగర్ అవ్వొద్దని చెప్పారు. వాస్తవానికి ప్రస్తుతం ముఖేష్ మార్చుకోవల్సింది అదొక్కటే. ప్రియాంక మాత్రం హౌస్‌లోని వారికి పరోక్షంగా ఓ వార్నింగ్ ఇచ్చేసి వెళ్లిపోయింది. అమన్ తండ్రి మసూద్ మాత్రం కొడుకుకు పెద్దగా సలహాలేమీ ఇవ్వలేదు. తన గేమ్ తను ఆడమని మాత్రం చెప్పేసి వెళ్లిపోయారు.
