
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కలయికలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఒక ఆసక్తికరమైన మార్పు జరిగింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2వ తేదీన చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. కానీ చివరి నిమిషంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీని సరిగ్గా వారం రోజుల పాటు పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు ఈ చిత్రం అక్టోబర్ 9న థియేటర్లలోకి రాబోతుంది. ఆడియన్స్ కు మరింత బెటర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికే ఈ చిన్న గ్యాప్ తీసుకున్నామని, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశ్యంతోనే ఇలా చేశామని చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అయితే ఈ వాయిదా వెనుక ఇండస్ట్రీలో చాలా రకాల ఇంట్రెస్టింగ్ కథలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచే రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సెట్స్ లో ఉన్నప్పుడు మేకర్స్ చాలా వరకు సీన్స్ ను మళ్ళీ మళ్ళీ రీ షూట్స్ చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ తన స్క్రిప్ట్ విషయంలో ఎప్పుడూ పర్ఫెక్షన్ కోరుకుంటారు కాబట్టే, ఔట్ పుట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఇలా రీ షూట్స్ కి వెళ్లారని తెలుస్తుంది. దీనికి తోడు ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న హీరో నారా రోహిత్ డేట్స్ విషయంలో కూడా పెద్ద మార్పు జరగడం ఈ రూమర్స్ కు మరింత బలం చేకూర్చింది. మొదట ఆయన క్యారెక్టర్ కోసం కేవలం 16 రోజులు మాత్రమే డేట్స్ అడిగారట. కానీ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఆయన పాత్ర నిడివి పెరగడం, అలాగే కథలో కొన్ని మార్పులు చేయడంతో ఆ డేట్స్ కాస్తా ఏకంగా 44 రోజులకు చేరాయని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే సినిమాలో నారా రోహిత్ క్యారెక్టర్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇక కథ విషయంలో కూడా ఆదర్శ కుటుంబం చుట్టూ ఒక క్రేజీ రూమర్ నడుస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించిన సూపర్ హిట్ బ్లాస్ట్ సినిమా పోలికలు ఈ సినిమాలో అక్కడక్కడా కనిపిస్తాయనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తుంది. కోర్ పాయింట్ అక్కడి నుంచి తీసుకున్నా, త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, వెంకటేష్ అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఆ కథను పూర్తిగా మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చేశారని అభిమానులు నమ్ముతున్నారు. ఈ రూమర్స్ ఎలా ఉన్నప్పటికీ, రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన సినిమా టీజర్ కు, అలాగే స్పెషల్ గా డిజైన్ చేసిన క్యారెక్టర్ ఇంట్రో వీడియోలకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ అన్నీ చాలా ఇంప్రెసివ్ గా ఉండటంతో సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇన్ని పాజిటివ్ వైబ్స్ మధ్య సినిమా వాయిదా పడటం ఫ్యాన్స్ ను కొద్దిగా డిజప్పాయింట్ చేసినా, ఆ వారం రోజుల వెయిటింగ్ కచ్చితంగా వర్త్ అవుతుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఆదర్శ కుటుంబం వాయిదా పడటానికి రీ షూట్స్, క్వాలిటీ ఔట్ పుట్ లాంటివి పైకి చెబుతున్న కారణాలు మాత్రమే అని, దీని వెనుక ఉన్న అసలు మేజర్ రీజన్ వేరే ఉందని వార్తలొస్తున్నాయి. అదే నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ప్యారడైజ్ రిలీజ్. ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రాబోతుంది. నాని సినిమా రిలీజ్ అయిన కేవలం ఎనిమిది రోజులకే అక్టోబర్ 2న వెంకటేష్ సినిమా వస్తే, బాక్సాఫీస్ దగ్గర రెండు సినిమాల కలెక్షన్స్ కు పెద్ద డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది. ప్యారడైజ్ కు హిట్ టాక్ వస్తే రెండో వారంలో కూడా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది, అప్పుడు థియేటర్ల దగ్గర ఆడియన్స్ డివైడ్ అయిపోతారు. ఇలాంటి టైమ్ లో పోటీకి వెళ్లడం కంటే, నాని సినిమాకు కాస్త బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే వెంకీ సినిమాను కావాలనే వారం రోజులు పోస్ట్ పోన్ చేశారని ఇండస్ట్రీలో ఒక స్ట్రాంగ్ టాక్ నడుస్తోంది. రెండు పెద్ద సినిమాలు బ్రతకాలంటే ఈ మాత్రం అడ్జస్ట్మెంట్ చాలా అవసరం.
ఈ వాయిదా వెనుక ఉన్న మరో ముఖ్యమైన ఫైనాన్షియల్ యాంగిల్ ఏంటంటే, ఈ రెండు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒకే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. రెండు పెద్ద సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వస్తే థియేటర్ల పంపకాల విషయంలో ఆ డిస్ట్రిబ్యూటర్స్ కు పెద్ద తలనొప్పి వస్తుంది. వాళ్లకు ఏ సినిమాకు ఎన్ని స్క్రీన్స్ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తోడు ప్యారడైజ్ సినిమా నిర్మాత సుధాకర్ చెరుకూరి, ఆదర్శ కుటుంబం నిర్మాత సూర్యదేవర నాగవంశీ బయట చాలా మంచి స్నేహితులు. తమ సినిమాల వల్ల బయ్యర్లు నష్టపోకూడదని, ఇద్దరు నిర్మాతలు కూర్చుని మాట్లాడుకుని ఒక ఫ్రెండ్లీ అగ్రిమెంట్ కు వచ్చారనే టాక్ కూడా బాగానే వినిపిస్తుంది. బాక్సాఫీస్ దగ్గర అనవసరమైన క్లాష్ తెచ్చుకుని వసూళ్లు తగ్గించుకోవడం కంటే, మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో వెళ్లడమే ఇద్దరికీ కరెక్ట్ అని నాగవంశీ ఈ డెసిషన్ తీసుకున్నారు. మొత్తానికి ఎలాంటి ఇగో క్లాషెస్ లేకుండా, కేవలం బిజినెస్ లాజిక్స్ మరియు స్నేహపూర్వక వాతావరణంలోనే ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 9కి షిఫ్ట్ అయిందన్నమాట.
