Menu
BREAKING
Biggboss10 Telugu: సడెన్ ఎలిమినేషన్.. ఇవాళేనా? వెళ్లబోయేదెవరు?   |   RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!   |   నా బాడీ నా యిష్టం.. నా సైజ్‌ల గురించి మీకెందుకు.. ఆ హీరోయిన్ సీరియస్..!   |   Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..   |   సో కాల్డ్ వారసులను అడిగే దమ్ముందా.. బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్లేనా టార్గెట్..?   |   కుర్రాడు సక్సెస్ అవుతాడా.. దొంగ నా కొడుకుతో మౌళి ఫ్యూచర్ ఏంటి..?   |   దసరాకు పట్టించుకోరా.. విజయదశమి కనీసం కళ్లకు కనిపించలేదా మన హీరోలకు..?   |   Biggboss10 Telugu: సుధీర్, ఝాన్సీలను ఒకాట ఆడుకున్న ఆర్కే.. బయటకొచ్చిన ఎలుకలు..   |   అన్నీ చెప్పిన రాజమౌళి ఆ ఒక్కటి తప్ప.. వారణాసి కథేంటో తెలుసా..?   |   దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్ రెండో కూతురు పేరు తెలుసా..?   |   Vijay Deverakonda: కొండన్న ముందు భారీ లక్ష్యం.. ‘రణబాలి’ ఇప్పటి వరకు ఓకే.. ఇకపై ఏం చేస్తుందో..?   |   Jailer 2: ఆ రికార్డు సాధిస్తుందా..? కోలీవుడ్ పరువు ఇప్పుడు రజినీ చేతుల్లో..!   |   Kaaka: ‘కాకా’ మేకింగ్ వీడియో లీక్.. కావాలనే చేసారా లేదంటే అలా జరిగిపోయిందా..?   |   బాలీవుడ్ హీరోలను బతకనీయరా.. నడిరోడ్డు మీద కాల్పులేంటి సామి..?   |   BiggBoss10 Telugu: బిగ్ బాస్‌లో షాలిని ఎలిమినేషన్ ట్విస్ట్.. సీక్రెట్ రూమ్‌కు పంపించిన నాగార్జున!

Biggboss 10 Telugu: బిగ్‌బాస్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్?

Biggboss 10 Telugu: బిగ్‌బాస్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్?

బిగ్‌బాస్‌ 10 తెలుగు (Bigg Boss 10 Telugu)లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందన్న టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియడం లేదు కానీ.. ముందుగానే బిగ్‌బాస్ హై రిస్క్, నో రిస్క్ జోన్‌ అని చెప్పాడు. ఈ క్రమంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండనుందని టాక్. ఈ రోజు (బుధవారం) అర్ధరాత్రికే మిడ్ వీక్ ఎలిమినేషన్ (Mid Week Elimination) జరగనుందని టాక్. ఇప్పటి వరకూ బిగ్‌బాస్ చరిత్రలో ఇలా ఫస్ట్ వీకే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది లేదు. ఇవాళ అది జరిగితే మాత్రం తొలిసారి కానుంది. ప్రస్తుతం హై రిస్క్‌లో రామ్ ప్రసాద్ (Ram Prasad), చరణ్ (Charan) హై రిస్క్ జోన్‌లో ఉన్నారు. రామ్ ప్రసాద్ వచ్చేసి తనను తాను హై రిస్క్‌ జోన్‌లో పెట్టుకున్నాడు. ఇది అతనికే మైనస్. అయితే వీళ్లిద్దరిలో చూస్తే మాత్రం వాస్తవానికి రామ్ ప్రసాద్‌కే డేంజర్ పొంచి ఉంది.

ఎందుకంటే.. చరణ్‌(Charan)ని హై రిస్క్ జోన్‌లో పెట్టడంతో అతనికి సింపతి బాగా వర్కవుట్ అయ్యింది. పైగా అతడిని హై రిస్క్ జోన్‌లో పెట్టినప్పుడు రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సమయంలో వారిద్దరి బాండ్ ఏంటనేది బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే రోహిత్ ఫ్యాన్స్.. చరణ్‌కి ఓటు వేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు డేంజర్ అనేది రామ్ ప్రసాద్‌(Ram Prasad)కే ఎక్కువ. ఇక రామ్ ప్రసాద్‌ని ఎలిమినేట్ చేస్తే కష్టం అవుతుంది. అతని కారణంగానే షోలో కామెడీ జెనరేట్ అవుతోంది. కాబట్టి అతడిని సీక్రెట్ రూమ్‌లోకి పంపించే అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా ఉండనున్నాయి. ఇప్పటికే నందూస్ వరల్డ్ నందన (Nandana).. ఇండియాకు వచ్చింది కూడా అందుకేనని టాక్ నడుస్తోంది.

ఈ క్రమంలోనే నందన కావాలనే అరెస్ట్ అయ్యారనే టాక్ కూడా ఉంది. తద్వారా బెయిల్ తీసుకుని ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. ఇక ఆమె మాత్రమే కాకుండా అగ్నిపరీక్షలో ఫైనల్ వరకూ వచ్చిన వారిలో ఒకరిద్దరిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించనున్నట్టు టాక్. మొత్తానికి బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360