Menu
BREAKING
‘ది ప్యారడైజ్’ దెబ్బతో నాని కీలక నిర్ణయం..   |   Bigg Boss 10 Telugu: చరణ్ ఎలిమినేషన్ వెనుక ట్విస్ట్.. షాలినికి ఓటేసిన హౌస్‌మేట్స్!   |   BiggBoss10 Telugu: రోహిత్‌కు నాగార్జున క్లాస్.. షాలిని కోసం ఆట మర్చిపోయాడా?   |   నానిని కావాలనే ఇరికిస్తున్నారా.. ‘ప్యారడైజ్’ రిలీజ్ తర్వాత వదలట్లేదా..?   |   నానా పటేకర్ లాంటి దిగ్గజ నటుడికి ఇచ్చే గౌరవం ఇదేనా.. బాలీవుడ్ పట్టించుకోలేదా..?   |   విశ్వంభర టీం నమ్మకమేంటి… కాకా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తాడా..?   |   Biggboss10 Telugu: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్..   |   విజయ్ దేవరకొండ ముందున్న ఎన్నో సవాళ్లు.. రణబాలితో సమధానం చెప్తాడా మరి..?   |   సెక్స్ టాయ్స్ అనేది అమ్మాయిల యిష్టం.. దాంతో మీకెందుకు అంటున్న స్టార్ హీరోయిన్..!   |   Biggboss10 Telugu: కామనర్స్‌కు దెబ్బేసిన సెలబ్రిటీలు.. వీళ్లిక మారరు..   |   మొన్న నాని.. నేడు విజయ్ దేవరకొండ.. తొక్కేస్తున్నారా వీళ్లను.. మరి తొక్కేదెవరు..?   |   Biggboss10 Telugu: షాలిని వర్సెస్ అపూర్వ ఆగేలా లేదు.. రోహిత్‌కి కష్టమే..   |   భారతీయుడు 3 వస్తున్నాడు.. సేనాపతి ఈజ్ బ్యాక్.. శంకర్ ఏం చేస్తాడో..?   |   లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. ఆయన సాధించిన ఘనతలు ఎన్నో తెలుసా.. ?   |   ఏంది మచ్చా అంత పని చేసినావ్.. మీమ్స్‌తో నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ హఠాన్మరణం..!

Biggboss 10 Telugu: రచ్చ లేపిన నామినేషన్స్.. శివాలెత్తిన సృష్టి

బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల పర్వం రానే వచ్చింది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో జరిగిన దాన్ని బట్టే నామినేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవాళ (సోమవారం) జరిగిన నామినేషన్స్‌కు సంబంధించిన ఫస్ట్ ప్రోమో విడుదలైంది. సుధీర్ దగ్గరకు వెళ్లి సృష్టి తనను ఫ్రెండ్‌గా భావిస్తున్నారా? లేదా? అని అడిగింది. దానికి సుధీర్.. వర్షిణిని పిలిచాడు. దీంతో తనకు అవసరం లేదని అక్కడి నుంచి సృష్టి వెళ్లిపోయింది. కిచెన్‌లోనూ వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. సుధీర్ ఎవరితోనో.. ‘నా దగ్గర ఫైవ్ మెంబర్స్ ఉన్నారు. సృష్టి దగ్గర ట్రైనింగ్ తీసుకుని వాళ్లను వెదకాలి’ అన్నాడట. ఆ విషయం తనకు తెలిసిందని.. ఎంత చెత్తలాగా ఉంటుందో తెలుసా? అని సృష్టి కోపంగా వెళ్లిపోయింది.

ఆ తరువాత బిగ్‌బాస్ నామినేషన్స్ ప్రక్రియను వివరించాడు. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి నెత్తిపై చెత్తపోసి కారణాలు చెప్పాలి. ప్రోమోను బట్టి చూస్తే సృష్టి, రోహిత్ ఇద్దరూ సుధీర్‌ని నామినేట్ చేసినట్టుగా తెలుస్తోంది. బ్లాక్ కీ ఎవరికి ఇవ్వాలి అనగానే మీరు (సుధీర్) చెప్పిన రీజన్ ఏంటంటే.. సుధీర్ అంటే సృష్టి కదా.. సో సుధీర్ అనగానే నా నోటిలో నుంచి సృష్టి పేరు గుర్తొచ్చింది’ అని సుధీర్ అన్నాడని రోహిత్ చెప్పాడు. ఎన్ని సార్లు అడిగినా కూడా ‘సుధీర్ అంటే సృష్టి కదా’ అని చెబుతూనే ఉన్నాడని సృష్టి కూడా ఫైర్ అయిపోయింది. ‘అది నా స్ట్రాటజీ.. నేనలా ఆడతా’ అని సుధీర్ అనగానే అబద్ధాలు చెప్పడం మీ స్ట్రాటజీనా? అని రోహిత్ ప్రశ్నించాడు.

Biggboss 10 Telugu: రచ్చ లేపిన నామినేషన్స్.. శివాలెత్తిన సృష్టి

‘నేను.. సృష్టి హౌస్‌లో ఫ్రెండ్స్ మాత్రమే’ అనగానే అది కూడా కాదని సృష్టి చెప్పింది. ‘బిగ్‌బాస్ నాకు ఫ్రీడం వచ్చింది’ అంటూ సుధీర్ అరిచాడు. దీంతో సృష్టి బాగా ఫైర్ అయిపోయింది. ‘ఫస్టే చెప్పాను నీకు.. నువ్వు నా టైప్ కాదు అని.. నువ్వు నాకు చెప్పకు.. పిచ్చి వేషాలు వేస్తావు.. ఒక్క గుద్దు గుద్దితే పళ్లు రాలిపోతాయి’ అంటూ సృష్టి మండిపడింది. ‘నేనేమన్నా నాకు ఫ్రీడం వచ్చిందని అన్నా’ అని సుధీర్ అనడంతో.. ‘నేనేమైనా పట్టుకుని కూర్చున్నానా? నోరు మూసుకో నేను మాట్లాడేటప్పుడు’ అని సృష్టి ఫైర్ అయ్యింది. ఆ తరువాత సృష్టి ఏడుస్తూ హౌస్‌ లోపలికి పరిగెత్తింది. ఆమె వెంట అంతా పరిగెత్తారు. అసలు దీని గురించి పూర్తిగా తెలియాలంటే.. ఎపిసోడ్ చూడాలి.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360