సినిమా వార్తలు

Biggboss 10 Telugu: వర్షిణి కోసం దేబ్జానిని బలి చేసిన ముఖేష్..

ఇవాళ (మంగళవారం) బిగ్‌బాస్ కూడా ఎక్కువ సేపు నామినేషన్స్ చుట్టూనే తిరిగింది. నామినేషన్స్ గురించి ఒకవైపు వర్షిణి, సుధీర్.. మరోవైపు దేబ్జాని, ముఖేష్ చర్చించుకుంటున్నారు. వర్షిణి చెప్పినా తాను విననని సుధీర్ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తనకు చెప్పదు అని చెప్పాలంటూ హితబోధ చేసింది. రామ్ ప్రసాద్, నరేష్ మధ్య సైతం శ్రష్టి నిన్న సుధీర్‌పై గుద్దుతే పళ్లు రాలతాయంటూ వెళ్లడంపై చర్చ జరిగింది. ఆ పాయింట్ మీద శ్రష్టికి నామినేషన్ వేయమని నరేష్‌కి రామ్ ప్రసాద్ చెప్పాడు. ఎవరిని ఎంచుకోమని చెప్పినా నరేష్‌కి ఇవ్వమని దేబ్జాని, ముఖేష్, ఝాన్సీ వాళ్లందరికీ రామ్ ప్రసాద్ చెప్పాడు. మరోవైపు త్రిగుణ్‌కి చెప్పి శ్రష్టి కన్నీళ్లు పెట్టుకుంది. త్రిగుణ్‌వి అన్నీ శకుని మూవ్సేనని రోహిత్ చెప్పాడు. డిష్ వాష్ చేసేటప్పుడు తనను చాలా ఇన్సల్టింగ్‌గా మాట్లాడాడని చెప్పాడు. మరోవైపు రామ్ ప్రసాద్, దేబ్జాని, నరేష్ మధ్య కూడా త్రిగుణ్ గురించే చర్చ. ‘నీది శ్రష్టి మధ్య ఏం జరిగిందో ఫస్ట్ నుంచి నేను లేను కాబట్టి మీ ఇద్దరి గురించి నేను మాట్లాడలేను’ అని సుధీర్‌కి రోహిత్ చెప్పాడు. శ్రష్టిని రాంగ్‌గా డైరెక్ట్ చేస్తున్నాడని.. ఆమె కూడా అలాగే అవుతోందని రోహిత్ చెప్పాడు.

తరువాత నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. ముఖేష్ నామినేషన్స్ ప్రారంభించాడు. ముఖేష్ వచ్చేసి చరణ్‌ని నామినేట్ చేశాడు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ గురించి చరణ్‌.. ముఖేష్‌ని పాయింట్ అవుట్ చేశాడు. తాను బయట చూసి వచ్చానని చరణ్ చెప్పాడు. ఈ విషయంలో వంశీ పేరు రావడంతో అతను ప్రతిదీ నీకు చెప్పాలా? అంటూ ఆయన ఫైర్ అయ్యాడు. ప్రక్రియ జరుగుతుంటే వచ్చి తింటూ అన్నీ అడుగుతుంటారని.. దేబ్జాని కూడా అలాగే చేస్తుందని వంశీ అన్నాడు. ప్రక్రియ జరుగుతున్నప్పుడు అక్కడ ఉండాలనేది అతని పాయింట్. ఈ నేపథ్యంలో వర్షిణి, షాలిని మధ్య పెద్ద గొడవే జరిగింది. పక్కనున్నోళ్లకు పుల్లలు పెట్టడం తప్ప నీకేం రాదదని షాలిని.. ఛాన్స్ వస్తే ఇలాగే గొడవ చేస్తావని వర్షిణి అన్నది. పక్కకెళ్లి ఆడుకోమని వర్షిణి.. నువ్వు బయటకు వెళ్లి ఆడుకోమని షాలిని అన్నది. రెచ్చగొట్టడం తప్ప ఆమె చేస్తున్నదేం లేదని షాలిని చెప్పింది. ‘నాన్నా.. ఇటు సైడ్ వెళ్లి ఆడు నాన్నా.. చూసుకో నాన్నా ఎటువైపు ఆడుతున్నావో’ అంటూ వర్షిణిని షాలిని ఇమిటేట్ చేసింది.

సంబంధమే లేకుండా నాపై వచ్చి పడుతుందేంటని త్రిగుణ్‌తో వర్షిణి చర్చ మొదలు పెట్టింది. ‘నీ పక్కనున్నవాళ్ల కారణంగానే నువ్వు టార్గెట్ అవుతున్నావు’ అని త్రిగుణ్ చెప్పాడు. ఇక నామినేషన్స్ చివరి రౌండ్ ప్రారంభమైంది. షాలిని నామినేషన్ ప్రారంభించింది. వర్షిణిని నామినేట్ చేసి ‘మీ గేమ్ మీరు ఆడితే బాగుంటుంది. మీరు వెనుకుండి గేమ్ ఆడుతున్నారు. సంచాలక్‌గా ఫెయిల్. బిగ్‌బాస్ ఇచ్చిన రెస్పాన్సిబులిటీ సరిగా చేయలేదు. పార్షియాలిటి చూపించారు. నేను కరెక్ట్ రాసినా కూడా పట్టించుకోకుండా మీకు నచ్చినట్టుగా గేమ్ మార్చారు’ అని వర్షిణిని షాలిని నామినేట్ చేసింది. రోప్ టాస్క్‌లో అమన్ కన్ఫ్యూజ్ చేశాడని చెప్పింది. అమన్ మాట్లాడుతుంటే అతడిని ఝాన్సీ ఆపేసింది. మధ్యలో ముఖేష్ వచ్చాడు కానీ అతడిని ఆపలేదు. రోహిత్‌ నిన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాడని అనడంతో తాను ఎవ్వరి మాట విననని షాలిని చెప్పింది. మధ్యలో ముఖేష్ వస్తే అతనెందుకు మాట్లాడుతున్నాడంటే.. దమ్ముంటే నామినేట్ చెయ్యమని వర్షిణి అన్నది. మధ్యలో రోహిత్ పేరు తీయడంతో ‘నా పేరు తీయకుండా నామినేషన్ చేయలేరా?’ అని రోహిత్ అన్నాడు. దీనికి త్రిగుణ్ ‘నువ్వూ నేనూ ఆవకాయ లాంటోళ్లం.. మనల్ని నంజుకోకుంటే ఎవరికీ అవదు’ అని త్రిగుణ్ చెప్పాడు.

ఆ తరువాత శ్రష్టి నామినేషన్ ప్రారంభించింది. ఆమె సుధీర్‌ని నామినేట్ చేసింది. ఫస్ట్ వచ్చి తన దగ్గర మాట్లాడిందని అతనేనని చెప్పింది. తను ఫ్రెండ్ కాదని చెప్పాక ఫ్రీడం వచ్చిందని చెప్పాడని.. తను గుద్దితే పళ్లు రాలతాయన్న మాట అనకుండా ఉండాల్సిందనని శ్రష్టి చెప్పింది. తను దేనికి ఇనిషియేట్ తీసుకోకపోవడానికి కారణం తనకు ఇంట్రస్ట్ లేకపోవడమేనని ఆమె చెప్పింది. ప్రతి సారి ఆమెకు ఇబ్బంది ఉంటే చెప్పమని చెప్పానని.. అలాగే ఎప్పుడూ రాంగ్‌గా పోట్రే చేయలేదని చెప్పాడు.అంతకు ముందు ఫ్రెండ్స్‌గా ఓకే అనడంతో తమ మధ్య ఏం లేదని కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పాల్సి వచ్చిందని సుధీర్ అన్నాడు. తన జీవితంలో ఏనాడూ ఏ అమ్మాయితో అలా అనిపించుకోలేదని.. తన బుద్ది తక్కువ కారణంగా ఇలాంటి మాటలు పడ్డానని అన్నాడు. 14 రోజుల్లో ఒకడిని పళ్లు రాలగొడుతా అన్నావని అంటే దానిిక తను సారీ కూడా చెప్పానన్నాడు. షాలిని వెళ్లి సుధీర్‌పై చెత్త వేసి రుద్దింది. దీనికి షాలిని అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. ఈ వారం వంశీ, సుధీర్, షాలిని, అమన్, ఝాన్సీ, త్రిగుణ్, చరణ్, వర్షిణి నామినేట్ అయ్యారు.

ట్రిగర్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఒక మనిషిపై చెత్త వేసి రుద్దడం కరెక్ట్ కాదని శ్రష్టికి చరణ్ చెప్పాడు. పళ్లు రాలిపోతాయనడం కూడా మంచిది కాదని ఆమెకు చెప్పాడు. శ్రష్టి బాధలో ఉన్నప్పుడు నవ్వుతూ క్లాప్స్ కొడితే ఎంత ట్రిగర్ అవుతారో మీకు తెలుసు కదా అని సుధీర్‌ని రోహిత్ అన్నాడు. మీరు కూడా బాధలో ఉన్నారని తనకు తెలుసని రోహిత్ చెప్పాడు. లైవ్‌లో రోహిత్ చాలా సేపు సుధీర్‌తో మాట్లాడాడు. శ్రష్టిది కూడా తప్పేనని.. సుధీర్‌పై ప్రశంసలు కూడా కురిపించాడు. చాలా ఓపిక పట్టావని.. అది తనకు నచ్చిందని రోహిత్ చెప్పాడు. చెత్త పోసిన విధానం బాగోలేదని శ్రష్టికి ఝాన్సీ చెప్పింది. తను కూడా హర్ట్ అయ్యానని శ్రష్టి చెప్పింది. టెమ్టేషన్.. టెన్షన్‌లో భాగంగా ఎమోషనల్ సైడ్ ఎంత బలంగా ఉందో పరీక్షించబోతున్నట్టు బిగ్‌బాస్ చెప్పారు. గార్డెన్ ఏరియాలో ఒక బజర్.. లివింగ్ ఏరియాలో ఒక బజర్ పెట్టారు. అందరి కంటే ముందు బజర్ కొట్టిన వ్యక్తులను నేరుగా కెప్టెన్సీ కంటెండర్స్‌ని చేయనున్నట్టు బిగ్‌బాస్ చెప్పారు. లివింగ్ ఏరియాలో ముఖేష్.. గార్డెన్ ఏరియాలో రోహిత్ బజర్ కొట్టాడు. అంటే రోహిత్ వర్సెస్ ముఖేష్ మధ్య టాస్క్ పడింది.

టాస్క్ ఏంటంటే.. పుష్ యువర్ లిమిట్స్. గార్డెన్ ఏరియాలో అమర్చిన మూడు బాక్సులను ఎల్లో లైన్ దాటేలా పుష్ చేయాలి. టాస్క్ ప్రారంభమైంది. ఫస్ట్ బాక్స్ ముఖేష్ తోసేశాడు. ఎల్లో లైన్ దాటిందని కొందరు.. దాటలేదని కొందరు చెప్పారు. ఈ రౌండ్ కూడా ముఖేష్ గెలిచాడని సంచాలక్ చెప్పాడు. దీంతో ముఖేష్ కెప్టెన్సీ కంటెండర్ అవడంతో పాటు టెమ్టేషన్ సాధించినట్టుగా ముఖేష్ చెప్పాడు. ఒకవేళ రాంగ్ డెషిషన్ చెప్పి ఉంటే అమన్ గాడితో పాటు గ్రూప్ గ్రూప్ అంతా అయిపోయేదంటూ రామ్ ప్రసాద్ నోరు జారి మాట్లాడాడు. రామ్ ప్రసాద్ స్టాండ్ తీసుకోకపోయి ఉంటే అయ్యేది కాదని.. లేదంటే ముఖేష్‌ని అవనిచ్చే వారు కాదని నరేష్ చెప్పాడు. ముఖేష్‌కు బిగ్‌బాస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రోహిత్ మీద గెలవడం తనకు ఆనందంగా ఉందని ముఖేష్ చెప్పాడు. మీ నాన్నని మిస్ అవుతున్నారా? అని ముఖేష్‌ని బిగ్‌బాస్ అడిగితే అతను అవునని చెప్పాడు. తను అవార్డు తీసుకుంటున్నప్పుడు ఆయన స్టేజ్‌పైన ఉన్నారని అది తన లైఫ్‌టైమ్ మెమరీ అని చెప్పాడు. ఈ క్రమంలోనే టెమ్టేషన్‌గా మీ నాన్నగారితో మీరు తీసుకున్న ఫోటో మీకు అందుతుందని చెప్పాడు. దీనికోసం ఇంట్లో వారికి టెన్షన్ ఇవ్వాలని బిగ్‌బాస్ చెప్పారు.

టెన్షన్ ఏంటంటే.. ఒకటి.. దేబ్జానికి ఇంటి నుంచి వచ్చిన లెటర్ అందకుండా చేయడం.. రెండవది వర్షిణికి ఆమె ఫ్యామిలీతో ఉన్న ఫోటోను దక్కకుండా చేయడం.. ఈ రెండింటిలో దేనిని దూరం చేస్తావని బిగ్‌బాస్ అడిగారు. ఎవరికి టెన్షన్ ఇస్తే వారికి ఇష్టమైనది దూరమవడంతో పాటు కెప్టెన్సీ కంటెండర్ రేసు నుంచి తప్పించాల్సి ఉంటుందన్నారు. తను దేబ్జానికి ఇస్తున్నట్టుగా చెప్పాడు. అది బయటకు వెళ్లి ఆమెకు చెప్పాలని బిగ్‌బాస్ చెప్పారు. లోపలికి వెళ్లి బటర్ బేబి రా అంటూ ముఖేష్ తీసుకెళ్లి.. బిగ్‌బాస్ చెప్పిన రెండింటినీ దేబ్జానికి ముఖేష్ చెప్పాడు. అయితే కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించిన విషయాన్ని మాత్రం దేబ్జానికి ముఖేష్ చెప్పలేదు. ఎవరి కోసం తనకు వచ్చిన దానిని త్యాగం చేశావని దేబ్జాని అడిగింది. అది మాత్రం ముఖేష్ ఆమెకు చెప్పలేదు. బిగ్‌బాస్ ఊరుకుంటారా? పెట్టాల్సిన ఫిట్టింగ్ పెట్టేశాడు. వర్షిణికి టెన్షన్ ఇవ్వలేదని.. దేబ్జానికి కెప్టెన్సీ కంటెండర్ రేసు నుంచి తప్పించడంతో పాటు లెటర్‌ను శాక్రిఫైస్ చేశాడని బిగ్‌బాస్ చెప్పారు. దీంతో దేబ్జాని బాగా ఎమోషనల్ అయ్యింది. తనను క్షమించమని.. ఇన్‌టెన్షన్‌తో చేయలేదని చెప్పాడు. కంటెండర్ తీసుకో ప్రాబ్లమ్ లేదు కానీ లెటర్ పోయిందని చెప్పాడు. దేబ్జాని బాగా ఎమోషనల్ అయ్యింది. ఇవాళ్టి బిగ్‌బాస్ హౌస్‌లో బీభత్సమైన గొడవలేం లేవు కానీ ఎవరికి వాళ్లు స్ట్రాటజీలు.. ఎవరికి వాళ్లు ఒకరిపై మరొకరు చెప్పుకోవడం వంటివి బాగా జరిగాయి. మొత్తానికి వర్షిణి కోసం దేబ్జానిని ముఖేష్ బలి చేశాడు.

Telugu Cinema 360

Recent Posts

‘ఆదర్శ కుటుంబం’ వాయిదా వెనక ‘ప్యారడైజ్’ హస్తం.. నాని కోసం త్యాగమా..?

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.…

2 hours ago

Biggboss 10 Telugu: అతి చేస్తున్న శ్రష్టి.. మొత్తం కంటెంట్ కోసమేనా?

వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి శ్రష్టి, కృష్ణుడు తనకసలు కనిపించలేదని చెప్పి ఆ ఇద్దరికీ పనిష్మెంట్ కూడా ఇచ్చారు. దాని…

3 hours ago

నానిని తొక్కేయాలని చూస్తున్నారా.. అతడి చుట్టూ కుట్ర జరుగుతుందా..?

టాలీవుడ్‌లో న్యాచురల్ స్టార్ నాని చుట్టూ జరుగుతున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసలు నానిపై ఇండస్ట్రీలో ఏదైనా కుట్ర…

14 hours ago

‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌కు మోహన్ బాబు దూరం.. అదేనా అసలు కారణం..!

టాలీవుడ్ సర్కిల్స్ లో ప్యారడైజ్ సినిమా చుట్టూ జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ సినిమా రెమ్యునరేషన్స్…

14 hours ago

అయ్యో ఏంది కాకా ఇది.. నువ్వు వినవు.. ఆయన ఆగడు.. సరిపోయారు ఇద్దరూ..!

ఇండస్ట్రీలో ఇప్పుడు చిరంజీవి చుట్టూ జరుగుతున్న ఒక ఆసక్తికరమైన చర్చ హాట్ టాపిక్ గా మారింది. రాబోయే సంక్రాంతి బరిలో…

15 hours ago

ది ప్యారడైజ్ సినిమా సెన్సార్ రివ్యూ.. 21 కట్స్.. చాలా పెద్ద రిస్క్.. అవే మైనస్..!

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ…

24 hours ago