సినిమా వార్తలు

Biggboss 10 Telugu: అతి చేస్తున్న శ్రష్టి.. మొత్తం కంటెంట్ కోసమేనా?

వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి శ్రష్టి, కృష్ణుడు తనకసలు కనిపించలేదని చెప్పి ఆ ఇద్దరికీ పనిష్మెంట్ కూడా ఇచ్చారు. దాని ఎఫెక్టో.. మరొకటో కానీ శ్రష్టి హౌస్‌లో రెచ్చిపోయింది. నామినేషన్స్‌లో సుధీర్‌తో గొడవకు దిగింది. పాయింట్స్ మాట్లాడితే బాగానే ఉండేది కానీ గుద్దితే పళ్లు రాలతాయ్.. ఇడియట్ అంటూ మాటలు జారింది. ఇది బయట చూసే ఆడియెన్స్‌కే కాదు.. హౌస్‌లో ఉన్న వారికి సైతం తప్పు అనిపించింది. పైగా కంటెంట్ కోసమే ఇలా చేసిందని హౌస్‌లో ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. చివరకు రోహిత్, షాలిని సైతం ఇదే భావనలో ఉన్నారు. ఫస్ట్ వారం వంశీతో కూడా నాగ్ కనిపించడం లేదని అన్నారు. ఆ తరువాతి వారం వంశీ రెచ్చిపోయి మరీ రచ్చ చేశాడు.

వీకెండ్‌లో నాగ్ వచ్చి వంశీకి అక్షింతలు వేశారు. అది చూసిన తర్వాత కూడా శ్రష్టి గొడవ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇవాళ రిలీజ్ అయిన ప్రోమోలో కూడా సుధీర్‌ను నామినేట్ చేస్తూ శ్రష్టి చాలా ఓవర్‌గా బిహేవ్ చేసినట్టుగా అనిపించింది. అతని నెత్తిపై చెత్తను కొట్టి వెళ్లిపోయింది. ఇది మరీ ఓవర్‌గా అనిపించింది. దీని కారణంగా శ్రష్టికే బ్యాడ్ అవుతోంది. చాలా నెగిటివిటీ వస్తోంది. శ్రష్టి ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం హౌస్‌లో ఉండటం కష్టమే. మరోవైపు ఈ గొడవంతా సుధీర్‌కు బాగా కలిసొచ్చింది. అంతేకాకుండా అతనికి హౌస్‌లోనూ సపోర్ట్ పెరిగింది. బయట ఓటింగ్ పోల్స్‌లోనూ అతనికి సపోర్ట్ బాగా కనిపిస్తోంది. మొత్తానికి సుధీర్‌తో గొడవపడి శ్రష్టి తన విలువను పడగొట్టుకుని.. సుధీర్ విలువను పెంచింది.

Telugu Cinema 360

Recent Posts

‘ఆదర్శ కుటుంబం’ వాయిదా వెనక ‘ప్యారడైజ్’ హస్తం.. నాని కోసం త్యాగమా..?

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.…

55 minutes ago

Biggboss 10 Telugu: వర్షిణి కోసం దేబ్జానిని బలి చేసిన ముఖేష్..

ఇవాళ (మంగళవారం) బిగ్‌బాస్ కూడా ఎక్కువ సేపు నామినేషన్స్ చుట్టూనే తిరిగింది. నామినేషన్స్ గురించి ఒకవైపు వర్షిణి, సుధీర్.. మరోవైపు…

1 hour ago

నానిని తొక్కేయాలని చూస్తున్నారా.. అతడి చుట్టూ కుట్ర జరుగుతుందా..?

టాలీవుడ్‌లో న్యాచురల్ స్టార్ నాని చుట్టూ జరుగుతున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసలు నానిపై ఇండస్ట్రీలో ఏదైనా కుట్ర…

13 hours ago

‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌కు మోహన్ బాబు దూరం.. అదేనా అసలు కారణం..!

టాలీవుడ్ సర్కిల్స్ లో ప్యారడైజ్ సినిమా చుట్టూ జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ సినిమా రెమ్యునరేషన్స్…

14 hours ago

అయ్యో ఏంది కాకా ఇది.. నువ్వు వినవు.. ఆయన ఆగడు.. సరిపోయారు ఇద్దరూ..!

ఇండస్ట్రీలో ఇప్పుడు చిరంజీవి చుట్టూ జరుగుతున్న ఒక ఆసక్తికరమైన చర్చ హాట్ టాపిక్ గా మారింది. రాబోయే సంక్రాంతి బరిలో…

14 hours ago

ది ప్యారడైజ్ సినిమా సెన్సార్ రివ్యూ.. 21 కట్స్.. చాలా పెద్ద రిస్క్.. అవే మైనస్..!

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ…

23 hours ago