సినిమా వార్తలు

Bigg Boss10 Telugu: మరో రోహిత్ అవుతున్న ముఖేష్.. రెడ్ కార్డ్ ఇచ్చేంత తప్పు చేశాడా?

బిగ్‌బాస్ 10 తెలుగు కంప్లీట్‌గా గ్రూప్‌ల మీదే నడుస్తోంది. ప్రస్తుతం అయితే పది మంది ఒక గ్రూప్ అదే త్రిగుణ్ గ్రూప్… ముగ్గురు ఒక గ్రూప్‌. ఇది ముఖేష్ గ్రూప్. ఎక్కడైనా బలం ఎక్కువ ఉన్నవారిదే హవా కాబట్టి హౌస్‌లో త్రిగుణ్ గ్రూప్ హవానే నడుస్తోంది. హౌస్‌లో సోమవారం నామినేషన్స్ పర్వం ప్రారంభమైంది. ఇవాళ కూడా నామినేషన్స్ నడవనున్నాయి. అయితే నిన్నంతా నామినేషన్స్ ముఖేష్, వర్షిణి చుట్టే తిరిగాయి. పది మందిలో ఆరుగురు ముఖేష్‌ను నామినేట్ చేశారు.

అయితే నామినేషన్స్ తర్వాత ఏదో పెద్ద గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. అందరూ వచ్చి ముఖేష్‌పై పడిపోయారని సమాచారం. అంతకు ముందే ముఖేష్‌ను వర్షిణి రెచ్చగొట్టిందని తెలుస్తోంది. అప్పటికే కాక ఎత్తిపోయి ఉన్న ముఖేష్‌పై త్రిగుణ్ గ్రూప్ అంతా ఒక్కసారిగా అతనిపై పడిపోయిందట. దీంతో ముఖేష్ ట్రిగర్ అయిపోయి నోరు జారినట్టుగా తెలుస్తోంది.

రెడ్ కార్డు ఇచ్చేంత తప్పు చేసినట్టుగా తెలుస్తోంది. అదేంటనేది బిగ్‌బాస్ లైవ్‌లో చూపించలేదు కానీ నరేష్, సుధీర్ సంభాషణలో ఈ విషయం తెలిసింది. ఇంతకాలం ఆడిన ఆటంతా ఒక్కరోజుతో పోగొట్టుకున్నాడని సుధీర్ చెప్పాడు.

నీతూ కూడా ముఖేష్ గేమ్ వర్షిణి కారణంగా నాశనమవుతోందని ముందుగానే చెప్పాను కదా అని అన్నది. శివ్ బాగా ట్రిగ్గర్ చేశాడని శ్వేత చెప్పింది. మెయిన్ వర్షిణి, ముఖేష్ బాగా డౌన్ ఫాల్ అయ్యారని.. సేమ్ రోహిత్ కూడా ఇలాగే అయ్యాడని శ్వేత చెప్పింది. ఈ మాటలు మార్జిన్ దాటి ఉన్నాయని సింపతి వర్కవుట్ అయ్యే అవకాశం లేదని అమన్ అన్నాడు.

మొత్తానికి దారుణంగా ఏదో గొడవ జరిగింది. రోహిత్‌ను కూడా ఇలాగే రెచ్చగొట్టారు. ఆ సమయంలో ట్రిగ్గర్ అయిపోయి రోహిత్ నోరు జారి కొన్ని సందర్భాల్లో బ్యాడ్ అయిపోయాడు. అలాగే ముఖేష్‌ను కూడా ఇష్టానుసారంగా శివ్, త్రిగుణ్ తదితరులంతా రెచ్చగొట్టాడని వాళ్ల మాటల ద్వారా తెలుస్తోంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఇవాళ షో చూడాల్సిందే.

Pranav

Recent Posts

“రాధిక ఆప్టే నీకు అసలు సిగ్గుందా..” సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల ఆగ్రహం..!

సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ల తీరు చూస్తుంటే ఆడియన్స్‌కు నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. మొదట్లో అవకాశాల కోసం సౌత్ ఇండస్ట్రీకి…

1 hour ago

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సాయి ధరమ్ తేజ్ పెళ్ళి ఎప్పుడో తెలుసా..?

మెగా అభిమానులకు త్వరలో ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందబోతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలోనే ఓ…

3 hours ago

Bigg Boss10 Telugu: వంశీకి ‘టెంపర్’ లేచింది.. వెకిలి చేష్టలతో చిరాకు తెప్పించిన శివ్..

హోస్ట్ నాగార్జున తనను కన్ఫెషన్ రూంలోకి పిలిచి ఏం చూపించారో త్రిగుణ్.. సుధీర్, నీతూ, దేబ్జానికి చెప్పాడు. బెడ్ మీద…

3 hours ago

మారిన సెన్సార్ (CBFC) రూల్స్.. దర్శక నిర్మాతలు గుర్తించుకోండి ఈ పాయింట్స్..!

సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడంలో, టైటిల్స్ ఫిక్స్ చేసి ప్రమోషన్స్ చేసుకోవడంలో మన మేకర్స్ ఎప్పుడూ ముందుంటారు. కానీ…

1 day ago

Bigg Boss10 Telugu: రోహిత్ ఎలిమినేట్..

నిన్న ఝాన్సీ ఎలిమినేట్ అయిన సీన్ నుంచి ఇవాళ్టి షో ప్రారంభమైంది. ఝాన్సీ స్టేజ్‌పైకి వచ్చాక ఆమె జర్నీ చూపించారు.…

1 day ago

ఏంటి గురూజీ ఆదర్శ కుటుంబం కూడా కాపీయేనా..? త్రివిక్రమ్‌పైనే ఎందుకిలా..?

టాలీవుడ్‌లో మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన డైరెక్ట్…

1 day ago