Menu
BREAKING
Bigg Boss 10 Telugu: రోహిత్‌కు బ్లాక్ కార్డ్.. మోకాళ్లపై కూర్చొని వేడుకున్న రోహిత్   |   ఫిట్‌నెస్, గాయాల నుంచి కోలుకోవడంపై డాక్టర్ వెంకటేష్ మోవ్వతో టైగర్ ష్రాఫ్ ఆసక్తికర చర్చ   |   Biggboss10 Telugu: సడెన్ ఎలిమినేషన్.. ఇవాళేనా? వెళ్లబోయేదెవరు?   |   RC17 సినిమాతో సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ విడిపోయినట్లే..!   |   నా బాడీ నా యిష్టం.. నా సైజ్‌ల గురించి మీకెందుకు.. ఆ హీరోయిన్ సీరియస్..!   |   Biggboss10 Telugu: హౌస్‌లోకి షాలిని ఎంట్రీ.. ఈ వారం ముప్పు ఆ ఇద్దరికే..   |   సో కాల్డ్ వారసులను అడిగే దమ్ముందా.. బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్లేనా టార్గెట్..?   |   కుర్రాడు సక్సెస్ అవుతాడా.. దొంగ నా కొడుకుతో మౌళి ఫ్యూచర్ ఏంటి..?   |   దసరాకు పట్టించుకోరా.. విజయదశమి కనీసం కళ్లకు కనిపించలేదా మన హీరోలకు..?   |   Biggboss10 Telugu: సుధీర్, ఝాన్సీలను ఒకాట ఆడుకున్న ఆర్కే.. బయటకొచ్చిన ఎలుకలు..   |   అన్నీ చెప్పిన రాజమౌళి ఆ ఒక్కటి తప్ప.. వారణాసి కథేంటో తెలుసా..?   |   దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్ రెండో కూతురు పేరు తెలుసా..?   |   Vijay Deverakonda: కొండన్న ముందు భారీ లక్ష్యం.. ‘రణబాలి’ ఇప్పటి వరకు ఓకే.. ఇకపై ఏం చేస్తుందో..?   |   Jailer 2: ఆ రికార్డు సాధిస్తుందా..? కోలీవుడ్ పరువు ఇప్పుడు రజినీ చేతుల్లో..!   |   Kaaka: ‘కాకా’ మేకింగ్ వీడియో లీక్.. కావాలనే చేసారా లేదంటే అలా జరిగిపోయిందా..?

Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్

Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ అవుట్

బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రిటీల హవా నడుస్తోంది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చినా కూడా వాళ్లకే న్యాయం చేసి.. కామనర్స్‌ని బాగా డౌన్ చేసి వెళుతున్నారని నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనికి కారణం.. శనివారం నాగ్.. వర్షిణిని ‘చెప్పుతో కొట్టురా’ అన్న మాటకు ప్రశ్నించలేదు. ముఖేష్‌ ఆడిన చెత్త గేమ్‌పై ప్రశంసలు కురిపించారు. తన టీంను పక్కనబెట్టి వేరొక టీంను నడిపిస్తే దానికి ప్రశంసలేంటని ప్రేక్షకులు మండిపడుతున్నారు. రామ్ ప్రసాద్ చాలా విషయాల్లో ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. అగ్నిపరీక్షను చాలా చులకనగా త్రిగుణ్, ముఖేష్ మాట్లాడారు. దాని గురించే నాగ్ ఏనాడూ ప్రశ్నించలేదు.. రోహిత్‌ను కొన్ని గంటల పాటు నిలబెట్టి నానా రచ్చ చేశారు. వాస్తవానికి బిగ్‌బాస్‌నే రోహిత్ అన్నాడు అనడానికి స్పష్టమైన ఆధారం కూడా లేదు.

ఒక వీడియోను ప్లే చేసి అది బిగ్‌బాస్‌నే అన్నాడంటూ నాగ్ నానా రచ్చ చేయడంతో నెట్టింట అతనికి మద్దతు బాగా పెరిగింది. ఇక సెలబ్రిటీలంతా కలిసి స్కెచ్ గీసి మరీ కామనర్స్‌ని నామినేషన్స్‌లోకి లాగారు. ఈ క్రమంలోనే ఈసారి కామనర్స్ ఎలిమినేషన్ అనివార్యమైంది. అందరూ సేవ్ అయిపోయి.. లాస్ట్ ఇద్దరిలో సృష్టి, షాలిని నిలిచారు. వారిలో సృష్టిని నాగ్ ఎలిమినేట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో సృష్టి ఎలిమినేట్ అయిపోయింది. ఇదిలా ఉండగా.. వచ్చే వారం నుంచి నాగ్ ఇచ్చిన డోస్‌కు ఎలిమినేషన్స్ గురించి అయితే చర్చించరేమో కానీ ఉన్న కామనర్స్ అందరినీ నామినేషన్స్‌లోకి లాగడమైతే పక్కా అని తెలుస్తోంది. ఇప్పటి నుంచి కామనర్స్‌పై ప్రెజర్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరి దీనిని వారు ఎలా డీల్ చేస్తారు? ప్రెజర్‌ను తట్టుకుని నిలబడతారా? చూడాలి.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360