Menu
BREAKING
2000 కోట్ల దిశగా రామాయణ.. ఆ రికార్డు రాముడి సొంతం అవుతుందా..?   |   నేను రాను.. వచ్చే సమస్యే లేదు.. కుండ బద్ధలు కొట్టిన రోహిత్ నాయుడు..!   |   ట్రెండింగ్‌లో జటాయు ఎర్త్స్ సెంటర్.. ఆ వైరల్ ప్లేస్ ఎక్కడుందో తెలుసా..?   |   ‘వారణాసి’ వాయిదా దాదాపు ఖాయమేనా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా..?   |   ఫేక్ గాళ్ల తాట తీయండి.. కేంద్రమంత్రికి ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి విన్నపం..!   |   అనిల్ రావిపూడితో జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు అవసరమా.. అవసరమే..!   |   బాహుబలి 2 ఔట్.. నెక్ట్స్ టార్గెట్ ధురంధర్ 2.. అక్కడ రామాయణ ఊచకోత..!   |   రియల్ స్టార్ శ్రీహరి ఇంట శుభకార్యం.. పెళ్ళి కొడుకు అవుతున్న పెద్ద కొడుకు..!   |   Bigg Boss10 Telugu: మీరు మీరు కొట్టుకోండి.. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి..   |   Bigg Boss10 Telugu: బిగ్‌బాస్ నుంచి ఈవారం ఎలిమినేట్ అయ్యిందెవరంటే…?   |   ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత.. చివరి రోజుల్లో ఎలా గడిచిందో తెలుసా..?   |   Bigg Boss10 Telugu: ముఖేష్ వర్సెస్ వర్షిణి బిగ్‌ ఫైట్.. ఎప్పుడూ చూస్తామనుకోలే..   |   Bigg Boss10 Telugu: శివ్‌కు రాంగ్ గైడెన్స్ ఇచ్చిన ప్రియాంక.. ఇక కష్టమే..   |   Bigg Boss10 Telugu: అందరికీ పరోక్షంగా ప్రియాంక వార్నింగ్.. ముఖేష్ తల్లి సూపర్బ్..   |   Bigg Boss10 Telugu: ఎవరెవరు వచ్చారు? ఏ ఏ హింట్స్ ఇచ్చారంటే…

Anil Ravipudi: అనిల్ రావిపూడి యామినేషన్ సినిమా వెనక అంత పెద్ద కథ ఉందా..?

Anil Ravipudi: అనిల్ రావిపూడి యామినేషన్ సినిమా వెనక అంత పెద్ద కథ ఉందా..?

టాలీవుడ్‌లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటే ముందుగా గుర్తొచ్చేది నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలతో ఆడియన్స్ కు పక్కా పైసా వసూల్ వినోదాన్ని పంచే ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఇప్పుడు తన రూట్ మార్చేస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తన లేటెస్ట్ ప్రాజెక్ట్ జనవరి 12 విడుదల సినిమా పనులు పూర్తికాగానే, రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ నుంచి ఆయన ఒక పెద్ద బ్రేక్ తీసుకోబోతున్నారు. ఎప్పుడూ ఒకే ఫార్మాట్ లో వెళ్తే ఆడియన్స్ కు బోర్ కొడుతుందనుకున్నారో ఏమో కానీ, ఈసారి ఏకంగా తన మార్క్ కు పూర్తి భిన్నమైన ఒక సరికొత్త జానర్ లో సినిమా చేసేందుకు అనిల్ రావిపూడి రెడీ అయిపోయారు. కమర్షియల్ మీటర్ వదిలేసి ఆయన తీసుకోబోతున్న ఈ కొత్త టర్న్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందిప్పుడు.

తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా అనిల్ రావిపూడి ఒక భారీ యానిమేషన్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. అది కూడా మన పురాణ ఇతిహాసం రామాయణం బేస్ గా ఈ యానిమేషన్ ప్రాజెక్ట్ ను డిజైన్ చేస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా లైవ్ యాక్షన్ సినిమాలు తీసే కమర్షియల్ డైరెక్టర్లు యానిమేషన్ వైపు రావడం చాలా రేర్. అందులోనూ రామాయణం లాంటి గొప్ప ఎపిక్ స్టోరీని యానిమేషన్ ఫార్మాట్ లో ప్రెజెంట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అయితే ఈ రిస్క్ తీసుకోవడానికి అనిల్ రావిపూడి పూర్తిగా సిద్ధపడ్డారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వర్క్స్ అన్నీ సైలెంట్ గా చాలా వేగంగా జరిగిపోతున్నాయి. టాలీవుడ్ హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ అని తెలుస్తుంది.

ఈ భారీ యానిమేషన్ ప్రాజెక్ట్ ను ప్రఖ్యాత నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందని తెలుస్తోంది. రామాయణాన్ని నేటి జనరేషన్ కు, ముఖ్యంగా పిల్లలకు కనెక్ట్ అయ్యేలా ఒక గొప్ప విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టీమ్ పగలు రాత్రి కష్టపడుతోంది. క్యారెక్టర్ డిజైనింగ్, స్టోరీ బోర్డింగ్ లాంటి పనులన్నీ పూర్తి చేసి, ఏమాత్రం గ్యాప్ లేకుండా వర్క్ స్టార్ట్ చేసేందుకు మేకర్స్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. టెక్నికల్ క్వాలిటీ విషయంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తోంది. మహావతార్ నరసింహా తరహాలోనే ఈ సినిమా కూడా రెడీ అవుతుంది.

అనిల్ రావిపూడి తన కెరీర్ లో ఇలాంటి ప్రయోగాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తూ తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. గతంలో నందమూరి బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరి సినిమానే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. బాలయ్య లాంటి ఊర మాస్ హీరోతో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషన్ బేస్డ్ గా ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేయించి హిట్ కొట్టారు. దానికి ముందు మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా తన రెగ్యులర్ కామెడీ రూట్ కు భిన్నంగానే వెళుతుంది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో దేశభక్తి ఎలిమెంట్స్ తో ఆ సినిమాను తీసి సూపర్ సక్సెస్ సాధించి తనలోని మరో యాంగిల్ ను బయటపెట్టారు.

ఇప్పుడు జనవరి 12 విడుదల సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటేందుకు వస్తున్న అనిల్ రావిపూడి, ఆ తర్వాత చేయబోయే రామాయణం యానిమేషన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. బేసిక్ గా కామెడీ టైమింగ్, మాస్ మీటర్ బాగా తెలిసిన ఒక దర్శకుడు, పూర్తిగా పురాణాల నేపథ్యంతో ఒక యానిమేషన్ అడ్వెంచర్ చేస్తే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఎన్నో విమర్శలను దాటుకుని కేవలం తన టాలెంట్ తోనే ఈ స్థాయికి ఎదిగిన అనిల్ రావిపూడి, ఈ రామాయణం ప్రాజెక్ట్ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ను సెట్ చేస్తారని, అలాగే ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తారని ఆయన అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

Pranav

Writer and contributor at Telugu Cinema 360