Menu
BREAKING
Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?   |   Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్   |   Anil Ravipudi: అనిల్ రావిపూడి యామినేషన్ సినిమా వెనక అంత పెద్ద కథ ఉందా..?   |   ఫ్లాప్ వాళ్లను ఆపలేదు.. రూట్ మార్చేలా చేసింది.. కుర్రాళ్ళూ జాగ్రత్త..!   |   లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు.. ది ట్రెండ్ సెట్టర్..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..   |   Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..   |   సాయి ధరమ్ తేజ్ కష్టాన్ని దోచేస్తున్నారా.. సంబరాల ఏటిగట్టు మళ్ళీ వాయిదా..?   |   చిరంజీవి టాక్ షో.. గెటప్ మార్చేస్తున్న బాస్.. ఎలా ఉండబోతుందో తెలుసా..?   |   రాజమౌళి కోసమే.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాపై మహేష్, తారక్ రివ్యూ..!   |   భయపెడుతున్న వారణాసి బిజినెస్.. రిలీజ్‌కు ముందే 1000 కోట్లు ఏంటి స్వామి..?   |   ఆ అగ్ర నిర్మాత చేతికి జైలర్ 2 రైట్స్.. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్ సడన్‌ ఎంట్రీ..!   |   Biggboss10 Telugu: ఎవరూ తగ్గట్లే.. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్లదే…   |   Biggboss10 Telugu: ఝాన్సీ గ్రాఫ్ పడగొట్టుకుంటోందా? ఇలా అయితే కష్టమే..   |   బాలయ్య కోసం రేసులో ఇద్దరు దర్శకులు.. కొరటాల సినిమా ఆగిపోయిందా..?

Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?

‘నారాయణమ్మ’ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున సండే షోకి ఎంట్రీ ఇచ్చారు. నామినేషన్స్‌లో ఉన్న 9 మందిని లేపి వారి నుంచి ముఖేష్‌, దేబ్జానిని నాగ్ సేవ్ చేశారు. తను చందమామ అని.. నరేష్ మచ్చ అని దేబ్జాని తనను తాను గొప్పగా చెప్పుకోవడం ఆసక్తికరం. ఇక సండే ఫన్‌డే‌లో భాగంగా నాగ్ ఓ గేమ్ ఆడించారు. రోహిత్‌ను ‘నువ్వు ఉన్న టీం కంటే అవతలి టీంలో వారికి హెల్ప్ చేయాలనుకుంటున్నావు. ఇక మీదట అది వదిలెయ్’ అని ఇవాళ కూడా అతనికే నాగ్ కౌంటర్ అనడం కన్నా ఓ హింట్ ఇచ్చారనడం మేలేమో. కామనర్స్‌కి సలహాలిస్తూ.. వారికి సాయం చేస్తూ రోహిత్ తన ఆటను పోగొట్టుకుంటున్నాడన్న టాక్ అయితే ఉంది. దానినే నాగ్ చెప్పారు. దీనిని రోహిత్ అర్థం చేసుకుంటే అతని ఆట మారే అవకాశం ఉంది. నాగ్ ఏదైనా హీరో లేదంటే హీరోయిన్ పోస్టర్ చూపిస్తారు. అది చూసి మూవీ పేరేంటో చెప్పాలి. ఈ ఫన్‌డేలో భాగంగా చరణ్, అపూర్వ డ్యాన్స్ ఇరగదీశారు. అమన్‌కి వర్షిణిని ఎప్పుడు పక్కనబెట్టుకోమని.. వెనుకుంటే వెన్నుపోటు పొడుస్తుందని నాగ్ కౌంటర్ ఇచ్చారు. గేమ్ ఆడిస్తూనే నాగ్ పంచ్‌లు పేల్చడం విశేషం. రామ్ ప్రసాద్ కూడా చాలా బాగా డ్యాన్స్ చేశాడు. నెక్ట్స్ నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురి నుంచి నరేష్‌ను సేవ్ చేశారు.

ఏషియన్ పెయింట్స్ ఎండీ బిగ్‌బాస్ షోకు వచ్చారు. దేశవ్యాప్తంగా ఐదు బిగ్‌బాస్ షోలకు ఏషియన్ పెయింట్స్ పార్టనర్ అని నాగ్ తెలిపారు. సీజన్ 10 అంత కలర్‌ఫుల్‌గా ఉండటానికి కారణం ఏషియన్ పెయింట్స్ అని నాగ్ చెప్పారు. అందరినీ ఫేవరెట్ కలర్స్ అడిగి ఏషియన్ పెయింట్స్ ఎండీ వెళ్లిపోయారు. షాలినిని ఒక ప్రశ్న సూటిగా అడుగుతానని.. చెప్పాలని నాగ్ అన్నారు. ఝాన్సీ, అపూర్వ అని అడిగారు. షాలిని ఏమాత్రం ఆలోచించకుండా అపూర్వ అని చెప్పింది. ఇక నామినేషన్స్‌లో ఉన్న వారి నుంచి చరణ్‌, త్రిగుణ్‌ను నాగ్ సేవ్ చేశారు. మళ్లీ సండే.. ఫన్‌డేను నాగ్ స్టార్ట్ చేశారు. తనొక ప్రశ్న అడుగుతానని.. తన దగ్గర ఉన్న సమాధానంతో వారు చెప్పిన సమాధానం మ్యాచ్ అయితే చాక్లెట్ ఇస్తానని నాగ్ చెప్పారు. ఈ ఫన్ గేమ్ ఆడించిన తర్వాత గత వారం ది బెస్ట్ ప్లేయర్‌ని సెలక్ట్ చేయాలని నాగ్ చెప్పారు. ఝాన్సీని విన్నర్‌గా తేల్చి ఆమెను స్టార్ ఆఫ్‌ ది వీక్‌గా ప్రకటించారు.

Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?

హౌస్ మొత్తాన్ని ఐదు గ్రూపులుగా విడిపోవాలని.. ఒక్కో గ్రూప్‌కు ఒక్కో కెప్టెన్ ఉండాలని నాగ్ చెప్పారు. ఫస్ట్ ముఖేష్, వర్షిణి, సుధీర్‌ని బోటులోకి పిలిచారు. పడవ ప్రమాదంలో ఉంటే ఎవరిని సేవ్ చేస్తావు? ఎవరిని ముంచేస్తావని నాగ్ అడగ్గా వర్షిణిని సేవ్ చేసి.. సుధీర్‌ని ముంచేస్తానని ముఖేష్ చెప్పాడు. నీ ఆన్సర్ ముందే తనకు తెలుసని నాగ్ చెప్పారు. ఆ తరువాత నరేష్, రామ్ ప్రసాద్, దేబ్జాని వెళ్లగా.. తను రామ్ ప్రసాద్‌ని ముంచేస్తానని నరేష్ చెప్పాడు. దేబ్జానిని సేవ్ చేస్తానన్నాడు. అమన్, అపూర్వ, చరణ్ వచ్చారు. తాను అపూర్వని ముంచుతానని అమన్ చెప్పాడు. కొన్నిసార్లు మంచి చేయాలనుకున్నా అది బ్యాక్ ఫైర్ అవుతుందని అపూర్వ చెప్పింది. అపూర్వని అలాగే ఉంచి షాలిని, రోహిత్‌ని రమ్మని నాగ్ పిలిచారు. అపూర్వను ముంచుతానని రోహిత్ చెప్పాడు. ఆ తరువాత ఝాన్సీని నాగ్ పిలిచారు. షాలిని.. ఝాన్సీని ముంచి రోహిత్‌ను సేవ్ చేస్తానని చెప్పింది. షాలిని డ్యాగర్ దొంగతనం చేసినప్పుడు రోహిత్ రియాక్షన్ కరెక్టా? అని నాగ్ అడిగారు. తను ఆరోజు.. ఈ రోజు కూడా తప్పేనని చెప్పినట్టుగా షాలిని తెలిపింది. చివరిగా త్రిగుణ్, వంశీ, సృష్టిని నాగ్ పిలిచారు. తను వంశీని ముంచి.. త్రిగుణ్‌ని సేవ్ చేస్తానని సృష్టి చెప్పింది.

Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?

నామినేషన్స్‌లో ఉన్న వారి నుంచి రోహిత్‌, అమన్‌ను సేవ్ చేశారు. సృష్టి, షాలిని నామినేషన్స్‌లో ఉన్నారు. స్టార్ ఆఫ్ ది వీక్ ఝాన్సీ కాబట్టి తన కోసం ఒక గిఫ్ట్ తన ఫేవరెట్ హౌస్‌మేట్ కోసం గిఫ్ట్ సెలక్ట్ చేసుకోమని ఝాన్సీకి నాగ్ చెప్పారు. తనకోసం హ్యాండ్‌బాగ్, స్నిక్కర్స్ ముఖేష్ కోసం ఝాన్సీ సెలక్ట్ చేసింది. ఇక ఎలిమినేషన్‌కు సమయం అయ్యింది. దీనికి ముందు ‘ఐ రియల్లీ లైక్ యు..’ అని రోహిత్‌కి షాలిని చెప్పింది. మరోవైపు సృష్టి వెళ్లిపోతుందేమోనని అమన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. షాలిని, సృష్టిలను నాగ్ యాక్టివిటీ రూమ్‌కి పిలిచారు. సృష్టి ఎలిమినేట్ అయినట్టుగా నాగ్ చెప్పారు. సృష్టి వెళ్లిపోతుంటే షాలిని కన్నీళ్లు పెట్టుకుంది. అగ్నిపరీక్ష టీం మొత్తం బాగా డల్ అయిపోయారు. వెళ్లే ముందు కూడా సుధీర్‌ని పిలిచి తన వైపు తప్పు జరిగిందని సృష్టి సారీ చెప్పి వెళ్లిపోయింది. ఇక సృష్టి స్జేజ్ మీదకు వచ్చింది. ఇదొక బ్యూటీఫుల్ జర్నీ అని.. తనెప్పుడూ దీనిని మరచిపోలేనని సృష్టి చెప్పింది. ఆ తరువాత ఆమె జర్నీని చూపించారు. ఆమె జర్నీ అన్ని ఎమోషన్స్‌తో చాలా బాగా బిగ్‌బాస్ టీం కట్ చేసింది. నాగ్ కూడా చాలా అప్‌ అండ్ డౌన్స్.. రోలర్ కోస్టర్ రైడ్ అని నాగ్ చెప్పారు. వాల్యుబుల్ లెస్సన్ నేర్చుకున్నట్టు సృష్టి చెప్పింది.

Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?

సృష్టి వెళ్లే ముందు మాస్క్ వేసుకునే ఉన్నారు.. తీయాల్సిన వాళ్లెవరని నాగ్ అడిగారు. దీనికి సృష్టి.. ముఖేష్, రామ్ ప్రసాద్, వర్షిణి పేర్లను పెట్టింది. సృష్టికి వైట్ గోల్డ్ మెడల్ ఇచ్చి పంపించారు. అందరూ జాగ్రత్తగా ఆడాలని.. లవ్ యూ చెప్పి సృష్టి వెళ్లిపోయింది. ఆ తరువాత నెక్ట్స్ వీక్ థీమ్ ఏంటో చెప్పారు. ఈ వారం థీమ్.. ‘రోడ్ టు రీలోడ్’. ఇది చెప్పేసి నాగ్ వెళ్లిపోయారు. రేపటి నామినేషన్స్ చూపించారు. ఫుల్ ఫైర్‌తో నడిచినట్టుగా తెలుస్తోంది. అయితే అంతా రోహిత్‌పై పడతారనుకుంటే.. ప్రోమోను బట్టి చూస్తే ఎవరూ అతడిని టార్గెట్ చేయలేదనిపిస్తోంది. రోహిత్ పని అయిపోయిందనుకున్నట్టున్నారు. అంతా వదిలేశారు. కానీ మళ్లీ సెలబ్రిటీలంతా అగ్ని పరీక్ష టీంనే టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు నాగ్ అయితే సమయం దొరికినప్పుడల్లా రోహిత్‌కు ఏదో ఒక కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఇక టాప్‌లో ఉన్న రోహిత్‌ను లీస్ట్ 4 ఉన్నప్పుడు సేవ్ చేయడం కూడా అతని పని అయిపోయిందన్నట్టుగా హౌస్‌మేట్స్‌కి చూపించడమేనని తెలుస్తోంది. తద్వారా బయట అతని ప్రభావాన్ని తగ్గించేందుకు ప్లాన్ చేసినట్టుగా టాక్. కానీ రోహిత్‌కు ఈ వారం బీభత్సంగా ప్లస్ అయ్యింది. విపరీతంగా సింపతి వచ్చేసింది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360