Menu
BREAKING
Bigg Boss10 Telugu: షాకింగ్.. బిగ్‌బాస్ నుంచి రోహిత్ ఎలిమినేట్..   |   Bigg Boss10 Telugu: ఈవారం ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. ఊహించని కంటెస్టెంట్ అవుట్   |   Bigg Boss10 Telugu: అమన్ వర్సెస్ రోహిత్ పెద్ద గొడవ.. సుధీర్ ఎలిమినేట్ కానీ..   |   సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ‘అదుర్స్’ బామ్మ ఇకలేరు..!   |   రామాయణ ఒరిజినల్ టాక్ ఏంటి.. అదే అయితే మాత్రం కష్టమే..!   |   Biggboss10 Telugu: స్కెచ్‌ల మీద స్కెచ్‌లు.. ఫైనల్‌గా గ్రీన్ లెవల్‌లోకి వెళ్లిందెవరంటే….   |   పునీత్ రాజ్‌కుమార్ 5వ వర్ధంతి.. అప్పు దూరమై అప్పుడే ఐదేళ్ళు..!   |   Nara Rohith: ఆదర్శ కుటుంబానికి నారా రోహిత్ దూరం దూరం.. అదేనా అసలు కారణం..?   |   Bigg Boss10 Telugu: బీబీ హోటల్ టాస్క్ ప్రారంభం.. రోహిత్ ఈజ్ బ్యాక్..   |   Janhvi Kapoor: పెద్దిపై జాన్వీ కపూర్ రియాక్షన్.. ఏరు దాటాక తెప్ప తార్చడమంటే ఇదేనా..?   |   మూర్తన్న ఆన్ డ్యూటీ.. కోట్లు ఇస్తా అన్నా నటించని పీపుల్ స్టార్.. హుషారు 2లో ఎలా..?   |   Bigg Boss10 Telugu: బిగ్‌బాస్‌కి ముందే వర్షిణి, త్రిగుణ్ మధ్య బిగ్ డీల్.. ఒప్పేసుకున్న త్రిగుణ్   |   Bigg Boss 10 Telugu: నామినేషన్లలో త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. దేబ్జాని, వర్షిణితోనూ వాగ్వాదాలు   |   Bigg Boss10 Telugu: మాస్క్ తీసిన దేబ్జాని.. రోహిత్‌ని ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు..   |   Bigg Boss10 Telugu: హౌస్ నుంచి దక్షి, షాలిని ఎలిమినేట్.. పస లేని షో..

సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ‘అదుర్స్’ బామ్మ ఇకలేరు..!

సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ‘అదుర్స్’ బామ్మ ఇకలేరు..!

సీనియర్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూశారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎన్నో నాటకాలు, టీవీ సీరియల్స్, సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. వత్సల గారి వయసు 93 సంవత్సరాలు. తమిళ చిత్ర పరిశ్రమలో ‘బామ్మ’ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ఈమెదే. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ ‘అదుర్స్’లో భట్టాచార్య (చారి)ని దత్తత తీసుకున్న బామ్మ పాత్ర ద్వారా ఆమె ఎంతో సుపరిచితులు. ఆమె మరణవార్త తెలుసుకున్న తమిళ, తెలుగు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఆమె భౌతిక కాయాన్ని పల్లవరంలోని నివాసంలో అభిమానులు, సినీ పరిశ్రమ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు.

డిసెంబర్ 25, 1933లో జన్మించిన వత్సల రాజగోపాల్.. సాధారణ నటీమణుల్లా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి రాలేదు. ఆమె నటనపై ఉన్న మక్కువతో తన 45వ ఏట అంటే 1979లో రంగస్థల నటిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. నాటకాలపై ఆమెకు ఉన్న అంకితభావం ఎంతటిదంటే.. పాతికేళ్ల వ్యవధిలో ఏకంగా 450కి పైగా నాటకాల్లో నటించి మెప్పించారు. అంటే సగటున ఏడాదికి 18 నాటకాలు, ప్రతి మూడు వారాలకు ఒక కొత్త నాటకంలో ఆమె నటించారన్నమాట. 2004లో ప్రముఖ పత్రిక ‘ది హిందూ’ ఆమె గురించి ‘టోటల్లీ కమిటెడ్ టు థియేటర్’ అనే టైటిల్‌తో ఓ ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది. నాటక రంగంలో ఆమె చేసిన ఈ సుదీర్ఘ ప్రయాణమే.. తర్వాత ఆమె తెరపై పోషించిన వైవిధ్యమైన పాత్రలకు పునాది వేసింది.

నాటక రంగంలో విశేష అనుభవం గడించిన తర్వాత, 1992లో తన 58వ ఏట మణిరత్నం బ్లాక్ బస్టర్ మూవీ ‘రోజా’తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో హీరో అరవింద్ స్వామికి నాయనమ్మ పాత్రలో నటించి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 1995లో కమల్ హాసన్ ‘సతీ లీలావతి’లో అంబుజం మామిగా, 1996లో ‘సెల్వ’లో చర్చ్ మదర్‌గా నటించారు. అదే ఏడాది హిందీలో ‘ఔర్ ఏక్ ప్రేమ్ కహానీ’లో డాక్టర్ ఎలవతి పాత్రను పోషించారు. 2000వ దశకం వత్సల గారికి సినిమాల్లో అత్యంత బిజీగా గడిచిన సమయం. ఆరేళ్ల వ్యవధిలోనే ‘విన్నర్’, ‘జూలీ గణపతి’, ‘అన్నియన్’ (అపరిచితుడు), ‘మళై’, ‘పట్టియాల్’, ‘మొళి’, ‘జయం కొండాన్’ లాంటి 11 భారీ చిత్రాల్లో ఆమె నటించారు. 2010లో ‘అదుర్స్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన ఆమె, 2013లో వచ్చిన ‘కల్యాణ సమయల్ సాదమ్’ వరకు దాదాపు 21 ఏళ్ల పాటు సినీ ప్రయాణాన్ని కొనసాగించారు.

సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెర ప్రేక్షకులను కూడా వత్సల గారు ఎంతగానో అలరించారు. 90వ దశకంలో తమిళంలో టీవీ సీరియల్స్ మొదలవుతున్న కొత్తలో ఆమె టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. సన్ టీవీలో ప్రసారమైన ‘కాస్ట్లీ మాప్పిళ్లై’, ‘కాదల్ పగడై’ సీరియల్స్‌తో ఆమె టెలివిజన్ కెరీర్ మొదలైంది. ముఖ్యంగా రాధిక నటించిన సెన్సేషనల్ సీరియల్ ‘చితి’ (తెలుగులో పిన్ని)లో ఆమె పోషించిన అంబుజం మామి క్యారెక్టర్ ప్రతి ఇంట్లో ఆమెను ఒక కుటుంబ సభ్యురాలిగా మార్చేసింది. ఆ తర్వాత ‘ఆనందం’, ‘వసంతం’, ‘స్వర్గం’, ‘మై డియర్ భూతం’, ‘ముంధానై ముడిచు’ లాంటి ఎన్నో హిట్ సీరియల్స్‌లో నటించారు. దాదాపు 19 ఏళ్ల పాటు సన్ టీవీ, విజయ్ టీవీ, జయా టీవీ, జీ తమిళ్ లాంటి ఐదు ప్రధాన ఛానెల్స్‌లో ఆమె సీరియల్స్ ప్రసారమయ్యాయి. 80 ఏళ్లు దాటిన వయసులో కూడా ఆమె 2015 వరకు టీవీ సీరియల్స్‌లో నటిస్తూనే ఉండటం విశేషం.

వత్సల రాజగోపాల్ గారి కెరీర్‌ను గమనిస్తే.. ఆమె ఎక్కువగా ‘బామ్మ’ పాత్రలకే కేరాఫ్ అడ్రస్‌గా మారారు. సినిమాల్లో 14 సార్లు, సీరియల్స్‌లో 5 సార్లు ఆమె అమ్మమ్మ, నాయనమ్మ పాత్రలను పోషించారు. అయితే ఆ పాత్రలన్నీ ఒకేలా కాకుండా వైవిధ్యంగా ఉండేలా చూసుకున్నారు. ఒక సినిమాలో చర్చి మదర్‌గా, మరో దాంట్లో డాక్టర్‌గా, సీరియల్స్‌లో నర్స్‌గా, పనిమనిషిగా, ల్యాండ్ లేడీగా.. ఇలా ఎన్నో రకాల క్యారెక్టర్స్‌తో తనలోని నటనను ఆవిష్కరించారు. 45 ఏళ్లకు రంగస్థలం, 58 ఏళ్లకు వెండితెర, 80 ఏళ్ల తర్వాత బుల్లితెర.. ఇలా లేటు వయసులో కెరీర్ ప్రారంభించినా, దాన్ని సుదీర్ఘకాలం పాటు కొనసాగించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు వత్సల రాజగోపాల్. నాటకం, సినిమా, టెలివిజన్.. ఇలా మూడు మాధ్యమాల్లో తనదైన ముద్ర వేసిన ఈ అద్భుత నటి.. తన పాత్రల ద్వారా ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360