Menu
BREAKING
ఇదెక్కడి దిక్కు మాలిన కథ.. ఇదెక్కడి సినిమా.. కీర్తి సురేష్‌కు ఏమైంది..?   |   అప్పుడు నవనీతమ్మా.. ఇప్పుడు నారాయణమ్మ.. మళ్లీ దొరికిపోయావా తమన్..!   |   అంతా ఫేక్.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. అంతా కనికట్టు..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కు క్లాసే కాదు.. హ్యాపీ న్యూస్ అందించిన నాగ్..   |   సిగ్మాతో ఏం చేయబోతున్నారు.. సందీప్ కిషన్ జాతకం ఇప్పటికైనా మారుతుందా..?   |   Rajamouli: రాజమౌళి 25 ఏళ్ల ప్రస్థానం.. ఇంతింతై వటుడింతై..!   |   నన్ను తొక్కేయట్లేదు కదా.. వాళ్లకు సైలెంట్‌గా రాడ్ దించేసిన చిరంజీవి..!   |   ‘ది ప్యారడైజ్’ చుట్టూ రాజకీయం.. తెలియకుండానే నాని ఇరుక్కుపోయాడా..?   |   Biggboss10 Telugu: మళ్లీ హౌస్‌లో రాజుకున్న మంటలు.. రోహిత్ వర్సెస్ త్రిగుణ్   |   Biggboss10 Review: అందరికీ నాగ్ క్లాస్.. ఇలా వచ్చి అలా రూ.15 లక్షలతో మిథిలేష్ జంప్..   |   అయ్యా మోహన్ బాబు గారు.. మీ రేంజ్ ఏంటి.. ఈ క్యారెక్టర్స్ ఏంటి సర్..?   |   ఆ ప్యాన్ ఇండియన్ దర్శకుడిపై ప్రెజర్.. అంతా వారసుడి మహిమ..!   |   Biggboss10 Telugu: రోహిత్‌ వర్సెస్ అపూర్వ.. ఎంజాయ్ చేసిన ఇతర హౌస్‌మేట్స్..   |   Biggboss10 Telugu: వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో మళ్లీ టార్గెట్ రోహిత్..   |   ఇప్పుడేం చేస్తాడు మన చిరంజీవి..? శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తాడా..?

దుల్కర్ సల్మాన్ ‘శ్రీ శ్రీ’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘బొమ్మ బొమ్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్..

దుల్కర్ సల్మాన్ 'శ్రీ శ్రీ' నుంచి ఫస్ట్ సింగిల్ 'బొమ్మ బొమ్మ' రిలీజ్ డేట్ ఫిక్స్..

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘శ్రీ శ్రీ’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం సంస్థకు 10వ మైలురాయి ప్రాజెక్ట్ (#SLV10)గా రూపొందుతుండగా, ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేష స్పందన లభించగా, ఇప్పుడు చిత్ర బృందం మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. సినిమా నుంచి తొలి పాట ‘బొమ్మ బొమ్మ’ను జూలై 27న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ట్రెక్కింగ్ దుస్తుల్లో కొండ ప్రాంతంలోని సస్పెన్షన్ బ్రిడ్జిపై నడుస్తూ కనిపించారు. ఇద్దరి మధ్య కనిపించిన సహజమైన కెమిస్ట్రీ, చిరునవ్వులు పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బ్యాక్‌డ్రాప్‌లోని ప్రకృతి అందాలు, రంగురంగుల జెండాలు పాటకు అందమైన విజువల్ టోన్‌ను సూచిస్తున్నాయి. ఈ చిత్రంలో దుల్కర్, పూజా హెగ్డే తొలిసారి జోడీగా నటిస్తుండటంతో వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీపై కూడా ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రానికి ప్రముఖ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. సినిమాటోగ్రఫీని అనయ్ ఓం గోస్వామి అందిస్తుండగా, సంగీతాన్ని జీవీ ప్రకాశ్ కుమార్ సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రేమ, వినోదం, హృద్యమైన భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందుతున్న ‘శ్రీ శ్రీ’ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360